సేవా కూటాల పట్టిక
అక్టోబరు 14తో ప్రారంభమయ్యే వారం
పాట 11 (85)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. సంఖ్యాకాండము 25వ అధ్యాయాన్ని, లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం) రెండవ సంపుటిలోని 419వ పేజీ 3-5 పేరాలలోవున్న సమాచారాన్ని చదవమని, ఆ తర్వాత అక్టోబరు 28తో ప్రారంభమయ్యే వారంలోని సేవా కూటంలో జరిగే చర్చకు సిద్ధపడడానికి మన కాలానికి హెచ్చరికా మాదిరులు (ఆంగ్లం) అనే వీడియోను చూడమని అందరినీ ప్రోత్సహించండి. 8వ పేజీలోని సలహాలను ఉపయోగిస్తూ అక్టోబరు-డిసెంబరు తేజరిల్లు!ను, (పత్రికా ప్రదర్శన కాలమ్‌లో ఉన్న మొదటిది,) అక్టోబరు 15 కావలికోటను ఎలా అందించాలో రెండు వేర్వేరు ప్రదర్శనలను ప్రదర్శించండి. “మీరు చేసే పని నాకు బాగాతెలుసు” అంటూ సంభాషణను ఆటంకపరిచే వారితో ఎలా వ్యవహరించాలో ఒక్కో ప్రదర్శనలో ఒక్కో విధంగా చూపించండి.—బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను అనే చిన్న పుస్తకంలో 12వ పేజీ చూడండి.
15 నిమి: ఒంటరి తల్లిదండ్రులు ఎదురుకొంటున్న సవాళ్ళు. తమ పిల్లలకు శిక్షణనిచ్చి, క్రమశిక్షణనిచ్చి, ఆధ్యాత్మిక నడిపింపునివ్వడానికి సంబంధించిన సమస్యలతో వారు ఎలా వ్యవహరిస్తున్నారో తెలుసుకోవడానికి ఒక పెద్ద ఒకరు లేదా ఇద్దరు ఒంటరి తల్లిదండ్రులను (లేదా సాక్షులు కాని భాగస్వాములు ఉన్నవారిని) ఇంటర్వ్యూ చేస్తాడు. వారు కూటాలకు హాజరవుతూ, క్రమంగా క్షేత్రసేవలో పాల్గొంటూ, అదే సమయంలో కుటుంబ బాధ్యతలను ఎలా నిర్వహించగలుగుతున్నారు? కుటుంబ సంతోషం పుస్తకంలో 104-10 పేజీలలో ఇవ్వబడిన సలహాలలో కొన్నింటిని ఉన్నతపర్చండి. 113-15 పేజీలలో చూపించబడినట్లు, ఇతరులు వారికి సహాయపడగల ఆచరణాత్మక విధానాలను ప్రస్తావించండి.
20 నిమి: “సంఘ పుస్తక అధ్యయన పైవిచారణకర్తలు వ్యక్తిగత శ్రద్ధను ఎలా చూపిస్తారు.” సంఘ పుస్తక అధ్యయన పైవిచారణకర్త నిర్వహించవలసిన ప్రశ్నా జవాబుల చర్చ. ఉపోద్ఘాత వ్యాఖ్యానాలలో, పుస్తక అధ్యయన ఏర్పాటు ఎలా ప్రారంభించబడిందో క్లుప్తంగా వివరించండి. (jv 237, 4వ పేరా) సంఘ పుస్తక అధ్యయనంలో తమపై చూపించబడిన వ్యక్తిగత శ్రద్ధ వల్ల తాము ఎలా ప్రయోజనం పొందామనేదాని గురించి వ్యాఖ్యానించేలా ముందుగానే ఇద్దరు లేక ముగ్గురు ప్రచారకులను ఏర్పాటు చేసుకోండి.
పాట 23 (200), ముగింపు ప్రార్థన.
అక్టోబరు 21తో ప్రారంభమయ్యే వారం
పాట 4 (43)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్టు.
35 నిమి: “వివిధ భాషలు మాట్లాడే ప్రజలున్న క్షేత్రంలో శిష్యులను చేయడం.” సేవా పైవిచారణకర్త నిర్వహించవలసిన ప్రసంగం మరియు ప్రేక్షకులతో చర్చ. 8వ పేరాను చర్చిస్తుండగా, చక్కగా సాగుతున్న ఒక బైబిలు అధ్యయనాన్ని, ఆ బైబిలు విద్యార్థి మాట్లాడే భాషా సంఘంలోని ఒక ప్రచారకునికి/రాలికి ఎలా ఇవ్వబడుతుందో ఇద్దరు ప్రచారకులను ప్రదర్శించమనండి. స్థానిక పరిస్థితులను బట్టి, సంఘంలోను క్షేత్రంలోను ఇతర భాషలు మాట్లాడేవారికి సహాయం చేయడానికి ఏమి చేయబడుతుందో క్లుప్తంగా వివరించండి.
పాట 20 (93), ముగింపు ప్రార్థన.
అక్టోబరు 28తో ప్రారంభమయ్యే వారం
పాట 16 (143)
8 నిమి: స్థానిక ప్రకటనలు. వచ్చే వారం సేవా కూటంలోని చర్చకు సిద్ధపడుతూ గత సేవా సంవత్సరంలో జరిగిన ప్రత్యేక దిన సమావేశ కార్యక్రమపు నోట్సును పునఃసమీక్షించుకొనమని అందరినీ ప్రోత్సహించండి. అక్టోబరు క్షేత్రసేవా రిపోర్టులను ఇవ్వమని ప్రచారకులకు గుర్తుచేయండి. 8వ పేజీలోని సలహాలను ఉపయోగిస్తూ అక్టోబరు-డిసెంబరు తేజరిల్లు!ను (పత్రికా ప్రదర్శన కాలమ్‌లో ఉన్న మూడవది,) ఎలా అందించాలో ఒక సహోదరుణ్ణి ప్రదర్శించమనండి, నవంబరు 1 కావలికోటను ఎలా అందించాలో ఒక సహోదరిని ప్రదర్శించమనండి. ప్రతి ప్రదర్శన తర్వాత, ఆ అందింపులోని ఒక ప్రభావవంతమైన అంశాన్ని క్లుప్తంగా ఉన్నతపర్చండి.
12 నిమి: స్కూల్లో సత్యం పక్షాన నిలబడడం. విశ్వాసులు కాని క్లాస్‌మేట్లతో సహవాసాన్ని పరిమితం చేసుకోవలసిన అవసరాన్ని గ్రహించిన ఒకరు లేదా ఇద్దరు యౌవన ప్రచారకులను ఇంటర్వ్యూ చేయండి. జాతీయ లాంచనాలు, స్కూల్ డాన్సులు మరియు ప్రదర్శనలు, అపరిశుభ్రమైన ప్రవర్తనకు సంబంధించిన సవాళ్ళతో మరియు శోధనలతో వారు ఎలా వ్యవహరించాలనుకుంటున్నారు? వారు స్కూల్లో సాక్ష్యమివ్వాలనుకుంటున్న విధానాల గురించి వ్యాఖ్యానాలను చేర్చండి.
25 నిమి: “మన కాలానికి హెచ్చరికా మాదిరులు వాటిని లక్ష్యపెట్టమని హృదయపూర్వకంగా చేస్తున్న విన్నపం.” ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, వెంటనే ఆర్టికల్‌లో ఇవ్వబడిన ప్రతి ప్రశ్నను ప్రేక్షకులతో చర్చించండి. డిసెంబరులో మనం రక్త రహిత చికిత్స—వైద్య శాస్త్రం ఆ సవాలును ఎదుర్కొంటుంది (ఆంగ్లం) అనే వీడియోను సమీక్షిస్తాం.
పాట 6 (45), ముగింపు ప్రార్థన.
నవంబరు 4తో ప్రారంభమయ్యే వారం
పాట 9 (37)
10 నిమి: స్థానిక ప్రకటనలు. దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌ను, జ్ఞానము పుస్తకాన్ని ప్రతిపాదించడానికి జనవరి 2002, మన రాజ్య పరిచర్య మధ్య పేజీల్లో ఇవ్వబడిన సలహాలలో కొన్నింటిని క్లుప్తంగా పునఃసమీక్షించండి. అందింపుల్లో ఒక దానిని ప్రదర్శించండి.
