ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు జనవరిలో: 1988కి ముందు ప్రచురించబడిన పుస్తకాలేవైనా సంఘం స్టాకులో ఉంటే వాటిని ఉపయోగించండి. ఒకవేళ అవేవీ మీ దగ్గర స్టాకులో లేకపోతే దగ్గర్లో ఉన్న ఏ సంఘంలోనైనా పాత ప్రచురణల అదనపు స్టాకు ఉందేమో చూడండి. పాత పుస్తకాలు లేని సంఘాలు కుటుంబ సంతోషానికిగల రహస్యము లేదా యువత అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మకమైన సమాధానాలు (ఆంగ్లం) పుస్తకాలను ప్రతిపాదించవచ్చు. ఫిబ్రవరిలో: యెహోవాకు సన్నిహితమవండి. ఈ పుస్తకం అందుబాటులో లేకపోతే ప్రత్యామ్నాయంగా, జీవము—ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం మూలంగానా లేక సృష్టి మూలంగానా? (ఆంగ్లం) లేదా ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది! పుస్తకాలు ఉపయోగించవచ్చు. మార్చిలో: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము. గృహ బైబిలు అధ్యయనాలు ఆరంభించేందుకు ప్రత్యేక ప్రయత్నాలు చేయాలి. ప్రజల దగ్గర ఇప్పటికే ఆ పుస్తకం ఉంటే, దానియేలు ప్రవచనానికి అవధానమివ్వండి! (ఆంగ్లం) పుస్తకం ప్రతిపాదించవచ్చు. ఏప్రిల్‌లో: కావలికోట, తేజరిల్లు! విడి పత్రికలు ప్రతిపాదించండి. ఆసక్తిగల ప్రజలను పునర్దర్శించేటప్పుడు, సంఘంతో చురుకుగా సహవసించని వారిని అంటే జ్ఞాపకార్థ ఆచరణకు లేదా సంఘంలోని ఇతర ప్రత్యేక సంఘటనలకు హాజరయ్యేవారిని కూడా సందర్శించండి. దేవుణ్ణి ఆరాధించండి పుస్తకాన్ని ప్రతిపాదించడంపై దృష్టినిలపండి. ప్రత్యేకంగా జ్ఞానము పుస్తకం, కోరుతున్నాడు బ్రోషుర్ నుండి ఇప్పటికే అధ్యయనం పూర్తిచేసిన వ్యక్తులతో గృహ బైబిలు అధ్యయనం ఆరంభించడానికి కృషి చేయాలి.
◼ 2004, మార్చి 15తో ప్రారంభమయ్యే వారం మొదలుకొని మనం యెహోవాకు సన్నిహితమవండి పుస్తకాన్ని సంఘ పుస్తక అధ్యయనంలో పఠిస్తాం. ఈ పుస్తకం ఇప్పుడు ఆంగ్లం, కన్నడ, తమిళం, తెలుగు, పంజాబీ, బెంగాలీ, మలయాళం, హిందీ భాషల్లో లభ్యమవుతోంది. సంఘ పుస్తక అధ్యయనం కోసం కాపీలు కావాలంటే వెంటనే మీ రిక్వెస్టులు పంపించండి.
◼ ఈ సంవత్సరం ఏప్రిల్ 4, ఆదివారం సూర్యాస్తమయం తర్వాత జ్ఞాపకార్థ ఆచరణను జరుపుకునేందుకు సంఘాలు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి. ప్రసంగం ముందుగానే ప్రారంభమైనప్పటికీ జ్ఞాపకార్థ చిహ్నాలను మాత్రం సూర్యాస్తమయం అయ్యేంతవరకు అందించకూడదు. మీ ప్రాంతంలో సూర్యాస్తమయం ఎప్పుడు అవుతుందో స్థానికాధికారులను అడిగి తెలుసుకోండి. క్షేత్ర సేవకు సంబంధించిన కూటాలు తప్ప ఇతరత్రా ఏ కూటాలు ఆ రోజు జరుపకూడదు కాబట్టి మరో సమయంలో కావలికోట అధ్యయనం చేసుకోవడానికి సముచితమైన సర్దుబాట్లు చేసుకోవాలి. స్థానిక పరిస్థితులనుబట్టి ప్రాంతీయ పైవిచారణకర్తలు తమ మీటింగ్ కార్యపట్టికను సవరించుకోవాలి. ప్రతీ సంఘం సొంతగా జ్ఞాపకార్థ ఆచరణను జరుపుకోవడం కోరదగినదే అయినా ఇది అన్ని సందర్భాల్లో సాధ్యం కాకపోవచ్చు. సాధారణంగా ఒకే రాజ్యమందిరాన్ని పలు సంఘాలు ఉపయోగించుకుంటున్న ప్రాంతాల్లో ఒకటి లేక అంతకంటే ఎక్కువ సంఘాలు ఆ సాయంత్రానికి మరో స్థలాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ ఆచరణ నుండి అందరూ పూర్తి ప్రయోజనం పొందేందుకుగాను కార్యక్రమాల మధ్య వీలైతే కనీసం 40 నిమిషాల వ్యవధి ఉండాలని మేము సూచిస్తున్నాము. హాజరయ్యే వారిని తీసుకురావడం, తీసుకువెళ్ళడంతోపాటు ట్రాఫిక్, పార్కింగ్ సమస్యల గురించి కూడా ఆలోచించాలి. స్థానికంగా ఎలాంటి ఏర్పాట్లు సరైనవో పెద్దల సభ నిర్ణయించాలి.
◼ లభ్యమవుతోన్న కొత్త ప్రచురణలు:
గొప్ప బోధకుడి నుండి నేర్చుకోండి—ఆంగ్లం, తమిళం
యెహోవాకు సన్నిహితమవండి—కన్నడ, తమిళం, తెలుగు, పంజాబీ, బెంగాలీ, మలయాళం, హిందీ
‘మంచి దేశమును చూడండి’—ఆంగ్లం, కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, హిందీ
యెహోవాకు స్తుతిగీతాలు పాడండి (చిన్న పాటలపుస్తకం)—కన్నడ
యెహోవాకు స్తుతిగీతాలు పాడండి (29 పాటలు)—నేపాలీ
ఈ లోకం నిలుస్తుందా (కరపత్రం నం. 19)—అస్సామీ
కృంగిన వారికి ఓదార్పు (కరపత్రం నం. 20)—అస్సామీ
కుటుంబ జీవితంలో సంతోషాన్ని అనుభవించండి (కరపత్రం నం. 21)—అస్సామీ
లోకాన్ని నిజంగా ఎవరు పరిపాలిస్తున్నారు? (కరపత్రం నం. 22)—అస్సామీ
◼ మళ్లీ లభ్యమవుతోన్న ప్రచురణలు:
నిత్యజీవానికి నడిపించే జ్ఞానము—గుజరాతీ
బైబిలు చర్చాంశాలు—నేపాలీ
యెహోవాకు స్తుతిగీతాలు పాడండి (29 పాటలు—తెలుగు
శాంతియుతమైన నూతనలోకంలో జీవితము (కరపత్రం నం. 15)—కన్నడ, గుజరాతీ, డొంగ్జా, తమిళం, నేపాలీ, పంజాబీ, బెంగాలీ, మరాఠీ, మిజో, హిందీ
మరణించిన మన ప్రియులకు ఏ నిరీక్షణ కలదు? (కరపత్రం నం. 16)—కన్నడ, కొంకణి (కానరీస్ మరియు రోమన్), మిజో
ఈ లోకం నిలుస్తుందా? (కరపత్రం నం. 19)—గుజరాతీ, తమిళం, బెంగాలీ, మరాఠీ, హిందీ
మీకు అమర్త్యమైన ఆత్మ ఉందా? (కరపత్రం నం. 25)—మిజో