దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
ఈ క్రింది ప్రశ్నలు డిసెంబరు 29, 2003వ తేదీతో ప్రారంభమయ్యే వారంలో దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో మౌఖికంగా పరిశీలించబడతాయి. పాఠశాల పైవిచారణకర్త 2003, నవంబరు 3 నుండి డిసెంబరు 29 మధ్య వారాల్లోని నియామకాల సమాచారాన్ని 30 నిమిషాలు పునఃసమీక్షిస్తారు. [గమనిక: ప్రశ్న తర్వాత రెఫరెన్సులు లేని వాటికి జవాబులను తెలుసుకోవడానికి మీరు స్వయంగా పరిశోధించాలి.—పరిచర్య పాఠశాల, 36-7 పేజీలను చూడండి.]
ప్రసంగ లక్షణాలు
1. క్షేత్ర పరిచర్యలో బైబిలును ఉపయోగించడం ఎందుకంత ప్రాముఖ్యం? [be 145వ పేజీ, 2వ పేరా, బాక్సు]
2. ఒక లేఖనానికి ఉపోద్ఘాతంగా ఏమి చెప్పాలనేదాన్ని, దాని సందర్భం ఎలా ప్రభావితం చేస్తుంది? [be 149వ పేజీ]
3. ఒక బైబిలు వచనాన్ని చదువుతున్నప్పుడు సరైన పదాలను నొక్కి పలకడం ఎందుకు ప్రాముఖ్యం, దాన్నెలా సాధించవచ్చు? [be 151వ పేజీ 2వ పేరా, బాక్సు]
4. మనం ఇతరులకు బోధించేటప్పుడు ‘సత్యవాక్యమును సరిగా ఉపదేశించమని’ పౌలు ఇచ్చిన సలహాను ఎలా అన్వయింపజేసుకుంటాము, ఇది ఎందుకు ప్రాముఖ్యం? (2 తిమో. 2:15) [be 153వ పేజీ, 2వ పేరా, బాక్సు]
5. పౌలు ఎలా ‘లేఖనములలోనుండి తర్కించాడు?’ (అపొ. 17:2, 3) [be 155వ పేజీ, 5, 6 పేరాలు]
ఒకటవ నియామకం
6. ఒక ప్రసంగానికి సిద్ధపడడానికి మనం మనకు అత్యంత ప్రముఖ పరిశోధనా ఉపకరణమైన బైబిలును ఉపయోగిస్తున్నప్పుడు (1) లేఖనాల సందర్భాన్ని పరిశీలించడం, (2) క్రాస్ రెఫరెన్సులను చూడడం, (3) బైబిలు అకారాది పట్టిక సహాయంతో వెదకడం ఎందుకు ప్రయోజనకరం? [be 34వ పేజీ, 3వ పేరా-35వ పేజీ, 2వ పేరా]
7. నిజమైన యథార్థత ఎలా చూపించబడుతుంది, ఎవరిపట్ల చూపించబడుతుంది? [w01 10/1 22-3 పేజీలు]
8. యెహోవా సమయాన్ని ఖచ్చితంగా పాటిస్తాడని ఏది సూచిస్తుంది? (దాని. 11:35-40; లూకా 21:24) [si 284వ పేజీ, 1వ పేరా]
9. ఒక ప్రసంగం కోసం పరిశోధన చేసిన తర్వాత ఏ విషయాలు చెప్పాలో నిర్ణయించుకుంటున్నప్పుడు ఏ అంశాలను మనం మనసులో ఉంచుకోవాలి? [be 38వ పేజీ]
10. “నోవహు దినముల” గురించి యేసు చేసిన వ్యాఖ్యానం నేటి మన పరిస్థితులకు ఎందుకు సంగతంగా ఉంది? (మత్త. 24:37) [w01 11/15 31వ పేజీ 3, 4 పేరాలు]
వారపు బైబిలు పఠనం
11. పౌలు ఫిలేమోనుకు వ్రాసిన పత్రిక, క్రైస్తవులయ్యేందుకు ఇతరులకు సహాయపడడమే క్రైస్తవుల విధి గానీ సమాజ సంస్కరణ కాదు అని ఎలా చూపిస్తోంది? (ఫిలే. 12)
12. ‘కొట్టుకొనిపోవడానికి,’ ‘విడిచిపోవడానికి,’ ‘తప్పిపోవడానికి’ మధ్యగల భేదం ఏమిటి? (హెబ్రీ. 2:1; 3:12; 6:5, 6) [w99 7/15 19వ పేజీ, 12వ పేరా; w86 6/1 14వ పేజీ, 16-17 పేరాలు; w80 12/1 23వ పేజీ, 8వ పేరా]
13. “ప్రభువు చిత్తమైతే” అన్న పదబంధాన్ని అల్పవిషయాలకు ఉపయోగించడాన్ని మనం ఎలా నివారించవచ్చు? (యాకో. 4:15) [cj 171వ పేజీ 1, 2 పేరాలు]
14. “దేవుని [యెహోవా] దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు,” ఉండడమంటే ఏమిటి, దానిని మనమెలా చేయవచ్చు? (2 పేతు. 3:11) [w97 9/1, 19-20 పేజీలు]
15. ప్రకటన 2, 3 అధ్యాయాల్లో ప్రస్తావించబడిన ఏడు సంఘాలకు ఇవ్వబడిన సందేశాల్లో, నేటి క్రైస్తవులకు ప్రాముఖ్యమైన ఏ సలహా ఉంది? (ప్రక. 2:4, 5, 10, 14, 20; 3:3, 10, 11, 17, 19)