సేవా కూటాల పట్టిక
అక్టోబరు 13తో ప్రారంభమయ్యే వారం
పాట 22 (130)
10 నిమి: స్థానిక ప్రకటనలు, మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. 8వ పేజీలోని సలహాలను ఉపయోగిస్తూ అక్టోబరు-డిసెంబరు తేజరిల్లు!ను, (పత్రికల ప్రతిపాదన కాలమ్‌లో మొదటిది) అక్టోబరు 15 కావలికోటను ఎలా ప్రతిపాదించాలో చూపించే రెండు వాస్తవిక ప్రదర్శనలను విడి విడిగా ప్రదర్శించండి. మాట్లాడేది ఒక పత్రిక గురించే అయినా ప్రతి ప్రదర్శనలోనూ రెండు పత్రికలను జంటగా ప్రతిపాదించాలి. ఒక ప్రదర్శనలో పత్రికా మార్గంలో పునర్దర్శనం చూపించండి. “మా తదుపరి సంచికలో” అనే బాక్సుపైకి అవధానం మళ్ళించడం ద్వారా మళ్ళీ సందర్శించడానికి పునాది వేయండి.—అక్టోబరు 1998 మన రాజ్య పరిచర్య, 8వ పేజీ, 7, 8 పేరాలను చూడండి.
20 నిమి: “సంతోషముతో యెహోవాను సేవించండి.”a (ఈ చర్చ కోసం అందరి దగ్గర జనవరి 2002 మన రాజ్య పరిచర్యలోని మధ్యపేజీలు, సెప్టెంబరు 2003 మన రాజ్య పరిచర్యలోని మధ్యపేజీలు ఉండాలి.) 4వ పేరా చర్చించిన తర్వాత, నవంబరులో మనం దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్, జ్ఞానము పుస్తకం ప్రతిపాదిస్తున్నామని చెప్పండి. మన రాజ్య పరిచర్యలోని మధ్యపేజీల్లో ఇవ్వబడిన సూచనల్లో ఒకదానిని సంక్షిప్తంగా సమీక్షించండి. (జనవరి 2002; సెప్టెంబరు 2003) తర్వాత అభ్యాస భాగంలో ఆ ప్రతిపాదనను చూపిస్తూ ప్రదర్శించండి. పరిచర్య కోసం బాగా సిద్ధపడమని అందరినీ ప్రోత్సహించండి.
15 నిమి: బైబిలు అధ్యయనాలు నిర్వహించడం ఆశీర్వాదాలు తెస్తుంది. ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. మన ప్రచురణల నుండి ప్రగతిశీల బైబిలు అధ్యయనాలున్న కొన్ని అనుభవాలు చెప్పండి. (w00 3/1 6వ పేజీ; yb98 55-60 పేజీలు) ఆ అనుభవాల నుండి మనమేమి నేర్చుకున్నామో వ్యాఖ్యానించమని, బైబిలు అధ్యయనాలు నిర్వహించడం ద్వారా ఎలా ప్రయోజనం పొందవచ్చునో చెప్పమని ప్రేక్షకులను కోరండి.
పాట 4 (43), ముగింపు ప్రార్థన.
అక్టోబరు 20తో ప్రారంభమయ్యే వారం
పాట 16 (143)
5 నిమి: స్థానిక ప్రకటనలు.
15 నిమి: “సమృద్ధిగానే అయినా వివేచనతో విత్తండి.”b ప్రత్యేకించి మీ క్షేత్రానికి సముచితంగా ఉండే మాటలను నొక్కిచెప్పండి. ఈ సూచనలను ఈ వారాంతపు క్షేత్ర సేవా కూటాల్లో సమీక్షించాలి.
25 నిమి: తోటివారి ఒత్తిడిని నిరోధించడం. క్రైస్తవ కుటుంబంలో పెరిగిన ఒక పెద్దను లేదా పరిచర్య సేవకుడిని ఇంటర్వ్యూ చేయండి. ఫిబ్రవరి 15 2003, కావలికోటలో నుండి ఎంపిక చేయబడిన అంశాలను సూచించండి. సహోదరుడు స్కూల్లో ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కొన్నాడు? (24వ పేజీ, 3వ పేరా; 25వ పేజీ, 4-5 పేరాలు) ఆయన ఇతరుల నుండి ఏమైనా హానికరమైన ప్రభావాన్ని ఎదుర్కొన్నాడా? (26వ పేజీ, 4-6 పేరాలు) ఆయన ఈ వయస్సులో కూడా తోటివారి ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడా? అలా ఎదురైన ఒత్తిడిని అధిగమించడానికి ఆయనకు ఏమి సహాయపడింది? ఆగస్టు 1 1999 కావలికోట 24-5 పేజీల ఆధారంగా, ఆరోగ్యకరమైన సహవాసం వల్ల కలిగే ప్రయోజనాలను నొక్కిచెబుతూ క్లుప్తమైన సమీక్షతో ప్రసంగాన్ని ముగించండి.
పాట 3 (32), ముగింపు ప్రార్థన.
అక్టోబరు 27తో ప్రారంభమయ్యే వారం
పాట 7 (51)
12 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్టు. అక్టోబరు క్షేత్ర సేవా రిపోర్టులను ఇమ్మని ప్రచారకులకు గుర్తు చేయండి. వచ్చేవారం సేవా కూటానికి సిద్ధపాటుగా, గత సేవా సంవత్సరపు ప్రత్యేక సమావేశ దినంలో వ్రాసుకున్న నోట్సును పునఃసమీక్షించుకొమ్మని అందరినీ ప్రోత్సహించండి. 8వ పేజీలోని సలహాలను ఉపయోగిస్తూ అక్టోబరు-డిసెంబరు తేజరిల్లు!ను, (పత్రికల ప్రతిపాదన కాలమ్‌లో మూడవది) నవంబరు 1 కావలికోటను ఎలా ప్రతిపాదించాలో చూపించే రెండు ప్రదర్శనలను విడి విడిగా ప్రదర్శించండి. మాట్లాడేది ఒక పత్రిక గురించే అయినా ప్రతి ప్రదర్శనలోనూ రెండు పత్రికలను జంటగా ప్రతిపాదించాలి. ఒక ప్రదర్శనలో “నాకు ఆసక్తిలేదు” అని చెప్పి సంభాషణను ఆపే వ్యక్తితో ఎలా వ్యవహరించాలో చూపించండి.—తర్కించడం (ఆంగ్లం) పుస్తకంలో 16వ పేజీ చూడండి.
20 నిమి: ఆత్మ ఖడ్గమును ఉపయోగించండి. (ఎఫె. 6:17) పరిచర్య పాఠశాల పుస్తకంలోని 143-4 పేజీల ఆధారంగా ప్రేక్షకులతో చర్చ. ఈ క్రింది ప్రశ్నలపై వ్యాఖ్యానించమని ఆహ్వానించండి: (1) ప్రశ్నలకు జవాబులిచ్చేటప్పుడు మనం బైబిలు ఎందుకు ఉపయోగిస్తాం? (2) యెహోవాసాక్షులు అనే పేరు మన గురించి ఏమి తెలియజేస్తుంది? (3) యేసు ఏ మాదిరి ఉంచాడు, ఆయనను మనమెలా అనుకరించవచ్చు? (4) స్థానిక క్షేత్రంలో బైబిలు తలంపులను పరిచయం చేసేందుకు కొన్ని సమర్థవంతమైన విధానాలు ఏవి? (5) వీలైనప్పుడల్లా నేరుగా బైబిలు నుండి చదవడం ఎందుకు మంచిది? (6) బైబిలును బాగా ఉపయోగించడానికి పెద్దలు ఇతరులను ఎలా ప్రోత్సహించవచ్చు? 144వ పేజీలోని అభ్యాసం ఆధారంగా, సమర్థుడైన ఒక ప్రచారకుడు ప్రశ్నకు జవాబిచ్చేటప్పుడు కనీసం ఒక లేఖనాన్ని ఉపయోగిస్తున్నట్లు బాగా సిద్ధపడిన ఒక పదర్శన చూపించండి. సాక్ష్యమిస్తున్న ప్రతిసారీ బైబిలు ఉపయోగించడాన్ని లక్ష్యంగా పెట్టుకొమ్మని అందరినీ ప్రోత్సహించండి.
13 నిమి: స్థానిక అనుభవాలు. జిల్లా సమావేశానికి హాజరైన సందర్భంలో లేదా ఉద్యోగ స్థలంలో, స్కూల్లో, వేరే ఎక్కడైనా తటస్థ సాక్ష్యమిచ్చిన అనుభవాలుంటే చెప్పమని ప్రేక్షకులను కోరండి.
పాట 6 (45), ముగింపు ప్రార్థన.
నవంబరు 3తో ప్రారంభమయ్యే వారం
పాట 26 (212)
5 నిమి: స్థానిక ప్రకటనలు.
15 నిమి: స్థానిక అవసరాలు.
25 నిమి: సత్‌క్రియలనే ధనముగలవారిగా ఉండండి. (1 తిమో. 6:18) ఇక్కడ ఇవ్వబడిన ప్రశ్నలను ఉపయోగిస్తూ ఒక పెద్ద, గత సేవా సంవత్సరంలో జరిగిన ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమంపై ప్రేక్షకులతో జరిపే చర్చ. తాము నేర్చుకున్న విషయాలను ఎలా అన్వయించుకోగలిగారో చెప్పమని సంఘాన్ని కోరండి. (ఒక్కొక్కరికి ఒక్కో భాగాన్ని ముందుగానే నియమించవచ్చు.) కార్యక్రమంలోని ఈ భాగాలను నొక్కిచెప్పండి: (1) “సత్‌క్రియలు గొప్ప ప్రయోజనాన్ని తీసుకువస్తాయి.” (ప్రసం. 2:11) దేవుని సేవకులు ఈ లోకంలోని నిష్ప్రయోజనమైన క్రియలు చేయకుండా దేవుని వాక్యంలో వర్ణించబడిన సత్‌క్రియలు పట్టుదలతో ఎందుకు చేస్తారు? (2) “దేవుని దృక్కోణం నుండి ధనవంతులుగా ఉండండి.” (మత్త. 6:20) కొందరు ‘పరలోకమందు ధనమును’ ఎలా సమకూర్చుకున్నారు, ఎలాంటి ప్రయోజనాలు పొందారు? (3) “బైబిలు అధ్యయనంతో మీ పరిచర్యను సుసంపన్నం చేసుకోండి.” (om 91వ పేజీ) ఒక బైబిలు అధ్యయనం ప్రారంభించి నిర్వహించడానికి మనకేమి సహాయపడగలదు? (4) “ఈ కోతకాలంలో సత్‌క్రియలు.” (మత్త. 13:37-39) సత్‌క్రియల విషయంలో తొలి క్రైస్తవులు ఎలాంటి మాదిరినుంచారు, మన కాలంలో రాజ్యపని ఎలా విస్తరింపజేయబడింది? (5) “మీ సత్‌క్రియల ద్వారా యెహోవాను ఘనపరచండి.” (మత్త. 5:14-16) కొందరు ‘తమ వెలుగును’ ఎలా “ప్రకాశింప”జేశారు? (6) “యెహోవాను స్తుతించడంలోని సత్‌క్రియలకు యౌవనులను మెచ్చుకోవడం.” (కీర్త. 148:12, 13) మన సర్క్యూట్‌లోని క్రైస్తవ యువత యెహోవాను ఎలా స్తుతిస్తోంది? (7) “సత్‌క్రియలు చేస్తూ యెహోవా ఆశీస్సులను అనుభవిస్తుండండి.” (సామె. 10:22) మనం సత్‌క్రియల్లో నిమగ్నులమై ఉండడం ద్వారా వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా, ప్రపంచవ్యాప్త సంస్థగా ఎలాంటి ఆశీర్వాదాలను పొందగలము?
పాట 5 (46), ముగింపు ప్రార్థన.
[అధస్సూచీలు]
a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.