కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 9/02 పేజీలు 4-5
  • మీ ఆధ్యాత్మిక అవసరాన్ని తృప్తిపరుచుకోండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ ఆధ్యాత్మిక అవసరాన్ని తృప్తిపరుచుకోండి
  • మన రాజ్య పరిచర్య—2002
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘విని, పాండిత్యము వృద్ధిచేసికొనుము’
    మన రాజ్య పరిచర్య—2001
  • వినండి, నేర్చుకోండి
    మన రాజ్య పరిచర్య—2013
  • 1999 “దేవుని ప్రవచన వాక్యము” జిల్లా సమావేశాలు
    మన రాజ్య పరిచర్య—1999
  • 1991 “స్వాతంత్ర్యమును ప్రేమించువారు” అను జిల్లాసమావేశమునకు హాజరగుటకు ఇప్పుడే ఏర్పాటు చేసికొనుము
    మన రాజ్య పరిచర్య—1991
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2002
km 9/02 పేజీలు 4-5

మీ ఆధ్యాత్మిక అవసరాన్ని తృప్తిపరుచుకోండి

1 “ఆసక్తిగల రాజ్య ప్రచారకులు” అనే రాబోయే మన జిల్లా సమావేశం మనం మన ఆధ్యాత్మిక అవసరాన్ని తీర్చుకోవడానికి అద్భుతమైన అవకాశాన్నిస్తుంది. పుష్టికరమైన భౌతికాహారంలాగే సమావేశ కార్యక్రమం మనల్ని ‘విశ్వాస సంబంధమైన వాక్యములచేత’ ఆధ్యాత్మికంగా తప్పక బలపరుస్తుంది. (1 తిమో. 4:⁠6) అది మనం యెహోవాకు సన్నిహితమయ్యేందుకు మనకు సహాయం చేస్తుంది. మన జీవితాల్లో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కోవడానికి సహాయాన్నందించే ఉపదేశాన్నీ, ప్రోత్సాహాన్నీ పొందవచ్చునని మనం ఎదురు చూడవచ్చు. యెహోవా మనకిలా హామీ ఇస్తున్నాడు: “నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను.” (కీర్త. 32:8) మన జీవితాలకు ఆయన ప్రేమపూర్వక నడిపింపు ఉన్నందుకు మనమెంత ధన్యులం! సమావేశ కార్యక్రమం నుండి పూర్తి ప్రయోజనాన్ని పొందడానికి మనం తీసుకోగల కొన్ని ఆచరణాత్మకమైన చర్యలను పరిశీలించండి.

2 మనం మన హృదయాన్ని సిద్ధపరుచుకోవలసిన అవసరం ఉంది: మనలో ప్రతి ఒక్కరికీ తమ ఆలంకారిక హృదయాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ఉంది. (సామె. 4:23) దీనికి, స్వయం శిక్షణా మనపట్ల మనం యథార్థంగా ఉండడమూ అవసరం. సమావేశం, యెహోవాతో మనకున్న సంబంధం గురించి ధ్యానించవలసిన, ‘స్వాతంత్ర్యము నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూడవలసిన’ సమయం. ‘వాక్యము నాటబడేందుకు’ మన హృదయాన్ని సిద్ధం చేసుకోవడానికిగాను, మనల్ని పరిశోధించమనీ సరిదిద్దవలసిన అవసరం ఉన్న ‘ఆయాసకరమైన మార్గము’ మనలో ఏమైనా ఉందేమో చూడమనీ “నిత్యమార్గమున” మనల్ని నడిపించమనీ మనం యెహోవాను వేడుకోవాలి.​—యాకో. 1:21, 25; కీర్త. 139:23, 24.

3 విని ధ్యానించండి: “మరియ ఉత్తమమైనదానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్దనుండి తీసివేయబడదని” అంటూ యేసు తన మాటలపై నిశ్చలంగా అవధానాన్ని నిలిపినందుకు మరియను మెచ్చుకున్నాడు. (లూకా 10:39, 42) మనం కూడా అదే మానసిక వైఖరిని కలిగివుంటే చిన్న చిన్న విషయాలు మన అవధానాన్ని ప్రక్కకు మళ్ళించడానికి మనం అనుమతించము. కార్యక్రమమంతటిలోనూ మనం కూర్చునే ఉండి చక్కగా అవధానం నిలిపేలా నిశ్చయపర్చుకుంటాము. మనం అనవసరంగా మాట్లాడడాన్నీ లేదా నడవడాన్నీ నివారించి, సెల్యులార్‌ ఫోన్‌లతో, పేజర్‌లతో, కెమెరాలతో, కామ్‌కార్డర్‌లతో ఇతరుల అవధానాన్ని ప్రక్కకు మళ్ళించము.

4 మనం ప్రసంగాలను వినేటప్పుడు, విషయం ఎలా విశదీకరించబడిందో విశ్లేషించుకోవడానికి సహాయకరంగా ఉండేలా సంక్షిప్తంగా నోట్సు రాసుకోవడం మంచిది. మనం వింటున్నదాన్ని మనకు ఇప్పటికే తెలిసినదానితో జతచేసుకోవాలి. ఇది మనం సమాచారాన్ని అర్థం చేసుకుని దాన్ని భద్రంగా మనస్సులో ఉంచుకోవడానికి సహాయం చేస్తుంది. మనం ఆ సమాచారాన్ని అన్వయించుకోవాలనే ఉద్దేశంతో మన నోట్సును మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. మనలో ప్రతి ఒక్కరం ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘ఇది యెహోవాతో నాకున్న సంబంధాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? నేను నా జీవితంలో ఏ సవరింపులు చేసుకోవలసిన అవసరం ఉంది? ఇతరులతో వ్యవహరించే విషయంలో ఈ సమాచారాన్ని నేనెలా అన్వయించుకోగలను? నేను నా పరిచర్యలో దీన్నెలా ఉపయోగించుకోగలను?’ మనం ప్రత్యేకంగా ఆనందించిన విషయాలను ఇతరులతో చర్చించండి. ఈ పనులు చేయడం, యెహోవా మాటలను ‘మన హృదయమందు భద్రము చేసుకోవడానికి’ మనకు సహాయం చేస్తుంది.​—సామె. 4:20, 21.

5 మనం నేర్చుకునేదాన్ని మనం అన్వయించుకుందాము: ఒక జిల్లా సమావేశానికి హాజరైన తర్వాత ఒక వ్యక్తి ఇలా అన్నాడు: “తన హృదయస్థితినీ తన కుటుంబ సభ్యుల హృదయస్థితినీ పరీక్షించుకోవడానికి పురికొల్పుతూ అవసరమైన ప్రేమపూర్వక లేఖనాధారిత సహాయాన్నందిస్తూ కార్యక్రమం సూటిగా హృదయాన్ని తాకే విధంగా ఉంది. అది, సంఘానికి ఎక్కువ సహాయాన్నందించవలసిన నా బాధ్యతను నేను మరింత బాగా గుర్తించేలా చేసింది.” బహుశా మనలో చాలామందిమి అదేవిధంగా భావించి ఉండవచ్చు. అయితే మనం ప్రోత్సహించబడి, నూతనోత్తేజాన్ని పొంది వెళ్ళిపోవడం మాత్రమే సరిపోదు. “ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన యెడల మీరు ధన్యులగుదురు” అని యేసు అన్నాడు. (ఇటాలిక్కులు మావి.) (యోహా. 13:17) మనకు వ్యక్తిగతంగా వర్తించే విషయాలను ఆచరణలో పెట్టడానికి మనం తీవ్రంగా కృషి చేయాలి. (ఫిలి. 4:⁠9) మన ఆధ్యాత్మిక అవసరాన్ని పూర్తిగా తీర్చుకోవడానికి కీలకమిదే.

[4వ పేజీలోని బాక్సు]

మీరు వినేదానినిధ్యానించండి:

◼ ఇది యెహోవాతో నా సంబంధాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

◼ ఇతరులతో నా వ్యవహారాలను ఇది ఎలా ప్రభావితం చేస్తుంది?

◼ నేను దీన్ని నా జీవితంలో, పరిచర్యలో ఎలా అన్వయించుకోగలను?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి