కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 1/04 పేజీ 3
  • ప్రశ్నా భాగం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రశ్నా భాగం
  • మన రాజ్య పరిచర్య—2004
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఖచ్చితమైన సమయపాలన, ఆయా భాగాలకు సరిపడేంత సమయం ఇవ్వడం
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • తగిన ముగింపు, మీ సమయము
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల నిర్దేశక పుస్తకము
  • కూటములను సమయానికి ప్రారంభించి సమయానికి ముగించుము
    మన రాజ్య పరిచర్య—1991
  • సేవాకూటానికి ఎలా సిద్ధపడాలి?
    మన రాజ్య పరిచర్య—2009
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2004
km 1/04 పేజీ 3

ప్రశ్నా భాగం

◼ సంఘకూటాల్లో ఆయాభాగాలు సరిగ్గా నియమిత సమయానికే ముగిసేలా మనమెలా జాగ్రత్తపడవచ్చు?

స్నేహితులతో ఆహ్లాదకరమైన విషయాలు మాట్లాడుతుంటే సమయం ఇట్టే గడిచిపోతుంది. అందుకే, నియమిత సమయంలోనే కూటాల్లోని ఆయాభాగాలు నిర్వహించడం ఓ సవాలుగా ఉండవచ్చు. మనకేది సహాయం చేయవచ్చు?

సరిగ్గా సమయానికి ఆరంభించండి. సంఘమంతా కూడినప్పుడు, ఒక క్రమ పద్ధతిలో నియమిత సమయానికే కూటం ఆరంభం కావడానికి వీలుగా ఒకటి రెండు నిమిషాల ముందే తమ తమ సీట్లలో కూర్చోమని ప్రేక్షకులను ఆహ్వానించవచ్చు. (ప్రసం. 3:1) చిన్న గుంపులు కూడుకునే కూటాలను అంటే క్షేత్రసేవ కొరకైన కూటాల వంటివాటిని, సకాలంలో రానివారి కోసం వేచివుండేందుకు ఆలస్యం చేయకూడదు.

సంపూర్ణంగా సిద్ధపడండి. సమయానికి పూర్తిచేయడానికి కీలకం ముందుగా సిద్ధపడడం. నియామక విషయాంశం స్పష్టంగా మనస్సులో ఉంచుకోండి. ముఖ్యాంశాలు గుర్తించి వాటిని నొక్కితెల్పండి. చిన్నచిన్న వివరాలతో దారిమళ్లకుండా చూసుకోండి. మీ ప్రసంగాన్ని సరళంగా ఉంచండి. మీరు నిర్వహించే భాగంలో ప్రదర్శనలు లేదా ఇంటర్వ్యూలు ఉంటే ముందుగానే వాటిని రిహార్స్‌ చేయండి. సాధ్యమైనంత వరకు మీ భాగాన్ని బిగ్గరగా అభ్యాసం చేస్తున్నప్పుడే మీ సమయం చూసుకోండి.

మీ ప్రసంగ సమాచారాన్ని విభాగించుకోండి. మీ నియామకం ప్రసంగమైనా లేక ప్రేక్షకులతో చర్చ అయినా, మీరు అందించబోయే సమాచారాన్ని భాగాలుగా విభజించుకోవడం సహాయకరంగా ఉంటుంది. ప్రతీ భాగానికి ఎంత సమయం కేటాయించాలో నిర్ణయించుకొని, మీ నోట్సు మార్జిన్‌లో వ్రాసిపెట్టుకోండి. ఆ తర్వాత ప్రసంగించేటప్పుడు ఆ సమయానికి తగ్గట్టు మీ ప్రసంగం సవరించుకోండి. ప్రేక్షకులతో చర్చించేటప్పుడు, చివర్లోవుండే అతి ప్రాముఖ్యమైన విషయాలకు సమయం ఉండేలా ఉపోద్ఘాతమప్పుడు ఎక్కువ వ్యాఖ్యానాలు రాబట్టకుండా చూసుకోండి. కావలికోట అధ్యయన నిర్వాహకులు చివర్లోవుండే పునఃసమీక్షా బాక్సును పరిశీలించడానికి సరిపడా సమయం ఉండేలా చూసుకోవాలి. ముగింపు పాట, ప్రార్థనకు కేటాయించబడిన సమయం కూడా తామే ఉపయోగించుకోకుండా వారు జాగ్రత్తపడాలి.

సరిగ్గా సమయానికి ముగించండి. సేవా కూటంలాంటి అనేక భాగాలుండే కూటంలో ప్రతీ ప్రసంగీకునికి తన భాగం ఎప్పుడు ఆరంభమవుతుందో ఎప్పుడు ముగుస్తుందో తెలిసుండాలి. కూటం నియమిత సమయంమించి వెళుతుంటే ఏమిచేయవచ్చు? వేరే భాగాలు నిర్వహించే ఒకరు లేదా ఎక్కువమంది సహోదరులు అల్ప ప్రాధాన్యతా విషయాలు విడిచిపెట్టి ముఖ్యాంశాలపై దృష్టి నిలపడం ద్వారా సమయానికి కూటాలు ముగిసేలా చూడవచ్చు. ప్రావీణ్యతగల బోధకునికి ఆ సామర్థ్యం ఉంటుంది.

ప్రేక్షకులుగా మనం క్లుప్తంగా, అంశానికి తగ్గట్టు సూటిగా వ్యాఖ్యానించడం ద్వారా, నిర్వహించే సహోదరునికి తోడ్పడవచ్చు. అలా కూటాల్లో “సమస్తమును మర్యాదగాను క్రమముగాను” జరగడానికి మనమందరం దోహదపడవచ్చు.​—1 కొరిం. 14:40.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి