ఇతరులకు సహాయం చేయడం మీకు ‘ఇష్టమేనా?’
1 యేసు ప్రజలపట్ల నిజమైన శ్రద్ధ కనబర్చాడు. ఒక కుష్ఠరోగి, సహాయం చేయమని ఆయనను వేడుకొన్నప్పుడు, యేసు తన చెయ్యిచాపి అతనిని ముట్టి, ‘నాకిష్టమే; నీవు శుద్ధుడవు కమ్ము’ అని అన్నాడు. (ఇటాలిక్కులు మావి.) (మార్కు 1:40-42) ఇతరులకు సహాయం చేసే విషయంలో యేసుకున్న దృక్పథాన్ని మనం ఏయే విధాలుగా అనుకరించవచ్చు?
2 ఆసక్తిగల ప్రజలు: ఆసక్తిగలవారు యెహోవా ఆరాధకులయ్యేందుకు సహాయం చేయడంలో సంఘంలోని ప్రతి ఒక్కరూ భాగం వహిస్తారు. క్రొత్తవారు కూటాలకు వచ్చినప్పుడు వారిని పలకరించండి, పరిచయం చేసుకోండి. వారిని ప్రోత్సహించడానికి మార్గాలను వెదకండి. వారు చేసే వ్యాఖ్యానాలకు వారిని ప్రశంసించండి. బైబిలు సూత్రాలను తమ జీవితాల్లో అన్వయించుకోవడానికి వారు చేస్తున్న కృషికి వారిని మెచ్చుకోండి. సంఘంలోనే నిజమైన స్నేహితులను సంపాదించుకోవడానికి అవకాశాలున్నాయని గ్రహించేందుకు వారికి సహాయం చేయండి.
3 తోటి విశ్వాసులు: ప్రత్యేకించి ‘విశ్వాసగృహమునకు చేరినవారు’ అనేక విధాలుగా మన సహాయం పొందడానికి తగినవారు. (గల. 6:10) వారిలో చాలామంది ఆరోగ్య సమస్యలతో పోరాడుతుంటారు. వారిని ప్రోత్సహించడానికి సందర్శించి వారితో సహవసించవచ్చు, అది వారికి ఆవశ్యకము, అంతేకాకుండా ఆచరణాత్మకమైన విధాల్లో కూడా వారికి సహాయం చేయవచ్చు. మరి కొందరు తమ జీవితాల్లో ఇతర కష్టాలను ఎదుర్కొంటుండవచ్చు. వారు చెప్పేది వినడానికి, వారిని బలపర్చడానికి సమయం వెచ్చించడం ద్వారా మీ శ్రద్ధను కనబర్చండి. (1 థెస్స. 5:14) పెద్దలు తమ బాధ్యతలను నిర్వర్తిస్తుండగా వారికి కూడా మన సహకారం అవసరం. (హెబ్రీ. 13:17) ఉత్సాహవంతమైన స్ఫూర్తిని, సహాయం చేసే స్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా మనం మన తోటి విశ్వాసులకు “ఆదరణ” కలిగించేవారిగా ఉండగలము.—కొలొ. 4:11.
4 కుటుంబ సభ్యులు: యేసు ప్రజలపట్ల చూపినటువంటి శ్రద్ధను మనం మన స్వంత కుటుంబ సభ్యులపట్ల చూపే విషయంలో ఆయనను అనుకరించడానికి కూడా కృషి చేయాలి. తల్లిదండ్రులకు తమ పిల్లలపట్ల ఉండే ప్రగాఢమైన శ్రద్ధ ‘ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచడానికి’ వారిని కదిలిస్తుంది. (ఎఫె. 6:4) పిల్లలు కూడా కుటుంబ అధ్యయనానికి, సంఘ కూటాలకు, లేదా క్షేత్ర పరిచర్యకు సమయానికి సిద్ధపడడం ద్వారా తమ వంతు తాము చేయవచ్చు. వృద్ధాప్యం వల్ల కలిగే కష్టాలను తట్టుకుని నిలబడడానికి తమ తల్లిదండ్రులకు ప్రేమపూర్వకంగా సహాయం చేయడం ద్వారా, ఎదిగిన పిల్లలు యేసు చూపించిన వాత్సల్యంతో కూడిన దయను ప్రతిబింబించవచ్చు. ఈ విధాల్లోనూ ఇతర విధాల్లోనూ మనమందరం ‘[మన] యింటివారియెడల భక్తి కనుపరచవచ్చు.’—1 తిమో. 5:4.
5 ఇతరులకు సహాయం చేయడంలో మనం యేసును అనుకరిస్తుండగా, మనం సమస్యలను తగ్గించి మన కుటుంబమూ సంఘమూ మరింత సన్నిహితమయ్యేందుకు సహాయపడవచ్చు. అన్నింటికంటే ప్రాముఖ్యంగా మనం “కనికరము చూపు తండ్రి” అయిన యెహోవాకు ఘనతను తెస్తాము.—2 కొరిం. 1:3.