ప్రశ్నా భాగం
◼ సెల్యులర్ టెలిఫోన్‌లను, ఎలక్ట్రానిక్ పేజర్లను ఉపయోగిస్తున్నప్పుడు మనం ఏమి గుర్తుంచుకోవాలి?
దాదాపు మనం ఏ ప్రదేశంలో ఉన్నప్పటికీ, ఇతరులను సంప్రదించడానికి ఇలాంటి పరికరాలు సహాయపడతాయి. ఇది ప్రయోజనకరమే అయినప్పటికీ సముచితం కాని సమయాల్లో సెల్‌ఫోన్‌లను, పేజర్లను ఉపయోగించడం వల్ల మనం మన పరిచర్య నుండి, క్రైస్తవ కూటాల నుండి అవధానం ప్రక్కకు మళ్ళించబడకుండా ఉండేలా జాగ్రత్త పడాలి. అది ఎలా జరగవచ్చు?
మనం క్షేత్ర పరిచర్యలో సాక్ష్యమిస్తున్నప్పుడు మన సెల్‌ఫోన్ గానీ పేజర్ గానీ మ్రోగితే దాని ప్రభావం ఎలా ఉంటుందో ఆలోచించండి. గృహస్థుడు ఎలా భావిస్తాడు? ఫోన్‌లో మాట్లాడడానికి మనం మధ్యలో ఆగితే అది గృహస్థునికి ఎలాంటి అభిప్రాయం ఇవ్వవచ్చు? ఇతరులు రాజ్య సందేశం వినడాన్ని ఆటంకపర్చే దేన్నైనా చేయడానికి నిస్సందేహంగా మనం ఇష్టపడం. (2 కొరిం. 6:3) కాబట్టి, మనతో పాటు సెల్‌ఫోన్‌ను గానీ పేజర్‌ను గానీ తీసుకు వెళ్తున్నట్లైతే, క్షేత్ర పరిచర్యలో పాల్గొంటున్నప్పుడు మనల్నిగానీ ఇతరులను గానీ ఆటంకపర్చకుండా ఉండేలా దాన్ని సెట్ చేసుకోవాలి.
ఇతరులు సాక్ష్యమిస్తుండగా మనం వేచివున్నప్పుడు సంగతేమిటి? మనం క్షేత్ర సేవ కోసం కొంత సమయాన్ని కేటాయించినప్పుడు, మన మనస్సులను ఆ పని మీదే కేంద్రీకరించవద్దా? మన పరిశుద్ధ సేవకు గౌరవాన్ని చూపిస్తూ అనవసరమైన వ్యక్తిగత వ్యవహారాలనూ స్నేహితులతో మాట్లాడడాన్నీ దయచేసి ఇతర సమయాల్లో చూసుకోండి. (రోమా. 12:6-8) అయితే దీని భావం, ఇతరులకు మరింత సాక్ష్యమివ్వడానికి లేదా అలా సాక్ష్యమిచ్చేందుకు అపాయింట్‌మెంట్ తీసుకోవడానికి ఫోన్‌ను ఉపయోగించకూడదని కాదు.
వాహనాలను నడిపేటప్పుడు సెల్‌ఫోన్‌లను ఉపయోగించే విషయంలో మనం చాలా అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే సెల్‌ఫోన్‌లను ఉపయోగించడం వల్ల యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం పెరుగుతోందని కొన్ని పరిశోధనలు చూపిస్తున్నాయి. వాహనాల్ని నడిపేటప్పుడు సెల్‌ఫోన్‌ల వాడకాన్ని పరిమితం చేసే ఏ చట్టాలనైనా మనం ఖచ్చితంగా పాటించాలి.
మనం క్రైస్తవ కూటాలకూ ప్రత్యేక, ప్రాంతీయ, జిల్లా, సమావేశాలకూ యెహోవాను ఆరాధించడానికీ ఆయనచే ఉపదేశించబడడానికీ వెళ్తాము. ఈ సందర్భాలకు ఉన్న పవిత్రతపట్ల మనకున్న మెప్పుదల సెల్‌ఫోన్‌లు, పేజర్లు ఇతరుల అవధానాన్నీ అలాగే మన అవధానాన్నీ ప్రక్కకు మళ్ళించకుండా ఉండేలా వాటిని సెట్ చేసుకొనేందుకు మనల్ని కదిలించవద్దా? మనం తక్షణమే అవధానం ఇవ్వాల్సిన అత్యవసర విషయం ఏదైనా ఉంటే, కూటం జరిగే ప్రదేశం నుండి బయటకు వచ్చి ఫోన్‌లో మాట్లాడాలి. లేకపోతే మన వ్యక్తిగత, ఉద్యోగపరమైన విషయాలను చూసుకోవడానికి ఆరాధన కోసం కేటాయించిన సమయాలను కాకుండా వేరే సమయాలను ఉపయోగించుకోవాలి.—1 కొరిం. 10:24.
సెల్యులర్ ఫోన్‌లను లేదా ఏవైనా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను మనం ఉపయోగించే విధానం, మనం ఎల్లప్పుడూ ఇతరులను పరిగణలోకి తీసుకుంటున్నామనీ ఆధ్యాత్మిక విషయాలపట్ల మనకు ప్రగాఢమైన మెప్పు ఉందనీ చూపించాలి.