2002వ సంవత్సరపు దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పట్టిక
సూచనలు
2002వ సంవత్సరంలో దైవపరిపాలనా పరిచర్య పాఠశాలను నిర్వహించేటప్పుడు ఈ క్రింది ఏర్పాట్లుంటాయి.
పాఠ్యపుస్తకాలు: అసైన్మెంట్లు కావలికోట [w], నిత్యజీవానికి నడిపించే జ్ఞానము [kl], నా బైబిలు కథల పుస్తకము [my], జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి [gt] అనే ప్రచురణలపై ఆధారపడి ఉంటాయి.
పాట, ప్రార్థన, క్లుప్తమైన ఆహ్వానపు మాటలతో పాఠశాల సరిగ్గా సమయానికి ప్రారంభమవ్వాలి. ఈ కార్యక్రమంలో ఏముందన్నది ముందుమాటగా ఏమీ చెప్పనవసరం లేదు. పాఠశాల పైవిచారణకర్త ఒక్కో భాగాన్ని పరిచయం చేసేటప్పుడు చర్చించబోయే విషయాన్ని పేర్కొంటాడు. ఈ క్రింది విధానాన్ని అవలంబించండి:
అసైన్మెంట్ నం. 1: 15 నిమిషాలు. దీనిని ఒక సంఘ పెద్ద లేదా పరిచర్య సేవకుడు నిర్వహించాలి. ఇది కావలికోట లేదా నిత్యజీవానికి నడిపించే జ్ఞానము పై ఆధారపడి ఉంటుంది. కావలికోట ఆధారంగా ఇచ్చే ప్రసంగమైతే ఈ అసైన్మెంట్ను మౌఖిక పునఃసమీక్ష లేకుండా 15 నిమిషాల ఉపదేశ ప్రసంగంగా నిర్వహించాలి. జ్ఞానము పుస్తకము ఆధారంగా ఇచ్చే ప్రసంగమైతే 10-12 నిమిషాల ప్రసంగంలా ఇవ్వాలి, తర్వాతి 3-5 నిమిషాల్లో పుస్తకంలోని ప్రశ్నలను ఉపయోగిస్తూ పునఃసమీక్ష చేయాలి. సమాచారాన్ని అందించడమే లక్ష్యంగా ఉండకుండా, సంఘానికి సహాయకరంగా ఉండే సమాచారాన్ని ఉన్నతపరుస్తూ, సమాచారంలోని ఆచరణాత్మక విలువపై శ్రద్ధ నిలపాలన్నది లక్ష్యమై ఉండాలి. ఈ పట్టికలో చూపించబడిన మూలాంశాన్నే ఉపయోగించాలి.
ఈ ప్రసంగం నియమించబడిన సహోదరులు దీనిని నిర్ణీత సమయంలోనే ముగించడానికి జాగ్రత్తపడాలి. అవసరమైతే, లేదా సలహా ఇమ్మని ప్రసంగీకుడు కోరినట్లయితే, తర్వాత వ్యక్తిగతంగా సలహా ఇవ్వవచ్చు.
చదవవలసిన బైబిలు భాగంలోని ఉన్నతాంశాలు: 6 నిమిషాలు. సమాచారాన్ని స్థానిక అవసరాలకు తగినట్లు ప్రభావవంతంగా అన్వయించగలిగే సంఘ పెద్ద లేదా పరిచర్య సేవకుడు దీనిని నిర్వహించాలి. దీనికి ఒక అంశాన్ని నిర్ణయించుకోనవసరం లేదు. ఇది కేవలం నియమిత అధ్యాయాల సంగ్రహ సారాంశమై ఉండకూడదు. నియమిత అధ్యాయాలన్నింటినీ మొత్తంగా 30 నుండి 60 సెకండ్లు పునఃసమీక్ష చేయవచ్చు. అయితే, ఆ సమాచారం మనకు ఎందుకు, ఎలా విలువైనదో గ్రహించేందుకు ప్రేక్షకులకు సహాయపడాలన్నదే దాని ముఖ్య ఉద్దేశం. తర్వాత పాఠశాల పైవిచారణకర్త విద్యార్థులను వారి వారి తరగతి గదులకు పంపిస్తాడు.
అసైన్మెంట్ నం. 2: 5 నిమిషాలు. ఇది నియమిత బైబిలు భాగాన్ని చదివే భాగము, దీన్ని ఒక సహోదరుడు చదవాలి, అది ముఖ్య పాఠశాలలో అయినా లేదా, రెండవ పాఠశాలలో అయినా సరే. విద్యార్థి ప్రారంభ ముగింపు మాటల్లో క్లుప్తమైన వివరణాత్మకమైన సమాచారాన్ని అందించేందుకు వీలయ్యేలా, చదవవలసిన ఈ నియమిత భాగాలు సాధారణంగా చిన్నగా ఉంటాయ. చారిత్రక నేపథ్యం ఏమిటి, ప్రవచనార్థక లేదా సిద్ధాంతపరమైన ప్రాముఖ్యత ఏమిటి, సూత్రాలను ఎలా అన్వయించుకోవాలి వంటి వాటిని చేర్చవచ్చు. నియమిత వచనాలను అన్నింటిని ఆపకుండా, మధ్యలో ఆగి వివరించకుండా చదవాలి. అయతే, చదవడానికి నియమించిన భాగం కొన్ని వచనాల తర్వాత మధ్యలో ఆగిపోయి మరో వచనంనుండి కొనసాగేటట్లయితే, అలా కొనసాగేది ఎన్నో వచనం నుండో విద్యార్థి పేర్కొనాలి.
అసైన్మెంట్ నం. 3: 5 నిమిషాలు. ఇది సహోదరీలకు నియమించబడుతుంది. ఈ అందింపు అంశం నా బైబిలు కథల పుస్తకం మీద ఆధారపడి ఉంటుంది. సన్నివేశం అనియత సాక్ష్యమో, పునర్దర్శనమో, ఒక గృహ బైబిలు అధ్యయనమో కావచ్చు. పాల్గొనేవారు కూర్చోవడమో, నిల్చోవడమో చేయవచ్చు. పాఠశాల పైవిచారణకర్త ముఖ్యంగా, విద్యార్థిని తనకు నియమించబడిన ముఖ్యాంశాన్ని ఎలా విశదీకరిస్తుంది, లేఖనాలపై తర్కించుకోవడానికి గృహస్థురాలికెలా సహాయపడుతుంది అనే వాటిపై శ్రద్ధ వహిస్తాడు. ఈ భాగానికి నియమించబడే విద్యార్థినికి చదవడం వచ్చి ఉండాలి. పాఠశాల పైవిచారణకర్త ఒక సహాయకురాలిని నియమిస్తాడు, అయతే మరొక సహాయకురాలిని కూడా తీసుకోవచ్చు. సన్నివేశానికి కాదుగాని బైబిలును సమర్థవంతంగా ఉపయోగించేందుకే ప్రాముఖ్యతనివ్వాలి.
అసైన్మెంట్ నం. 4: 5 నిమిషాలు. ఇది, జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి మీద ఆధారపడి ఉంటుంది. అసైన్మెంట్ నం. 4 ఒక సహోదరునికి గానీ సహోదరికి గానీ నియమించబడుతుంది. ఒక సహోదరుడికి నియమించబడినప్పుడు, దీన్ని ఒక ప్రసంగంగానే ఇవ్వాలి. సహోదరికి నియమించబడినప్పుడు, అసైన్మెంట్ నం. 3కి ఇవ్వబడిన నిర్దేశాల అనుసారంగా చేయాలి.
చదవవలసిన బైబిలు భాగపు పట్టిక: ప్రతివారం చదవవలసిన బైబిలు భాగపు పట్టికను అనుసరించమని సంఘంలోని ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తున్నాం. ఈ పట్టిక ప్రకారం రోజుకు దాదాపు ఒక పేజీ చదవవలసి ఉంటుంది.
గమనిక: సలహా, సమయం, వ్రాతపూర్వక పునఃసమీక్షలు, అసైన్మెంట్ల కోసం సిద్ధపడడం వంటి వాటిని గూర్చిన అదనపు సమాచారం కోసం నిర్దేశం కోసం దయచేసి అక్టోబరు 1996 మన రాజ్య పరిచర్య 3వ పేజీ చూడండి.
పట్టిక
జన. 7 చదవవలసిన బైబిలు భాగం: ప్రసంగి 1-6
పాట నం. 2 (15)
నం. 1: మీరు సంతోషకరమైన భవిష్యత్తును కలిగివుండవచ్చు! ( kl 6-11 పేజీలు)
నం. 2: ప్రసంగి 4:1-16
నం. 3: సృష్టి—దేవుని అద్భుతమైన పని! ( my 1వ అధ్యాయం)
నం. 4: జన్మదిన వేడుకలో హత్య ( gt 51వ అధ్యాయం)
జన. 14 చదవవలసిన బైబిలు భాగం: ప్రసంగి 7-12
పాట నం. 5 (46)
నం. 1: దేవుని గూర్చిన జ్ఞానాన్ని బయల్పర్చే పుస్తకము—1వ భాగము ( kl 12-17 పేజీలు 1-15 పేరాలు)
నం. 2: ప్రసంగి 8:1-17
నం. 3: మన భూమిపట్ల దేవునికి ఉన్న ఆది సంకల్పం ఏమిటి? ( my 2వ అధ్యాయం)
నం. 4: యేసు అద్భుతరీతిగా వేలాదిమందికి ఆహారం పెట్టడం ( gt 52వ అధ్యాయం)
జన. 21 చదవవలసిన బైబిలు భాగం: పరమగీతము 1-8
పాట నం. 5 (46)
నం. 1: దేవుని గూర్చిన జ్ఞానాన్ని బయల్పర్చే పుస్తకము—2వ భాగము ( kl 17-22 పేజీలు 16-23 పేరాలు)
నం. 2: పరమగీతము 5:1-16
నం. 3: మొదటి వివాహాన్ని యెహోవా జరిపించాడా? ( my 3వ అధ్యాయం)
నం. 4: కోరదగిన మానవాతీత పరిపాలకుడు ( gt 53వ అధ్యాయం)
జన. 28 చదవవలసిన బైబిలు భాగం: యెషయా 1-6
పాట నం. 6 (45)
నం. 1: సత్య దేవుడెవరు? ( kl 23-31 పేజీలు)
నం. 2: యెషయా 2:1-17
నం. 3: మనం జీవితంలో ఎల్లప్పుడూ దేవునికి విధేయులుగా ఎందుకుండాలి? ( my 4వ అధ్యాయం)
నం. 4: “పరలోకమునుండి వచ్చిన నిజమైన ఆహారము” ( gt 54వ అధ్యాయం)
ఫిబ్ర. 4 చదవవలసిన బైబిలు భాగం: యెషయా 7-11
పాట నం. 23 (200)
నం. 1: మనకు యెహోవా సంస్థ అగత్యం (w00 1/1 30-1 పేజీలు)
నం. 2: యెషయా 8:1-22
నం. 3: దేవుని నిర్దేశానికి ఉద్దేశపూర్వకంగా అవిధేయత చూపినందుకు పర్యవసానం ( my 5వ అధ్యాయం)
నం. 4: అనేకమంది శిష్యులు యేసును వెంబడించడం మానుకుంటారు ( gt 55వ అధ్యాయం)
ఫిబ్ర. 11 చదవవలసిన బైబిలు భాగం: యెషయా 12-19
పాట నం. 9 (37)
నం. 1: మిమ్మల్ని మీరు ఎలా దృష్టించుకుంటారు? (w00 1/15 20-2 పేజీలు)
నం. 2: యెషయా 17:1-14
నం. 3: అసూయకు తావివ్వకండి ( my 6వ అధ్యాయం)
నం. 4: మనుష్యుడ్ని అపవిత్రపరిచేది ఏమిటి? ( gt 56వ అధ్యాయం)
ఫిబ్ర. 18 చదవవలసిన బైబిలు భాగం: యెషయా 20-26
పాట నం. 11 (85)
నం. 1: యెహోవాతో సాన్నిహిత్యాన్ని పెంచుకోండి (w00 1/15 23-6 పేజీలు)
నం. 2: యెషయా 22:1-19
నం. 3: యెహోవాతో కలిసి నడవడం ( my 7వ అధ్యాయం)
నం. 4: బాధపడేవారిపై కరుణచూపడం ( gt 57వ అధ్యాయం)
ఫిబ్ర. 25 చదవవలసిన బైబిలు భాగం: యెషయా 27-31
పాట నం. 21 (191)
నం. 1: హింసకుడు గొప్ప వెలుగును చూశాడు (w00 1/15 27-9 పేజీలు)
నం. 2: యెషయా 29:1-14
నం. 3: దౌర్జన్యం చేసేవారిని దేవుడు దృష్టించినట్లే మీరూ దృష్టిస్తారా? ( my 8వ అధ్యాయం)
నం. 4: రొట్టెలు మరియు పులిసిన పిండి ( gt 58వ అధ్యాయం)
మార్చి 4 చదవవలసిన బైబిలు భాగం: యెషయా 32-37
పాట నం. 16 (143)
నం. 1: పట్టుదల ద్వారా సాఫల్యం (w00 2/1 4-6 పేజీలు)
నం. 2: యెషయా 33:1-16
నం. 3: దేవుని నియమాలను సంపూర్ణంగా అనుసరించడంవల్ల వచ్చే బహుమతులు ( my 9వ అధ్యాయం)
నం. 4: నిజానికి యేసు ఎవరు? ( gt 59వ అధ్యాయం)
మార్చి 11 చదవవలసిన బైబిలు భాగం: యెషయా 38-42
పాట నం. 21 (191)
నం. 1: ఒక తల్లి ఇచ్చిన జ్ఞానయుక్తమైన ఉపదేశం (w00 2/1 30-1 పేజీలు)
నం. 2: యెషయా 42:1-16
నం. 3: జీవాన్ని కాపాడుకోవడానికి విధేయత చాలా ప్రాముఖ్యం ( my 10వ అధ్యాయం)
నం. 4: క్రీస్తురాజ్యపు మహిమయొక్క పూర్వప్రదర్శన ( gt 60వ అధ్యాయం)
మార్చి 18 చదవవలసిన బైబిలు భాగం: యెషయా 43-47
పాట నం. 29 (222)
నం. 1: ప్రమాదప్రాంతం నుండి దూరంగా ఉండండి! (w00 2/15 4-7 పేజీలు)
నం. 2: యెషయా 44:6-20
నం. 3: మానవజాతిపై దేవునికి శ్రద్ధ ఉందన్న హామీ ( my 11వ అధ్యాయం)
నం. 4: దయ్యముపట్టిన బాలుడు స్వస్థపరచబడ్డాడు ( gt 61వ అధ్యాయం)
మార్చి 25 చదవవలసిన బైబిలు భాగం: యెషయా 48-52
పాట నం. 6 (45)
నం. 1: ప్రార్థనా శక్తి (w00 3/1 3-4 పేజీలు)
నం. 2: యెషయా 49:1-13
నం. 3: మానవుడు దేవుని నుండి స్వతంత్రంగా ఉంటూ చూపించే శక్తి సామర్థ్యాలు ఆయన ఆగ్రహాన్నే కొనితెస్తాయి ( my 12వ అధ్యాయం)
నం. 4: వినయమును గూర్చి ఒక పాఠము ( gt 62వ అధ్యాయం)
ఏప్రి. 1 చదవవలసిన బైబిలు భాగం: యెషయా 53-59
పాట నం. 23 (200)
నం. 1: సిద్ధపడిన హృదయంతో యెహోవా కోసం వెదకడం (w00 3/1 29-31 పేజీలు)
నం. 2: యెషయా 54:1-17
నం. 3: నియామకాలను హృదయపూర్వకంగా స్వీకరించండి ( my 13వ అధ్యాయం)
నం. 4: ఇంకను ఇవ్వబడిన దిద్దుబాటు హెచ్చరిక ( gt 63వ అధ్యాయం)
ఏప్రి. 8 చదవవలసిన బైబిలు భాగం: యెషయా 60-6
పాట నం. 8 (53)
నం. 1: యేసుక్రీస్తు—దేవుని గూర్చిన జ్ఞానానికి కీలకము ( kl 32-42 పేజీలు)
నం. 2: యెషయా 61:1-11
నం. 3: జీవితంలో విజయం సాధించడానికి ప్రధానమైనది దృఢమైన విశ్వాసం ( my 14వ అధ్యాయం)
నం. 4: క్షమించడం గురించి ఒక పాఠం ( gt 64వ అధ్యాయం)
ఏప్రి. 15 చదవవలసిన బైబిలు భాగం: యిర్మీయా 1-4
పాట నం. 9 (37)
నం. 1: ఎవరి ఆరాధనను దేవుడు అంగీకరిస్తాడు? ( kl 43-52 పేజీలు)
నం. 2: యిర్మీయా 2:4-19
నం. 3: నిజమైన విలువ గలదేదీ ఈ పాత విధానము ఇవ్వలేదు ( my 15వ అధ్యాయం)
నం. 4: రహస్యముగా యెరూషలేమును పర్యటించడం ( gt 65వ అధ్యాయం)
ఏప్రి. 22 చదవవలసిన బైబిలు భాగం: యిర్మీయా 5-8
పాట నం. 28 (224)
నం. 1: మానవజాతికి ఒక సహాయకుడు ఎందుకు అవసరం? (w00 3/15 3-4 పేజీలు)
నం. 2: యిర్మీయా 7:1-20
నం. 3: వివాహ భాగస్వామిని ఎంపిక చేసుకోవడంలో దైవిక మార్గదర్శకాన్ని అనుసరించండి ( my 16వ అధ్యాయం)
నం. 4: పర్ణశాలల పండుగలో ( gt 66వ అధ్యాయం)
ఏప్రి. 29 వ్రాతపూర్వక పునఃసమీక్ష. చదవవలసిన బైబిలు భాగం: యిర్మీయా 9-13
పాట నం. 5 (46)
మే 6 చదవవలసిన బైబిలు భాగం: యిర్మీయా 14-18
పాట నం. 28 (224)
నం. 1: యేసుక్రీస్తు మనకెలా సహాయం చేయగలడు? (w00 3/15 5-9 పేజీలు)
నం. 2: యిర్మీయా 17:1-18
నం. 3: పవిత్ర విషయాలను మనం ఉన్నతంగా ఎంచుతున్నామా లేదా అన్నది మనం తీసుకునే నిర్ణయాలు వ్యక్తం చేస్తాయి ( my 17వ అధ్యాయం)
నం. 4: ఆయనను వారు బంధించలేక పోయారు ( gt 67వ అధ్యాయం)
మే 13 చదవవలసిన బైబిలు భాగం: యిర్మీయా 19-23
పాట నం. 7 (51)
నం. 1: వినయం—శాంతిని నెలకొల్పే ఒక లక్షణం (w00 3/15 21-4 పేజీలు)
నం. 2: యిర్మీయా 19:1-15
నం. 3: “ప్రభువునందు మాత్రమే పెండ్లి చేసుకొనవలెను” ( my 18వ అధ్యాయం)
నం. 4: ఏడవ దినమున ఇంకా బోధించడం ( gt 68వ అధ్యాయం)
మే 20 చదవవలసిన బైబిలు భాగం: యిర్మీయా 24-28
పాట నం. 26 (212)
నం. 1: దిద్దుబాటును స్వీకరించిన మాదిరికరమైన వ్యక్తి (w00 3/15 25-8 పేజీలు)
నం. 2: యిర్మీయా 25:1-14
నం. 3: బలమైన ఆధ్యాత్మిక కుటుంబాన్ని నిర్మించుకోవడం ( my 19వ అధ్యాయం)
నం. 4: పితృత్వమును గూర్చిన ప్రశ్న ( gt 69వ అధ్యాయం)
మే 27 చదవవలసిన బైబిలు భాగం: యిర్మీయా 29-31
పాట నం. 21 (191)
నం. 1: దేవుని ఆత్మ ఈనాడు ఎలా పనిచేస్తుంది? (w00 4/1 8-11 పేజీలు)
నం. 2: యిర్మీయా 30:1-16
నం. 3: చెడు సహవాసం విషాదానికి నడిపించగలదు ( my 20వ అధ్యాయం)
నం. 4: పుట్టు గ్రుడ్డియైన ఒక మనుష్యుడ్ని స్వస్థపరచడం ( gt 70వ అధ్యాయం)
జూన్ 3 చదవవలసిన బైబిలు భాగం: యిర్మీయా 32-35
పాట నం. 11 (85)
నం. 1: యెహోవా బలాన్ని బట్టి ఓదార్పును పొందండి (w00 4/15 4-7 పేజీలు)
నం. 2: యిర్మీయా 34:1-16
నం. 3: అసూయ పాప కార్యములను చేసేలా చేస్తుంది ( my 21వ అధ్యాయం))
నం. 4: పరిసయ్యుల బుద్ధిపూర్వక అపనమ్మకము ( gt 71వ అధ్యాయం)
జూన్ 10 చదవవలసిన బైబిలు భాగం: యిర్మీయా 36-40
పాట నం. 13 (124)
నం. 1: దౌర్జన్యం చేసేవారిని దేవుడు దృష్టించినట్లే మీరూ దృష్టిస్తారా? (w00 4/15 26-9 పేజీలు)
నం. 2: యిర్మీయా 37:1-17
నం. 3: జీవితంలోని బాధకరమైన పరిస్థితులను నిరాశచెందకుండా అంగీకరించండి ( my 22వ అధ్యాయం)
నం. 4: యేసు 70 మందిని పంపడం ( gt 72వ అధ్యాయం)
జూన్ 17 చదవవలసిన బైబిలు భాగం: యిర్మీయా 41-45
పాట నం. 3 (32)
నం. 1: “నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము” (w00 5/15 20-4 పేజీలు)
నం. 2: యిర్మీయా 41:1-15
నం. 3: మన సామర్థ్యాల ఘనతను యెహోవాకు ఆపాదించండి ( my 23వ అధ్యాయం)
నం. 4: పొరుగువాడైన సమరయుడు ( gt 73వ అధ్యాయం)
జూన్ 24 చదవవలసిన బైబిలు భాగం: యిర్మీయా 46-49
పాట నం. 2 (15)
నం. 1: పరిపూర్ణ జీవితం కేవలమొక కల కాదు! (w00 6/15 5-7 పేజీలు)
నం. 2: యిర్మీయా 49:1-13
నం. 3: ప్రేమ ద్వేషాన్ని జయిస్తుంది ( my 24వ అధ్యాయం)
నం. 4: మార్తకు సలహా, ప్రార్థన గురించి ఉపదేశము ( gt 74వ అధ్యాయం)
జూలై 1 చదవవలసిన బైబిలు భాగం: యిర్మీయా 50-52
పాట నం. 24 (185)
నం. 1: మనమెందుకు వృద్ధులమై మరణిస్తున్నాము? ( kl 53-61 పేజీలు)
నం. 2: యిర్మీయా 50:1-16
నం. 3: పశ్చాత్తాపం చూపే తప్పిదస్థులు దేవుని కృపను పొందగలరు ( my 25వ అధ్యాయం)
నం. 4: ధన్యతకు మూలము ( gt 75వ అధ్యాయం)
జూలై 8 చదవవలసిన బైబిలు భాగం: విలాపవాక్యవలు 1-2
పాట నం. 6 (45)
నం. 1: మానవజాతిని రక్షించడానికి దేవుడేమి చేశాడు? ( kl 62-69 పేజీలు)
నం. 2: విలాపవాక్యములు 1:1-14
నం. 3: దృఢమైన యథార్థత దేవుని కృపను తెస్తుంది ( my 26వ అధ్యాయం)
నం. 4: పరిసయ్యునితో కలిసి భోజనము చేయుట ( gt 76వ అధ్యాయం)
జూలై 15 చదవవలసిన బైబిలు భాగం: విలాపవాక్యవలు 3-5
పాట నం. 29 (222)
నం. 1: దేవుడెందుకు బాధను అనుమతిస్తున్నాడు? ( kl 70-79 పేజీలు)
నం. 2: విలాపవాక్యములు 3:1-30
నం. 3: విశ్వాసంతో కూడిన మన చర్యలను దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు ( my 27వ అధ్యాయం)
నం. 4: పిత్రార్జితమును గూర్చిన ప్రశ్న ( gt 77వ అధ్యాయం)
జూలై 22 చదవవలసిన బైబిలు భాగం: యెహెలు 1-6
పాట నం. 24 (185)
నం. 1: మరణించిన మన ప్రియమైనవారికి ఏమి సంభవిస్తుంది? ( kl 80-89 పేజీలు)
నం. 2: యెహెజ్కేలు 4:1-17
నం. 3: యెహోవా గొప్ప విమోచకుడు, తన సంకల్పములను నెరవేర్చువాడు ( my 28వ అధ్యాయం)
నం. 4: సిద్ధముగా ఉండండి! ( gt 78వ అధ్యాయం)
జూలై 29 చదవవలసిన బైబిలు భాగం: యెహెలు 7-12
పాట నం. 27 (221)
నం. 1: మంచి మాదిరుల నుండి ప్రయోజనం పొందండి (w00 7/1 19-21 పేజీలు)
నం. 2: యెహెజ్కేలు 10:1-19
నం. 3: దేవునిపట్ల యథార్థంగా ఉంటూ మీ సహోదరులను ప్రేమించండి ( my 29వ అధ్యాయం)
నం. 4: అందరూ కాదుగాని ఒక జనాంగమే తప్పిపోయింది ( gt 79వ అధ్యాయం)
ఆగ. 5 చదవవలసిన బైబిలు భాగం: యెహెలు 13-16
పాట నం. 7 (51)
నం. 1: అనైతిక లోకంలో మీరు పవిత్రంగా ఉండగలరు (w00 7/15 28-31 పేజీలు)
నం. 2: యెహెజ్కేలు 13:1-16
నం. 3: యెహోవా శిక్షణను గ్రహించండి ( my 30వ అధ్యాయం)
నం. 4: గొర్రెల దొడ్లు, గొర్రెల కాపరి ( gt 80వ అధ్యాయం)
ఆగ. 12 చదవవలసిన బైబిలు భాగం: యెహెలు 17-20
పాట నం. 13 (124)
నం. 1: అధికారాన్ని ఎందుకు గౌరవించాలి? (w00 8/1 4-7 పేజీలు)
నం. 2: యెహెజ్కేలు 17:1-18
నం. 3: యెహోవా నామాన్ని ధైర్యంగా సమర్థించండి ( my 31వ అధ్యాయం)
నం. 4: యేసును హత్యచేయడానికి చేసిన ఇతర ప్రయత్నాలు ( gt 81వ అధ్యాయం)
ఆగ. 19 చదవవలసిన బైబిలు భాగం: యెహెలు 21-23
పాట నం. 23 (200)
నం. 1: మీరు విభేదాల్ని ఎలా పరిష్కరించుకుంటారు? (w00 8/15 23-5 పేజీలు)
నం. 2: యెహెజ్కేలు 22:1-16
నం. 3: యెహోవా తన మాట నెరవేర్చడంలో ఎన్నడూ తప్పిపోడు ( my 32వ అధ్యాయం)
నం. 4: యేసు మళ్ళీ యెరూషలేముకు వెళ్ళడం ( gt 82వ అధ్యాయం)
ఆగ. 26 వ్రాతపూర్వక పునఃసమీక్ష. చదవవలసిన బైబిలు భాగం: యెహెలు 24-28
పాట నం. 15 (127)
సెప్టెం. 2 చదవవలసిన బైబిలు భాగం: యెహెలు 29-32
పాట నం. 5 (46)
నం. 1: స్వయంత్యాగం ఎందుకు? (w00 9/15 21-4 పేజీలు)
నం. 2: యెహెజ్కేలు 30:1-19
నం. 3: ‘యెహోవా తన ప్రజల కోసం పోరాడుతాడు’ ( my 33వ అధ్యాయం)
నం. 4: పరిసయ్యుడు ఆతిథ్యమివ్వడం ( gt 83వ అధ్యాయం)
సెప్టెం. 9 చదవవలసిన బైబిలు భాగం: యెహెలు 33-36
పాట నం. 6 (45)
నం. 1: మీరు దేవునికెలా దగ్గర కాగలరు (w00 10/15 4-7 పేజీలు)
నం. 2: యెహెజ్కేలు 33:1-16
నం. 3: ‘సేవకుని తరగతి’ నుండి లభిస్తున్న ఆధ్యాత్మిక ఆహారాన్ని తేలికగా తీసుకోకండి ( my 34వ అధ్యాయం)
నం. 4: శిష్యత్వముయొక్క బాధ్యత ( gt 84వ అధ్యాయం)
సెప్టెం. 16 చదవవలసిన బైబిలు భాగం: యెహెలు 37-40
పాట నం. 9 (37)
నం. 1: మీరు విజయాన్ని ఎలా కొలుస్తారు? (w00 11/1 18-21 పేజీలు)
నం. 2: యెహెజ్కేలు 39:1-16
నం. 3: దేవుని ధర్మశాస్త్రంలోని ప్రధానమైన సూత్రాలపై శ్రద్ధ వహించండి ( my 35వ అధ్యాయం)
నం. 4: తప్పిపోయిన దానిని వెదకడం ( gt 85వ అధ్యాయం)
సెప్టెం. 23 చదవవలసిన బైబిలు భాగం: యెహెలు 41-45
పాట నం. 12 (113)
నం. 1: సిద్ధ మనస్సుతో దేవుణ్ణి సేవించండి (w00 11/15 21-3 పేజీలు)
నం. 2: యెహెజ్కేలు 42:1-20
నం. 3: విగ్రహారాధనను యెహోవా సహించడు ( my 36వ అధ్యాయం)
నం. 4: తప్పిపోయిన కుమారుని కథ ( gt 86వ అధ్యాయం)
సెప్టెం. 30 చదవవలసిన బైబిలు భాగం: యెహెలు 46-48
పాట నం. 11 (85)
నం. 1: దేవుని రాజ్యం పరిపాలిస్తుంది ( kl 90-97 పేజీలు)
నం. 2: యెహెజ్కేలు 46:1-15
నం. 3: మీకున్న విలువైన వాటితో యెహోవాను గౌరవించండి ( my 37వ అధ్యాయం)
నం. 4: అభ్యాససిద్ధమైన జ్ఞానముతో భవిష్యత్తు కోసం సమకూర్చుకోవడం ( gt 87వ అధ్యాయం)
అక్టో. 7 చదవవలసిన బైబిలు భాగం: దానిలు 1-4
పాట నం. 21 (191)
నం. 1: ఇవి అంత్యదినాలు! ( kl 98-107 పేజీలు)
నం. 2: దానియేలు1:1-17
నం. 3: ఆశావాదంతో ఉంటూ, ఇతరుల మనస్సుల్లో దృఢవిశ్వాసాన్ని కలిగించండి ( my 38వ అధ్యాయం)
నం. 4: ధనవంతుడు మరియు లాజరు ( gt 88వ అధ్యాయం)
అక్టో. 14 చదవవలసిన బైబిలు భాగం: దానిలు 5-8
పాట నం. 12 (113)
నం. 1: నిపుణులు చెప్పేది ఎల్లప్పుడూ నమ్మాలా? (w00 12/1 29-31 పేజీలు)
నం. 2: దానియేలు 5:1-16
నం. 3: అధ్యక్షత వహిస్తున్న వారిపట్ల యథార్థవంతులై ఉండండి ( my 39వ అధ్యాయం)
నం. 4: యూదయకు కనికరముతోకూడిన ప్రయాణం ( gt 89వ అధ్యాయం)
అక్టో. 21 చదవవలసిన బైబిలు భాగం: దానిలు 9-12
పాట నం. 4 (43)
నం. 1: దుష్టాత్మలను ఎదిరించండి ( kl 108-117 పేజీలు)
నం. 2: దానియేలు10:1-21
నం. 3: నమ్రతను నేర్చుకొని నాశనాన్ని తప్పించుకోండి ( my 40వ అధ్యాయం)
నం. 4: పునరుత్థాన నిరీక్షణ ( gt 90వ అధ్యాయం)
అక్టో. 28 చదవవలసిన బైబిలు భాగం: హోషేయ 1-14
పాట నం. 9 (37)
నం. 1: దైవభక్తిగల జీవితాన్ని గడపడం ఎందుకు సంతోషాన్ని తెస్తుంది?—1వ భాగము ( kl 118-123 పేజీలు 1-13 పేరాలు)
నం. 2: హోషేయ 4:1-19
నం. 3: విమోచన క్రయధనం మీద విశ్వాసం కలిగివుండండి ( my 41వ అధ్యాయం)
నం. 4: లాజరు పునరుత్థానము చేయబడినప్పుడు ( gt 91వ అధ్యాయం)
నవం. 4 చదవవలసిన బైబిలు భాగం: యోవేలు 1-3
పాట నం. 29 (222)
నం. 1: దైవభక్తిగల జీవితాన్ని గడపడం ఎందుకు సంతోషాన్ని తెస్తుంది?—2వ భాగము ( kl 123-129 పేజీలు 14-23 పేరాలు)
నం. 2: యోవేలు 1:1-20
నం. 3: మనం చెడు మార్గంలో నడిచేలా దురాశ మనల్ని అంధుల్ని చేస్తుంది ( my 42వ అధ్యాయం)
నం. 4: యెరూషలేముకు యేసు చేసిన చివరి పర్యటనలో పదిమంది కుష్టరోగులు స్వస్థతపొందడం ( gt 92వ అధ్యాయం)
నవం. 11 చదవవలసిన బైబిలు భాగం: ఆమోసు 1-9
పాట నం. 7 (51)
నం. 1: మీరు ఎవరి అధికారాన్ని గుర్తించాలి? ( kl 130-139 పేజీలు)
నం. 2: ఆమోసు 1:1-15
నం. 3: దైవపరిపాలక ఏర్పాటును వినయంతో గౌరవించండి ( my 43వ అధ్యాయం)
నం. 4: మనుష్య కుమారుడు బయలుపరచబడినప్పుడు ( gt 93వ అధ్యాయం)
నవం. 18 చదవవలసిన బైబిలు భాగం: ఓబద్యా 1–యోనా 4
పాట నం. 14 (117)
నం. 1: దేవుణ్ణి ఘనపరిచే కుటుంబాన్ని నిర్మించుకోవడం—1వ భాగము ( kl 140-144 పేజీలు 1-14 పేరాలు)
నం. 2: ఓబద్యా 1:1-16
నం. 3: క్రియల్లేని విశ్వాసం నిర్జీవమైనది ( my 44వ అధ్యాయం)
నం. 4: మనుష్య కుమారుడు బయలుపరచబడినప్పుడు ( gt 94వ అధ్యాయం)
నవం. 25 చదవవలసిన బైబిలు భాగం: మీకా 1-7
పాట నం. 19 (164)
నం. 1: దేవుణ్ణి ఘనపరిచే కుటుంబాన్ని నిర్మించుకోవడం—2వ భాగము ( kl 145-149 పేజీలు 15-23 పేరాలు)
నం. 2: మీకా 1:1-16
నం. 3: యెహోవా వాగ్దానాలను ఏ మాత్రం సందేహించకండి ( my 45వ అధ్యాయం)
నం. 4: విడాకులు మరియు పిల్లల మీది ప్రేమను గూర్చిన పాఠాలు ( gt 95వ అధ్యాయం)
డిసెం. 2 చదవవలసిన బైబిలు భాగం: నహూము 1–హబక్కూకు 3
పాట నం. 22 (130)
నం. 1: మీరెలా దేవునికి సన్నిహితులు కాగలరు ( kl 150-159 పేజీలు)
నం. 2: నహూము 3:1-19
నం. 3: విజయం యెహోవాకు చెందుతుంది ( my 46వ అధ్యాయం)
నం. 4: యేసు మరియు ధనవంతుడైన ఒక యువ అధికారి ( gt 96వ అధ్యాయం)
డిసెం. 9 చదవవలసిన బైబిలు భాగం: జెఫన్యా 1–హగ్గయి 2
పాట నం. 23 (200)
నం. 1: దేవుని ప్రజల మధ్య భద్రతను కనుగొనండి ( kl 160-169 పేజీలు)
నం. 2: జెఫన్యా 2:1-15
నం. 3: దురాశ మరియు దొంగతనం విపత్కరమైన పర్యవసానాలను తెస్తాయి ( my 47వ అధ్యాయం)
నం. 4: ద్రాక్షతోటలోని పనివారు ( gt 97వ అధ్యాయం)
డిసెం. 16 చదవవలసిన బైబిలు భాగం: జెకర్యా 1-8
పాట నం. 22 (130)
నం. 1: దేవుణ్ణి నిరంతరం సేవించడమే మీ లక్ష్యంగా చేసుకోండి ( kl 170-180 పేజీలు)
నం. 2: జెకర్యా 6:1-15
నం. 3: శాంతిని అన్వేషించేవారిని యెహోవా ఆశీర్వదిస్తాడు ( my 48వ అధ్యాయం)
నం. 4: యేసు మరణము సమీపిస్తుండగా శిష్యులు వాదించుకోవడం ( gt 98వ అధ్యాయం)
డిసెం. 23 చదవవలసిన బైబిలు భాగం: జెకర్యా 9-14
పాట నం. 17 (187)
నం. 1: భూమి దేవుని గూర్చిన జ్ఞానముతో నిండివుండే కాలం ( kl 181-191 పేజీలు)
నం. 2: జెకర్యా 9:1-17
నం. 3: ప్రార్థనా శక్తిని తక్కువగా అంచనా వేయకండి ( my 49వ అధ్యాయం)
నం. 4: యేసు యెరికోలో ప్రకటించడం ( gt 99వ అధ్యాయం)
డిసెం. 30 వ్రాతపూర్వక పునఃసమీక్ష. చదవవలసిన బైబిలు భాగం: మలాకీ 1-4
పాట నం. 20 (93)