కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 11/03 పేజీ 2
  • సేవా కూటాల పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సేవా కూటాల పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2003
  • ఉపశీర్షికలు
  • నవంబరు 10తో ప్రారంభమయ్యే వారం
  • నవంబరు 17తో ప్రారంభమయ్యే వారం
  • నవంబరు 24తో ప్రారంభమయ్యే వారం
  • డిసెంబరు 1తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2003
km 11/03 పేజీ 2

సేవా కూటాల పట్టిక

నవంబరు 10తో ప్రారంభమయ్యే వారం

పాట 26 (212)

10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. మీ క్షేత్రంలో అక్టోబరు-డిసెంబరు తేజరిల్లు!ను (పత్రికల ప్రతిపాదన కాలమ్‌లో మొదటిది), నవంబరు 15 కావలికోటను అందించడానికి 4వ పేజీలోని సలహాలను ఎలా ఉపయోగించాలో తెలిపే రెండు ఆచరణాత్మకమైన ప్రదర్శనలు చూపండి. మాట్లాడేది ఒక పత్రిక గురించే అయినా ప్రతి ప్రదర్శనలోనూ రెండు పత్రికలను జంటగా ప్రతిపాదించాలి. ఒక ప్రదర్శనలో, మన ప్రపంచవ్యాప్త పనికి ఆర్థిక మద్దతు ఎలా లభిస్తోందో తెలిపే వివరణను చేర్చండి.—కావలికోట 2వ పేజీ లేదా తేజరిల్లు! 5వ పేజీ చూడండి.

15 నిమి: “సన్నద్ధులై ఉన్నట్లు నిరూపించుకోండి.” a ఈ విధానపు చింతలు అవరోధాలు ఆధ్యాత్మిక లక్ష్యాలు చేరుకునేందుకు ప్రయోజనకరంగా వెచ్చించగల సమయాన్ని హరించివేయకుండా వాటిని దూరంగా ఉంచడానికి ఏమి సహాయపడిందో చెప్పమని ప్రేక్షకులను కోరండి.

20 నిమి: మీరు మీ సహవాసులను ఎలా ఎంపిక చేసుకుంటారు? దేవుణ్ణి ఆరాధించండి పుస్తకంలోని 47-9 పేజీల ఆధారంగా ప్రేక్షకులతో చర్చ. 13వ పేరాలోని ప్రశ్నలను, లేఖనాలను ఉపయోగిస్తూ, మనం మన సహవాసులను ఎంపిక చేసుకునేందుకు మార్గదర్శకంగా ఉండవలసిన బైబిలు సూత్రాలపై వ్యాఖ్యానించమని ప్రేక్షకులను ఆహ్వానించండి.

పాట 15 (127), ముగింపు ప్రార్థన.

నవంబరు 17తో ప్రారంభమయ్యే వారం

పాట 6 (45)

12 నిమి: స్థానిక ప్రకటనలు. ప్రస్తుతం అందించవలసిన సాహిత్యాలను ఉపయోగించడంలో ఆసక్తికరమైన అనుభవాలు కలిగిన ఇద్దరు ముగ్గురు ప్రచారకులను ఇంటర్వ్యూ చేయండి. వారిలో కొందరు బహుశా బైబిలు అధ్యయనాలు కూడా ప్రారంభించగలిగి ఉండవచ్చు.

15 నిమి: ఇచ్చే స్ఫూర్తిని పెంపొందించుకోండి. నవంబరు 1, 2003, కావలికోట, 27-30 పేజీల ఆధారంగా పెద్ద ఇచ్చే ప్రసంగం.

18 నిమి: “ప్రశంస ఉత్తేజాన్నిస్తుంది.”b కుటుంబ సంతోషం పుస్తకంలోని 49-50 పేజీల్లోని 21వ పేరాలోనున్న వ్యాఖ్యానాలను చేర్చండి. ఇతరుల ప్రశంసాపూర్వక మాటలనుబట్టి ప్రోత్సహించబడినవారిని క్లుప్తంగా వ్యాఖ్యానించమని ఆహ్వానించండి.

పాట 11 (85), ముగింపు ప్రార్థన.

నవంబరు 24తో ప్రారంభమయ్యే వారం

పాట 23 (200)

12 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్సు రిపోర్టు. మీ క్షేత్రంలో అక్టోబరు-డిసెంబరు తేజరిల్లు!ను (పత్రికల ప్రతిపాదన కాలమ్‌లో మూడవది), డిసెంబరు 1 కావలికోటను అందించడానికి 4వ పేజీలోని సలహాలను ఎలా ఉపయోగించాలో తెలిపే రెండు వేర్వేరు ప్రదర్శనలు చూపండి. 4వ పేజీలో సూచించిన లేఖనమే చూపించవలసిన అవసరం లేదు, వేరే లేఖనాన్ని చూపించవచ్చు. మాట్లాడేది ఒక పత్రిక గురించే అయినా ప్రతి ప్రదర్శనలోనూ రెండు పత్రికలను జంటగా ప్రతిపాదించాలి. ఒక ప్రదర్శనలో, పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టులో లేదా స్థానికంగా సముచితమైన సెట్టింగులో అనియతంగా పత్రికలు ఇవ్వడాన్ని ప్రదర్శింపజేయండి.

10 నిమి: ప్రశ్నా భాగం. పెద్ద ఇచ్చే ప్రసంగం.

23 నిమి: “యెహోవాతో సాన్నిహిత్యాన్ని పెంపొందించుకోవడం.”c ఇవ్వబడిన ప్రశ్నలను ఉపయోగించండి. లేఖనాలు ఎలా అన్వయిస్తాయో వ్యాఖ్యానించమని ప్రేక్షకులను కోరండి. తమ వ్యక్తిగత బైబిలు అధ్యయనాన్ని మెరుగుపరచుకోవడానికి ఏమి సహాయపడిందో వ్యాఖ్యానించేందుకు ఒకరినో ఇద్దరినో ముందే ఏర్పాటు చేసుకోండి.

పాట 1 (13), ముగింపు ప్రార్థన.

డిసెంబరు 1తో ప్రారంభమయ్యే వారం

పాట 21 (191)

10 నిమి: స్థానిక ప్రకటనలు. నవంబరు క్షేత్రసేవ రిపోర్టులను ఇమ్మని ప్రచారకులకు గుర్తుచేయండి. డిసెంబరు సాహిత్య ప్రతిపాదనలను పేర్కొనండి. సూచించబడిన ఒకటి లేక రెండు అందింపులను క్లుప్తంగా సమీక్షించండి. అదనపు అందింపుల కోసం వాచ్‌టవర్‌ పబ్లికేషన్స్‌ ఇండెక్స్‌ను ప్రచారకులు ఎలా ఉపయోగించుకోవచ్చో వివరించండి.—సెప్టెంబరు 2001 మనరాజ్య పరిచర్య, 2వ పేజీ చూడండి.

15 నిమి: స్థానిక అవసరాలు.

20 నిమి: ఇతరులకు బోధించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాం. జూన్‌ 1, 2000, కావలికోట, 16-17 పేజీలు, 9-13 పేరాల ఆధారంగా ప్రేక్షకులతో చర్చ. సమర్థంగా బోధించగలగడం మన పరిచర్య ప్రధాన లక్ష్యం. గొఱ్ఱెల్లాంటివారికి సహాయం చేయడంలో మన సఫలత, రాజ్య సందేశాన్ని వారికి తెలియజేసి వారిని పురికొల్పే విధంగా అందించే మన సామర్థ్యం మీద ఆధారపడివుంటుంది. ఈ ప్రశ్నలపై చర్చించండి: (1) ప్రకటించడానికి బోధించడానికి తేడా ఏమిటి? (it-2 672వ పేజీ, 2వ పేరా) (2) బైబిలు అధ్యయనం చేయడానికి కొందరెందుకు సంకోచిస్తారు? (3) మన బోధనా సామర్థ్యాన్ని ఎలా మెరుగుపరచుకోవచ్చు? (4) మన విద్యార్థి తాను నేర్చుకుంటున్న దాని భావం గ్రహిస్తున్నాడో లేదో ఎలా నిర్ధారించుకోవచ్చు? (5) విద్యార్థి ఏ లక్ష్యాన్ని సాధించడానికి మనం ఆయనకు సహాయం చేసేలా ప్రయత్నించాలి?

పాట 22 (130), ముగింపు ప్రార్థన.

[అధస్సూచీలు]

a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి