దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
సెప్టెంబరు 4 నుండి డిసెంబరు 18, 2000 మధ్య వారాల్లోని ప్రసంగాల సమాచారంపై పుస్తకాలు మూసి చేసే పునఃసమీక్ష. కేటాయించబడిన సమయంలోనే మీరు వ్రాయగల్గినన్ని ప్రశ్నలకు జవాబులు వ్రాసేందుకు వేరే పేపరును ఉపయోగించండి.
[గమనిక: వ్రాతపూర్వక పునఃసమీక్ష సమయంలో ఏ ప్రశ్నలకు సమాధానమివ్వడానికైనా కేవలం బైబిలును మాత్రమే ఉపయోగించాలి. వాటి ప్రక్కనున్న రెఫరెన్సులు మీ వ్యక్తిగత పరిశోధన కోసం ఇవ్వబడ్డాయి. కావలికోట రెఫరెన్సులున్న ప్రతిచోట పేజీ నెంబర్లు, పేరా నెంబర్లు ఉండకపోవచ్చు.]
ఈ క్రింది వాక్యాలు సత్యమో, అసత్యమో వ్రాయండి:
1. తనకు వ్యతిరేకంగా షిమీ దావీదుపై మోపిన ఆరోపణలన్నింటి విషయంలో దావీదు అపరాధి కాబట్టే షిమీని చంపవద్దని అబీషైకి అడ్డుపడ్డాడు. (2 సమూ. 16:5-13) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w99 5/1 32వ పేజీ, 3వ పేరా చూడండి.]
2. చక్కగా తర్ఫీదివ్వబడిన నిర్మలమైన మనస్సాక్షి, దేవునితో వాత్సల్యపూరితమైన, వ్యక్తిగతమైన సంబంధాన్ని కల్గివుండడానికి నడిపిస్తుంది, అంతేగాక మన రక్షణకు అది ఆవశ్యకము. (హెబ్రీ. 10:22; 1 పేతు. 1:15, 16) [w98 9/1 4వ పేజీ, 4వ పేరా]
3. నీతియుక్తమైన ఆగ్రహానికి దాని స్థానం దానికి ఉన్నప్పటికీ, కోపం మనకు అభ్యంతర కారణం కాగల ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. [w99 8/15 8, 9 పేజీలు]
4. సొలొమోను పరిపాలించిన శాంతియుతమైన సుసంపన్నమైన 40 సంవత్సరాల పరిపాలనకు యేసు వెయ్యేండ్ల పరిపాలనను పోల్చవచ్చు. (1 రాజు. 4:24, 25, 29) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w90 6/1 6వ పేజీ, 5వ పేరా.]
5. అతడు మంచిగా సమాధి చేయబడ్డాడు కనుక, యరొబాము కుటుంబమంతటిలో అబీయా మాత్రమే యెహోవా యొక్క నమ్మకమైన ఆరాధికునిగా ఉన్నాడన్నదానికి స్పష్టమైన రుజువు. (1 రాజు. 14:10, 13) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w95 4/1 12వ పేజీ, 11వ పేరా చూడండి.]
6. క్రైస్తవ బాప్తిస్మం తీసుకోవడం అంటే ఒక వ్యక్తి పరిపక్వత కలిగిన దేవుని సేవకుడైపోయాడు అని అర్థం. [w98 10/1 28వ పేజీ, 2వ పేరా]
7. మానవాతీతం అన్పించే ధైర్యంతో యెహోవా ఏలీయాను బలపరచాడు, ఆయనకు భయమనేది లేకుండా చేశాడు. (1 రాజు. 18:17, 18, 21, 40, 46) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w98 1/1 31వ పేజీ, 2వ పేరా చూడండి.]
8. మన్నా సహజంగా లభించే ఆహారం. [w99 8/15 25వ పేజీ]
9. ఎలీషా నయమానుల వృత్తాంతంలో గమనిస్తే, అన్ని జనాంగాలకూ చెందిన యథార్థవంతులైన స్త్రీపురుషులను స్వీకరించడానికి యెహోవాకు సుముఖత ఉందని అర్థమౌతుంది. ఇది, నేటి లోకంలో సర్వత్రా వ్యాపించివున్న సంకుచిత మనస్తత్వం మతపరమైన శత్రుత్వ భావాలకు యెహోవా అతీతుడని మనకు పూర్తి నిశ్చయతను ఇస్తుంది. [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w99 6/15 23వ పేజీ చూడండి.]
10. రెండవ రాజులు 11:12 లో తెలియజేయబడినట్లుగా “ధర్మశాస్త్ర గ్రంథమును” రాజు చేతికివ్వడమనే చర్యకు, దేవుని ధర్మశాస్త్రానికి ఆయన చెప్పిన అర్థమే చెల్లుతుందనడానికి ఆయన చెప్పినట్లుగానే వినాలనడానికి సూచనార్థక అర్థం. [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w91 2/1 31వ పేజీ, 6వ పేరా చూడండి.]
క్రింది ప్రశ్నలకు సమాధానమివ్వండి:
11. తమ పిల్లలు సరైన లౌకిక ఉద్యోగాన్ని ఎంపిక చేసుకోవడంలో నడిపింపునిచ్చేటప్పుడు దైవిక తల్లిదండ్రులు 1 యోహాను 2:15-17కు అనుగుణ్యంగా, వారు దేన్ని నివారించాలని వారిని ప్రోత్సహించాలి? [w98 7/15 5వ పేజీ, 2వ పేరా]
12. “కత్తిచేత కూలినవారికంటె ఎక్కువమంది అడవిలో చిక్కుబడి నాశనమైరి” అని చెప్తున్న 2 సమూయేలు 18:8 లోని మాటల భావమేమిటి? [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w87 3/15 31వ పేజీ 2వ పేరా చూడండి.]
13. గొల్యాతు బంధువులైన రెఫాయీయులతో నేడు ఎవరిని పోల్చవచ్చు, వారేమి చేయడానికి ప్రయత్నించారు? (2 సమూ. 21:15-22) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w89 1/1 20వ పేజీ, 8వ పేరా చూడండి.]
14. తోటివారి ఒత్తిడి అంటే ఏమిటి? [w99 8/1 22వ పేజీ]
15. సబ్బాతును ఉల్లంఘించినందుకు మరణశిక్ష పొందిన మనుష్యుని వృత్తాంతము నుండి ఏ ప్రాముఖ్యమైన సూత్రాన్ని నేర్చుకోగలము? (సంఖ్యా. 15:35) [w98 9/1 20వ పేజీ, 2వ పేరా]
16. మనం ఏమి చేయడం ద్వారా “సొలొమోనుయొక్క జ్ఞానమును” గూర్చి వినడానికి చాలా దూరం నుండి ప్రయాణించి వచ్చిన షేబ దేశపు రాణిని అనుకరించవచ్చు? (1 రాజు. 10:1-9) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w99 7/1 31వ పేజీ, 1,2 పేరాలు చూడండి.]
17. 1 రాజులు 17:3, 4, 7-9, 17-24 ప్రకారంగా ఏ మూడు మార్గాల్లో ఏలీయా యెహోవా యందు విశ్వాసాన్ని ప్రదర్శించాడు? [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w-E92 4/1 19వ పేజీ 5వ పేరా చూడండి.]
18. నాబోతు, ద్రాక్షాతోటను ఆహాబుకు ఇవ్వడానికి తిరస్కరించడం కేవలం తన వైపు నుండి అది మొండిపట్టు పట్టడం కాదని ఎందుకు చెప్పవచ్చు? [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w97 8/1 13వ పేజీ, 18వ పేరా చూడండి.]
19. రెండవ రాజులు 6:16లోని మాటలు నేటి యెహోవా సేవకులను ఎలా ప్రోత్సహిస్తున్నాయి? [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w98 6/15 18వ పేజీ, 5వ పేరా చూడండి.]
20. సీమోను క్రియ విషయంలో నిజ క్రైస్తవులు ఏయే మార్గాలలో నేడు అప్రమత్తంగా ఉండాలి? [w98 11/15 28వ పేజీ, 5వ పేరా]
క్రింది వాక్యాలను పూరించడానికి అవసరమైన పదాన్ని (పదాలను) లేక పదబంధాలను చేర్చండి:
21. నిజ క్రైస్తవుడు __________కి లోనై, __________కి అప్రీతి కలిగించే ఆచారాల్లో పాల్గొనకూడదు. (సామె. 29:25; మత్త. 10:28) [w98 7/15 20వ పేజీ, 5వ పేరా]
22. రాజైన అగ్రిప్ప ఎదుట పౌలు సాక్ష్యమిచ్చినప్పుడు ఆయన __________ను ఉపయోగించాడు, తానూ అగ్రిప్పా __________ను నొక్కి చెప్పాడు. (అపొ. 26:2, 3, 26, 27) [w98 9/1 31వ పేజీ 3వ పేరా]
23. దేవుడు __________ గనుక ఆయన ఒక వ్యక్తి కాదు అన్నట్లు భావించవచ్చు, కానీ __________ సమయాలు ఎంత తరచుగా, ఎంత తీవ్రంగా ఉంటాయో ‘అదృశ్యుడైనవానిని చూడడం’ ఒక వ్యక్తికి అంత సాధ్యమౌతుంది. (హెబ్రీ. 11:27) [w98 9/15 21వ పేజీ 3, 4 పేరాలు]
24. సిరియా సైన్యాధికారియైన __________ విషయంలో చూసినట్లుగా కొన్నిసార్లు కాస్త __________ను ప్రదర్శించడం మూలంగా ఎంతో గొప్ప ప్రయోజనాలను పొందుతాము. [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w99 2/1 3వ పేజీ 6వ పేరా నుండి 4వ పేజీ 1వ పేరా వరకు చూడండి.]
25. యెహోనాదాబు హృదయం రాజైన యెహూతో ఉన్నట్లుగానే, నేడు __________ గొప్ప యెహూ అయిన __________నూ, ఆయన భూసంబంధ ప్రతినిధులకు ప్రాతినిధ్యం వహించే __________నూ పూర్ణహృదయంతో స్వీకరిస్తూ వారికి సహకరిస్తున్నారు. (2 రాజు. 10:15, 16) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w98 1/1 13వ పేజీ, 5, 6 పేరాలు చూడండి.]
క్రింది వాక్యాలలో నుండి సరైన జవాబును ఎంపిక చేయండి:
26. ‘ఇశ్రాయేలీయులను లెక్కించే’ పాపాన్ని చేసేలా దావీదును పురికొల్పింది (సాతాను; యెహోవా; యోవాబు) (2 సమూ. 24:1) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w92 7/15 5వ పేజీ 2వ పేరా చూడండి.]
27. యెరూషలేములో యెహోవా ఆలయాన్ని ప్రతిష్ఠించే సమయంలో, రాజైన సొలొమోను బహిరంగంగా ప్రార్థించినప్పుడు (వినయాన్ని; జ్ఞాన దృక్పథాన్ని; తాను పూర్తి చేసిన దేవాలయాన్ని బట్టి గర్వాన్ని) కనబర్చాడు. (1 రాజు. 8:27) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w99 1/15 17వ పేజీ, 7వ పేరా చూడండి.]
28. సొలొమోను యెరూషలేములో దేవాలయాన్నీ తన గృహాన్నీ నిర్మించిన 20 ఏండ్ల కాలాన్ని, (1919; 1923; 1931) లో ప్రారంభమై (1938; 1942; 1950) లో ముగిసిన సిద్ధాంతపరమైన సంస్థాగతమైన సర్దుబాట్ల కాలానికి పోల్చవచ్చు. (1 రాజు. 9:10) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w92 3/1 20వ పేజీ బాక్సు చూడండి.]
29. రెండవ రాజులు 2:11లో “ఆకాశము” అని ఉపయోగించబడిన పదము (దేవుని ఆత్మీయ నివాస స్థానాన్ని; భౌతిక విశ్వాన్ని; పక్షులు ఎగిరే, గాలి వీచే ప్రదేశాలైన భూపరిధిలోని వాతావరణాన్ని) సూచిస్తుంది. [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w97 9/15 15వ పేజీ బాక్సు చూడండి.]
30. (హేరోద్ ద గ్రేట్; కైసరు ఔగుస్తు; తిబెరికైసరు) ఇచ్చిన ప్రజాసంఖ్యను గూర్చిన ఆజ్ఞ మూలంగానే యేసు నజరేతులో కాక బేత్లెహేములో జన్మించడం తటస్థించింది. [w98 12/15 7వ పేజీ బాక్సు]
క్రింద ఇవ్వబడిన వాక్యాలతో ఈ క్రింది లేఖనాలను జత చేయండి:
కీర్త. 15:4; హెబ్రీ. 10:24, 25; 2 రాజు. 3:11; కొలొ. 3:13; గల. 6:10
31. తన ప్రజలు క్రమంగా సమావేశం కావాలని యెహోవా నిర్దేశించడానికి గల కారణాల్లో ఒకటి, అనుకూలమైన తోటివారి ప్రభావం. [w99 8/1 23వ పేజీ]
32. మన ఆలోచనల్నీ కార్యాల్నీ ఇతరులకు మంచి చేసే ఉద్దేశంతో కొనసాగిస్తూ, అలాంటి ఆరోగ్యదాయకమైన, అనుకూలమైన కార్యకలాపాలు చేపడితే అవి తదనుభూతిని, నమ్మకాన్ని ప్రోత్సహించి, సులభంగా కోపానికి దారితీయగల అపార్థాలను తగ్గిస్తాయి. [w99 8/15 9వ పేజీ]
33. యెహోవా కృప పట్ల మెప్పుదల కలిగివుండడం ఒకరు నిగ్రహశక్తిని అభ్యసించేందుకు, ఇతరుల తప్పుల్ని కప్పివేయడానికి సహాయం చేయగలదు. [w98 11/1 6వ పేజీ, 3వ పేరా]
34. ప్రత్యేక సేవలో ఉన్న యెహోవా దేవుని నమ్మకమైన సేవకులకు వినయంతో పరిచర్య చేయడం, ఆతిథ్యాన్ని చూపించడం ఒక ఆధిక్యత. [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w97 11/1 31వ పేజీ, 1వ పేరా చూడండి.]
35. విషయాలు అనుకున్నట్లు జరగకపోయినప్పటికీ, యెహోవాకు భయపడే వ్యక్తి తన మాటను నెరవేర్చడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తాడు. [w98 11/15 27వ పేజీ, 1వ పేరా]