ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు మార్చి: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము. గృహ బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి ప్రత్యేక ప్రయత్నాలు చేయాలి. ఏప్రిల్, మే: కావలికోట, తేజరిల్లు ! విడిపత్రికలు. పునర్దర్శనాలు చేసినప్పుడు ఆసక్తి ఉన్నట్లు అనిపిస్తే పత్రిక చందాలను ప్రతిపాదించవచ్చు. జీవించినవారిలోకెల్లా మహాగొప్ప మనిషి పుస్తకాన్నిగానీ, నా బైబిలు కథల పుస్తకమునుగానీ ప్రతిపాదించండి. జూన్: దేవుడు మననుండి ఏమి కోరుతున్నాడు? లేక నిత్యజీవానికి నడిపించే జ్ఞానము. బైబిలు అధ్యయనాలు ప్రారంభించేందుకు కృషిచేయండి.
◼ ఏప్రిల్‌లో సహాయ పయినీరింగ్ చేయాలనుకునే ప్రచారకులు ఇప్పుడే పథకాలను వేసుకుని, తమ దరఖాస్తులను ముందుగా ఇవ్వాలి. ఇలా చేయటం క్షేత్రసేవకు అవసరమైన ఏర్పాట్లు చేయడానికి, తగినన్ని పత్రికలు, ఇతర సాహిత్యం అందుబాటులో ఉంచేందుకు పెద్దలకు వీలు కలుగజేస్తుంది. సహాయ పయినీరింగ్ చేయటానికి ఆమోదం పొందిన వారి పేర్లను ప్రతి నెలలోనూ సంఘంలో ప్రకటించాలి.
◼ జ్ఞాపకార్థ ఆచరణ ఏప్రిల్ 8, 2001 ఆదివారంనాడు జరుగుతుంది. క్షేత్రసేవ కొరకైన కూటము తప్ప మరే సంఘకూటాలు ఆ రోజు జరపకూడదు. ఆ రోజున జరిగే కావలికోట పఠనం మరో సమయంలో జరిగేలా పైవిచారణకర్తలు ఏర్పాటు చేయవచ్చు.
◼ ఒక సంఘంతో సహవసించే వారు కావలికోట, తేజరిల్లు! పత్రికలకు తమ వ్యక్తిగత చందాలతో సహా క్రొత్త చందాలనూ, నవీకరించబడిన చందాలనూ సంఘం ద్వారానే పంపించాలి.
◼ సాహిత్యాల్ని పంపించమని ప్రచారకులు వ్యక్తిగతంగా చేసుకొన్న రిక్వెస్ట్‌లను సంస్థ అంగీకరించదు. సాహిత్యాల కోసం సంఘం చేసే నెలసరి రిక్వెస్ట్‌లను సొసైటీకి పంపించే ముందు ప్రతి నెలా దాన్ని గురించి సంఘంలో ప్రకటన చేసేలా సంఘ పైవిచారణకర్త ఏర్పాటు చేయాలి. ఆ విధంగా, వ్యక్తిగతంగా కావల్సిన సాహిత్యాల్ని తెప్పించుకోవాలని ఇష్టపడుతున్న వారందరూ సాహిత్యాల విషయం చూసుకుంటున్న సహోదరునికి తెలియజేయవచ్చు. సాహిత్యాల్లో ఏవి స్పెషల్ రిక్వెస్ట్ ఐటమ్‌కు చెందుతాయో దయచేసి గుర్తుంచుకోండి.
◼ లభ్యమయ్యే క్రొత్త ప్రచురణలు:
దేవుని మార్గదర్శనము—పరదైసుకు మన మార్గము—తమిళం, మలయాళం
దేవుడు మననుండి ఏమి కోరుతున్నాడు—అస్సామీ, ఆంగ్లం, కన్నడ, గుజరాతి, తమిళం, తెలుగు, నేపాలీ, పంజాబీ, బెంగాలీ, మరాఠీ, మలయాళం, హిందీ
◼ ఇండియాలో స్టాకులో లేని ప్రచురణలు:
లేఖనాలపై అంతర్దృష్టి —ఆంగ్లం
పరిశుద్ధ లేఖనాల నూతనలోక అనువాదము—(డీలక్స్ పోకెట్ ఎడిషన్; DLbi25)
పరిశుద్ధ లేఖనాల నూతనలోక అనువాదము—(డీలక్స్; DLbi12 విత్ మార్జినల్ రిఫరెన్‌సెస్)
దేవుని కొరకు మానవజాతి అన్వేషణ—ఆంగ్లం
యెహోవా స్తుతిగీతములు (పెద్ద, చిన్న పాటల పుస్తకాలు)—ఆంగ్లం
లేఖనాలనుండి తర్కించుట—ఆంగ్లం, తమిళం
మన పరిచర్యను నెరవేర్చుటకు సంస్థీకరింపబడియున్నాము—ఆంగ్లం, తమిళం, మలయాళం
నా బైబిలు కథల పుస్తకం, చిన్న ఎడిషన్—తమిళం
కురుక్షేత్రం నుండి అర్మగిద్దోను వరకు—తమిళం, తెలుగు
మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే—మలయాళం
రక్తము నీ జీవమును ఎట్లు కాపాడగలదు?—తమిళం, మలయాళం, హిందీ
చర్చనీయ బైబిలు అంశములు—మలయాళం
సర్వమానవాళి కొరకైన గ్రంథము—తమిళం, మలయాళం
“ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను”—మలయాళం
భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము!—తమిళం