జీవితంలోని అతిప్రాముఖ్యమైన కార్యకలాపాల కోసం మనల్ని సిద్ధపరిచే పాఠశాల
1 ప్రజలు, జీవితంలో తమ లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడే ఉపదేశాన్ని పొందడానికి పాఠశాలకు వెళతారు. అయితే, జీవదాతను స్తుతించడం, ఆయన సంకల్పాలనూ మార్గాలనూ నేర్చుకోవడంలో ఇతరులకు సహాయపడడం కంటే ప్రాముఖ్యమైన లక్ష్యమేమై ఉండగలదు? అలాంటి లక్ష్యమేదీ లేదు. మన విశ్వాసాన్ని ఇతరులకు బోధించడానికి మనల్ని సిద్ధపర్చడమే దైవపరిపాలనా పరిచర్య పాఠశాల ఉద్దేశం. కాబట్టి, మనం ఆ పాఠశాలకు ప్రతీవారం హాజరవుతుండగా, జీవితంలోని అతిప్రాముఖ్యమైన కార్యకలాపాల కోసం మనల్ని సిద్ధపరిచే సామర్థ్యాలను సంపాదించుకుంటున్నాము.
2 గతనెల మన రాజ్య పరిచర్య సంచికతోపాటు “2003వ సంవత్సరపు దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పట్టిక” ఇవ్వబడింది. పాఠశాల ఎలా నిర్వహించబడుతుంది అన్నదానికి సంబంధించిన వివరాలు ఆ షెడ్యూల్లో ఉన్నాయి. మీరు ఆ షెడ్యూల్‌ను దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి అనే పుస్తకంలో పెట్టుకోవడం ఆచరణాత్మకంగా ఉంటుండవచ్చు, ఎందుకంటే ప్రతివారం మీరు ఆ పుస్తకాన్ని దైవపరిపాలనా పరిచర్య పాఠశాలకు తీసుకొనిరావలసి ఉంటుంది. 2003వ సంవత్సరం కోసమైన దైవపరిపాలనా పరిచర్య పాఠశాలకు సంబంధించిన కొన్ని ప్రధానలక్షణాలను పరిశీలించండి.
3 ప్రసంగ లక్షణం: జనవరి నెలనుండి దైవపరిపాలనా పరిచర్య పాఠశాలకు సంబంధించిన ప్రతీ కూటం, చదవడానికీ అధ్యయనం చేయడానికీ లేదా బోధించడానికీ సంబంధించిన ఒక అంశంపై లేదా ఒక ప్రసంగ లక్షణంపై ఇవ్వబడే ఐదు నిమిషాల ప్రసంగంతో మొదలవుతుంది. పాఠశాల పైవిచారణకర్త ఈ ప్రారంభపు ప్రసంగాలను ఇవ్వడమో, లేదా ఆయన ఈ ప్రసంగాలను ఇచ్చేందుకు అర్హతగల మరో పెద్దను నియమించడమో చేస్తాడు. ప్రసంగీకుడు ప్రసంగ లక్షణ నిర్వచనాన్నీ దాని ప్రాముఖ్యతనూ చర్చించవచ్చు. ఆ తర్వాత ఆయన లేఖనాధారిత ఉదాహరణలను చర్చించి, ఆ ప్రసంగ లక్షణాన్ని ఎలా అన్వయించుకోవాలో ప్రదర్శించి, అలా చేయడం ద్వారా మన క్షేత్ర పరిచర్య ఎలా మెరుగుపడగలదన్న విషయానికి అవధానమిస్తూ సమాచారాన్ని వివరించాలి.
4 నియామకం నం. 1: ఉపదేశ ప్రసంగం ఇవ్వడానికి నియమించబడిన సహోదరులకు “చర్చించబడుతున్న . . . సమాచారపు ఆచరణాత్మక విలువపై మనసు కేంద్రీకరించాలి” అని సలహా ఇవ్వబడుతుంది. అంటే సమాచారాన్ని ఎలా ఉపయోగించుకోవాలో సంఘానికి తెలియజేయడం. మీకు ఈ నియామకం ఇవ్వబడితే, దానికి ఎలా సిద్ధపడాలి అనే విషయంలో సలహాల కోసం పరిచర్య పాఠశాల పాఠ్యపుస్తకంలో 48-9 పేజీలను చూడండి. పుస్తకపు ఇండెక్స్‌లో “ఆచరణాత్మక అన్వయింపు” క్రింద ఇవ్వబడిన రెఫరెన్సులను అధ్యయనం చేయండి.
