సేవా కూటాల పట్టిక
మే 12తో ప్రారంభమయ్యే వారం
పాట 6 (45)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. 4వ పేజీలోని సలహాలను ఉపయోగిస్తూ ఏప్రిల్-జూన్ తేజరిల్లు!ను, (పత్రికల ప్రతిపాదన కాలమ్‌లో మొదటిది) మే 15 కావలికోటను ఎలా ప్రతిపాదించాలో చూపించే రెండు ప్రదర్శనలను విడి విడిగా ప్రదర్శించండి. మాట్లాడేది ఒక పత్రిక గురించే అయినప్పటికీ ప్రతి ప్రదర్శనలోనూ రెండు పత్రికలను జంటగా ప్రతిపాదించాలి. ప్రదర్శనలో విరాళమిచ్చే ఏర్పాటు గురించి ప్రస్తావించబడేలా చూడండి.
20 నిమి: తల్లిదండ్రులారా—మీ పిల్లల అభివృద్ధికి సహాయపడండి. పరిచర్య పాఠశాల పుస్తకం 9-12, 21-38 పేజీలలోని ముఖ్యమైన విషయాలను చర్చిస్తూ ఇచ్చే ప్రసంగం. తమ పిల్లలు పరిచర్యలో అభివృద్ధి సాధించేలా శిక్షణనివ్వాలనే లక్ష్యంతో ఆ పుస్తకంలోని కొంత సమాచారాన్ని, తమ కుటుంబ అధ్యయనాల్లో ఉపయోగించమని తల్లిదండ్రులను ప్రోత్సహించండి. అవసరమైన నైపుణ్యాలను వృద్ధిచేసుకోవడంలో యౌవనులకు సహాయపడేందుకు ఉపయోగించగల నిర్దిష్ట అంశాలపైకి అవధానాన్ని మళ్ళించండి.
15 నిమి: “సువార్త అప్పగించబడింది.”a ప్రకటనా పనిలో ఎక్కువగా భాగం వహించడానికి తమ పరిస్థితులను ఎలా సర్దుబాటు చేసుకోగలిగారో సంక్షిప్తంగా వివరించేందుకు ఒకరు లేక ఇద్దరు ప్రచారకులను ముందుగానే ఏర్పాటు చేసుకోండి.
పాట 5 (46), ముగింపు ప్రార్థన.
మే 19తో ప్రారంభమయ్యే వారం
పాట 23 (200)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్టు.
15 నిమి: స్థానికావసరాలు.
20 నిమి: “అనియత సాక్ష్యంతో యెహోవాను స్తుతించండి.”b ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. 3వ పేరా చర్చిస్తున్నప్పుడు, ఈ క్రింద ఇవ్వబడిన కొన్ని పరిస్థితుల్లో బైబిలు చర్చను ప్రారంభించడానికి ఏమి చెప్పవచ్చో తెలియజేయమని ప్రేక్షకులను అడగండి. (1) బజారుకు వెళ్ళినప్పుడు, (2) ప్రయాణం చేస్తున్నప్పుడు, (3) ఇంటి పెరట్లో పనిచేసుకుంటున్న పొరుగింటి వ్యక్తితో, (4) ఉద్యోగ స్థలంలో తోటి ఉద్యోగితో, (5) స్కూల్లో తోటి విద్యార్థితో. ఒక ప్రచారకుడు అనియత సాక్ష్యమివ్వడంలో ఎలా సఫలుడయ్యాడో చూపించే స్థానిక అనుభవాన్ని చెప్పడానికి ముందుగానే ఏర్పాటు చేసుకోండి.
పాట 16 (143), ముగింపు ప్రార్థన.
మే 26తో ప్రారంభమయ్యే వారం
పాట 22 (130)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మే క్షేత్రసేవా రిపోర్టులను ఇమ్మని అందరికీ గుర్తు చేయండి. 4వ పేజీలోని సలహాలను ఉపయోగిస్తూ ఏప్రిల్-జూన్ తేజరిల్లు!ను, (పత్రికల ప్రతిపాదన కాలమ్‌లో మూడవది) జూన్ 1 కావలికోటను ఎలా ప్రతిపాదించాలో చూపించే రెండు ప్రదర్శనలను విడి విడిగా ప్రదర్శించండి. మాట్లాడేది ఒక పత్రిక గురించే అయినప్పటికీ ప్రతి ప్రదర్శనలోనూ రెండు పత్రికలను జంటగా ప్రతిపాదించాలి. ఒక ప్రదర్శన ముగింపులో, పత్రికలను తీసుకోవడానికి నిరాకరించిన వ్యక్తికి మీరు బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడతారా? అనే కరపత్రాన్ని ఇవ్వండి.
10 నిమి: ప్రశ్నా భాగం. ప్రసంగం. ఫిబ్రవరి 2001, మన రాజ్య పరిచర్య 6వ పేజీలోని 12-15 పేరాల్లో టెలిఫోన్ సాక్ష్యం కోసం ఇచ్చిన కొన్ని సలహాలను లేదా స్థానిక క్షేత్రంలో మంచి ఫలితాలనిచ్చిన సలహాలను క్లుప్తంగా సమీక్షించండి.
25 నిమి: “దేవుని వాక్యమే సత్యము.”c ఇవ్వబడిన ప్రశ్నలను ఉపయోగించండి. ప్రేక్షకులు సత్యం నేర్చుకునేటప్పడు తమ ప్రశ్నలకు జవాబులివ్వడానికి బైబిలు ఉపయోగించడం ద్వారా ప్రచారకులు తమకు ఎలా సహాయపడ్డారో చెప్పమని కోరండి. 4వ పేరా చర్చిస్తున్నప్పుడు, ప్రతిభావంతుడైన ఒక ప్రచారకునిచేత “దేవుని వాక్యాన్ని సరిగ్గా ఉపయోగించండి” అనే ఆర్టికల్‌లో ఇవ్వబడిన కొన్ని సలహాలను ఉపయోగిస్తూ మొదటి సందర్శనంలోనే బైబిలు ఎలా ఉపయోగించాలో తెలిపే ప్రదర్శనను ప్రదర్శింపజేయండి.—km 12/01, 1వ పేజీ, 3, 4 పేరాలు.
పాట 6 (45), ముగింపు ప్రార్థన.
జూన్ 2తో ప్రారంభమయ్యే వారం
పాట 23 (200)
10 నిమి: స్థానిక ప్రకటనలు. జనవరి 2002, మన రాజ్య పరిచర్య లోపలిపేజీల్లో దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌ను, జ్ఞానము పుస్తకమును ప్రతిపాదించేందుకు ఇవ్వబడిన సలహాల్లోనుండి ఒకటి లేదా రెండింటిని సమీక్షించండి.
20 నిమి: మాననీయమైన వివాహం దేవుని ఆదేశం. ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. అనేక దేశాల్లో చట్టబద్ధంగా వివాహం చేసుకోకుండానే కలిసి జీవించడం సర్వసాధారణం. దీంట్లో ఆచరణాత్మకమైన ప్రయోజనాలున్నాయని కొందరంటారు. వివాహాన్ని దేవుడు ప్రారంభించాడని నొక్కి చెబుతూ బైబిలు దృక్కోణాన్ని ప్రాధాన్యంగా చూపించండి. (rs 248-9 పేజీలు) వివాహం చేసుకోకుండానే కలిసి జీవించడం వ్యభిచారం. (fy 17వ పేజీ) చాలామంది విశ్వసిస్తున్నదానికి భిన్నంగా, వివాహానికి ముందు కలిసి జీవించడం వల్ల వివాహ జీవితం విజయవంతమయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని పరిశోధనలు చూపిస్తున్నాయి. (g02 ఏప్రి.-జూన్ 28వ పేజీ; g92 9/8 28వ పేజీ; g91 5/8 28వ పేజీ) క్రైస్తవులు యెహోవా ప్రమాణాలకు అనుగుణంగా జీవించడం ద్వారా ఆయనను గౌరవిస్తారు. అలా చేయడం ద్వారా వాళ్ళు తమకు తాము కూడా ప్రయోజనం చేకూర్చుకుంటారు.—యెష. 48:17, 18.
15 నిమి: మీరెలా ప్రయోజనం పొందుతున్నారు? ప్రేక్షకులతో చర్చ, పాఠశాల పైవిచారణకర్త నిర్వహించాలి. జనవరి నుండి దైవపరిపాలనా పరిచర్య పాఠశాల కోసం మేము ఒక కొత్త ఏర్పాటును ప్రవేశపెట్టాము. దానిలోని కొన్ని కొత్త విశిష్ట భాగాలను క్లుప్తంగా సమీక్షించండి. ఇప్పటివరకు కనబడిన సానుకూల ప్రయోజనాలను నొక్కి చెప్పండి. పాఠశాలలో మరింత ఎక్కువమంది విద్యార్థులు చేరారా? భాగం వహించడానికి అత్యధిక సంసిద్ధత కనబడుతోందా? సలహా ఇవ్వడానికి చేయబడిన కొత్త ఏర్పాటు నుండి విద్యార్థులు ఎలా ప్రయోజనం పొందుతున్నారు? ప్రేక్షకులు తాము ఇప్పటివరకు వ్యక్తిగతంగా ఎలా ప్రయోజనం పొందారో, ఈ కొత్త కార్యక్రమం భవిష్యత్తులో వారికి ఎలా సహాయపడగలదని భావిస్తున్నారో తెలియజేయమని వారిని కోరండి.
పాట 9 (37), ముగింపు ప్రార్థన.
[అధస్సూచీలు]
a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.