పవిత్రమైన విషయాలపై మీకు మెప్పుదల ఉందా?
1 పవిత్రమైన విషయాలపై మీకు మెప్పుదల ఉందా అంటే, ఉంది! అని వెంటనే మనం జవాబు చెబుతుండవచ్చు. దేవుడు ఏర్పాటు చేసిన మనం మెప్పుదల చూపే కొన్ని పవిత్ర విషయాలు ఏవి?
2 మన పరలోక తండ్రితో మనకు అనుమతించబడిన సన్నిహిత సంబంధాన్ని మనమెంత ప్రియమైనదిగా ఎంచుతాం! మనం ‘తన దగ్గరకు వెళ్తే, ఆయన మన దగ్గరకు వస్తాడు’ అని ఆయనే మనకు అభయం ఇస్తున్నాడు. (యాకో. 4:8) యేసుక్రీస్తు విమోచన క్రయధన బలి లేకుండా ఏ మానవుడూ నిత్యజీవాన్ని పొందలేడు. (యోహా. 3:16) దేవుడు ఇచ్చిన ప్రశస్తమైన ఆ బహుమానం విషయమై హృదయపూర్వక కృతజ్ఞతా భావం నుండి పుట్టిన ప్రగాఢ మెప్పుదలను ప్రతిరోజూ ప్రార్థనలో చూపిస్తాం.
3 దైవ ప్రేరేపిత వాక్యమైన బైబిలు పవిత్రమైనట్లే, యెహోవా దేవుని భూ సంస్థ కూడా పవిత్రమైనదే. మనం బైబిలు సూత్రాలకు అనుగుణ్యంగా జీవిస్తూ, సహోదర ప్రేమానుబంధాలను పటిష్ఠం చేసుకుంటూ, దైవపరిపాలనా క్రమాన్ని అనుసరిస్తూ, నాయకత్వం వహించేవారితో సహకరిస్తూ ఉన్నట్లైతే, యెహోవా అందించిన ఈ పవిత్ర విషయాల గురించి మనం మెప్పుదలను చూపినవాళ్ళమౌతాము.—1 పేతు. 1:22, 23.
4 నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని ద్వారా, మనం ఆధ్యాత్మిక ఆహారాన్ని సమృద్ధిగా పొందుతున్నాం. ఈ సంవత్సరం జరుగనున్న “దేవుని వాక్యప్రకారం ప్రవర్తించేవారు” అనే జిల్లా సమావేశం ద్వారా కూడా పొందుతాం. అక్కడ, ప్రాముఖ్యమైన నిర్దేశాలను మనం పొందుతాం, మనకు అత్యవసరమైన ఆప్యాయతతో కూడిన సహవాసాన్ని అనుభవిస్తాం. ఈ పవిత్ర ఏర్పాట్ల విషయమై హృదయపూర్వకమైన మెప్పుదలను మనమెలా చూపగల్గుతాం?
5 యెహోవా మందిరాన్ని విడిచిపెట్టవద్దు: ‘దేవుని మందిరమును విడిచిపెట్టకూడదు’ అని యెరూషలేము గోడల పునర్నిర్మాణంలో కష్టించి పనిచేసినవారికే నెహెమ్యా బోధించాడు. (నెహె. 10:39) నేడు, యెహోవా “మందిరము” అంటే ఆయన చేసిన ఆరాధనా ఏర్పాటు. మన జిల్లా సమావేశాలు ఆ ఏర్పాటులో ఒక భాగం. ఈ ఏర్పాటును నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా మనం అక్కడ హాజరై ఉండి, అక్కడ జరుగుతున్న కార్యక్రమంపై అవధానాన్ని నిలపడం ద్వారా, యెహోవా చేసిన ఏర్పాట్లను మనమెంతో విలువైనవిగా ఎంచుతున్నామని ఆయనకు చూపిస్తాము. (హెబ్రీ. 10:24, 25) ఈ పవిత్ర సందర్భం విషయమై మనకు సంపూర్ణమైన మెప్పుదల ఉందని చూపేందుకు మనం ఇప్పుడు ఏయే పథకాలు వేసుకోవాలి?
6 మూడు రోజులూ హాజరుకండి: మనలో ప్రతి ఒక్కరమూ ఈ సమావేశపు మూడు రోజులూ హాజరవ్వగలిగేలా ఏర్పాట్లు చేసుకోవాలి. ప్రతి రోజూ సమావేశ స్థలానికి ముందుగానే చేరుకోవాలనీ, ఆదివారం ముగింపు ప్రార్థన వరకూ ఉండాలనీ మీరు పథకం వేసుకుంటున్నారా? అలాగైతే మీకు గొప్ప ఆశీర్వాదాలు లభిస్తాయి. సమావేశానికి హాజరు కావడమనేది ఎల్లప్పుడూ సులభం కాకపోవచ్చు. మీ ఉద్యోగ సంబంధ విషయాల్లో లేదా పనిలో చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకునేందుకు మీ వైపు నుండి కృత నిశ్చయం అవసరం. ప్రయాణం అన్నివేళలా సౌకర్యవంతంగా ఉండకపోవచ్చు. కానీ మీరు సమావేశానికి హాజరుకాకుండా మిమ్మల్ని నిరుత్సాహపరచేందుకు ఈ విషయాలను అనుమతించకండి.
7 ఈ చక్కని మాదిరిని గురించి ఆలోచించండి: గత సంవత్సరం ఆఫ్రికాలోని, పౌరుల మధ్య పోరాటాలు జరుగుతున్న ఒక దేశంలో కొంతమంది సహోదరులు, జిల్లా సమావేశానికి వెళ్తుండగా, దారిలో ఒక సైనిక గుంపును కలిశారు. “మీరెవరు, ఎక్కడికి వెళ్తున్నారు?” అని వాళ్ళు సహోదరులను అడిగారు. “మేము యెహోవాసాక్షులము. మేము మా జిల్లా సమావేశానికి వెళ్తున్నాము” అని సహోదరులు బదులిచ్చారు. ఒక సైనికుడు, “యెహోవాసాక్షులైన మీరు దేనికీ భయపడరు. మీరు మీ సమావేశానికి వెళ్ళండి, ఎటువంటి సమస్యా లేకుండా మీరు మీ సమావేశాన్ని జరుపుకోగలరు. అయితే, మీకు చాలా మంది సైనికులు ఎదురౌతారన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు రోడ్డు మధ్యలోనే నడవండి! చాలా మంది ప్రజలు గుమిగూడినట్లు కనిపించినా, రోడ్డు మధ్యలోనే నడవండి!” అని చెప్పాడు. వాళ్ళు ఆయన చెప్పినట్లుగానే చేసి, సమావేశ స్థలానికి సురక్షితంగా చేరుకున్నారు. వాళ్ళు పవిత్రమైన విషయాల గురించి మెప్పుదలను చూపించారు కనుక, దానికి తగిన ప్రతిఫలాన్ని పొందారు.
8 ఆఫ్రికాలోని మన సహోదరుల్లాగ, మనకు కూడా సవాళ్ళు ఎదురౌతాయి. నిస్సంశయంగా, మనం వాళ్ళ విశ్వాసాన్ని అనుకరించగలం, మన జిల్లా సమావేశంలోని అన్ని భాగాలకు హాజరవ్వాలని గట్టిగా నిర్ణయించుకోండి. కార్యక్రమమంతటికీ హాజరయ్యేందుకు మీరు చేసే ప్రయత్నాలను యెహోవా ఆశీర్వదిస్తాడని ఎరిగి, సర్దుబాట్లు ఏమైనా అవసరమైతే, మార్గదర్శనం కోసం యెహోవావైపుకు చూడండి.
9 ఆశీర్వాదాలను పొందండి: మనం దేవుని వాక్యం ద్వారా రక్షణ విషయంలో ఎదగవచ్చని తెలుసుకుని, దాని కోసం అపేక్షిస్తాం. (1 పేతు. 2:3) మనలో ప్రతి ఒక్కరమూ జిల్లా సమావేశానికి హాజరై, కార్యక్రమాన్ని శ్రద్ధగా ఆలకిస్తే, దేవుని వాక్యం మీద బలమైన విశ్వాసాన్ని పెంపొందించుకోగల్గుతాం, ఆ విధంగా, సాతాను దాడులను తట్టుకుని ఉండగల్గుతాం. మనకు పవిత్ర విషయాల గురించి సంపూర్ణ మెప్పుదల ఉందనీ, మనము “వెనుకతీయువారము కాముగాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగినవారమైయున్నాము” అనీ యెహోవాకూ చూపరులకూ చూపిస్తాం.—హెబ్రీ. 10:39; 12:16; సామె. 27:11.
10 యెహోవా దేవుడు, ఆకాశపు వాకిండ్లను విప్పి, మనకు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను సమృద్ధిగా కుమ్మరిస్తాడని మనం ఎదురుచూడగలం. (మలా. 3:10) “దేవుని వాక్యప్రకారం ప్రవర్తించేవారు” అనే జిల్లా సమావేశం శుక్రవారం ఉదయం ఆరంభమైనప్పటి నుండి ఆదివారం మధ్యాహ్నం ముగింపు ప్రార్థనలో “ఆమెన్!” అనే వరకు అక్కడ హాజరై ఉండాలన్న లక్ష్యాన్ని పెట్టుకోండి. అలా చేసినప్పుడు మీరు సంతోషాన్ని పొందగలరు!