5 బైబిలు పఠన షెడ్యూల్: గతంలో మీరు బైబిలు పఠన షెడ్యూల్‌ను పాటించలేకపోతే, ఈ సంవత్సరపు షెడ్యూల్‌ను పాటించాలని ఎందుకు తీర్మానించుకోకూడదు? అలా చేసేవారు, సంవత్సరాంతానికి క్రైస్తవ గ్రీకు లేఖనాలను పూర్తి చేస్తారు. క్రైస్తవ గ్రీకు లేఖనాలతో బైబిలు పఠన కార్యక్రమాన్ని ప్రారంభించడంలోవున్న ప్రయోజనాలు పరిచర్య పాఠశాల పుస్తకంలో 10వ పేజీ, 4వ పేరాలో చర్చించబడ్డాయి.
6 బైబిలు పఠనంలోని ఉన్నతాంశాలు: వారం కోసం నియమించబడిన బైబిలు భాగంపై ప్రేక్షకులు వ్యాఖ్యానించడానికి వీలుగా ఈ నియామకం 10 నిమిషాలకు పొడిగించబడింది. నియమించబడినవారు కేటాయించబడిన సమయాన్ని మించకూడదు. ఈ భాగం ప్రతీవారం, మౌఖిక పునఃసమీక్ష ఉన్న వారం కూడా నిర్వహించబడుతుంది. నియమించబడిన అధ్యాయాలను చదువుతుండగా మీ కుటుంబ అధ్యయనంలో, మీ పరిచర్యలో లేదా మీ జీవిత విధానంలో మీకు ప్రయోజనం చేకూర్చే అంశాల కోసం చూడండి. ప్రజలతో, దేశాలతో వ్యవహరించేటప్పుడు యెహోవా ఏ లక్షణాలను కనబర్చాడు? మీ విశ్వాసాన్ని బలపర్చి, యెహోవాపట్ల మీకున్న మెప్పుదలను అధికం చేసిన ఏ విషయాన్ని మీరు నేర్చుకున్నారు? నియమించబడిన అధ్యాయాల్లో ఏ అంశంపైనైనా వ్యాఖ్యానించడానికి సందేహించకండి. నియామకం నం. 2కు నియమించబడిన సహోదరుడు తాను చదివిన వచనాలపై వ్యాఖ్యానించడు కాబట్టి ఆ భాగంలోని వచనాలపై కూడా వ్యాఖ్యానించవచ్చు.
7 నియామకం నం. 2: ప్రతీవారం విద్యార్థి నియామకాల్లో మొదటిది బహిరంగ పఠనానికి సంబంధించిన అభ్యాసం అయివుంటుంది. నెలలో చివరి వారం జరిగే బైబిలు పఠనానికి తప్ప మిగతా వారాలన్నింటిలోనూ వారపు బైబిలు పఠన భాగంనుండే సమాచారం తీసుకోబడుతుంది. నెలలో చివరి వారం జరిగే పఠనం మాత్రం కావలికోట నుండి తీసుకోబడుతుంది. విద్యార్థి పరిచయ మాటలు గానీ ముగింపు మాటలు గానీ ఏమీ చెప్పకుండా నియమిత సమాచారాన్ని చదవాలి. ఈ విధంగా ఆయన తన పఠన నైపుణ్యాలపై ప్రాథమిక అవధానాన్ని నిలపగలడు.—1 తిమో. 4:13.
8 నియామకం నం. 3, నం. 4: ఈ నియామకాల్లో కొన్నింటికి మూలాధార సమాచారం ఎక్కువగా తర్కించడం (ఆంగ్లం) పుస్తకం నుండి ఉంటుంది; కొన్ని నియామకాలకు కేవలం అంశం మాత్రమే ఇవ్వబడుతుంది, తర్కించడం పుస్తకం మీ భాషలో అందుబాటులో లేకపోతే అదనపు రెఫరెన్సులు ఇవ్వబడ్డాయి. పరిమితమైన మూలాధార సమాచారం లేదా కేవలం అంశం ఉన్న నియామకాలు ఇవ్వబడినవారికి, మన క్రైస్తవ ప్రచురణల్లో పరిశోధన చేయడం ద్వారా తమ అందింపులను తయారుచేసుకునే అవకాశం ఉంటుంది. సహోదరీలు తమ సహాయకురాళ్ళకు తగిన విధంగా తమ వ్యాఖ్యానాలను అన్వయించుకోవడాన్ని ఇది సులభం చేయవచ్చు.
9 సన్నివేశాలు: పరిచర్య పాఠశాల పుస్తకంలో 45వ పేజీలో సూచించబడినట్లు, పాఠశాల పైవిచారణకర్త ఒక సన్నివేశాన్ని నియమించే అవకాశం ఉంది. ఆయన అలా నియమించకపోతే, సహోదరీలు 82వ పేజీలోని లిస్టులోనుండి ఒక సన్నివేశాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఒక సహోదరి రెండు నెలలకు ఒక ప్రసంగం చొప్పున ఇస్తుంటే, లిస్టులో ఇవ్వబడిన 30 సన్నివేశాలు, ఐదు సంవత్సరాల వరకు ఒకసారి ఉపయోగించిన సన్నివేశాన్ని మళ్ళీ ఉపయోగించనవసరం లేకుండా వైవిధ్యాన్ని అందజేస్తాయి. “మీ ప్రాంతానికి తగిన మరొక సన్నివేశం” అనే 30వ సన్నివేశాన్ని ఎంపిక చేసుకునే సహోదరీలు, తమ అసైన్మెంట్ స్లిప్ (S-89) క్రింది భాగంలో లేదా వెనుక భాగంలో సన్నివేశాన్ని వ్రాయాలి. పాఠశాల పైవిచారణకర్త, ఆ సహోదరి పుస్తకంలో 82వ పేజీలో ఆమె ఉపయోగించిన సన్నివేశం ప్రక్కన ఆ విద్యార్థి ప్రసంగం ఇచ్చిన తేదీ వ్రాస్తాడు. విద్యార్థి సలహా పత్రంలో మార్కు చేసేటప్పుడే ఆయన తేదీని కూడా వేయవచ్చు.
10 సలహా పత్రం: మీ సలహా పత్రం మీ పుస్తకంలోనే ఉంటుంది. అది 79-81 పేజీలలో ఉంటుంది. కాబట్టి మీరు ప్రసంగం ఇచ్చిన తర్వాత ప్రతీసారి మీ పుస్తకాన్ని పాఠశాల పైవిచారణకర్తకు ఇవ్వవలసి ఉంటుంది. విద్యార్థులు పనిచేస్తున్న ప్రసంగ లక్షణాలకు సంబంధించి పాఠశాల పైవిచారణకర్త రికార్డు పెట్టుకోవాలి.
11 మౌఖిక పునఃసమీక్ష: దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష మౌఖికంగా నిర్వహించబడుతుంది. అది ప్రతి రెండు నెలలకు ఒకసారి 30 నిమిషాల పాటు నిర్వహించబడుతుంది. పునఃసమీక్షలో పరిశీలించవలసిన ప్రశ్నలు మునుపటిలాగే మన రాజ్య పరిచర్యలో ఇవ్వబడతాయి. మౌఖిక పునఃసమీక్ష జరగవలసిన వారంలో ప్రాంతీయ సమావేశం లేదా ప్రాంతీయ పైవిచారణకర్త సందర్శనం ఉంటే, ఆ తర్వాత వారపు ప్రసంగాలు ఒక వారం ముందే ఇవ్వబడాలి. మౌఖిక పునఃసమీక్షను ఆ తర్వాతి వారానికి షెడ్యూల్ చేయాలి.
12 సహాయ తరగతులు: పాఠశాలలో 50 కంటే ఎక్కువమంది విద్యార్థులు ఉన్న సంఘాలలో, పెద్దలు సహాయ తరగతులను నిర్వహించే విషయం గురించి ఆలోచించవచ్చు. “విద్యార్థి నియామకాలన్నింటికీ లేదా కేవలం చివరి రెండు నియామకాలకు ఈ ఏర్పాటును ఉపయోగించవచ్చు.” (పరిచర్య పాఠశాల, 285వ పేజీ) ఈ రెండవ సలహా, ఎక్కువమంది సహోదరీలు ఉండి, పఠన నియామకాలను నిర్వహించడానికి కేవలం కొద్దిమంది సహోదరులు మాత్రమే ఉన్న సంఘాలను పరిగణలోకి తీసుకొని ఇవ్వబడింది. ఈ తరగతులను నిర్వహించడానికి పెద్దలు అర్హతగల సహోదరులను ఎంపిక చేయాలి.
13 సహాయ సలహాదారుడు: దైవపరిపాలనా పరిచర్య పాఠశాల షెడ్యూల్లో సూచించబడినట్లు, బైబిలు ఉన్నతాంశాలను, ఉపదేశ ప్రసంగాలను ఇచ్చే పెద్దలకు, పరిచర్య సేవకులకు వ్యక్తిగత సలహా ఇవ్వడానికి పెద్దల సభ ఒక సహాయ సలహాదారుడిని నియమించాలి. అలా చేయడానికి నియమించబడిన సహోదరుడు అనుభవజ్ఞుడై ఉండాలి, ఇతర పెద్దలు ఆయన సలహాను గౌరవించేలాంటి వ్యక్తి అయ్యుండాలి. ఆయన ఇచ్చే సలహా ప్రోత్సాహకరమైనదిగా, మంచి సంభాషణా బోధనా నైపుణ్యాలను ప్రశంసించేదిగా, మెరుగుపర్చుకోవడానికి ఒకటి రెండు అంశాలను సూచించేదిగా ఉండాలి. తరచూ ప్రసంగాలు ఇచ్చే సహోదరునికి ఆయన ప్రసంగం ఇచ్చిన ప్రతీసారి సలహా ఇవ్వవలసిన అవసరం లేదు. అయితే, సహాయ సలహాదారునిగా నియమించబడిన సహాదరుడు వివేచన కలిగివుండాలి, ప్రస్తుతం బహిరంగ ప్రసంగాలు ఇస్తున్న సహోదరులు కూడా మరింత అభివృద్ధి సాధించేందుకు వారికి సహాయపడవచ్చని ఆయన అర్థం చేసుకోవాలి.—1 తిమో. 4:15.
14 సలహాదారులు ఏ విషయంపై అవధానముంచాలి: సలహాదారుడు ఒక అందింపును విశ్లేషించడానికి ఆయనకు ఏది సహాయపడగలదు? పరిచర్య పాఠశాల పుస్తకంలో నంబరు వేయబడి ఉన్న 53 అధ్యాయాల్లోని అనేక అధ్యాయాల్లో ఉన్న మూడవ బాక్సు, ఏ విషయంపై అవధానముంచాలి అన్నదానిపై క్లుప్తమైన సారాంశాన్ని కలిగివుంటుంది. ఒక అందింపులో సమాచారం ఎంత బాగా క్రమబద్ధం చేయబడింది, ఆ సమాచారం ఎంత ప్రభావవంతంగా అందించబడింది అనే విషయాలను త్వరగా మదింపుచేసుకోవడానికి తనకు సహాయపడే, పుస్తకంలోవున్న ఇతర జ్ఞాపికలకు లేదా సలహాలకు కూడా పాఠశాల పైవిచారణకర్త అవధానం ఇవ్వాలి. ఉదాహరణకు, 55వ పేజీ ప్రారంభంలో ఇవ్వబడిన ప్రశ్నలను, 163వ పేజీలోని ఆఖరి పేరాలో ఇవ్వబడిన తలంపులను గమనించండి.
15 ఖాళీలను పూరించండి: పరిచర్య పాఠశాల పుస్తకంలో వెడల్పైన మార్జిన్లతోపాటు, మీ వ్యక్తిగత అధ్యయన సమయంలోనూ మీరు దైవపరిపాలనా పరిచర్య పాఠశాలకు హాజరైన సమయంలోనూ నోట్సు రాసుకోవడానికి వీలుగా అనేక ఖాళీ స్థలాలు ఇవ్వబడ్డాయి. (77, 92, 165, 243, 246, 250 పేజీలను చూడండి.) ప్రతీవారం మీతోపాటు పుస్తకాన్ని తప్పకుండా తీసుకొని రండి. ప్రారంభ ప్రసంగం సమయంలో పుస్తకంలో చూసుకోండి. పాఠశాల జరుగుతున్నంత సేపు మీ పుస్తకాన్ని తెరిచే ఉంచుకోండి. పాఠశాల పైవిచారణకర్త ఇస్తున్న సలహాలను రాసుకోండి. ప్రసంగీకులు ఉపయోగిస్తున్న బోధనా పద్ధతులు, ప్రశ్నలు, ఉదాహరణలు, అలంకారిక భాష, ఉపమానాలు, దృశ్య సహాయకాలు, వ్యత్యాసాలపై అవధానం ఉంచండి. ఉపయోగకరమైన నోట్సు వ్రాసుకోవడం ద్వారా, పాఠశాలనుండి నేర్చుకున్న అద్భుతమైన అనేక అంశాలను గుర్తుచేసుకుని ఉపయోగించుకోగలుగుతారు.
16 దేవుని రాజ్య సువార్తను ప్రకటించడం అనేది ఎవరికైనా ఇవ్వబడగల అతిగొప్ప ఆధిక్యత అని యేసుక్రీస్తుకు తెలుసు. అది ఆయన చేసిన ప్రాముఖ్యమైన పని. (మార్కు 1:38) ‘నేను దేవుని రాజ్యసువార్తను ప్రకటింపవలెను; ఇందునిమిత్తమే నేను పంపబడితిని’ అని ఆయన అన్నాడు. (లూకా 4:43) తనను వెంబడించమని ఆయన అందించిన ఆహ్వానాన్ని స్వీకరించిన వారివలే మనం కూడా రాజ్య సువార్తను ప్రకటించే పనిలో నిమగ్నమై ఉన్నాము. మన “స్తుతియాగము” యొక్క నాణ్యతను మెరుగుపర్చుకోవడానికి మనం ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉన్నాము. (హెబ్రీ. 13:15) ఆ లక్ష్యాన్ని సాధించడానికి, జీవితంలోని అతిప్రాముఖ్యమైన కార్యకలాపాల కోసం మనల్ని సిద్ధపర్చడానికి సహాయపడే పాఠశాల అయిన దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో మనం క్రమంగా భాగం వహించడానికి తీర్మానించుకుందాము.