కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 జూలై పేజీ 5
  • అవసరం ఎక్కువున్న ప్రాంతానికి వెళ్లండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అవసరం ఎక్కువున్న ప్రాంతానికి వెళ్లండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • ఇలాంటి మరితర సమాచారం
  • బ్రాంచి కార్యాలయం ఏమేం చేస్తుంది?
    నేడు యెహోవా ఇష్టాన్ని ఎవరు చేస్తున్నారు?
  • మీ పరిచర్యను విస్తృతం చేసుకునే మార్గాలు
    యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
  • మీరు “మాసిదోనియకు” వెళ్లగలరా?
    మన రాజ్య పరిచర్య—2011
  • “నేను మరొక చోటుకు మారాలా?”
    మన రాజ్య పరిచర్య—2000
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 జూలై పేజీ 5
“విశ్వాసం చూపిస్తూ మీకు దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకోండి​—⁠అవసరం ఎక్కువ ఉన్న ప్రాంతానికి వెళ్లండి” వీడియోకు సంబంధించిన చిత్రాలు. చిత్రాలు: 1. గాబ్రియేల్‌ పరిశోధన చేస్తున్నాడు. 2. బ్రాంచి ఆఫీసుకు ఉత్తరం ఎలా రాయాలో సంఘపెద్దను అడుగుతున్నాడు. 3. తన ఫ్రెండ్‌ సామ్యూల్‌తో కలిసి ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో ప్రీచింగ్‌ చేస్తున్నాడు.

మన క్రైస్తవ జీవితం | కొత్త సేవా సంవత్సరం కోసం లక్ష్యాలు పెట్టుకోండి

అవసరం ఎక్కువున్న ప్రాంతానికి వెళ్లండి

పరిచర్య ఎక్కువ చేయడం కోసం మీ ఇంటిని వదిలి కొత్త ప్రాంతానికి వెళ్లడం అంత తేలిక కాదు; దానికి విశ్వాసం కావాలి. (హెబ్రీ 11:8-10) అవసరం ఎక్కువున్న ప్రాంతానికి వెళ్లాలని ఆలోచిస్తుంటే, మీ సంఘ పెద్దలతో మాట్లాడండి. ఒకవేళ వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది, ఎక్కడికి వెళ్లాలి లాంటి విషయాలు తెలుసుకోవడానికి ఏం చేయవచ్చు? అవసరం ఎక్కువున్న చోట సేవ చేయడం గురించి మన ప్రచురణల్లో ఉన్న సమాచారం చదవండి. ఇప్పటికే వేరే సంఘానికి వెళ్లి సేవ చేస్తున్న వాళ్లతో మాట్లాడండి. (సామె 15:22) సరైన నిర్ణయం తీసుకోవడానికి సహాయం చేయమని యెహోవాను ప్రార్థనలో అడగండి. (యాకో 1:5) మీరు వెళ్లాలనుకున్న ప్రాంతం గురించి వీలైనన్ని ఎక్కువ విషయాలు తెలుసుకోండి. వీలైతే, ముందే వెళ్లి ఆ ప్రాంతాన్ని చూసి రండి; ఆ తర్వాతే నిర్ణయం తీసుకోండి.

విశ్వాసం చూపిస్తూ మీకు దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకోండి—అవసరం ఎక్కువ ఉన్న ప్రాంతానికి వెళ్లండి వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • గాబ్రియేల్‌ ఎలాంటి మార్పులు చేసుకున్నాడు, అతనికి ఏం సహాయం చేసింది?

మీ దగ్గర్లో, ఏ సంఘంలో అవసరం ఉందో తెలుసుకోవాలనుకుంటే ప్రాంతీయ పర్యవేక్షకుడితో మాట్లాడండి. ఒకవేళ దూర ప్రాంతాల్లో ఉన్న ఏ సంఘాల్లో అవసరం ఉందో తెలుసుకోవాలనుకుంటే, మీ సంఘ సేవా కమిటీ ద్వారా బ్రాంచికు ఉత్తరం రాయండి. వేరేదేశాల్లో ఉన్న ఏ సంఘాల్లో అవసరం ఉందో తెలుసుకోవాలనుకుంటే, అక్కడి పనిని పర్యవేక్షిస్తున్న బ్రాంచి ఆఫీసుకు ఉత్తరం రాయండి. ఒకవేళ మీ మనసులో ఏదైనా ప్రాంతం పేరు ఉంటే, దాని గురించి కూడా ఆ ఉత్తరంలో రాయవచ్చు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి