దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
2002, మే 6 నుండి ఆగస్టు 19, మధ్య వారాల్లో జరిగిన దైవపరిపాలనా పరిచర్య పాఠశాల నియామకాల సమాచారంపై పుస్తకాలు మూసి చేసే పునఃసమీక్ష. కేటాయించబడిన సమయంలోనే మీరు వ్రాయగలిగినన్ని ప్రశ్నలకు జవాబులు వ్రాసేందుకు వేరే పేపరును ఉపయోగించండి.
[గమనిక: వ్రాతపూర్వక పునఃసమీక్ష సమయంలో ఏ ప్రశ్నలకు సమాధానమివ్వడానికైనా కేవలం బైబిలును మాత్రమే ఉపయోగించవచ్చు. ప్రశ్నల ప్రక్కనున్న రెఫరెన్సులు మీ వ్యక్తిగత పరిశోధన కోసం ఇవ్వబడ్డాయి. కావలికోట రెఫరెన్సులున్న ప్రతిచోట పేజీ నెంబర్లు, పేరా నెంబర్లు ఉండకపోవచ్చు.]
ఈ క్రింది వాక్యాలు సత్యమో, అసత్యమో వ్రాయండి:
1. ప్రజలు తమ చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించేలా యెహోవా చేస్తాడని యిర్మీయా 18:1-6 చూపిస్తుంది. [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w99 4/1 22వ పేజీ, 3, 4 పేరాలు చూడండి.]
2. దేవుని నుండి వచ్చే నిజమైన హెచ్చరికను వినే బదులు అబద్ధాలు వినమని ప్రజలను ప్రోత్సహించడం ద్వారా అబద్ధ ప్రవక్తలు దేవుని మాటల శక్తిని, ఆ మాటలు వినడం ద్వారా రాగల ఫలితాలను దొంగిలించారు. (యిర్మీ. 23:30) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w92 2/1 4వ పేజీ, 3వ పేరా చూడండి.]
3. యిర్మీయా 25:15, 16 వచనాల్లో చెప్పబడిన, ‘జనములన్ని వెఱ్ఱివాండ్రు’ అయ్యేటట్టు చేసే “ఈ క్రోధపు మద్యపాత్ర,” అబద్ధమతం కలిగించే అజ్ఞానాన్ని సూచిస్తుంది. [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w94 3/1 20వ పేజీ, 13వ పేరా చూడండి.]
4. యిర్మీయా ప్రవచనాన్ని మత్తయి అన్వయించిన పద్ధతి ప్రకారం, “శత్రువుని దేశము” మరణ దేశాన్ని సూచిస్తుంది, రాజైన హేరోదు చంపిన చిన్న పిల్లలు పునరుత్థానము ద్వారా అక్కడి నుండే తిరిగి వస్తారు. (యిర్మీ. 31:15, 16; మత్త. 2:17, 18) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w79 6/15 19వ పేజీ, 13వ పేరా చూడండి.]
5. యిర్మీయా 37:21, కష్టతరమైన ఆర్థిక పరిస్థితుల మధ్య యెహోవా తన నమ్మకమైన సేవకులను ఆదుకోగలడన్న హామీ ఇస్తుంది. [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w97 9/15 3వ పేజీ, 4వ పేరా-4వ పేజీ, 2వ పేరా చూడండి.]
6. హీబ్రూ భాషలో, “విమోచన క్రయధనము” అనే పదం చెరపట్టబడిన వ్యక్తిని విడిపించడానికి కట్టే సొమ్మును సూచిస్తుంది, సరిసమానమైన అనే భావాన్ని కూడా ఇస్తుంది. [kl 65వ పేజీ, 11వ పేరా]
7. యెహోవా, తల్లిదండ్రుల పాపాలను బట్టి వారి పిల్లలను ప్రత్యక్షంగా శిక్షిస్తాడని విలాపవాక్యములు 5:7 స్పష్టంగా చూపిస్తుంది. [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w88 9/1 27వ పేజీ, బాక్సు చూడండి.]
8. యెహెజ్కేలు 9:4 వ వచనంలో చెప్పబడిన లలాటము మీది గురుతు, జ్ఞానము మాత్రమే ఒక వ్యక్తిని కాపాడుతుందని సూచిస్తుంది. [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w88 9/15 14వ పేజీ, 18వ పేరా చూడండి.]
9. ఎఫెసీయులు 4:8 వ వచనంలో చెప్పబడిన ‘మనుష్యులలో ఈవులు’ క్రైస్తవ పెద్దలు, వారు పరిశుద్ధాత్మ ద్వారా నియమించబడ్డారు, తోటి విశ్వాసుల ఆధ్యాత్మిక అవసరాల విషయంలో శ్రద్ధ తీసుకోవడానికి వారికి అధికారం ఇవ్వబడింది. (అపొ. 20:28) [w00 8/1 6వ పేజీ, 3వ పేరా]
10. యెహెజ్కేలు 23వ అధ్యాయానికి సంబంధించిన ఆధునిక దిన అన్వయింపులో, ప్రొటెస్టెంటు మతాన్ని ఒహొలీబాతోను, రోమన్ క్యాథలిక్ మతాన్ని ఆమె అక్కయైన ఒహొలాతోను పోల్చవచ్చు. [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w88 9/15 21వ పేజీ, 22వ పేరా చూడండి.]
క్రింది ప్రశ్నలకు సమాధానమివ్వండి:
11. “పునరుత్థానము” అనే పదానికి అక్షరార్థ భావమేమిటి? [kl 85వ పేజీ, 15వ పేరా]
12. లూకా 9:23 లో ఇవ్వబడ్డ ఆహ్వానానికి ప్రతిస్పందనగా, క్రీస్తు విమోచన క్రయధన బలి యందు యథార్థమైన మెప్పుదల ఎలా ప్రతిబింబించబడుతుంది? [w00 3/15 8వ పేజీ, 1వ పేరా]
13. యెహోవా యిర్మీయాను ఎలా ‘బుద్ధిహీనుడిని చేశాడు?’ (యిర్మీ. 20:7, NW) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w89 5/1 31వ పేజీ, 6వ పేరా చూడండి.]
14. “పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును” అని యేసు అన్నప్పుడు ఆయన భావమేమిటి? (యోహా. 14:26) [w00 4/1 8వ పేజీ, 7, 8 పేరాలు]
15. యిర్మీయా 35:18, 19 వచనాల ప్రకారం ఆధునిక దిన రేకాబీయుల తరగతికి ఏ నిరీక్షణ ఇవ్వబడుతుంది? [వారంలో చదవవలసిన బైబిలు భాగం; su 131వ పేజీ, 7వ పేరా చూడండి.]
16. నెఫీలులు ఏ విధంగా “పేరు పొందిన శూరులు?” (ఆది. 6:4) [w00 4/15 27వ పేజీ, 9వ పేరా]
17. బారూకు తన ఆధ్యాత్మిక సమతుల్యాన్ని ఎలా పోగొట్టుకున్నాడు, ఆయన అనుభవము నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు? (యిర్మీ. 45:1-5) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w97 8/15 21వ పేజీ, 14-16 పేరాలు చూడండి.]
18. యిర్మీయా 50:38వ వచనంలోని ప్రవచనం ఎప్పుడు, ఎలా నెరవేరింది? [వారంలో చదవవలసిన బైబిలు భాగం; dp 150వ పేజీ, 2,3 పేరాలు చూడండి.]
19. విలాపవాక్యములు 1:15 ప్రకారం, క్రైస్తవమత సామ్రాజ్యాన్ని సూచించే యెరూషలేముకు అంటే “కన్యకయైన యూదా కుమారి”కి ఏ గతి పడుతుంది? [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w88 9/1 27వ పేజీ, బాక్సు చూడండి.]
20. యెహెజ్కేలు 21:26వ వచనంలో నమోదుచేయబడిన “తలాటమును తీసివేయుము కిరీటమును ఎత్తుము,” అన్న వాక్యానికున్న ప్రాధాన్యత ఏమిటి? [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w88 9/15 19వ పేజీ, 16వ పేరా చూడండి.]
క్రింది వాక్యాలను పూరించడానికి అవసరమైన పదాన్ని (పదాలను) లేక పదబంధాలను చేర్చండి:
21. వినయస్థుడు మంచి _________________________ పవర్తిస్తాడు మరియు తను చేసి తీరాల్సిన కార్యాలకూ తాను చేయగల కార్యాలకూ _________________________ ఉన్నాయని కూడా ఆయన అంగీకరిస్తాడు. (మీకా 6:8) [w00 3/15 21వ పేజీ, 1, 2 పేరాలు]
22. పరిశుద్ధాత్మ, ________________ను లేదా ___________________ను తీసివేయకపోవచ్చు కానీ వాటిని _________________________ అది మనకు సహాయపడగలదు. (1 కొరిం. 10:13; 2 కొరిం. 4:7) [w00 4/1 11వ పేజీ, 6వ పేరా]
23. _____________________ను ఏర్పరచి, తన ______________కు ఏది మంచిదో ఏది చెడ్డదో నిర్వచించే హక్కు సృష్టికర్తగా యెహోవా దేవునికి ఉంది. [kl 56వ పేజీ, 9వ పేరా]
24. దుష్టత్వాన్ని, బాధను యెహోవా అనుమతించడం మూలంగా, దేవుని నుండి వేరై _________________________ ఉండడం _________________________ తీసుకురాలేదనే విషయం నిరూపించబడింది. [kl 77వ పేజీ, 18వ పేరా]
25. ఒక వివాదాన్ని పరిష్కరించుకునేటప్పుడు పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోయేలా ఉండడంలో అబ్రాహాము చూపించిన మాదిరి, మన సహోదరులతో మనకున్న అమూల్యమైన సంబంధాన్ని _________________________ లేదా _________________________ నాశనం చేసేందుకు అనుమతించకూడదని మనల్ని ప్రోత్సహిస్తుంది. (ఆది. 13:5-12) [w00 8/15 24వ పేజీ, 3, 4 పేరాలు]
క్రింది వాక్యాలలో నుండి సరైన జవాబును ఎంపిక చేయండి:
26. యెహోవా (జ్ఞానమును; కరుణను; న్యాయమును) యోబు విలువైనదిగా ఎంచాడు గనుక, ఆయన తన సేవకులతో (వివేచనతో; కరుణాపూర్వకంగా; న్యాయవంతంగా) వ్యవహరించాడు. (యోబు 31:13, 14) [w00 3/15 26వ పేజీ, 1వ పేరా]
27. యిర్మీయా 16:2-4 వచనాల్లో, ఆ ప్రవక్తకు అవివాహితునిగా ఉండమని ఆజ్ఞాపించబడడానికి కారణం, (ఆయన స్వయంత్యాగ స్ఫూర్తిని ప్రతిబింబించడం; మెస్సీయా అవివాహితునిగా ఉంటాడని ముందుగా తెలియజేయడం; యెరూషలేము నాశనానికి సంబంధించి యెహోవా వాక్యం తప్పకుండా నెరవేరుతుందని ధృవీకరించడం). [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w78 4/15 31వ పేజీ, 2వ పేరా చూడండి.]
28. సామెతలు 4:7వ వచనంలో, జ్ఞానము, (వాస్తవాలను గురించి తెలుసుకొని ఉండడాన్ని; వాస్తవాలు ఒకదానితో ఒకటి ఎలా సంబంధం కలిగి ఉన్నాయో చూడడాన్ని; విషయ పరిజ్ఞానాన్నీ, వివేకాన్నీ ఉపయోగించుకోవడాన్ని) సూచిస్తుంది. [w00 5/15 21వ పేజీ, 1వ పేరా]
29. ఐగుప్తుకు తీసుకువెళ్ళబడి, అక్కడ పోతీఫరు అనే వ్యక్తికి అమ్మివేయబడినప్పుడు యోసేపు వయస్సు కేవలం (17 సంవత్సరాలు; 19 సంవత్సరాలు; 21 సంవత్సరాలు). [my 22వ అధ్యాయం]
30. యెహెజ్కేలు 1వ అధ్యాయంలో వర్ణించబడిన దేవుని రథము, (దేవుని మెస్సీయా రాజ్యాన్ని; యెహోవా దూతల ఆత్మసంబంధమైన సంస్థను; శేషముకు యెహోవా తన ఉద్దేశాలను తెలియజేయడాన్ని) సూచిస్తుంది. [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w88 9/15 11వ పేజీ, 5వ పేరా చూడండి.]
క్రింద ఇవ్వబడిన వాక్యాలతో ఈ క్రింది లేఖనాలను జత చేయండి:
హెబ్రీ. 12:16, 17; లూకా 11:41; సామె. 5:21; యిర్మీ. 46:28; రోమా. 15:4
31. పరిశుద్ధమైన వాటిని విలువైనవిగా ఎంచడంలో విఫలమవ్వడం, వ్యభిచారం వంటి మరింత గంభీరమైన పాపాలకు దారితీయగలదు. [my 17వ అధ్యాయం]
32. యెహోవా మనకు ఇచ్చిన తన లిఖిత వాక్యం, ఆయన ఓదార్పునిచ్చే ఒక విశిష్ట మార్గం. అందులో భవిష్యత్తును గురించిన అద్భుతమైన నిరీక్షణ ఉంది. [w00 4/15 5వ పేజీ, 4వ పేరా]
33. తలిదండ్రులు ఇచ్చే క్రమశిక్షణ సహేతుకమైన పరిధులను దాటకూడదు, సరిదిద్దడం మరియు బోధించడం అనే దాని సంకల్పాన్ని మించకూడదు. [వారంలో చదవవలసిన బైబిలు భాగం; kl 148వ పేజీ, 20వ పేరా చూడండి.]
34. ఇతరులను ప్రభావితము చేయవలెననే కోరికతో కాకుండ, వారు ఇచ్చుదానిని ప్రేమగల హృదయముతో ఇవ్వవలెను. [gt 76వ అధ్యాయం]
35. ఏ విధమైన లైంగిక దుర్నీతియైనా, ఎంత రహస్యంగా దానికి పాల్పడినా, అది దేవుని కళ్ళకు మరుగై ఉండదు. [w00 7/15 31వ పేజీ, 3వ పేరా]