కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wp20 No. 1 పేజీలు 3-5
  • సత్యం కోసం అన్వేషణ

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సత్యం కోసం అన్వేషణ
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2020
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీరు సత్యాన్ని కనుక్కోవడం సాధ్యమేనా?
  • సత్యం కోసం మీ అన్వేషణ
  • సత్యాన్ని తెలియజేసే సాటిలేని పుస్తకం
  • నేనెందుకు నేర్చుకోలేను?
    తేజరిల్లు!—1996
  • సత్యదేవుని అనుకరించడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • సత్యంకొరకు ఎందుకు అన్వేషించాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ‘సత్యంలో నడుస్తూ ఉండండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2020
wp20 No. 1 పేజీలు 3-5
పుస్తకాలు ఉన్న అరల్ని చూస్తున్న ఒకతను

సత్యం కోసం అన్వేషణ

సత్యం తెలుసుకోవడం వల్ల మన ప్రాణాల్ని కాపాడుకోవచ్చు. ఉదాహరణకు, అంటురోగాలు ఎలా వ్యాపిస్తాయి అనే ప్రశ్నకు సంబంధించిన సత్యం తెలుసుకోవడం మన జీవితాల్ని ఎలా మార్చేసిందో గమనించండి.

వేల సంవత్సరాలపాటు ఆ ప్రశ్నకు జవాబు ఎవ్వరికీ తెలియలేదు. ఈలోగా, రకరకాల అంటువ్యాధులు లక్షలమందిని పొట్టనబెట్టుకున్నాయి. కాలం గడుస్తుండగా శాస్త్రవేత్తలు దానికి సంబంధించిన సత్యాన్ని తెలుసుకున్నారు. చాలామట్టుకు రోగాలు క్రిముల వల్ల అంటే బ్యాక్టీరియా, వైరస్‌ల వంటి సూక్ష్మజీవుల వల్ల వ్యాపిస్తాయని వాళ్లు కనుక్కున్నారు. ఆ ఒక్క సత్యం ప్రజల్ని అనేక రోగాల నుండి కాపాడింది, వాటికి చికిత్సలు కనుక్కోవడానికి సహాయం చేసింది; దానివల్ల కోట్లాదిమంది మరింత ఆరోగ్యంగా, ఎక్కువకాలం బ్రతకడం సాధ్యమైంది.

ముఖ్యమైన ఇంకొన్ని ప్రశ్నల మాటేమిటి? ఈ కింది వాటిగురించి ఒకసారి ఆలోచించండి:

  • దేవుడు ఎవరు?

  • యేసుక్రీస్తు ఎవరు?

  • దేవుని రాజ్యం అంటే ఏంటి?

  • రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి?

ఈ ప్రశ్నలకు సంబంధించిన సత్యాన్ని కనుక్కోవడం వల్ల లక్షలాదిమంది తమ జీవితాల్ని చక్కదిద్దుకున్నారు. వీటికి జవాబులు తెలుసుకుంటే మీ జీవితం కూడా బాగుంటుంది.

మీరు సత్యాన్ని కనుక్కోవడం సాధ్యమేనా?

‘అసలు దేని గురించైనా సత్యాన్ని కనుక్కోవడం సాధ్యమేనా?’ అని మీకనిపించవచ్చు. నిజంగానే, చాలావాటికి సంబంధించిన సత్యాన్ని కనుక్కోవడం రానురాను ఇంకా కష్టమౌతున్నట్టు అనిపిస్తోంది. ఎందుకు?

ప్రభుత్వాలు, కంపెనీలు, లేదా మీడియా నిజం చెప్తాయంటే చాలామంది నమ్మరు. ఇతరులు తమ అభిప్రాయం చెప్తున్నారా, కొంత సమాచారాన్ని దాస్తున్నారా, పచ్చి అబద్ధాలాడుతున్నారా లేక నిజం చెప్తున్నారా అనేది గుర్తుపట్టడం కష్టం. అటు అపనమ్మకం, ఇటు తప్పుడు సమాచారాలు వ్యాపించి ఉన్న ఈ ప్రపంచంలో అసలు వాస్తవాలు ఏంటి, వాటిని ఎలా అర్థంచేసుకోవాలి అనే విషయాల్లో ప్రజలకు వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయి.

పరిస్థితి అలా ఉన్నా, జీవితానికి సంబంధించిన అత్యంత ప్రాముఖ్యమైన ప్రశ్నలకు సరైన జవాబులు తెలుసుకోవడం సాధ్యమే. దానికోసం ఏం చేయాలి? రోజువారీ జీవితంలో మీకు వచ్చే మామూలు ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడానికి మీరేం చేస్తారో అది చేస్తే చాలు.

సత్యం కోసం మీ అన్వేషణ

చెప్పాలంటే మీరు ప్రతీరోజు ఏదోకవిధంగా సత్యం కోసం వెదుకుతూనే ఉంటారు. ఉదాహరణకు, జెస్సికా పరిస్థితినే తీసుకోండి. ఆమె ఇలా అంటోంది, “నా కూతురికి పల్లీలు అస్సలు పడవు, దాని మాంసకృత్తులు లేదా ప్రోటీన్‌లు ఏ కొంచెం నోటికి తగిలినా ఆమె ప్రాణాలకే ప్రమాదం.” అందుకే తన కూతురికి తినేవి ఏవైనా కొనేటప్పుడు, అవి ఆమె ఆరోగ్యానికి మంచివో కావో జెస్సికా తెలుసుకుంటుంది. ఆమె ఇంకా ఇలా అంటోంది, “మొదటిగా నేనేమి చేస్తానంటే, ఫలానా ఆహారంలో ఏయే పదార్థాలు ఉన్నాయో తెలుసుకోవడానికి వాటి లేబుల్స్‌ని జాగ్రత్తగా చూస్తాను. తర్వాత నేను ఇంకొంత పరిశోధన చేస్తాను, అలాగే దాని తయారీదారునితో కూడా మాట్లాడి, అందులో అనుకోకుండా పల్లీల ప్రోటీన్‌లు ఏవైనా కలిశాయేమో కనుక్కుంటాను. ఆహారాన్ని తయారుచేస్తున్నప్పుడు అన్ని జాగ్రత్తలూ పాటిస్తారనే పేరు ఆ కంపెనీకి ఉందనే నమ్మకం కుదరడానికి నేను వెబ్‌సైట్లను, నమ్మదగిన ఇతర సమాచారాన్ని కూడా చూస్తాను.”

అతను ఆ అరల నుండి ఒక పుస్తకాన్ని తీసుకొని, దానిలో ఉన్న సమాచారాన్ని తన ఎలక్ట్రానిక్‌ పరికరంలో ఉన్న సమాచారంతో పోల్చి చూస్తున్నాడు

మీ రోజువారీ జీవితంలో వచ్చే ప్రశ్నలు జెస్సికా పరిస్థితంత తీవ్రంగా ఉండకపోవచ్చు. కానీ మీరు జెస్సికాలా, మీకొచ్చే ప్రశ్నలకు జవాబులు కనుక్కోవడానికి ఈ కింది పద్ధతి పాటించవచ్చు:

  • వాస్తవాల్ని తెలుసుకోండి.

  • మరింత పరిశోధన చేయండి.

  • సమాచారం కోసం వెతికే వెబ్‌సైట్లు, మరితరమైనవి నమ్మదగినవో కావో చూసుకోండి.

జీవితంలో వచ్చే పెద్దపెద్ద ప్రశ్నలకు సరైన జవాబులు కనుక్కోవడానికి కూడా అదే పద్ధతి పాటించవచ్చు. ఎలా?

సత్యాన్ని తెలియజేసే సాటిలేని పుస్తకం

జెస్సికా తన కూతురి ఆహారం విషయంలో పరిశోధన చేస్తున్నప్పుడు ఎలాంటి పద్ధతి పాటించిందో, బైబిలు సత్యాన్ని వెతుకుతున్నప్పుడు కూడా అలాంటి పద్ధతినే పాటించింది. ఆమె ఇలా అంటోంది: “జాగ్రత్తగా చదవడం వల్ల, శ్రద్ధగా పరిశోధన చేయడం వల్ల నేను బైబిల్లో ఉన్న సత్యాన్ని కనుక్కోగలిగాను.” జెస్సికాలాగే, లక్షలాదిమంది ఈ ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబులు తెలుసుకున్నారు:

  • మన జీవితానికి అర్థం ఏంటి?

  • చనిపోయాక ఏం జరుగుతుంది?

  • ఎందుకు ఇన్ని బాధలు ఉన్నాయి?

  • బాధలన్నిటినీ తీసేయడానికి దేవుడు ఏం చేస్తున్నాడు?

  • మన కుటుంబ జీవితం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి?

అదే వ్యక్తి బైబిలు చదువుతున్నాడు, తన ల్యాప్‌టాప్‌ తెరిచి ఉంచుకున్నాడు

మీరు బైబిలు చదవడం ద్వారా, www.jw.org వెబ్‌సైట్లో మరింత పరిశోధన చేయడం ద్వారా ఇలాంటి ప్రశ్నలకు సరైన జవాబులు తెలుసుకోవచ్చు.

ఈ కావలికోట పత్రికలో కింది ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవచ్చు:

  • దేవుడు ఎవరు?

  • యేసుక్రీస్తు ఎవరు?

  • దేవుని రాజ్యం అంటే ఏంటి?

  • రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి?

అయితే అన్నిటికన్నా ముందు, సత్యాన్ని తెలియజేసే నమ్మదగిన పుస్తకం బైబిలు అని ఎందుకు చెప్పవచ్చో చూద్దాం.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి