కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 9/03 పేజీ 1
  • వినయమును ధరించుకోండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వినయమును ధరించుకోండి
  • మన రాజ్య పరిచర్య—2003
  • ఇలాంటి మరితర సమాచారం
  • వినయమును ఎందుకు ధరించుకొనవలెను?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • యెహోవా వినయస్థుల్ని ఇష్టపడతాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
  • నిజమైన వినయాన్ని అలవరచుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • అనుకరించదగు సాత్వికముగలవారి ఉదాహరణలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2003
km 9/03 పేజీ 1

వినయమును ధరించుకోండి

1 గొఱ్ఱెలు కాసుకునే ఒక పిల్లవాడు యెహోవాపై విశ్వాసంతో శక్తిమంతుడైన ఒక యోధుడ్ని జయిస్తాడు. (1 సమూ. 17:45-47) ఒక సంపన్నుడు విపత్తును ఓర్పుతో సహిస్తాడు. (యోబు 1:20-22; 2:9, 10) దేవుని కుమారుడు తన బోధకు ఘనతనంతటినీ తన తండ్రికి ఆపాదిస్తాడు. (యోహా. 7:15-18; 8:28) ఈ ఉదాహరణలన్నిటిలోనూ వినయం కీలక పాత్ర వహించింది. అదేవిధంగా నేడు, మనం ఎదుర్కొనే పరిస్థితుల్లో వినయం ఆవశ్యకం.—కొలొ. 3:12.

2 ప్రకటించేటప్పుడు: క్రైస్తవ పరిచారకులుగా మనం అన్ని రకాల ప్రజలతో వినయంగా సువార్త పంచుకుంటాము, వారి జాతి, సంస్కృతి లేదా నేపథ్యం ఆధారంగా ముందే వారిపై ఓ అభిప్రాయం ఏర్పరచుకోము. (1 కొరిం. 9:22, 23) ఎవరైనా కఠినంగా వ్యవహరిస్తే లేదా అహంకారంగా రాజ్య సందేశాన్ని నిరాకరిస్తే, మనమూ అలాగే ప్రవర్తించము గానీ ఓర్పుగా యోగ్యులైన వారి కోసం వెదకుతాము. (మత్త. 10:11, 14) మన జ్ఞానంతో లేదా విద్యతో ఇతరులను ముగ్ధుల్ని చేయడానికి ప్రయత్నించే బదులు, మనం చెప్పేదేనికన్నా దేవునివాక్యం మరింత బలంగా ఒప్పించగలదని గుర్తిస్తూ మనం దానిపైకి వారి అవధానం మళ్ళిస్తాము. (1 కొరిం. 2:1-5; హెబ్రీ. 4:12) యేసును అనుకరిస్తూ మనం ఘనతనంతటినీ యెహోవాకే చెల్లిస్తాము.—మార్కు 10:17, 18.

3 సంఘంలో: అంతేగాక క్రైస్తవులు ‘ఎదుటివానియెడల దీనమనస్సు అను వస్త్రము ధరించుకోవాలి.’ (1 పేతు. 5:5) మనం ఇతరులను మనకంటే ఉన్నతులుగా పరిగణిస్తే, మన సహోదరులు మనకు సేవచేయాలని ఎదురుచూసే బదులు మనమే వారికి సేవచేయడానికి మార్గాల కోసం వెదకుతాము. (యోహా. 13:12-17; ఫిలి. 2:3, 4) రాజ్యమందిరాన్ని శుభ్రపరచడం వంటి పనులు చేయవలసిన స్థాయికంటే ఉన్నతహోదాలో మనం ఉన్నామని భావించము.

4 ‘ప్రేమతో ఒకరినొకరు సహించడానికి’ వినయం మనకు సహాయం చేసి, తద్వారా సంఘంలో శాంతి సమైక్యతలను పెంపొందింపజేస్తుంది. (ఎఫె. 4:1-3) నాయకత్వం వహించడానికి నియమించబడినవారికి లోబడి ఉండేందుకు అది మనకు సహాయం చేస్తుంది. (హెబ్రీ. 13:17) మనకు ఇవ్వబడే ఏ ఉపదేశాన్నైనా లేదా క్రమశిక్షణనైనా స్వీకరించేలా అది మనల్ని పురికొల్పుతుంది. (కీర్త. 141:5) సంఘంలో మనకు లభించే ఏ బాధ్యతలనైనా నిర్వర్తించేటప్పుడు మనం యెహోవాపై ఆధారపడేందుకు వినయం మనల్ని ప్రోత్సహిస్తుంది. (1 పేతు. 4:11) విజయం మానవ సామర్థ్యంపై కాదు గానీ దేవుని ఆశీర్వాదంపై ఆధారపడి ఉంటుందని దావీదు వలే మనమూ గుర్తిస్తాము.—1 సమూ. 17:37.

5 మన దేవుని సమక్షంలో: అన్నిటికంటే ముఖ్యంగా, ‘దేవుని బలిష్ఠమైన చేతిక్రింద మనం దీనమనస్కులమై’ ఉండాలి. (1 పేతు. 5:6) మనకు కష్టభరిత పరిస్థితులు ఎదురైతే, రాజ్యం తీసుకువచ్చే ఉపశమనం కోసం మనం ఆకాంక్షిస్తుండవచ్చు. కానీ యెహోవా తన వాగ్దానాలను తన నియమిత సమయంలోనే నెరవేర్చాలని మనం ఎదురుచూస్తూ వినయంతో సహనం చూపిస్తాము. (యాకో. 5:7-11) యథార్థత కాపాడుకున్న యోబు విషయంలోలాగే మనకు అత్యంత ముఖ్యమైన విషయం “యెహోవా నామమునకు స్తుతి కలుగ[డమే].”—యోబు 1:21.

6 దానియేలు ప్రవక్త ‘దేవుని యెదుట తనను తాను తగ్గించుకున్నాడు,’ అందుకే ఆయన యెహోవా అనుగ్రహం పొందాడు, ఆయనకు ఎన్నో మంచి ఆధిక్యతలు ఇవ్వబడ్డాయి. (దాని. 10:11, 12) అలాగే మనం కూడా, “యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివలన కలుగును” అని తెలుసుకొని వినయమును ధరించుకొందాము.—సామె. 22:4.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి