మీరు చేసే పవిత్ర సేవలో సంతోషాన్ని కనుగొనడం
1 వారు “సంతోషముతో” తిరిగి వచ్చారు. 70 మంది శిష్యులు చాలాసేపు ప్రకటించిన అనంతరం తిరిగి వచ్చి యేసుతో చెప్పేటప్పుడు అలా భావించారని బైబిలు వృత్తాంతం తెలియజేస్తుంది. దేవుని చిత్తాన్ని చేయడంలో వారు అంతర్గత ఆనందాన్ని అనుభవించారు. (లూకా 10:17) పవిత్ర సేవలో అలాంటి ఆనందాన్నే పొందడానికి మీకేది సహాయం చేయగలదు?
2 అనుకూల దృక్పథం: యెహోవా ఘనమైన సంకల్పాన్ని గురించి తెలుసుకొనేందుకు ప్రజలకు సహాయం చేసే దేవుడిచ్చిన ఆధిక్యత మీకు ఉంది. మీ ప్రకటనా పని ద్వారా, దిగజారిపోతున్న ఈ లోక ఆచారాల నుండీ, అబద్ధ మత బంధాలనుండీ తప్పించుకునేలా ఒక వ్యక్తికి మీరు సహాయం చేయవచ్చు. నేడు మన చుట్టూ ఉన్న వైషమ్యం ఇక ఉండని లోకంలో జీవించే నిరీక్షణను వారికి అందించవచ్చు. ప్రతిస్పందించే ప్రజల హృదయాల్లో మనం సత్యపు విత్తనాలను విజయవంతంగా నాటినప్పుడు యెహోవాకు కలిగే ఆనందాన్ని గూర్చి ఆలోచించండి. మీ పూర్ణ హృదయంతో మీరు పరిచర్యలో పాటుపడుతుండగా ఆత్మ ఫలమైన సంతోషాన్ని మీలో ఉత్పత్తి అయ్యేలా చేయమని అనుకూల దృక్పథంతో ప్రార్థించండి.
3 ఆచరణాత్మకమైన తర్ఫీదు: యేసు తన 70 మంది శిష్యులతో నిర్వహించిన ఉపదేశ తరగతి ఆధునిక దిన సేవాకూటంతో పోల్చబడింది. వాళ్ళు తమ పరిచర్యను ప్రభావవంతంగా నిర్వర్తించగలిగేలా ఆయన తర్ఫీదునిచ్చాడు. (లూకా 10:1-16) ప్రజలను ఎలా సమీపించాలి, సంభాషణలు ఎలా ప్రారంభించాలి, గృహ బైబిలు పఠనాలను ఎలా ప్రారంభించి నిర్వహించాలి అనే విషయాల గురించి నేడు సేవాకూటం మీకు శిక్షణనిస్తుంది. బాగా కృషి చేస్తూ, మీ ప్రకటనా నైపుణ్యాలను వృద్ధి చేసుకోవడం ద్వారా, మీకేమైనా అసౌకర్యంగా ఉంటే లేదా అయోగ్యులమన్న భావాలు ఉంటే, అవి పోయి వాటి స్థానే నమ్మకం, ఆనందం వృద్ధి అవుతాయి.
4 భవిష్యత్తుపై దృష్టి నిలపండి: యేసు తాను శ్రమలను ఎదుర్కొన్నప్పటికీ పవిత్ర సేవలో ఆనందాన్ని కనుగొన్నాడు. ఎందుకు? ఎందుకంటే ఆయన తనకు లభించనైయున్న ఆశీర్వాదాలపై ఆధిక్యతలపై తన దృష్టిని సూటిగా కేంద్రీకరించాడు. (హెబ్రీ. 12:1, 2) యెహోవా నామంపై, దేవుని నూతనలోకంలో రానైయున్న ఆశీర్వాదాలపై మన మనస్సునూ హృదయాన్నీ కేంద్రీకరించడం ద్వారా మనం కూడా అలాగే చేయవచ్చు. ఇది మీ పరిచర్యలో మీకు ఆనందాన్ని తెచ్చి మీ పరిచర్యకు అర్థాన్నిస్తుంది.
5 నేడు మీరు కలిగివుండగల అత్యంత గొప్ప ఆధిక్యత యెహోవాకు పవిత్ర సేవ చేయడమే. కాబట్టి, “నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము” అని మీరు చెప్పవచ్చు.—కీర్త. 40:8.