కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 12/99 పేజీ 1
  • ఇంతకు ముందు మనం దాన్ని వినలేదా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఇంతకు ముందు మనం దాన్ని వినలేదా?
  • మన రాజ్య పరిచర్య—1999
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా జ్ఞాపికలు మీకు అతి ప్రియమైనవిగా ఉన్నాయా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • యెహోవా జ్ఞాపికలు మనల్ని ఆత్మీయంగా పురికొల్పుతున్నాయా?
    మన రాజ్య పరిచర్య—1995
  • యెహోవా జ్ఞాపికలు నమ్మదగినవి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • దేవుని వాక్యం మీ త్రోవను వెలుగుమయం చేయనివ్వండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1999
km 12/99 పేజీ 1

ఇంతకు ముందు మనం దాన్ని వినలేదా?

1 విన్నాము! తన ప్రజల ప్రయోజనార్థం యెహోవా తన వాక్యంలో అనేక విషయాల్ని పదేపదే చెప్తాడు. యేసు తరచూ రాజ్యానికి సంబంధించిన అనేక కోణాల్ని గూర్చిన తన బోధలను పదేపదే చెప్పాడు. ఆయన అపొస్తలులు ఆధ్యాత్మిక విషయాల్ని, సత్యంలో పాదుకుని ఉన్న వ్యక్తులతోనే పదేపదే పునఃసమీక్షించారు.—రోమా. 15:15, 16; 2 పేతు. 1:12, 13; 3:1, 2.

2 మన కాలంలో యెహోవా సంస్థ ముఖ్యమైన విషయాల్ని సంఘకూటాల్లో పదేపదే పునఃసమీక్షించేలా ఏర్పాటు చేసింది. ఆయా ప్రచురణల్ని అనేకసార్లు పఠించాము. అవును, మనం ముందు విన్నదాన్ని మళ్లీ వినడం ప్రాముఖ్యం!

3 పునరుక్తి ప్రాముఖ్యమైన ఒక అవసరాన్ని తీరుస్తుంది: యెహోవా జ్ఞాపికలు మన అవగాహన లోతును పెంచుతాయి, మన దృక్కోణాన్ని విశాలపరుస్తాయి, ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలన్న మన నిశ్చయాన్ని బలపరుస్తాయి. (కీర్త. 119:129) దేవుని ప్రమాణాల్ని సూత్రాల్ని పునఃసమీక్షించటం అద్దంలో చూసుకోవటంలాంటిది. అది మనల్నిమనం పరిశీలన చేసుకొనేలా, ‘వినువారుగా మాత్రమే’ ఉండకుండేలా మనకు సహాయం చేస్తుంది.—యాకో. 1:22-25.

4 ఒకవేళ సత్యాన్ని గూర్చి మనకు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండకపోతే ఇతర విషయాలు మన హృదయాల్ని ప్రభావితం చేస్తాయి. దేవుని జ్ఞాపికలు సాతాను లోకపు అవినీతి పోకడలను ఎదిరించేందుకు మనల్ని బలపరుస్తాయి. (కీర్త. 119:2, 3, 99, 133; ఫిలి. 3:1) దేవుని సంకల్పాల నెరవేర్పును గూర్చి క్రమంగా మనం అందుకునే జ్ఞాపికలు ‘మెలకువగా ఉండేలా’ మనల్ని ప్రోత్సహిస్తాయి. (మార్కు 13:32-37) ఆధ్యాత్మిక సత్యాల జ్ఞాపికలు నిత్యజీవ మార్గంలో నిలిచివుండేలా మనకు సహాయం చేస్తాయి.—కీర్త. 119:144.

5 వ్యక్తిగతంగా మనమెలా మేలు పొందవచ్చు: మనం ‘మన హృదయాలను దేవుని జ్ఞాపికల వైపుకి త్రిప్పుకోవాలి.’ (కీర్త. 119:36, NW) ఒక సంఘకూటంలో బాగా పరిచయం ఉన్న విషయం పరిశీలించ బడుతున్నప్పుడు మనం ముందుగా సిద్ధపడాలి, చూపించబడిన లేఖనాలను తెరచి చూడాలి, ఆ సమాచారాన్ని ఎలా అన్వయించుకోవాలో విచారించుకోవాలి. దైవపరిపాలనా పాఠశాలలోని వ్రాతపూర్వక పునఃసమీక్షను అంత అవసరం లేదన్నట్లు దాన్ని ఉపేక్షించకూడదు. (లూకా 8:18) అశ్రద్ధ గలవారిగా తయారవ్వాలని మనం ఎన్నడూ అనుకోకూడదు ఎందుకంటే మన కూటాల్లో ప్రాథమిక సత్యాలను గూర్చి తరచూ మళ్లీ మళ్లీ చెప్పబడుతుంది గనుక.—హెబ్రీ. 5:11.

6 కీర్తనల గ్రంథకర్త కల్గివున్న దృక్పథాన్నే మనమూ పంచుకుందాము: “సర్వసంపదలు దొరికినట్లు నీ జ్ఞాపికల మార్గమునుబట్టి నేను సంతోషించుచున్నాను.” (కీర్త. 119:14, NW) అవును ఈ విలువైన విషయాలను మనం మునుపు విన్నాము, బహుశ వాటిని మళ్లీ వింటాము. ఎందుకని? ఎందుకంటే యెహోవాకు తెలుసు వాటిని వినటం మనకు అవసరమని!

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి