కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 1/01 పేజీ 7
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2001
మన రాజ్య పరిచర్య—2001
km 1/01 పేజీ 7

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు జనవరి: బ్రోషూర్లు: ఇరవయ్యో శతాబ్దమందలి యెహోవాసాక్షులు, యెహోవాసాక్షులు—ప్రపంచమంతట ఐక్యంగా దేవుని చిత్తాన్ని చేస్తున్నారు. అలాగే, 192 పేజీల పాత పుస్తకాలను అందించవచ్చు. ఫిబ్రవరి: జీవము—ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం మూలంగానా లేక సృష్టి మూలంగానా? (ఆంగ్లం), ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది! సంఘపు స్టాకులో ఉన్న 192 పేజీల పాత పుస్తకాలలో దేన్నైనా సరే అందించవచ్చు. మార్చి: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము. గృహ బైబిలు పఠనాలు ప్రారంభించడానికి ప్రత్యేక ప్రయత్నాలు చేయాలి. ఏప్రిల్‌: కావలికోట, తేజరిల్లు! విడిపత్రికలు. పునర్దర్శనాలు చేసినప్పుడు ఆసక్తి ఉన్నట్లు అనిపిస్తే పత్రిక చందాలను ప్రతిపాదించవచ్చు. జీవించినవారిలోకెల్లా మహాగొప్ప మనిషి పుస్తకాన్నిగానీ, నా బైబిలు కథల పుస్తకమునుగానీ ప్రతిపాదించండి.

◼ 2002 సంవత్సరపు జ్ఞాపకార్థదినం మార్చి 28, గురువారం సూర్యాస్తమయం తర్వాత. ఇంత ముందుగా తెలియజేస్తున్నది, ఒకే రాజ్యమందిరాన్ని దాని సదుపాయాల్ని అనేక సంఘాలు ఉపయోగిస్తున్నచోట సహోదరులు అందుబాటులో ఉన్న హాళ్లకు అవసరమైన రిజర్వేషన్లు లేక కాంట్రాక్టులు చేసుకోవటానికే. జ్ఞాపకార్థ ఆచరణ పద్ధతిగానూ, ప్రశాంతంగానూ జరిగేలా ఆ భవనంలోని ఇతర కార్యకలాపాల వల్ల భంగం కలుగకుండ ఉండేలా పెద్దలు హాలు యాజమాన్యంతో ఒక అంగీకారానికి రావాలి. ఎందుకంటే ఆ సందర్భం యొక్క ప్రాముఖ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, జ్ఞాపకార్థదిన ప్రసంగీకుణ్ని నియమిస్తున్నప్పుడు పెద్దలసభ ప్రతి సంవత్సరం అదే సహోదరుణ్ని ఊరక ఉపయోగించుకునే బదులు లేక తాము వంతులు తీసుకునే బదులు, మరింత యోగ్యుడైన పెద్దనే ఎన్నుకోవాలి. ప్రసంగం ఇవ్వగల, అభిషిక్తుడైన సమర్థుడైన పెద్ద ఉంటే మినహాయింపు ఉంటుంది.

◼ జనవరి 8తో ప్రారంభమయ్యే వారంలో జరిగే సేవా కూటానికి హాజరయ్యే, బాప్తిస్మం పొందిన ప్రచారకులందరూ అడ్వాన్స్‌ మెడికల్‌ డైరెక్టివ్‌/రిలీజ్‌ కార్డులను, తమ పిల్లలకోసం ఐడెంటిటీ కార్డులను పొందవచ్చు.

◼ ఫిబ్రవరి మొదలుకొని ప్రాంతీయ పై విచారణకర్తలు “తీర్పుదినం—భయపడే కాలమా? నిరీక్షణ కాలమా?” అన్న బహిరంగ ప్రసంగాన్ని ఇవ్వడం ప్రారంభిస్తారు. ఆ ప్రసంగాన్ని ఇవ్వడం కనీసం మార్చి 4 కల్లా ప్రారంభించాలి.

◼ ఈ సంవత్సరం ఏప్రిల్‌ 8 ఆదివారం సూర్యాస్తమయం తర్వాత జ్ఞాపకార్థ దినాన్ని జరుపుకునేందుకు సంఘాలు తగిన ఏర్పాట్లను చేసుకోవాలి. ప్రసంగం ముందే ప్రారంభమైనప్పటికీ జ్ఞాపకార్థదిన చిహ్నాలను సూర్యాస్తమయం అయ్యేంతవరకు అందించకూడదు. మీ ప్రాంతంలో ఎప్పుడు సూర్యాస్తమయమౌతుందో స్థానికాధికారులను అడిగి తెలుసుకోండి. ఆ రోజున క్షేత్ర సేవ కొరకైన కూటాలు తప్ప మరే ఇతర కూటాలు నిర్వహించబడవు గనుక, మరో సమయంలో కావలికోట పఠనాన్ని జరుపుకునేందుకు అవసరమైన ఏర్పాట్లను చేసుకోవాలి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రాంతీయ పై విచారణకర్తలు తమ కూటాల షెడ్యూలును మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి సంఘమూ జ్ఞాపకార్థదినాన్ని తమకు తాముగా జరుపుకోవడం మంచిదైనప్పటికీ అన్నివేళలా ఇది సాధ్యంకాకపోవచ్చు. సాధారణంగా అనేక సంఘాలు ఒకే రాజ్యమందిరాన్ని ఉపయోగించుకుంటున్న ప్రాంతాల్లో, ఒకటి లేక అంతకన్నా ఎక్కువ సంఘాలు ఆ సాయంత్రానికి మరో స్థలాన్ని సిద్ధం చేసుకోవచ్చు. సాధ్యమైన చోట, సందర్శకులను పరామర్శించడానికి, ఆసక్తిగల క్రొత్త వారిని ప్రోత్సహించడానికి, మరి ఆ ఆచరణ నుండి పూర్తి ప్రయోజనం పొందేందుకు కూటానికి కూటానికి మధ్య కనీసం 40 నిమిషాల వ్యవధి ఉండాలని మేము సూచిస్తున్నాము. హాజరయ్యే వారిని తీసుకొని వెళ్లి, తీసుకొని వచ్చే దానితోసహా ట్రాఫిక్‌, పార్కింగ్‌ సమస్యలకు కూడా అవధానం ఇవ్వాలి. స్థానికంగా ఏ ఏర్పాట్లు ప్రయోజనకరంగా ఉంటాయో పెద్దల సభ నిర్ణయించాలి.

◼ 2001 జ్ఞాపకార్థ ఆచరణ కాలంలోని ప్రత్యేక బహిరంగ ప్రసంగం ఆదివారం ఏప్రిల్‌ 1న ఇవ్వబడుతుంది. ఆ ప్రసంగ అంశం “ఎవరు రక్షించబడగలరు?” దాని ఔట్‌లైన్‌ ఇవ్వబడుతుంది. ఆ వారంలో ప్రాంతీయ పై విచారణకర్త సందర్శనంగానీ, ప్రాంతీయ సమావేశంగానీ, ప్రత్యేకదిన సమావేశంగానీ జరుగుతున్న సంఘాల్లో ఏప్రిల్‌ 9తో ప్రారంభమయ్యే వారంలో ప్రత్యేక ప్రసంగం ఇవ్వబడుతుంది. ఆ ప్రత్యేక ప్రసంగాన్ని 2001, ఏప్రిల్‌ 1కి ముందు ఏ సంఘంలోనూ ఇవ్వకూడదు.

◼ 2001 జనవరి 8వ సంచికతో మొదలై, తేజరిల్లు! ఉర్దూ భాషలో మాస పత్రికగా ప్రచురించబడుతుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి