ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు జనవరి నెలలో: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి. దీనికి ప్రత్యామ్నాయంగా నా బైబిలు కథల పుస్తకము, బైబిలు—దేవుని వాక్యమా లేక మానవునిదా? (ఆంగ్లం), యువత అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మకమైన సమాధానాలు (ఆంగ్లం), మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకాలలో దేన్నైనా ప్రతిపాదించవచ్చు. ప్రత్యామ్నాయంగా అందించవలసిన వాటిలో ఏదైనా పుస్తకం సంఘంలో స్టాకు లేనట్లయితే మీకు ఇవ్వగలిగేంత ఎక్కువ స్టాకు దగ్గర్లో ఉన్న ఏ సంఘంలోనైనా ఉందేమో దయచేసి తెలుసుకోండి. ఫిబ్రవరి నెలలో: ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది! లేదా ఇక్కడ ఇవ్వబడిన 32 పేజీల బ్రోషుర్‌లలో దేన్నైనా ఉపయోగించవచ్చు: “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను,” జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, నిరంతరం నిలిచే దైవిక నామం (ఆంగ్లం), పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, భూమిపై నిరంతరజీవితమును అనుభవించుము!, మనం మరణించినప్పుడు మనకేమి సంభవిస్తుంది? (ఆంగ్లం), మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే. సముచితమనుకున్న చోట్ల మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?, మృతుల ఆత్మలు—అవి మీకు సహాయపడగలవా లేక హాని తలపెట్టగలవా? అవి నిజంగా ఉనికిలో ఉన్నాయా? (ఆంగ్లం), యుద్ధంలేని లోకం ఎప్పటికైనా ఉంటుందా? (ఆంగ్లం), సర్వమానవాళి కొరకైన గ్రంథం అనే బ్రోషుర్‌లను ప్రతిపాదించవచ్చు. మార్చి నెలలో: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము. గృహ బైబిలు అధ్యయనాలను ప్రారంభించడానికి ప్రత్యేక ప్రయత్నం చెయ్యాలి. ఏప్రిల్, మే నెలల్లో: పునర్దర్శనాలకు వెళ్ళినప్పుడు ఆసక్తి కనబరచినవారికి కావలికోట, తేజరిల్లు!ల విడి విడి కాపీలను ప్రతిపాదించి, ఆ వ్యక్తిని పత్రికా మార్గంలో చేర్చుకోండి. బైబిలు అధ్యయనాలను ఆరంభించే ఉద్దేశంతో దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌ను ప్రతిపాదించండి.
◼ ఫిబ్రవరి మొదలుకొని మార్చి 2లోపు ప్రాంతీయ పైవిచారణకర్తలు ఇచ్చే కొత్త బహిరంగ ప్రసంగం “అంధకార లోకం నుండి విమోచనం.”
◼ ఈ సంవత్సరం ఏప్రిల్ 16, బుధవారం సూర్యాస్తమయం తర్వాత జ్ఞాపకార్థ దినాన్ని జరుపుకునేందుకు సంఘాలు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి. ప్రసంగం ముందుగానే ప్రారంభమైనప్పటికీ జ్ఞాపకార్థ చిహ్నాలను మాత్రం సూర్యాస్తమయం అయ్యేంతవరకు అందించకూడదు. మీ ప్రాంతంలో సూర్యాస్తమయం ఎప్పుడవుతుందో స్థానికాధికారులను అడిగి తెలుసుకోండి. సాధారణంగా ఒకే రాజ్యమందిరాన్ని పలు సంఘాలు ఉపయోగించుకుంటున్న ప్రాంతాల్లో ఒకటి లేక అంతకంటే ఎక్కువ సంఘాలు ఆ సాయంత్రానికి మరో స్థలాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ ఆచరణ నుండి అందరూ పూర్తి ప్రయోజనం పొందేందుకుగాను కార్యక్రమాల మధ్య వీలైతే కనీసం 40 నిమిషాల వ్యవధి ఉండాలని సూచిస్తున్నాము. హాజరయ్యే వారిని తీసుకురావడం, తీసుకువెళ్ళడంతోపాటు ట్రాఫిక్, పార్కింగ్ సమస్యల గురించి కూడా ఆలోచించాలి. స్థానికంగా ఎలాంటి ఏర్పాట్లు సరైనవో పెద్దల సభ నిర్ణయించాలి.