కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 7/00 పేజీ 2
  • సేవా కూటాల పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సేవా కూటాల పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2000
  • ఉపశీర్షికలు
  • జూలై 10తో ప్రారంభమయ్యే వారం
  • జూలై 17తో ప్రారంభమయ్యే వారం
  • జూలై 24తో ప్రారంభమయ్యేవారం
  • జూలై 31తో ప్రారంభమయ్యేవారం
  • ఆగస్టు 7తో ప్రారంభమయ్యేవారం
మన రాజ్య పరిచర్య—2000
km 7/00 పేజీ 2

సేవా కూటాల పట్టిక

జూలై 10తో ప్రారంభమయ్యే వారం

పాట 17 (187)

12 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేసిన ప్రకటనలు. సంఘం యొక్క ఏప్రిల్‌ సేవా రిపోర్టు గురించి వ్యాఖ్యానించండి. “వెనుక పేజీ చూడండి” అనే బాక్స్‌వైపు అవధానాన్ని మళ్ళిస్తూ, అందులో సూచించబడిన సంచికల్లోని అందింపుల్లో స్థానిక ప్రాంతంలో బాగా పనిచేసే ఒక అందింపును ప్రదర్శించండి.

15 నిమి: “మేము చెప్పకుండా ఉండలేము.” ఉపోద్ఘాతాన్ని నిమిషంలోపుకు పరిమితం చేసి, ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి. మనం, మన ప్రకటనా పనిని గంభీరమైనదిగా ఎందుకు ఎంచుతున్నామన్న దానికిగల కారణాలను నొక్కి చెప్పండి. ఆ విషయానికి సంబంధించి 1997, జనవరి 15, కావలికోటలోని 23-4 పేజీల్లో ఇవ్వబడిన విషయాలను చేర్చండి.

18 నిమి: “సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరుగనియ్యుడి.” ఈ శీర్షికను ఇద్దరు పెద్దలు చర్చిస్తారు. ప్రతీ పేరానూ, పేర్కొన్న లేఖనాలనూ చదువుతారు. ఆ శీర్షికలో ఇమిడివున్న సూత్రాలను ఉన్నతపర్చండి. వ్యాపార లావాదేవీల్లో భాగం వహిస్తున్నప్పుడూ లేక పెట్టుబడులు పెడుతున్నప్పుడూ వివేచన ప్రదర్శించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పండి. 1997, మార్చి 15, కావలికోటలోని 18-19, 22 పేజీల్లో ఇవ్వబడిన సలహాలను పరిశీలించండి.

పాట 2 (15) ముగింపు ప్రార్థన.

జూలై 17తో ప్రారంభమయ్యే వారం

పాట 29 (222)

12 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్‌ రిపోర్టు. ఆసక్తిగల వ్యక్తి దేవుని స్వంత నామాన్ని తెలుసుకొని, ఆ నామాన్ని ఉపయోగించే అవసరతను గుర్తించేలా భూమిపై నిరంతరజీవితము బ్రోషూర్‌ను ఉపయోగిస్తూ అతనికి ఎలా సహాయం చేయవచ్చో క్లుప్తంగా వివరించండి.—తర్కించుట (ఆంగ్లం) పుస్తకంలోని 196-7 పేజీలను చూడండి.

15 నిమి: ‘ఔదార్యముగలవారిగా, ఇతరులతో పంచుకునేవారిగా ఉండండి.’ ప్రశ్నాజవాబులు. నవంబరు 1, 1996 కావలికోటలోని 29-30 పేజీల్లోని “మనం ఎందుకివ్వాలి” అనే శీర్షికలో పేర్కొనబడిన నాలుగు కారణాలను చేర్చండి.

18 నిమి: మీకు ఎవరు మాదిరులుగా ఉండాలి? ఒక తండ్రి ఒకరు లేదా ఇద్దరు యౌవనస్థులైన తన పిల్లలతో కుటుంబ పఠనాన్ని నిర్వహిస్తాడు. ఆ యౌవనస్థుల సంభాషణ తరచూ క్రీడాకారుల గురించి, ప్రముఖ తారల గురించి, టీవీ నటుల గురించి, లేదా గాయనీగాయకుల గురించే ఉన్నట్లు తండ్రి ఇటీవల గమనించాడు. ఈ విధమైన ఆకర్షణ లోకాత్మను ప్రతిబింబిస్తుందని చెబుతూ, తాను ఈ విషయంలో కలతచెందుతున్నట్లు చెబుతాడు. వారు జూన్‌ 8, 1998 తేజరిల్లు !లోని 12-14 పేజీలను చర్చిస్తారు. ఆ చర్చవల్ల ఈ యౌవనులు, లోకంలోని ప్రసిద్ధిచెందిన వ్యక్తుల్ని ఆరాధించడం ప్రమాదకరమని గ్రహిస్తారు. ఈ లోకంలో ప్రసిద్ధికెక్కడం క్రైస్తవులకు ఏమీ ప్రయోజనాన్ని చేకూర్చదని వారు ఒప్పుకుంటారు. తల్లిదండ్రులనూ, పెద్దలనూ సంఘంలో మాదిరికరంగా ఉన్న ఇతరులనూ—ప్రాముఖ్యంగా యేసుక్రీస్తునూ—తమ మాదిరికర్తలుగా దృష్టించడంలోని ప్రయోజనాలను కూడా వారు చర్చిస్తారు.

పాట 9 (37) ముగింపు ప్రార్థన

జూలై 24తో ప్రారంభమయ్యేవారం

పాట 6 (45)

5 నిమి: స్థానిక ప్రకటనలు.

15 నిమి: దేవుని పరిచారకులుగా మనల్ని మనం సిఫారసు చేసుకోవడం. డిసెంబరు 15, 1998 కావలికోటలోని 19-20 పేజీల్లో ఇవ్వబడిన లేఖనాధార ఉద్బోధను ఇద్దరు పరిచర్యా సేవకులు చర్చిస్తారు. తాము పరిచర్యా సేవకుల స్థానానికి తగ్గట్లుగా ప్రవర్తించాల్సిన అవసరాన్ని గుర్తిస్తున్నట్లు చెబుతారు. ఇంకా తాము తమ నియామకాలను నిర్వర్తించటానికి వ్యక్తిగతంగా ఏమి చేయవచ్చో పరిశీలిస్తారు. క్షేత్రసేవలో మంచి మాదిరులుగా ఉండే అవసరతను వారు పేర్కొంటారు. ఇతరులకు వ్యక్తిగత సహాయం అందించే విషయంలో పెద్దలకు ఏయే విధాలుగా సహాయపడగలరో చర్చిస్తారు. మనం నివసిస్తున్న కాలాల యొక్క ప్రాముఖ్యతను గుర్తించేందుకూ, ఆధ్యాత్మికంగా ఎదిగేందుకూ సంఘ సభ్యులకు సహాయపడడానికి తాము చేయగలిగినదంతా చేయాలన్న విషయాన్ని వారు అంగీకరిస్తారు.

10 నిమి: మనం చేరుకోలేని ప్రజలకు ఉత్తరాలు వ్రాయడం. ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. ప్రజలను ఇళ్ళల్లో కనుగొనడం అంతకంతకూ కష్టమౌతుంది గనుక ఉత్తరాలు వ్రాయడం ద్వారా కొంతమంది పరిచారకులు గొప్ప ఫలితాలు పొందారు. ఇక్కడ ఇవ్వబడిన సూచనలను గమనించండి. ఉత్తరం క్లుప్తంగానూ, లేఖనాధారాలతోనూ, గౌరవపూర్వకంగానూ ఉండాలి. అనామక ఉత్తరాల్ని పంపించవద్దు. ఉత్తరాన్ని చక్కగా స్పష్టంగా వ్రాయడమో లేక టైపు చేయడమో చేయండి. కూటాలకు రమ్మని ఆహ్వానిస్తూ రాజ్యమందిరము చిరునామానూ సంఘకూటాల సమయాలనూ వ్రాయండి. తిరిగి వ్రాయవలసిన చిరునామాగా సొసైటీ చిరునామాను ఉపయోగించవద్దు. పాఠశాల నిర్దేశక పుస్తకములోని (ఆంగ్లం) 87-8 పేజీల్లోనూ నవంబరు 1996 మన రాజ్య పరిచర్య ప్రశ్నాభాగంలోనూ ఇవ్వబడిన సలహాలను పరిశీలించండి.

15 నిమి: ఆలోచనను రేకెత్తించే ఉపోద్ఘాతాలను ఉపయోగించండి. బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను పుస్తకంలో ఇవ్వబడిన వాటిలో, రెండు లేక మూడు ఉపోద్ఘాతాలను ఎన్నుకొని స్థానిక ప్రాంతంలో వీటిని సమర్థవంతంగా ఎలా ఉపయోగించవచ్చో చర్చించండి. “వీధుల్లోగానీ, అనియతంగాగానీ, లేదా వేరేవిధాలుగాగానీ ఎవరినైనా కలిస్తే మీరు ఏ ఉపోద్ఘాతాలను ఉపయోగిస్తారని” ప్రేక్షకులను అడగండి. సమయం అనుమతించేకొలది ఒకటి లేక రెండు ఉపోద్ఘాతాలను ప్రదర్శించండి.

పాట 1 (13) ముగింపు ప్రార్థన.

జూలై 31తో ప్రారంభమయ్యేవారం

పాట 23 (200)

15 నిమి: స్థానిక ప్రకటనలు. జూలైలోని తమ క్షేత్రసేవా రిపోర్టును ఇవ్వమని అందరికీ గుర్తుచేయండి. ఈ నెలలో బ్రోషూరులను అందిస్తున్నప్పుడు వారికి కల్గిన అనుభవాలను చెప్పమని ప్రేక్షకులను కోరండి.

12 నిమి: స్థానిక అవసరతలు.

18 నిమి: “యెహోవా చూపిస్తున్న సహనం పట్ల మీకు మెప్పుదల ఉందా?” ప్రశ్నాజవాబులు. యెహోవా దీర్ఘశాంతాన్ని గురించి యుక్తమైన వ్యాఖ్యానాల్ని చేర్చండి.—అంతర్దృష్టి (ఆంగ్లం) సంపుటి 2, 263-4 పేజీలను చూడండి.

పాట 22 (130) ముగింపు ప్రార్థన.

ఆగస్టు 7తో ప్రారంభమయ్యేవారం

పాట 26 (212)

10 నిమి: స్థానిక ప్రకటనలు.

17 నిమి: “మీరు చాలా బిడియస్తులా?” ప్రశ్నాజవాబులు. 1997 వార్షికపుస్తకంలోని 43-4 పేజీల్లోని ప్రోత్సాహకరమైన ఒక అనుభవాన్ని చెప్పండి.

18 నిమి: నీవు ముందుకు జ్ఞానివగు. పెద్ద ఇచ్చే ప్రసంగం. తాము ప్రేమించే వాళ్ళతో భవిష్యత్తులో ఆనందంగా కలిసి సహజీవనం చేయాలని యౌవనులు కోరుకుంటారు. ఇలా కోరుకోవడం సహజమే కావచ్చు, కాని వారలా సఫలులు కావాలంటే దైవిక సలహాలను ఆచరణలో పెట్టాలి. (సామె. 19:20) యౌవనుల్లో ఆడా మగల మధ్య ఉండే ఆకర్షణ బలీయమైనది. భావోద్రేకాలను అదుపులో పెట్టుకోకపోతే, పర్యవసానాలు చాలా ఘోరంగా ఉంటుండవచ్చు. టీనేజర్లుగా ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులు కావడం నిజంగా జ్ఞానయుక్తమేనా అన్న విషయంలో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. అది ఆకర్షణతో మొదలై ప్రేమకలాపాలకు దారితీస్తుంది. యువత ఇలా అడుగుతోంది (ఆంగ్లం) పుస్తకంలో 231-5 పేజీల్లో ఇవ్వబడిన హెచ్చరికలను పరిశీలించండి. యౌవనులు దేవునిపట్ల తమ పూర్తి విధిని నెరవేర్చటంలోని ప్రాముఖ్యతను సూచించే నవంబరు 15, 1999 కావలికోటలోని 18-23 పేజీల్లో ఇవ్వబడిన ప్రాముఖ్యమైన విషయాలను ఉన్నతపర్చండి. ఈ సలహాలను గురించి టీనేజర్లు బాగా ఆలోచించి వారికి ఏవైనా ప్రశ్నలుంటే వాళ్ళు తమ తల్లిదండ్రులతో చర్చించాలని ప్రోత్సాహించండి.

పాట 28 (224) ముగింపు ప్రార్థన.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి