కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 9/03 పేజీ 7
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2003
మన రాజ్య పరిచర్య—2003
km 9/03 పేజీ 7

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు సెప్టెంబరులో: “నీ రాజ్యము వచ్చుగాక” (ఆంగ్లం) లేదా జీవితమున ఉన్న యావత్తు ఇదేనా? లేదా పాతబడి, రంగుమారిన ఏదైనా 192 పేజీల పుస్తకం లేదా నిత్యజీవానికి నడిపించే జ్ఞానము ప్రతిపాదించవచ్చు. అక్టోబరులో: కావలికోట, తేజరిల్లు! పత్రికలు. ఆసక్తి కనబరిస్తే బైబిలు అధ్యయనాలను ప్రారంభించడానికి ప్రత్యేకమైన కృషి చేస్తూ దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌ను ప్రతిపాదించండి. నవంబరులో: దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? లేక నిత్యజీవానికి నడిపించే జ్ఞానము. గృహస్థుల వద్ద అప్పటికే ఈ ప్రచురణలు ఉంటే, అద్వితీయ సత్యదేవుణ్ణి ఆరాధించండి లేదా ఏదైనా పాత ప్రచురణను ప్రతిపాదించవచ్చు. డిసెంబరులో: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి. ప్రత్యామ్నాయంగా నా బైబిలు కథల పుస్తకము లేదా మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అందించవచ్చు.

◼ సాహిత్యాలను పంపించమని ప్రచారకులు వ్యక్తిగతంగా చేసే రిక్వెస్ట్‌లను బ్రాంచి కార్యాలయం అంగీకరించదు. సాహిత్యాల కోసం సంఘం చేసే నెలసరి రిక్వెస్ట్‌లను బ్రాంచికి పంపించే ముందు ప్రతి నెలా దాని గురించి సంఘంలో ప్రకటన చేసేలా సంఘ పైవిచారణకర్త ఏర్పాటు చేయాలి. ఆ విధంగా, వ్యక్తిగతంగా కావల్సిన సాహిత్యాలను తెప్పించుకోవాలని ఇష్టపడుతున్న వారందరూ సాహిత్యాల బాధ్యతను నిర్వహిస్తున్న సహోదరునికి ఆ విషయాన్ని తెలియజేయవచ్చు. సాహిత్యాల్లో ఏవి స్పెషల్‌ రిక్వెస్ట్‌ ఐటమ్‌కు చెందుతాయో దయచేసి గుర్తుంచుకోండి.

◼ బహిష్కరించబడిన లేక తమకు తాముగా సంఘం నుండి వేరైపోయిన వారి విషయంలో పెద్దలు ఫిబ్రవరి 1, 1992, కావలికోట 17-19 పేజీల్లోని సూచనల ప్రకారం వ్యవహరించాలని వారికి గుర్తు చేయబడుతోంది, బహుశా అలాంటి వారెవరైనా తిరిగి రావడానికి మొగ్గు చూపిస్తుండవచ్చు .

◼ మన రాజ్య పరిచర్య యొక్క ఈ సంచికలోని అనుబంధంలో జ్ఞానము పుస్తకం కోసం క్లుప్త సలహాలు సూచించబడ్డాయి. సాక్ష్యమిచ్చే మీ పనిలో మీరు ఇష్టపడినన్ని ప్రయత్నించి, ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడండి.

◼ బెంగుళూరులోని బ్రాంచి కార్యాలయానికి ఇప్పటికీ లోనావ్లా చిరునామాగల అనేక ఉత్తరాలు అందుతున్నాయి, అవి ప్రాముఖ్యంగా మన సాహిత్యాన్ని చదివి మరింత తెలుసుకోవాలని ఆసక్తివున్నా తిరిగి వారిని కలుసుకోని వారి నుండి వస్తున్నాయి. ఇటీవల ముద్రించబడిన పత్రికలు, సాహిత్యాల్లో తప్ప మన సాహిత్యాల్లో అధిక శాతంపై ఇంకా లోనావ్లా చిరునామానే ఉంది. ప్రచారకులవద్ద, సంఘాలవద్ద ఇంకా స్టాకులోవున్న సాహిత్యాల్లోకూడా ఇదే చిరునామా ఉంటుంది. కాబట్టి ప్రస్తుత స్టాకు అయిపోయి ఇంకా ఎక్కువ పునర్ముద్రణ జరిగేంత వరకు, ఈ సాహిత్యాలను అందజేస్తున్న ప్రచారకులందరిని పాత చిరునామాను బెంగుళూరులోని కొత్త బ్రాంచి చిరునామాకు మార్చమని మేము కోరుతున్నాము. ఇది ఉత్తరాలు లోనావ్లాకు వెళ్ళడాన్ని తగ్గించి, ఉత్తరప్రత్యుత్తరాలలో జాప్యాన్ని నివారిస్తుంది.

◼ 2004 జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో ప్రత్యేక ప్రసంగం ఏప్రిల్‌ 18 ఆదివారం నాడు ఇవ్వబడుతుంది. ప్రసంగ అంశము తర్వాత ప్రకటించబడుతుంది. ఆ వారాంతంలో ప్రాంతీయ పైవిచారణకర్త సందర్శనం గానీ సమావేశం గానీ ఉన్న సంఘాల్లో మరుసటి వారంలో ఆ ప్రసంగం ఇవ్వబడుతుంది. ఏ సంఘంలోనూ ఏప్రిల్‌ 18, 2004కు ముందు ప్రత్యేక ప్రసంగం ఇవ్వబడకూడదు.

◼ మళ్ళీ లభ్యమయ్యే ప్రచురణలు:

యెహోవాసాక్షులు మరియు విద్య—హిందీ

జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు? —బెంగాలీ, మరాఠీ, హిందీ

దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?—కన్నడ, గుజరాతీ, బెంగాలీ, మరాఠీ, హిందీ

మనం మరణించినప్పుడు మనకేమి సంభవిస్తుంది?—ఆంగ్లం

యెహోవాకు స్తుతిగీతములు పాడండి (29 పాటలు)—హిందీ

కురుక్షేత్రం నుండి అర్మగిద్దోను వరకు—మరియు మీరు తప్పించుకొనుట —కన్నడ, గుజరాతీ, తమిళం, తెలుగు, బెంగాలీ, మలయాళం, హిందీ

మరణంపై విజయం—మీకు సాధ్యమవుతుందా?—నేపాలీ

తక్దీర్‌ మన జీవితాల్ని ఏలుతోందా?—లేక ఖుదా మనల్ని బాధ్యులనుగా ఎంచుతాడా? (ముస్లిమ్‌లకు) (కరపత్రం నం. 71)—ఉర్దూ

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి