మీరు మన సాహిత్యాలను విలువైనవిగా ఎంచుతున్నారా?
1 వజ్రాలు ఇతర రత్నాలు వాటికున్న అందాన్ని బట్టే కాకుండా వాటిని కనుగొనడానికి, గనిని త్రవ్వి వాటిని సేకరించడానికి అయ్యే ఖర్చునుబట్టి కూడా ఎంతో విలువైనవి. అయితే, యెహోవా యేసుక్రీస్తులను గురించిన జ్ఞానము మరింత శ్రేష్ఠమైన విలువ గలది. ప్రపంచమంతటిలో కేవలం మన ప్రచురణలు మాత్రమే ఈ ఆధ్యాత్మిక సంపదల లోతైన భావాన్ని దైవిక జ్ఞానాన్నుపయోగిస్తూ వివరిస్తాయి. (రోమా. 11:33; ఫిలి. 3:8) మరి, మనం మన సాహిత్యాలపట్ల నిజమైన మెప్పుదలను ఎలా ప్రదర్శించగలము?
2 చాలామంది వ్యక్తులు, కుటుంబాలు రాజ్య మందిరంలో ఉండే, “సొసైటీ ప్రపంచవ్యాప్త పని కోసం చందాలు—మత్తయి 24:14” అని వ్రాయబడి ఉన్న బాక్సుల్లోని ఒకదానిలో చందాను వేయడం కోసం క్రమంగా కొంత డబ్బును ప్రక్కకు తీసిపెడతారు. సంఘంనుంచి పత్రికలు లేదా సాహిత్యం తీసుకున్నప్పుడు ప్రపంచవ్యాప్త పని కోసం వ్యక్తిగతంగా చందాలు వేస్తారు, అంతేగాక క్షేత్ర సేవలో పొందిన చందాలను కూడా ఆ బాక్సుల్లో వేస్తారు.
3 మన మెప్పుదలను ప్రదర్శించడానికి మరొక మార్గం ఏమిటంటే, మనం క్షేత్ర సేవలో కలిసిన ప్రజలకు సాహిత్యాన్ని అందించే విషయంలో వివేచన చూపించడం. మనం ఒక ఖరీదైన వజ్రాన్ని, దాని విలువను గ్రహించలేని శిశువు చేతికి ఇవ్వాలని అనుకోము. అలాగే, ఆధ్యాత్మిక విషయాల పట్ల మెప్పుదల లేని వ్యక్తులకు విలువైన సాహిత్యాన్ని మనం ఇవ్వము. (హెబ్రీయులు 12:16 పోల్చండి.) మనం మన సమయాన్ని శక్తిని ఉదారంగా వెచ్చించే విషయంలోనూ, సాహిత్యాన్ని ఉదారంగా ఇచ్చే విషయంలోనూ వివేచనను ఉపయోగించాలి. గృహస్థుడు సంభాషించడానికి సుముఖంగా ఉన్నాడా? మనము మాట్లాడుతున్నప్పుడు ఆయన అవధానమిస్తున్నాడా, మనం అడిగే ప్రశ్నలకు ప్రతిస్పందిస్తున్నాడా, మనం బైబిలు నుంచి చదువుతున్నప్పుడు శ్రద్ధగా వింటున్నాడా? ఆ వ్యక్తి ఇలాంటి ఆసక్తి చూపిస్తే సముచితమైన ప్రచురణను ఇవ్వడానికి మనం సంతోషిస్తాము. అలాగే మన సాహిత్యం నుంచి మనం అధ్యయనాలను నిర్వహించినప్పుడు, బైబిలు ఏమి బోధిస్తుందో నేర్చుకోవడానికి ప్రజలకు సహాయం లభిస్తుంది, యెహోవాతో సంబంధం పెంపొందించుకోవడానికి అది వారికి మార్గాన్ని తెరుస్తుంది. మన సాహిత్యాల వల్ల కలిగే నిజమైన ప్రయోజనం, వాటిని మనం ఎలా ఉపయోగిస్తున్నాము అన్నదానిపై ఆధారపడివుంటుంది.
4 రాజ్యమందిరంలోని ఒక షెల్ఫులో లేదా మన ఇంట్లో అలా ఉంచబడిన సాహిత్యం స్టాకు దాని ఉద్దేశాన్ని సాధించదు, దాని విలువను గ్రహించడం జరగదు. బ్రోషుర్లు, పుస్తకాలు, కరపత్రాలు, పత్రికల యొక్క పాత సంచికలను కూడా మంచిగా ఉపయోగించుకోవాలి. మన దగ్గర ఇప్పటికే ఉన్న సాహిత్యాల సప్లై యొక్క ఇన్వెంటరీ తీసుకుని ఎన్ని రోజులయ్యింది? మన దగ్గర ఎంత సాహిత్యం పేరుకుపోయిందో తెలుసుకుని మనం ఆశ్చర్యపోవచ్చు. మన దగ్గర ఉన్న సాహిత్యం ఇంకా మంచి స్థితిలోనే ఉందా—పాతబడిపోయి పసుపు రంగులోకి మారిపోకుండా, చిరిగిపోకుండా, దుమ్ముకొట్టుకుపోకుండా ఉందా? అలాగైతే, దాన్ని క్షేత్ర పరిచర్యలో పంచిపెట్టడానికి మనం అన్ని విధాలా కృషి చేయాలి. పాడైపోయిన సాహిత్యాన్ని మనం వ్యక్తిగత ఉపయోగం కోసం ఉంచుకోవచ్చు లేదా దాన్ని తగిన విధంగా తీసివేయవచ్చు. ఆ నెలలో ప్రతిపాదించవలసిన సాహిత్యాలపై ఎక్కువ అవధానం ఉంచినప్పటికీ కొన్నిసార్లు మనం వేరే ప్రచురణను ఉపయోగించాలని నిశ్చయించుకోవచ్చు.
5 మీరు అందించడానికి మీకు సరిగ్గా ఎంత సాహిత్యం కావాలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఆలోచించుకోండి. అలా చేయడానికి మంచి అవగాహన అవసరం. ప్రత్యేకించి, మీరు పయినీరు సేవ చేస్తున్నట్లైతే సరిపడినంత సాహిత్యం అవసరమే అయినప్పటికీ, వ్యక్తిగతంగా మీరు ఎక్కువ సాహిత్యాన్ని మీ దగ్గర ఉంచుకోనవసరం లేదు. ఎందుకంటే రాజ్య మందిరంలో కూటాలు ప్రారంభం అవ్వడానికి ముందు, ముగిసిన తర్వాత మీరు సాహిత్యాన్ని పొందవచ్చు. నెల మొదలైనప్పుడు మీకు సరిపడినంత సాహిత్యం మీవద్ద ఉంచుకోండి, అది అయిపోతుంటే మళ్ళీ తీసుకుంటుండండి.
6 దేవుని వాక్య సత్యం పట్ల మెప్పుదలను చూపించే ప్రజల చేతుల్లో మన సాహిత్యాన్ని పెట్టినప్పుడు, అవి అత్యంత విలువైనవిగా ఉంటాయి. మనకు అందించబడిన వాటిని ఉపయోగించే విషయంలో మనందరం జ్ఞానవంతంగా, వివేచనాత్మకంగా ఉండి, మన సాహిత్యాన్ని మనమెంత విలువైనదిగా ఎంచుతామో చూపిద్దాం.