సేవా కూటాల పట్టిక
మార్చి 10తో ప్రారంభమయ్యే వారం
పాట 6 (45)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. 8వ పేజీలోని సలహాలను ఉపయోగిస్తూ జనవరి-మార్చి తేజరిల్లు!ను, (పత్రికల ప్రతిపాదన కాలమ్‌లో మొదటిది) మార్చి 15 కావలికోటను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి. మాట్లాడేది ఒకే పత్రిక గురించి అయినా ప్రతి ప్రదర్శనలోనూ రెండు పత్రికలను కలిపి ప్రతిపాదించాలి.
15 నిమి: 2003 వార్షిక పుస్తకం (ఆంగ్లం) నుండి ప్రయోజనం పొందడం. ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. “పరిపాలక సభ నుండి ఉత్తరం”లోని ముఖ్యాంశాలను చర్చించండి. అది ఈ సంచికతోపాటు ఉన్న అదనపు పేజీల్లో ఉంది. ప్రోత్సాహకరంగానూ, బలపరిచేవిగానూ ఉన్నాయనిపించిన నివేదికలను, అనుభవాలను తెలిపేందుకు కొందరు ప్రచారకులను ముందుగానే ఏర్పాటు చేసుకోండి. ప్రపంచవ్యాప్త నివేదిక నుండి ముఖ్యాంశాలను ప్రస్తావించండి. ఈ సంవత్సర కాలంలో కొద్ది కొద్దిగా మొత్తం పుస్తకాన్ని చదవమని కుటుంబాలను ప్రోత్సహించండి. కొత్త వాళ్ళను యెహోవా సంస్థవైపు మళ్ళించడానికి, కూటాలకు హాజరయ్యేందుకు వారిని ప్రోత్సహించడానికి మనం ఈ పుస్తకాన్ని ఉపయోగించగల మార్గాలను సూచించండి.
20 నిమి: “మంచి విషయాల పట్ల ఆసక్తితో ఉండండి!”a (1-12 పేరాలు) 6వ పేరా చర్చించిన తర్వాత ఒక ప్రచారకుడు ముద్రిత ఆహ్వాన పత్రాన్ని ఇచ్చి తన బంధువునో, పొరుగింటి వ్యక్తినో, తోటి విద్యార్థినో లేక తోటి ఉద్యోగినో జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానిస్తున్నట్లు క్లుప్తంగా ప్రదర్శించండి. ముద్రిత ఆహ్వాన పత్రాలను ఇప్పటివరకూ పంచకపోతే, కూటమి తర్వాత లభ్యమయ్యేలా చూడాలి.
పాట 4 (43), ముగింపు ప్రార్థన.
మార్చి 17తో ప్రారంభమయ్యే వారం
పాట 9 (37)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్టు.
15 నిమి: సహవాసులను ఎంపిక చేసుకోవడంలో వివేకవంతంగా ఉండండి. మార్చి 8, 1997 తేజరిల్లు! 13వ పేజీ, తర్కించడం (ఆంగ్లం) పుస్తకం 189వ పేజీలోని “చెడు సహవాసాలు” అనే ఉప శీర్షిక క్రిందనున్న సారాంశం ఆధారంగా పెద్ద ఇచ్చే ప్రసంగం. అందులోని సూత్రాలు పిల్లలకు, పెద్దలకు ఎలా వర్తిస్తాయో చూపించండి. యెహోవాను ప్రేమించేవారిని, ఆయన ప్రమాణాలను హత్తుకొని ఉండేందుకు కృషి చేస్తున్నట్లు నిరూపించుకుంటున్నవారిని స్నేహితులుగా ఎంచుకోవడంలోని ప్రయోజనాలను నొక్కి చెప్పండి.
20 నిమి: “మంచి విషయాల పట్ల ఆసక్తితో ఉండండి!”b (13-26 పేరాలు) సంఘ పైవిచారణకర్త నిర్వహించాలి. 14వ పేరాను పరిశీలిస్తున్నప్పుడు, అనారోగ్యంతో ఉన్న సహోదరుణ్ణి ఒక పెద్ద సందర్శిస్తున్నట్లుగా క్లుప్తంగా ప్రదర్శించండి. దానిలో జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో విస్తృతపరచబడిన సంఘ కార్యకలాపాల్లో ఆ సహోదరుడు ఎలా పాల్గొనవచ్చో ఆ పెద్ద ప్రేమపూర్వకంగా వివరించాలి.
పాట 8 (53), ముగింపు ప్రార్థన.
మార్చి 24తో ప్రారంభమయ్యే వారం
పాట 22 (130)
10 నిమి: స్థానిక ప్రకటనలు. 8వ పేజీలోని సలహాలను ఉపయోగిస్తూ జనవరి-మార్చి తేజరిల్లు!ను, (పత్రికల ప్రతిపాదన కాలమ్‌లో మూడవది) ఏప్రిల్ 1 కావలికోటను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి.
15 నిమి: స్థానిక అవసరాలు.
20 నిమి: యెహోవాసాక్షులు—సమాజంలో ప్రయోజనకరమైన ప్రభావం. ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. కొన్నిసార్లు మన పరిచర్య, మన మాదిరి సమాజానికి ఎలా ప్రయోజనం చేకూరుస్తాయో చూపించే అవకాశం మనకు లభిస్తుంది. ఈ అంశాలపై వ్యాఖ్యానించమని ప్రేక్షకులను ఆహ్వానించండి: (1) బైబిలు బోధించే నైతిక ప్రమాణాలకు అనుగుణంగా జీవించమని ప్రజలకు బోధిస్తాం. (2) ప్రభుత్వం పట్ల నిజాయితీగా గౌరవపూర్వకంగా ఉండాలని బోధిస్తాం. (3) జాతుల, దేశాల, సమాజ వర్గాల మధ్య సామరస్యం ఉండాలని బోధిస్తాం. (4) బైబిలు సూత్రాలను అన్వయించుకోమని ప్రోత్సహించడం ద్వారా, తమ కుటుంబ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి మనం ఇతరులకు సహాయపడతాము. (5) వేలమందికి చదవడం వ్రాయడం నేర్పించాం. (6) విపత్తు సమయాల్లో ఇతరులకు సహాయం చేసేందుకు శ్రమపడతాం. (7) అందరూ అనుభవిస్తున్న మత స్వేచ్ఛను కాపాడడంలో ఉపకరణంగా పని చేశాము.—ప్రచారకులు (ఆంగ్లం) పుస్తకంలో 699వ పేజీ చూడండి.
పాట 12 (113), ముగింపు ప్రార్థన.
మార్చి 31తో ప్రారంభమయ్యే వారం
పాట 10 (82)
12 నిమి: స్థానిక ప్రకటనలు. మార్చి క్షేత్రసేవా రిపోర్టులను ఇమ్మని అందరికీ గుర్తు చేయండి. ఏప్రిల్‌లో ప్రతిపాదించే సాహిత్యాలను ప్రస్తావించండి. “దేవుణ్ణి ఆరాధించండి (ఆంగ్లం) పుస్తకాన్ని బైబిలు అధ్యయనాలు నిర్వహించడానికి ఉపయోగించండి” అనేదాన్ని సమీక్షించండి. “జ్ఞాపకార్థ ఆచరణకు సంబంధించి గుర్తుంచుకోవలసిన విషయాలు” అనేదాని నుండి ముఖ్యాంశాలను చర్చించండి.
13 నిమి: స్థానిక అనుభవాలు. మార్చినెలలో విస్తృతపరచబడిన కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల ఎదురైన అనుభవాలను తెలియజేయమని ప్రేక్షకులను కోరండి. వారు చేసిన ప్రయత్నాలకు వారిని ప్రశంసించి, ఏప్రిల్‌లో కూడా వారి పరిస్థితులు అనుకూలించినంత మేరకు సంపూర్ణంగా పాల్గొనమని అందరినీ ప్రోత్సహించండి.
20 నిమి: “యెహోవా అధికస్తోత్రము పొందదగినవాడు.”c జ్ఞాపకార్థ ఆచరణ ప్రాముఖ్యత గురించి నొక్కిచెప్పండి. ఇతరులు హాజరవడానికి దోహదపడడంలో అందరూ ఎలా సహాయకరంగా ఉండవచ్చో చూపించండి. నిష్క్రియులుగా మారినవారి ఆసక్తిని తిరిగి పునరుద్ధరించేందుకు వారిని కలుసుకోవడానికి ఏమి చేయవచ్చో వివరించండి. గత సంవత్సరపు ఆచరణ సమయంలో ప్రోత్సాహకరమైన అనుభవాలు ఏమైనా ఉంటే తెలియజేయమని ప్రేక్షకులను కోరండి.
పాట 23 (200), ముగింపు ప్రార్థన.
ఏప్రిల్ 7తో ప్రారంభమయ్యే వారం
పాట 21 (191)
10 నిమి: స్థానిక ప్రకటనలు.
15 నిమి: లేఖనాల నుండి ఎలా తర్కించాలి? ప్రేక్షకులతో చర్చ. పరిచర్యలో ప్రజలతో సమర్థవంతంగా తర్కించే సామర్థ్యాన్ని మనమెలా వృద్ధి చేసుకోవచ్చు? (1) క్రమంగా వ్యక్తిగత అధ్యయనం చేయడం ద్వారా, కూటాలకు హాజరవడం ద్వారా లేఖన పరిజ్ఞానాన్ని బాగా సంపాదించుకోండి. (2) సత్యాలను వివిధ దృక్కోణాల నుండి పరిశీలిస్తూ మీరు నేర్చుకున్న విషయాలను ధ్యానించండి. (3) లేఖనాల వివరణల కోసం మాత్రమే కాకుండా ఆ వివరణలకు లేఖనాధార కారణాలను కూడా వెదకండి. (4) మీరు లేఖనాలను వివిధ రకాల ప్రజలకు ఎలా వివరిస్తారో ఆలోచించండి. (5) కొన్ని అంశాలను మీరు ఎలా విశదీకరించవచ్చో ఆలోచించండి.
20 నిమి: “సత్యం మనల్ని ఎలా స్వతంత్రులను చేస్తుంది?”d 1998 అక్టోబరు 1, కావలికోట సంచిక 6వ పేజీలోని బాక్సులోని వ్యాఖ్యానాలను చేర్చండి. దేవుని వాక్యంలోని సత్యాలు తమను ఎలా స్వతంత్రులను చేశాయో వ్యాఖ్యానించమని ప్రేక్షకులను కోరండి.
పాట 16 (143), ముగింపు ప్రార్థన.
[అధస్సూచీలు]
a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
d ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.