కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 5/00 పేజీ 7
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2000
మన రాజ్య పరిచర్య—2000
km 5/00 పేజీ 7

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు మే: కావలికోట, తేజరిల్లు ! విడిపత్రికలు. ఆసక్తిగల వారికి అందించటానికి దేవుడు కోరుతున్నాడు బ్రోషూర్లను, కూడా ఉంచుకుని గృహ బైబిలు పఠనాలు ప్రారంభించటానికి ప్రయత్నం చేయాలి. జూన్‌: దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? గృహ బైబిలు పఠనాలు ప్రారంభించటంపై దృష్టి నిలపాలి. జూలై, ఆగస్టు: ఈ క్రింద ఇవ్వబడిన 32-పేజీల బ్రోషూర్లలో దేన్నైనా ఉపయోగించవచ్చు: జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, నిరంతరము నిలిచే దైవిక నామము (ఆంగ్లం), పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము !, మనం మరణించినప్పుడు మనకేమి సంభవిస్తుంది? (ఆంగ్లం), మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే. సముచితమైనచోట్ల ఈ బ్రోషూర్లను అంటే మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?, మృతుల ఆత్మలు—అవి మీకు సహాయపడగలవా లేక హాని తలపెట్టగలవా? అవి నిజంగా ఉనికిలో ఉన్నాయా? (ఆంగ్లం), యుద్ధంలేని లోకం ఎప్పటికైనా ఉంటుందా? (ఆంగ్లం), సర్వమానవాళి కొరకైన గ్రంథము అనే వాటిని ప్రతిపాదించవచ్చు.

◼ మనం వ్యక్తిగతంగా ఉత్తరప్రత్యుత్తరాలు జరిపేటప్పుడు, అవతలి వాళ్లు తిరిగి సంప్రదించవలసిన చిరునామాగా సంస్థ చిరునామాను ఎన్నడూ ఉపయోగించకూడదని ప్రచారకులందరికీ జ్ఞాపకం చేయడం అవసరమని మేము భావిస్తున్నాము. ఆసక్తిగల వారికీ, తాళం వేసివున్న ఇళ్ళలోని వారికీ, చేరుకోలేని స్థలాల్లో నివసిస్తున్న వారికీ సాక్ష్యమిస్తూ పంపే ఉత్తరాలకు, సాహిత్యానికి కూడా ఇది వర్తిస్తుంది. ఉత్తరాల ద్వారా సాక్ష్యమిచ్చేటప్పుడు, అవతలి వాళ్ళు తిరిగి సంప్రదించేందుకు మీ స్వంత చిరునామాను గానీ లేదా స్థానిక రాజ్య మందిర చిరునామాను గానీ ఉపయోగించండి. దయచేసి సంస్థ చిరునామాను ఉపయోగించకండి.

◼ సంఘ పైవిచారణకర్త గానీ లేక ఆయన నియమించిన మరొకరు గానీ జూన్‌ 1వ తారీఖున లేక అటు తర్వాత సాధ్యమైనంత త్వరలో సంఘ లెక్కల్ని ఆడిట్‌ చేయాలి. ఇలా ఆడిట్‌ చేసిన తర్వాత సంఘానికి తర్వాత అక్కౌంట్స్‌ రిపోర్టు చదువుతున్నప్పుడు ప్రకటించాలి.

◼ చాలా సంఘాల్లో పాత సాహిత్యాలు స్టాకు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు మనం సాహిత్యాన్ని చార్జి చేయకుండా పంపిణీ చేస్తున్నాము గనుక, సంఘాలు వేటి కోసం ఆర్డరు చేస్తున్నారనేది సేవా కమిటీలు, ప్రాముఖ్యంగా సేవాధ్యక్షులు జాగ్రత్తగా పర్యవేక్షించవలసిన అవసరాన్ని ఈ సమస్య ఉన్నతపరుస్తుంది. దయచేసి, 4, 5 నెలలకు సరిపడే దానికన్నా ఎక్కువ ఆర్డరు చేయవద్దు. ఆ తర్వాత ప్రతి నెలా ఆర్డరు చేయవచ్చు గనుక పెట్టిన ఆ ఆర్డరు సరిపోవచ్చు.

ప్రస్తుతమున్న పాత పుస్తకాల స్టాకు అయిపోయే వరకూ పునర్‌ముద్రించడాన్ని కూడా సంస్థ తగ్గిస్తుంది. ఈ కారణాన్ని బట్టి మీరు రిక్వెస్ట్‌ చేసిన సాహిత్యం స్టాకులో లేకపోతే, దానికి సరిసమానమైన ఏ సాహిత్యం అందుబాటులో ఉందో సంస్థ ప్యాకింగ్‌ లిస్ట్‌లో చూపిస్తుంది, అప్పుడు మీరు మీ తర్వాతి సాహిత్య రిక్వెస్ట్‌లో దాన్ని ఇమడ్చవచ్చు. రాబోయే నెలల్లో పాత సాహిత్యాన్ని బాగా ఉపయోగించేందుకు తగిన కృషిచేయమని మేము సంఘాలను ప్రోత్సహిస్తున్నాము.

◼ లభ్యమయ్యే క్రొత్త ప్రచురణలు:

దానియేలు ప్రవచనానికి అవధానమివ్వండి!—హిందీ

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి