ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు జూన్ నెలలో: దేవుడు మననుండి ఏమి కోరుతున్నాడు? లేక నిత్యజీవానికి నడిపించే జ్ఞానము. గృహ బైబిలు అధ్యయనాలు ప్రారంభించడంపై దృష్టి కేంద్రీకరించండి. జూలై, ఆగస్టు నెలల్లో: ఈ క్రింద ఇవ్వబడిన 32-పేజీల బ్రోషూర్లలో దేన్నైనా ఉపయోగించవచ్చు: “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను,” జీవిత సంకల్పమేమిటి?—మీరు దానినెలా తెలిసికోగలరు?, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, నిరంతరము నిలిచే దైవిక నామము (ఆంగ్లం), పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము!, మనం మరణించినప్పుడు మనకేమి సంభవిస్తుంది? (ఆంగ్లం), మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే. ఈ బ్రోషూర్లతో పాటు మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?, మృతుల ఆత్మలు—అవి మీకు సహాయపడగలవా లేక హాని తలపెట్టగలవా? అవి నిజంగా ఉనికిలో ఉన్నాయా? (ఆంగ్లం), యుద్ధంలేని లోకం ఎప్పటికైనా ఉంటుందా? (ఆంగ్లం) సర్వమానవాళి కొరకైన గ్రంథము అనే బ్రోషూర్లను సముచితమైనచోట్ల ప్రతిపాదించవచ్చు. సెప్టెంబరు నెలలో: జీవం—ఇక్కడికెలా వచ్చింది? పరిణామం ద్వారానా లేక సృష్టి ద్వారానా? అనే పుస్తకము, ఇరవయ్యో శతాబ్దమందలి యెహోవాసాక్షులు అనే బ్రోషూరు.
◼ 2001, జూలై 30తో ప్రారంభమయ్యే వారం మొదలుకొని ఇండియాలోని క్షేత్రమంతా సంఘ పుస్తక అధ్యయనాల్లో యెషయా ప్రవచనం—సర్వమానవాళికి వెలుగు I అధ్యయనం చేస్తుంది. తెలుగు, నేపాలీ, మరాఠీ భాషా అధ్యయన గ్రూపులకు కూడా ఇది వర్తిస్తుంది.
◼ ఫిబ్రవరి నెల స్టేట్‌మెంటుతోపాటు స్పెషల్ రిక్వెస్ట్ ఫారమ్ ఫర్ యాన్యువల్ ఐటమ్స్‌ను ప్రతి సంఘానికి పంపించడం జరిగింది. సంఘాలు 2001 జిల్లా సమావేశపు బ్యాడ్జి కార్డుల కోసం, 2002 సంవత్సరానికి కావాల్సిన ప్రతిదినము లేఖనములను పరిశీలించుట, వార్షికపుస్తకాలు (ఆంగ్లం), క్యాలెండర్లు (ఆంగ్లం), జ్ఞాపకార్థ దిన ఆచరణ ఆహ్వాన పత్రాలు వంటి ఇతర వార్షిక ఐటమ్‌ల కోసం ఇంకా రిక్వెస్ట్ చేయని సంఘాలు తమ రిక్వెస్ట్‌లను వెంటనే పంపించాలి. లేకపోతే తర్వాతి సంవత్సరం మీ అవసరాల్ని తీర్చడం సొసైటీకి కష్టమౌతుంది. కింగ్‌డమ్ హాల్ లిటరేచర్ ఇన్వెంటరీ అరేంజ్‌మెంట్ క్రిందకు వచ్చే సంఘాలు తమ రిక్వెస్టులను “కో-ఆర్డినేటింగ్ కాంగ్రిగేషన్” ద్వారానే పంపించాలి. సాహిత్య కో-ఆర్డినేటర్, కో-ఆర్డినేటింగ్ సంఘం కార్యదర్శి తమ లిటరేచర్ గ్రూపులోని ప్రతి సంఘానికీ కావల్సినంత సరఫరాను రిక్వెస్టు చేయడం జరిగిందని రూఢిపర్చుకోవాలి.