భూమ్యందంతటా యెహోవా నామాన్ని తెలియజేయడం
1 ‘భూదిగంతముల వరకూ సాక్షులై ఉండమని’ యేసు తన శిష్యులకు ఆజ్ఞాపించినప్పుడు, వారు అనుసరించడానికి ఆయన అప్పటికే మాదిరిని ఉంచాడు. (అపొ. 1:8) ఆయన ఎప్పుడు, ఎక్కడ ప్రజలను కలుసుకున్నా, మానవజాతి పట్ల దేవుని సంకల్పం గురించి వారితో మాట్లాడేవాడు. యేసును అనుసరిస్తూ, యెహోవా నామము ‘భూమ్యందంతటా తెలియజేయడానికి’ నమ్మకమైన దాసుని తరగతి వివిధ మార్గాలను ఉపయోగిస్తుంది.—యెష. 12:4, 5.
2 పూర్వపు దినాల్లో ఎలా ప్రకటించారు: గత కాలాల్లో ప్రసంగాలు వార్తాపత్రికల్లో ప్రచురించబడేవి; “ఫోటో డ్రామా ఆఫ్ క్రియేషన్” రూపొందించబడి లక్షలాదిమందికి చూపించబడింది; సౌండ్ కార్లు ఉపయోగించబడ్డాయి; ఫోనోగ్రాఫ్లు విస్తృతంగా ఉపయోగించబడ్డాయి; కొంతకాలంపాటు, రేడియో ఉపయోగించబడింది—ఇవన్నీ ఉపయోగించబడింది సువార్తను ప్రకటించేందుకే. అయితే ఆసక్తి చూపిన ప్రజల్లో ఆసక్తిని ఇంకా పెంపొందించేందుకు, వ్యక్తిగతంగా ప్రజలను కలవడానికే ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ప్రతిచోట యెహోవా నామం తెలియజేయబడేందుకు ఇంటింటి పరిచర్య చాలా ప్రభావవంతమైన మార్గంగా నిరూపించబడింది.—అపొ. 5:42.
3 మన దినాల్లో ఎలా ప్రకటిస్తున్నాము: మారుతున్న కాలాల్ని బట్టి, ప్రపంచం తీవ్రగతిన ప్రయాణం చేస్తోంది, చాలా ప్రదేశాల్లో అరుదుగా ప్రజలను ఇళ్లవద్ద కనుగొనగల్గుతాము. ఆధ్యాత్మిక విషయాల గురించి చదవడం, ధ్యానించడం వంటివాటిలో సమయాన్ని వెచ్చించడానికి ఇష్టపడేది చాలా తక్కువమంది. అందుకనే మనం దానికి తగినట్లుగానే మన ప్రచార పనిని సవరించుకోవాలి. ఇంటింటి పరిచర్య చేస్తూ ప్రాంతాన్ని పూర్తి చేయడమేగాక, ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళాలనీ, మనలో ఉన్న నిరీక్షణ గురించి సమాధానం చెప్పేందుకు “ఎల్లప్పుడు సిద్ధముగా” ఉండాలనీ మనం ప్రోత్సహించబడుతున్నాము. (1 పేతు. 3:15) తోటి పనివారితోనూ, తోటి విద్యార్థులతోనూ, వీధుల్లోనూ, పార్కుల్లోనూ, వాహనాలు నిలిపే స్థలంలోనూ, దుకాణాల్లోనూ, ప్రజలు ఎక్కడవుంటే అక్కడ ప్రకటించడానికి ప్రయత్నించాలని దాని అర్థం. యెహోవా మద్దతు ఉన్నందున, మన ప్రయత్నాలు విజయవంతమౌతాయి. ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళను కలవడంలో మీరూ భాగం వహిస్తున్నారా?
4 మన ప్రాంతంలో యెహోవా నామాన్ని తెలియజేసేందుకు మనం వ్యక్తిగతంగా సాధ్యమైనదంతా చేద్దాము. యథార్థ హృదయం గలవారిని ఆకర్షించడానికి యెహోవాపై ఆధారపడుతూ, మన పరిచర్యను పూర్తిగా నెరవేర్చడంలో మనం గొప్ప సంతృప్తిని పొందవచ్చు.—యోహా. 6:44.