దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
మే 7 నుండి ఆగస్టు 20, 2001 మధ్య వారాల్లో జరిగిన దైవపరిపాలనా పరిచర్య పాఠశాల నియామకాల సమాచారంపై పుస్తకాలు మూసి చేసే పునఃసమీక్ష. కేటాయించబడిన సమయంలోనే మీరు వ్రాయగలిగినన్ని ప్రశ్నలకు జవాబులు వ్రాసేందుకు వేరే పేపరును ఉపయోగించండి.
[గమనిక: వ్రాతపూర్వక పునఃసమీక్ష సమయంలో ఏ ప్రశ్నలకు సమాధానమివ్వడానికైనా కేవలం బైబిలును మాత్రమే ఉపయోగించాలి. ప్రశ్నల ప్రక్కనున్న రెఫరెన్సులు మీ వ్యక్తిగత పరిశోధన కోసం ఇవ్వబడ్డాయి. కావలికోట రెఫరెన్సులున్న ప్రతిచోట పేజీ నెంబర్లు, పేరా నెంబర్లు ఉండకపోవచ్చు.]
ఈ క్రింది వాక్యాలు సత్యమో, అసత్యమో వ్రాయండి:
1. నెహెమ్యా 2:4లో పేర్కొన్న ప్రార్థన నిరాశతో చివరి నిమిషంలో చేసిన ప్రార్థనల్లో ఒకటి. [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w86 2/15 25వ పేజీ, 8వ పేరా చూడండి.]
2. “సంఘం” అనే పదం ఎక్లీసియా అనే గ్రీకు పదం నుండి అనువదించబడింది, ఏకీభావం, పరస్పర సహకారం అనే తలంపులు ఆ పదంలో చేరి ఉన్నాయి. [w99 5/15 25వ పేజీ, 4వ పేరా]
3. తన తండ్రి నామమును మహిమపరచి, మానవ రుగ్మతలనన్నింటిని శాశ్వతముగా తీసివేసే దేవుని రాజ్యమునుగూర్చి ప్రకటించడానికే యేసు ప్రత్యేకముగా ఈ భూమి మీదికి వచ్చాడు. [gt 24]
4. యోబు కాలంలో జీవించినవారిలోకెల్లా యెహోవా పట్ల యథార్థంగా ఉన్నది ఆయనొక్కడే. (యోబు 1:8) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w92 8/1 31వ పేజీ, 3-4 పేరాలు చూడండి.]
5. సౌలు లేక పౌలు డేరాలు కుట్టడం ద్వారా తననుతాను పోషించుకున్నాడనే విషయం, ఆయన సామాన్యమైన నేపథ్యం నుండి వచ్చాడని సూచిస్తోంది. (అపొ. 18:2, 3) [w99 5/15 30వ పేజీ, 2వ పేరా–31వ పేజీ 1వ పేరా]
6. పశ్చాత్తాపపడిన దావీదు యొక్క మెరుగైన లక్షణాలపైనే యెహోవా మనస్సు నిలిపాడు కాబట్టే, దావీదు గంభీరమైన తప్పిదాలు చేసినప్పటికీ ఆయన గురించి, “మనఃపూర్తిగా నన్ను అనుసరించి[న] నా సేవకు[డు]” అని చెప్పగలిగాడు. (1 రాజు. 14:8) [w99 6/15 11వ పేజీ, 4వ పేరా]
7. మనం వాగ్దానం చేసింది లేఖన విరుద్ధం కానంత వరకు, ఆ వాగ్దానాలు నెరవేర్చడం కష్టమని అటుతర్వాత తెలిసినప్పటికీ మనం చేయగలిగినంత వరకు చేయాలి. (కీర్త. 15:4) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w89 9/15 28వ పేజీ, 5వ పేరా చూడండి.]
8. కీర్తన 22:1, ఒత్తిడికి లోనయిన దావీదు తాత్కాలికంగా తన విశ్వాసాన్ని కోల్పోయాడని సూచిస్తోంది. [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w86 8/15 20వ పేజీ, 19వ పేరా.]
9. ఒక క్రైస్తవుడు కొన్ని సందర్భాల్లో నిరాశా నిస్పృహల్లో, చట్టబద్ధమైన లేక ఆర్థికపరమైన విపత్తుల్లో “పడినను,” దేవుని ఆత్మ సహాయంతో, ప్రేమగల ఆరాధకుల సహాయంతో ఆయన ఆధ్యాత్మికంగా పూర్తిగా “లేవలేక యుండడు.” (కీర్త. 37:23, 24) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w86 11/1 30వ పేజీ, 14వ పేరా చూడండి.]
10. “ఈయన జగడమాడడు, కేకలు వేయడు వీధులలో ఈయన శబ్దమెవనికిని వినబడదు” అన్న మాటలకు, యేసు బిగ్గరగా లేక గొంతెత్తి బహిరంగంగా ప్రకటించడు అని భావం. (మత్త. 12:19) [gt 33]
క్రింది ప్రశ్నలకు సమాధానమివ్వండి:
11. ఎజ్రా, ఆయన సహచరులు ధర్మశాస్త్రముకు ఎలా ‘అర్థం చెప్పారు’? (నెహె. 8:8) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w86 2/15 26వ పేజీ, 4వ పేరా చూడండి.]
12. ‘యెహోవాయందు ఆనందం’ ఎలా పొందుతాము? (నెహె. 8:10) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w86 2/15 26వ పేజీ, 9వ పేరా చూడండి.]
13. “యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పు కొనిన”వారు ఎందుకు దీవించబడ్డారు? (నెహె. 11:1-2) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w86 2/15 26వ పేజీ, 12వ పేరా చూడండి.]
14. నిర్దిష్టమైన తన ఉద్దేశాన్ని రాజుకు తెలియజేయడంలో ఎస్తేరు ఎందుకు ఆలస్యం చేసింది? (ఎస్తే. 5:6-8) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w86 3/15 24వ పేజీ, 18వ పేరా చూడండి.]
15. వేరే విశ్వాసంగల వారిని వివాహం చేసుకునే విషయంలో బైబిలు సలహా ఏమిటి? లేఖనాలివ్వండి. [fy 129వ పేజీ, 3వ పేరా.]
16. ఎలీఫజు సలహా యోబును ఓదార్చకుండా ఎందుకు కృంగదీసింది? (యోబు 21:34; 22:2, 3) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w95 2/15 27వ పేజీ, 5-6 పేరాలు చూడండి.]
17. వివాహ సమస్యలతో ఎలా, ఎప్పుడు వ్యవహరించాలి? [fy 154వ పేజీ, 4వ పేరా]
18. కీర్తన 2:1లో పేర్కొన్న ప్రకారం, అన్యజనులు “తలంచుచున్న” “వ్యర్థమైన[ది]” ఏమిటి? [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w86 8/15 20వ పేజీ, 5వ పేరా చూడండి.]
19. సమరయులకు, ఐతియోపీయుడైన అధికారికి ఫిలిప్పు చేసిన పరిచర్య నుండి నిష్పక్షపాతం గురించి ఆచరణీయమైన ఏ పాఠం మనం నేర్చుకోవచ్చు? (అపొ. 8:6-13, 26-39) [w99 7/15 25వ పేజీ, 2వ పేరా]
20. దేవుడు తనను సమాధినుండి పునరుత్థానం చేస్తాడన్న తన దృఢవిశ్వాసాన్ని యోబు ఎలా ఉదహరించాడు? (యోబు 14:7, 13-15) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w00 5/15 27వ పేజీ, 7వ పేరా–28వ పేజీ, 1వ పేరా చూడండి.]
క్రింది వాక్యాలను పూరించడానికి అవసరమైన పదాన్ని (పదాలను) లేక పదబంధాలను చేర్చండి:
21. దేశజనులు అనేకులు “యూదుల మతము అవలంబించిరి” అని ఎస్తేరు 8:17 చెబుతోంది; అదే విధంగా నేడు, “వేరే గొఱ్ఱెల” __________ తమ స్థానాన్ని, __________ పక్షంగా తీసుకున్నారు. (ప్రక. 7:9; యోహా. 10:16; జెక. 8:23) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w86 3/15 25వ పేజీ, 14వ పేరా చూడండి.]
22. అపొస్తలుల కార్యములు 1:7 ప్రకారం, యెహోవా __________ విషయంలో చాలా అప్రమత్తంగా ఉన్నప్పటికీ, లెక్క అప్పజెప్పవలసిన రోజు ప్రజలు ఏ మాత్రం ఎదురు చూడని గడియలో __________ వలె వస్తుంది. (2 పేతు. 3:10) [w99 6/1 5వ పేజీ, 2-3 పేరాలు]
23. తన శిష్యులు __________ __________ వంటి, __________ పాత ఆచారములకు అనుగుణముగా ఉండాలని ఎవరూ ఎదురుచూడకూడదనే విషయాన్ని గ్రహించడానికి యేసు, మత్తయి 9:16, 17లో పేర్కొన్న ఉపమానాల ద్వారా __________ __________ శిష్యులకు సహాయము చేశాడు. [gt 28]
24. మనస్సులో మాటను ఆరోగ్యకరమైన విధంగా తెలియజేసుకోవడం అనేది నమ్మకం, విశ్వాసం, పరస్పర అవగాహనల ద్వారా సాధ్యమౌతుంది. వైవాహిక అనుబంధాన్ని __________ అనుబంధంగా దృష్టించినప్పుడు, తమను తాము యథార్థంగా __________ చేసుకున్నప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయి. [w99 7/15 21వ పేజీ, 3వ పేరా]
25. నైతిక ఆధ్యాత్మిక విషయాల్ని __________ పెట్టడానికీ, యెహోవాను __________ సేవించడానికీ తోటివారి ఆరోగ్యకరమైన ప్రభావం మనకు సహాయం చేయగలదు. [w99 8/1 24వ పేజీ, 3వ పేరా]
క్రింది వాక్యాలలో నుండి సరైన జవాబును ఎంపిక చేయండి:
26. “మొర్దెకై రాజు గుమ్మములో కూర్చుని యుండెను” అనే మాటలు ఆయన (రాజు అంగరక్షకుడని; రాజైన అహష్వేరోషు ఉన్నతోద్యోగుల్లో ఒకడని; రాజును దర్శించడానికి ఎదురుచూస్తున్నాడని) సూచిస్తున్నాయి. (ఎస్తే. 2:19, 20) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w86 3/15 24వ పేజీ, 9వ పేరా చూడండి.]
27. యోబు 19:25-27లో పేర్కొన్న ప్రకారం, యోబు “దేవుని చూచెదను” అని తన నమ్మకాన్ని వ్యక్తపర్చాడు. అంటే తాను (దర్శనం పొందుతాడని; పరలోక జీవితానికి పునరుత్థానుడవుతాడని; యిహోవాను గూర్చిన సత్యాన్ని తెలుసుకోడానికి తన జ్ఞాన నేత్రాలు తెరువబడతాయని) ఆయన భావం. [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w94 11/15 19వ పేజీ. 17వ పేరా చూడండి.]
28. తలిదండ్రులు తమ పిల్లల్లో (అనాలోచితాన్ని; మూఢత్వాన్ని; ఉల్లాసాన్ని) చూస్తే ఆశ్చర్యపడకూడదు. (సామె. 22:15) [fy 149వ పేజీ, 20వ పేరా]
29. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఇరువురు (వినుటకు వేగిరపడుతూ, మాట్లాడుటకు వేగిరపడుతూ, కోపగించుటకు వేగిరపడుతూ) ఉండాలి. (యాకో. 1:19) [fy 156వ పేజీ, 9వ పేరా]
30. భార్యాభర్తలిద్దరూ అరమరికల్లేకుండా, యథార్థంగా ఉండడంవల్ల వివాహాన్ని విచ్ఛిన్నం చేసే (వృద్ధాప్యపు; అనారోగ్యపు; సాతాను) దాడులను తట్టుకొని తమ వివాహ బంధాన్ని పటిష్ఠం చేసుకోగలరు. [fy 167వ పేజీ, 13వ పేరా]
క్రింద ఇవ్వబడిన వాక్యాలతో ఈ క్రింది లేఖనాలను జత చేయండి:
నెహె. 3:5; కీర్త. 12:2; 19:7; 72:13; లూకా 4:16-21
31. కష్టపడి పని చేయడంవల్ల మన విలువ తగ్గుతుందని గర్వంతో వెనుకంజ వేయకుండా మనం అన్ని పనులు చేయడానికి సిద్ధంగా ఉండాలి. [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w86 2/15 25వ పేజీ, 12, 19 పేరాలు చూడండి.]
32. యేసు క్రీస్తు భూపరిచర్య రోజుల్లో యూదా సమాజ మందిరము బోధించడానికి, ప్రార్థించడానికి, లేఖనాలను చదివి కంఠస్థం చేయడానికి, అలాగే వాటిని వివరించడానికి వినియోగించబడేది. [gt 21]
33. యేసు కనికరముచూపు రాజుగా, బాధలకు గురైన వారందరికి సహాయం చేయాలనే తన హృదయపూర్వక కోరికను తన రాజ్య పరిపాలనలో నెరవేర్చుకుంటాడు. [gt 25]
34. మనం దేవుని స్నేహం కావాలనుకుంటే, కపటం లేకుండా మనం మనస్సులో యథార్థంగా ఉండాలి. [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w89 9/15 26వ పేజీ, 7వ పేరా చూడండి.]
35. దేవుని ధర్మశాస్త్రముకు విధేయులై ఉండడంవల్ల ప్రాణం తెప్పరిల్లుతుంది, సంక్షేమము కలుగుతుంది. [వారంలో చదవవలసిన బైబిలు భాగము; w00 10/1 13వ పేజీ, 4వ పేరా చూడండి.]