మీ గ్రంథాలయంలో వార్షికపుస్తకాలు అన్నీ ఉన్నాయా?
యెహోవాసాక్షుల వార్షికపుస్తకాలు (ఆంగ్లం) అన్నీ ఆహ్లాదకరంగా చదువుకోవడానికి ఎంతో అద్భుతమైన ఖజానాను కలిగివున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రాజ్య ప్రకటనా పని గురించిన క్షేమాభివృద్ధికరమైన నివేదికలు, యెహోవా అందించే నడిపింపు, కాపుదల, కుమ్మరించే ఆశీర్వాదాల గురించిన మన నమ్మకాన్ని దృఢతరం చేస్తాయి. మా దగ్గర ఆంగ్లంలో, 1997 నుండి 2000వ సంవత్సరం వరకు వార్షికపుస్తకాల స్టాకు ఉంది. ఈ వార్షికపుస్తకాల్లో ఉరుగ్వే, చెక్ రిపబ్లిక్, జపాన్, జర్మనీ, పరాగ్వే, బెనిన్, బ్రిటన్, బ్రెజిల్, మడగాస్కర్, మలావీ, మార్టినిక్, మైక్రోనీషియాలలోని రాజ్య పని గురించిన ఉత్తేజకరమైన చరిత్ర ఉంది. మీ వ్యక్తిగత గ్రంథాలయాల్లో వీటిలో ఏదైనా తక్కువయ్యిందేమో చూడండి. అదే విధంగా, దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పైవిచారణకర్త రాజ్యమందిరంలోని గ్రంథాలయంలో ఇవి ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఈ వార్షికపుస్తకాలు కావాలనుకునే ప్రచారకులు లేక సంఘాలు సంఘ సాహిత్య సేవకుని ద్వారా వాటికోసం రిక్వెస్టు చేయాలి.