“సంతృప్తికరమైన జీవితం—దాన్నెలా సాధించవచ్చు? బ్రోషుర్ కోసం సూచించబడిన ప్రతిపాదనలు”
◼ “ప్రతిరోజు మనం ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా, నిజంగా సంతృప్తినిచ్చే జీవితం సాధ్యమవుతుందని మీకనిపిస్తోందా? [ప్రతిస్పందించనీయండి.] జ్ఞానవంతమైన ఒక సలహా మత్తయి 5:5లో ఉంది. [చదవండి] అయితే అలాంటి సాత్వికాన్ని పెంపొందించుకొని, మన కోపాన్ని ఎలా నిగ్రహించుకోవచ్చు? ఈ పత్రికలో 9వ పేజీలోవున్న చిత్రాన్ని, దానికి సంబంధించిన కాప్షన్ చూడండి.” ఆ తర్వాత 8వ పేజీలోని 11వ పేరావైపు దృష్టి మళ్ళించండి.
◼ “చెడు ప్రభావాలతో నిండిన ఈ లోకంలో తమ పిల్లలను ఎలా పెంచిపెద్ద చేయాలా అని అనేకమంది తల్లిదండ్రులు కలత చెందుతున్నారని మీరు అంగీకరించరా? [ప్రతిస్పందించనీయండి.] ఇలాంటి హానికరమైన వాతావరణం నుండి తమ పిల్లలను రక్షించుకోవడానికి తల్లిదండ్రులు ఏమి చేయవచ్చు?” సామెతలు 22:6 చదవండి. ఆ తర్వాత 5వ పేజీలోని పైచిత్రాన్ని చూపించి, 2వ పేరాను చర్చించండి.
◼ “నేడు మనలో చాలామంది శాంతిసమాధానాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం, అయినా వాటిని పొందడం కష్టమవుతోంది. వాటిని పొందలేకపోవడానికి కారణం ఏమిటంటారు? [ప్రతిస్పందించనీయండి.] నేటి మానవాళి పరిస్థితి గురించి యోబు 14:1, 2 ఏమంటున్నాయో గమనించండి. మనం నిజంగా సంతోషంగా ఉండడానికి మనకు సహాయపడేది ఏమిటి?” 22వ పేజీలోని 2వ పేరాపైకి దృష్టిని మళ్ళించండి, ఆ పేజీలోని చిత్రాలపై కూడా వ్యాఖ్యానించండి.