ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు: ఫిబ్రవరిలో: కుటుంబ సంతోషానికిగల రహస్యము. మార్చిలో: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము. గృహ బైబిలు పఠనాలు ప్రారంభించటానికి ప్రత్యేక ప్రయత్నాలు చేయాలి. ఏప్రిల్, మే: కావలికోట, తేజరిల్లు! విడిపత్రికలు. ఆసక్తిగల వారికి అందించటానికి దేవుడు కోరుతున్నాడు బ్రోషూర్లను, కూడా ఉంచుకుని గృహ బైబిలు పఠనాలు ప్రారంభించటానికి ప్రయత్నం చేయాలి.
◼ సంఘ కార్యదర్శి, సేవా పైవిచారణకర్త క్రమ పయినీర్లందరి కార్యకలాపాలనూ సమీక్షిస్తుండాలి. ఎవరికైనా అవసరమైన గంటల్ని చేరుకోవటానికి కష్టంగా ఉన్నట్లైతే పెద్దలు సహాయాన్ని అందించటానికి ఏర్పాట్లు చేయాలి. సలహాలకోసం, సొసైటీ అక్టోబరు 1, 1998 తారీఖున పంపిన S-201 వార్షిక ఉత్తరాన్ని సమీక్షించండి. మన రాజ్య పరిచర్య 1986 అక్టోబరు (ఆంగ్లం) ఇన్‌సర్ట్ 12-20 పేరాలను కూడా చూడండి.
◼ 2000 సంవత్సరం ఏప్రిల్ 17వ తారీఖు వారం నుంచి సంఘ పుస్తక పఠనాల్లో దానియేలు ప్రవచనానికి అవధానమివ్వండి! (ఆంగ్లం) అనే పుస్తకాన్ని మనం పఠిస్తాము.
◼ లభ్యమౌతున్న కొత్త ప్రచురణలు:
దానియేలు ప్రవచనానికి అవధానమివ్వండి!—ఇంగ్లీషు, కన్నడ, గుజరాతి, తమిళం, పంజాబీ, మలయాళం.
దేవుని మార్గదర్శనము—పరదైసుకు మన మార్గము—అస్సామీ, ఇంగ్లీషు, కన్నడ, తమిళం, బెంగాలీ, మలయాళం.
జీవం—అది ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం ద్వారానా లేక సృష్టి ద్వారానా?—మలయాళం.