‘మేలు చేస్తూ’ కొనసాగండి
1 మీరు యెహోవా దేవుని సేవకునిగా మారినప్పుడు మీరు చాలా సరైన పనే చేశారు. అయితే ఇప్పుడు, క్లిష్టమైన ఈ అంత్య దినాల్లో ‘మేలు చేస్తూ’ కొనసాగడం సవాలుకరంగా ఉంటుంది. (గల. 6:9) ఇందుకు చాలా గట్టి కృషి అవసరమైనప్పటికీ మీరు విజయాన్ని సాధించగలరు. ఎలా?
2 యేసు చిత్తప్రకారమైన మనస్సును అలవర్చుకోండి: మీ మనస్సును రాజ్య నిరీక్షణపై కేంద్రీకరిస్తే యేసులా మీరు కూడా శ్రమల్ని సహించగలరు. (హెబ్రీ. 12:1-3) యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడనీ, మీరు విజయాన్ని సాధించాలని ఆయన కోరుతున్నాడనీ మీరు నిశ్చయత కలిగివుండండి. (2 పేతు. 3:9) మీరు మీ పూర్ణ నమ్మకాన్ని ఆయనపై ఉంచండి, ఆయన మీకు సహాయం చేస్తాడన్న విశ్వాసంతో ఉండండి. (1 కొరిం. 10:13) ప్రార్థనలో పట్టుదల కలిగివుండండి, మీరు సహించడానికి సహాయం కావాలని యెహోవాను అర్థించండి. (రోమా. 12:12) మీ సహనం దేవుని దృష్టిలో మెప్పును పొందడానికి నడిపిస్తుందన్న దృఢ నమ్మకంతో ఆనందించండి. (రోమా. 5:3-5, పరిశుద్ధ బైబల్) “క్రీస్తుయేసు చిత్తప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిసినవారై” ఉండడానికి మీరు విశ్వసనీయంగా చేస్తున్న కృషి మీకు వ్యక్తిగత సంతృప్తిని తీసుకువస్తుంది, యెహోవా హృదయాన్ని సంతోషపరుస్తుంది.—రోమా. 15:5, 6; సామె. 27:11.
3 మేలుకరమైన పనులు చేస్తూ కొనసాగండి: మేలుకరమైన పనులు చేస్తూ ఉండడంలో సహాయం చేసేందుకు యెహోవా తన ప్రజల కోసం చేసిన ఏర్పాట్ల నుండి పూర్తి ప్రయోజనాన్ని పొందండి. దేవుని వాక్యాన్ని చదువుతూ, నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతి అందజేసే బైబిలు ఆధారిత ప్రచురణల్ని అధ్యయం చేస్తూ ఒక క్రమమైన జీవన సరళిని అలవర్చుకోండి. సంఘ కూటాలన్నింటికీ విశ్వసనీయంగా సిద్ధపడుతూ, హాజరౌతూ, పాల్గొనండి. క్రైస్తవ కూటాలకు ముందూ ఆ తర్వాతా మీ ఆధ్యాత్మిక సహోదర సహోదరీలతో సన్నిహితంగా సహవసించండి. మీ పరిచర్య విషయంలో మీరు చేరుకోదగ్గ లక్ష్యాల్ని ఏర్పర్చుకోండి, తద్వారా మీరు క్షేత్ర సేవలో అర్థవంతమైన భాగాన్ని కలిగివుండగలరు, అలాగే సువార్తను ఇతరులకు అందించడంలో మీ నైపుణ్యాలను మెరుగుపర్చుకోగలరు.
4 అదీ, మీరు మేలుకరమైన పనుల్ని చేస్తూ అదే సమయంలో అత్యంత ఆనందాన్ని అనుభవిస్తూ కొనసాగే విధానం. ఈ విషయంలో ఇటలీలోని ఒక సహోదరుడు ఇలా అన్నాడు: “సూర్యాస్తమయం సమయానికి నేను యెహోవా సేవలో రోజంతా గడిపి ఇంటికి చేరుకుంటాను. చాలా అలసిపోయివుంటాను, కాదనను. కానీ నా ఆనందానికి అవధులుండవు, వేరెవ్వరూ నా నుండి దోచుకోలేని ఆ ఆనందాన్ని నాకు దయచేసినందుకు నేను యెహోవాకు కృతజ్ఞతలు తెలుపుకుంటాను.” కాబట్టి, మేలుకరమైన పనుల్ని చేస్తూ కొనసాగండి, మీరు కూడా గొప్ప ఆనందాన్ని అనుభవిస్తారు.