13 నిమి: సువార్త విషయంలో సిగ్గుపడేవారము కాదు. (రోమా. 1:16) యౌవనస్థుడు ఒక సమస్యతో తండ్రిని సమీపిస్తాడు. తోటి విద్యార్థులు హేళన చేస్తారన్న భయంవల్ల ఒక యెహోవాసాక్షిగా గుర్తించబడడానికి ఆ యౌవనస్థుడు సుముఖంగా లేడు. ఈ విషయంలో తన భావాలను యథార్థంగా తెలియజేసినందుకు తండ్రి యువకుడిని మెచ్చుకుంటాడు. పేతురు ఒకసారి తోటివారి ఒత్తిడి మూలంగా ఎలా ప్రతిస్పందించాడో ఆయన వివరిస్తాడు. (మత్త. 26:69-74) క్రైస్తవులముగా మనం, మనమెవరమన్న విషయంలో ఎన్నడూ సిగ్గుపడకూడదని తండ్రి సలహా ఇస్తాడు. (మార్కు 8:38) స్కూల్లో మీరు ఒక యెహోవాసాక్షిగా గుర్తించబడడం ప్రయోజనకరంగా ఉంటుంది. చాలామంది ఉపాధ్యాయులు తమకు ఆ విషయం తెలియజేయబడినప్పుడు మీ నమ్మకాలను గౌరవిస్తారు, మీరు అభ్యంతరకరంగా పరిగణించే కార్యకలాపాల్లో మిమ్మల్ని చేర్చకుండా ఉండడానికి ప్రయత్నిస్తారు. నీతినియమాలులేని యువత మిమ్మల్ని తప్పు చేయమని ఒత్తిడి చేసే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. మీరు డేటింగ్ చేయకూడదని, పాఠ్యేతర క్రీడలలో పాల్గొనకూడదని, స్కూలు తర్వాత కార్యకలాపాల్లో భాగం వహించకూడదని ఎందుకు ఎంపిక చేసుకున్నారో అర్థం చేసుకోవడానికి ఇతర క్లాస్‌మేట్‌లు మరింత సుముఖంగా ఉంటారు. సమయానుకూలతను బట్టి ఆ తండ్రి, యువకుడు యౌవనస్థులు అడిగే ప్రశ్నలు (ఆంగ్లం) పుస్తకంలో 315-18 పేజీలలో ఉన్న “దేవునితో మీకున్న స్నేహాన్ని బహిరంగంగా తెలియజేయడం” అనే ఉపశీర్షిక క్రింద ఉన్న పాయింట్లను చర్చిస్తారు. మంచి సలహాకు ఆ యౌవనస్థుడు కృతజ్ఞతను వ్యక్తం చేస్తాడు.
22 నిమి: దేవునికి లోబడియుండండి—అపవాదిని ఎదిరించండి. (యాకో. 4:7) ఇక్కడ ఇవ్వబడిన ప్రశ్నలను ఉపయోగిస్తూ ఒక పెద్ద, గత సేవా సంవత్సరంలో నిర్వహించబడిన ప్రత్యేక దిన సమావేశ కార్యక్రమాన్ని ప్రేక్షకులతో ఉత్సాహంగా చర్చిస్తాడు. వారు నేర్చుకున్నవాటిని ఎలా అన్వయించుకోగలిగారో చెప్పమని సంఘాన్ని ఆహ్వానించండి. (భాగాలను ముందుగానే నియమించవచ్చు.) క్రింద ఇవ్వబడిన కార్యక్రమపు భాగాలను ఉన్నతపర్చండి: (1) “బానిసగా ఉన్న లోకంలో దేవునికి లోబడివుండడం.” మనం లోకసంబంధమైన ఉచ్చులను నివారించడంలో ఎందుకు అప్రమత్తంగా ఉండాలి? (2) “కుటుంబ సభ్యులుగా దైవిక విధేయతను కనబరచండి.” యెహోవా సంస్థలో కుటుంబ బాంధవ్యాలను బలపర్చుకోవలసిన తక్షణ అవసరం ఎందుకు ఉంది? మనం అలా ఎలా చేయవచ్చు? (3) “యెహోవా పక్షాన దృఢంగా నిలబడేందుకు క్రొత్త శిష్యులకు సహాయపడండి.” వారి విశ్వాసాన్ని పరీక్షించే ఆటంకాలను అధిగమించేందుకు మనం క్రొత్తవారికి ఎలా సహాయపడవచ్చు? (4) “అపవాదిని ఎదిరించడమంటే ఏమిటి?” అపవాదికి వ్యతిరేకంగా విజయవంతంగా నిలబడడానికి కీలకం ఏమిటి? ఎఫెసీయులు 6:11-18 వచనాల్లో వర్ణించబడిన ఆధ్యాత్మిక కవచం మనల్ని ఎలా రక్షించగలదు? (w92 5/15 21-3) (5) “దుష్టుడ్ని విజయవంతంగా ఎదిరించే యౌవనస్థులు” మరియు “యౌవనస్థులారా, దైవిక విధేయత ద్వారా ప్రయోజనం పొందండి.” యౌవనస్థులు అప్రమత్తంగా ఉండి వ్యతిరేకించవలసిన సాతాను పన్నాగాలలో కొన్ని ఏమిటి? యెహోవాకు విధేయత చూపడం ద్వారా యౌవనస్థులు ఎలా ఆశీర్వదించబడ్డారు? (w91 9/1 30, 31 పేజీలు, 15-17 పేరాలు) (6) “దైవిక విధేయత నుండి ప్రయోజనం పొందడం.” క్రైస్తవులు ప్రభుత్వాధికారులకు, ఉద్యోగపరమైన యజమానులకు, కుటుంబంలో, క్రైస్తవ సంఘంలో ఎలా విధేయతను ప్రదర్శిస్తారో వివరించండి. అలా చేయడానికి మనకు ఏ గుణాలు సహాయపడతాయి?
పాట 24 (185), ముగింపు ప్రార్థన.