కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 1/03 పేజీ 1
  • మన సమర్పణకు అనుగుణంగా జీవించడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మన సమర్పణకు అనుగుణంగా జీవించడం
  • మన రాజ్య పరిచర్య—2003
  • ఇలాంటి మరితర సమాచారం
  • నిబ్బరమైన హృదయముతో యెహోవాను సేవిస్తుండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • మీరు మీ సమర్పణకు తగ్గట్టు జీవిస్తున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • “ప్రతిదినము” మన సమర్పణకు తగినట్లు జీవించుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • మీరు యెహోవాకు ఎందుకు సమర్పించుకోవాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2003
km 1/03 పేజీ 1

మన సమర్పణకు అనుగుణంగా జీవించడం

1 మీరు ఇటీవలే బాప్తిస్మం పొందినా లేక దశాబ్దాల క్రితమే బాప్తిస్మం పొందినా మీ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైన ఆ సందర్భాన్ని మీరు జ్ఞాపకముంచుకుంటారు. మన బాప్తిస్మం అంతం కాదు గానీ అది మనం జీవితాంతం చేసే అంకిత సేవకు ఆరంభం, ఆ సేవ శాశ్వతకాలం ఉంటుంది. (1 యోహా. 2:17) మన సమర్పణకు అనుగుణంగా జీవించడమంటే ఏమిటి?

2 క్రీస్తు మాదిరిని అనుసరించండి: యేసు బాప్తిస్మం పొందిన తర్వాత “దేవుని రాజ్యసువార్తను” ప్రకటించడమనే తన పనిని ‘మొదలుపెట్టాడు.’ (లూకా 3:23; 4:43) అదేవిధంగా యెహోవాకు మన సమర్పణను బాప్తిస్మం ద్వారా సూచించిన తర్వాత, మనం సువార్త సేవకులుగా నియమించబడ్డాము. మన జీవితంలో అవసరమయ్యే వాటిని సంపాదించుకోవడానికి ఎంతో సమయం, కృషి అవసరమైనా మన ప్రధాన పని క్రైస్తవ పరిచర్యే. (మత్త. 6:33) దేవునికి సమర్పించుకున్నవారు ధనసంపదలనో ఖ్యాతినో సంపాదించుకోవడానికి తాపత్రయపడకుండా, అపొస్తలుడైన పౌలు చేసినట్లే తమ “పరిచర్యను ఘనపరచ[డానికి]” కృషి చేస్తారు. (రోమా. 11:13, 14) యెహోవాకు మీరు చేసే సేవను విలువైనదిగా ఎంచుతూ దాన్ని ఘనపరచడానికి మీకు సాధ్యమైనదంతా చేస్తారా?

3 యేసు ఎదిరించినట్లే మనం “అపవాదిని ఎదిరిం[చాలి].” (యాకో. 4:7) యేసు బాప్తిస్మం తీసుకున్న తర్వాత సాతాను ఆయనను శోధించాడు, అదేవిధంగా నేడు యెహోవాకు సమర్పించుకున్న సేవకులను కూడా అతడు తన లక్ష్యంగా చేసుకుంటాడు. (లూకా 4:1-13) సాతాను లోకంలో మనం జీవిస్తున్నాము కాబట్టి మనకు స్వయం క్రమశిక్షణ అవసరం, మన మనస్సును గానీ హృదయాన్ని గానీ కలుషితం చేయగలిగేది ఏదైనా ఉంటే దానికి దూరంగా ఉండాలి. (సామె. 4:23; మత్త. 5:29, 30) “ప్రభువు పాత్ర లోనిది దయ్యముల పాత్రలోనిది కూడ త్రాగనేరరు” అని క్రైస్తవులకు ప్రబోధించబడింది. (1 కొరిం. 10:21) అలా ఉండాలంటే మనం హానికరమైన వినోద కార్యకలాపాలు, చెడు సహవాసాలు, ఇంటర్‌నెట్‌ వల్ల కలిగే ప్రమాదాల విషయమై జాగ్రత్తగా ఉండాలి. భ్రష్టత్వానికి సంబంధించిన సమాచారానికి కూడా మనం దూరంగా ఉండాలి. వీటి విషయంలోను సాతాను పన్నే ఇతర కుయుక్తుల విషయంలోను అప్రమత్తంగా ఉండడం, మనం యెహోవాకు చేసుకున్న సమర్పణకు అనుగుణంగా జీవించేందుకు తోడ్పడుతుంది.

4 దేవుడు చేసిన ఏర్పాట్లను ఉపయోగించుకోండి: మనం మన సమర్పణకు అనుగుణంగా జీవించడానికి తోడ్పడేందుకు యెహోవా తన వాక్యం ద్వారా క్రైస్తవ సంఘం ద్వారా సహాయాన్ని ఏర్పాటు చేశాడు. మీ దైనందిన కార్యకలాపాల్లో బైబిలు చదవడాన్ని, ప్రార్థించడాన్ని భాగంగా చేసుకోండి. (యెహో. 1:8; 1 థెస్స. 5:16-18) సంఘ కూటాల్లో సంతోషాన్ని పొందండి. (కీర్త. 122:1) యెహోవాకు భయపడుతూ ఆయన నియమాలను పాటించే వ్యక్తులతో సహవసించండి.—కీర్త. 119:63.

5 యెహోవా దేవుని మద్దతుతో, మీరు ఆయనకు చేసుకున్న మీ సమర్పణకు అనుగుణంగా జీవించగలుగుతారు, ఆయనను నిరంతరం సేవించడంలో ఆనందాన్ని పొందుతారు.—కీర్త. 22:26, 27; ఫిలి. 4:13.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి