సెప్టెంబరులోని సేవా కూటాలు
గమనిక: మన రాజ్య పరిచర్య రానున్న నెలల్లో వారం వారం జరిగే సేవా కూటపు షెడ్యూల్‌ను ఇస్తుంది. అయితే, “దేవుని ప్రవచన వాక్యము” జిల్లా సమావేశానికి హాజరయ్యేందుకూ, ఆ సమావేశానంతరపు వారంలో జరిగే సేవా కూటంలో 30 నిమిషాలపాటు సమావేశ కార్యక్రమ ఉన్నతాంశాలను పునఃసమీక్షించేందుకూ వీలుగా సంఘాలు సేవా కూటాల షెడ్యూల్‌లో అవసరమైన సవరింపులు చేసుకోవచ్చు. సమావేశపు కార్యక్రమంలో ఒక్కొక్క రోజును ఒక సహోదరునికి చొప్పున యోగ్యులైన ముగ్గురు సహోదరులకు ముందుగానే నియమించాలి. వాళ్లు, ముఖ్యాంశాలపై శ్రద్ధను కేంద్రీకరిస్తారు. అలా బాగా సిద్ధపడిన పునఃసమీక్ష వ్యక్తిగతంగా అన్వయించుకునేలా, ప్రాంతీయ పరిచర్యలో ఉపయోగించేలా కీలక అంశాలను గుర్తుంచుకునేందుకు సంఘానికి సహాయపడుతుంది. ప్రేక్షకులలో నుంచి ఏవైనా వ్యాఖ్యానాలుగానీ, సంబంధిత అనుభవాలుగానీ ఉంటే అవి క్లుప్తంగానూ, విషయానికి సంబంధించినవిగానూ ఉండాలి.
సెప్టెంబరు 6తో ప్రారంభమయ్యే వారం
పాట 190 (6)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు.
17 నిమి: “మీరు ఒక ఉద్దేశంతో పనిచేస్తున్నారా?” ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కంటే తక్కువ సమయానికి పరిమితం చేయండి, ఉపోద్ఘాతానంతరం చర్చను ప్రశ్నా జవాబులతో కొనసాగించండి. మన పరిచర్య పుస్తకం 88-89 పేజీల్లో ఉన్న వ్యాఖ్యానాలను జతచేయండి. తమ పరిచర్యలో క్రమంగానూ, సంపూర్ణ సాక్ష్యమివ్వాలనీ ప్రతీ ఒక్కరిని ప్రోత్సహించండి.
18 నిమి: “తల్లిదండ్రులారా—మీ పిల్లలకు మంచి మాదిరినుంచండి.” పెద్ద ఇచ్చే క్లుప్తమైన ఉపోద్ఘాతము, తదనంతరం తండ్రులైన ఇద్దరు సహోదరులు ఆ శీర్షికను చర్చిస్తారు. తమ పిల్లలు పాఠశాలలో, టీవీ మూలంగా, సాక్షులుకాని బంధువుల ద్వారా, ఇతరుల ద్వారా హానికరమైన అభ్యాసాలకూ, దృక్పథాలకూ ప్రభావితమౌతున్నారు, వాటి నుంచి వారిని ఎలా కాపాడాలనే విషయంలో తమ శ్రద్ధను వారు వ్యక్తపరుస్తారు. అమర్యాదకరమైన దృక్పథాలు, లోకస్థుల్లా మాట్లాడడం, కన్పించడం, క్షేమాభివృద్ధికరంకాని వినోదం వంటి వాటిని ఆ సహోదరులు పరిశీలిస్తారు. మంచి మాదిరిని ఉంచాల్సిన గొప్ప అవసరాన్ని గురించి అవలోకించిన తర్వాత, కుటుంబ పఠనం పట్లా, సంఘకూటాల పట్లా, క్షేత్రసేవ పట్లా గొప్ప ఉత్సాహాన్ని పెంపొందించుకునేందుకు గల మార్గాలను గురించి వారు చర్చిస్తారు.—కావలికోట జూలై 1, 1999 8-22 పేజీలు; తేజరిల్లు! అక్టోబరు 8, 1992 5-6 పేజీలు చూడండి.
పాట 101 (28), ముగింపు ప్రార్థన.
సెప్టెంబరు 13తో ప్రారంభమయ్యే వారం
పాట 171 (11)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్టు.
15 నిమి: మనం గత సంవత్సరం ఎలా చేశాము? సేవా పై విచారణకర్త ఇచ్చే ప్రసంగం. 1999 సేవా సంవత్సరం కోసం సంఘ రిపోర్టు నుండి ఉన్నతాంశాలను పునఃసమీక్షించండి. సాధించిన మంచి వాటినిబట్టి మెచ్చుకోండి. బహుశా ఎక్కడ అభివృద్ధి అవసరమో ఆ అంశాలను చూపించండి. కూటాలకు హాజరవ్వడంలోనూ, పుస్తక పఠనాలను నిర్వహించడంలోనూ సంఘం ఎలా చేసిందో అన్న దానిపై దృష్టి సారించండి. రానున్న సంవత్సరం కోసం ఆచరణాత్మక లక్ష్యాలను గురించి క్లుప్తంగా తెలియజేయండి.
20 నిమి: “ఒక హిందువుతో మీరు ఏమని చెబుతారు?” ప్రశ్నా జవాబులు. ఒక వ్యక్తితో చర్చించేందుకు పునాదిని వేయడంలో ఉన్న ప్రయోజనాన్ని నొక్కితెల్పి, మనం హిందువుతో ఏకీభవించగల విషయాలను తెలియజేయండి. ఏ మత నేపథ్యానికి చెందిన ప్రజలకైనా సరే సాక్ష్యమిచ్చేలా ఇవ్వబడిన అందింపులను ఎలా మలచవచ్చో చూపించండి. ఒక హిందువుకి సాక్ష్యమివ్వడానికి బాగా సిద్ధపడిన ఒక అందింపును ప్రదర్శించండి. హిందూమతాన్ని గూర్చిన మరింత సమాచారం కొరకు ఫిబ్రవరి 1998 మన రాజ్య పరిచర్య ఇన్‌సర్ట్; బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను 14వ పేజీ; దేవుని కొరకు మానవజాతి అన్వేషణ (ఆంగ్లం), 5వ అధ్యాయం చూడండి.
పాట 140 (26), ముగింపు ప్రార్థన.
సెప్టెంబరు 20తో ప్రారంభమయ్యే వారం
పాట 193 (18)
5 నిమి: స్థానిక ప్రకటనలు.
15 నిమి: స్థానిక అవసరాలు.
25 నిమి: “1999 ‘దేవుని ప్రవచన వాక్యము’ జిల్లా సమావేశాలు.” (1-15 పేరాలు) ప్రశ్నా జవాబులు. 6, 8, 11, 15 పేరాలను చదవండి. శుక్రవారం కార్యక్రమాలతో సహా సమావేశమంతటికీ మనం ఎందుకు హాజరవ్వాలో కారణాలను తెల్పండి. ప్రతి రోజు సమావేశానికి మన మధ్యాహ్న భోజనాన్ని మనమే తెచ్చుకోవడం విషయంలో సంస్థ ఇచ్చిన నిర్దేశనాన్ని అనుసరించడంలో ఉన్న ప్రాముఖ్యతను నొక్కి తెల్పండి.
పాట 19 (4), ముగింపు ప్రార్థన.
సెప్టెంబరు 27తో ప్రారంభమయ్యే వారం
పాట 141 (17)
10 నిమి: స్థానిక ప్రకటనలు. సెప్టెంబరు నెల సేవా రిపోర్టును ఇవ్వమని అందరికీ గుర్తు చేయండి. అక్టోబరులో పత్రికలను పంచిపెట్టడంలో పూర్తి భాగాన్ని వహించేందుకు పథకాలు వేసుకోమని అందరినీ ప్రోత్సహించండి. అందింపుల్ని ఎలా సిద్ధపడాలన్న విషయంపై మన రాజ్య పరిచర్య అక్టోబరు 1996 8వ పేజీలో ఉన్న సలహాలలో కొన్నింటిని పునఃసమీక్షించండి. తాజా పత్రికలను ఉపయోగిస్తూ, మాట్లాడగల చక్కని అంశాలలో కొన్నింటిని ప్రస్తావించి, ఒకటి రెండు అందింపులను క్లుప్తంగా ప్రదర్శించండి.
15 నిమి: ప్రశ్నా భాగం. పెద్ద ఇచ్చే ప్రసంగం.
20 నిమి: “1999 ‘దేవుని ప్రవచన వాక్యము’ జిల్లా సమావేశాలు.” (16-23 పేరాలు) ప్రశ్నా జవాబులు. 17-20 పేరాలు చదవండి. దుస్తులు, కేశాలంకరణ, ప్రవర్తనలనేవి మన శ్రద్ధాపూర్వకమైన అవధానాన్ని నిలపాల్సిన విషయాలు ఎందుకై ఉన్నాయో నొక్కిచెప్పేందుకు ఎత్తివ్రాయబడిన, తెలుపబడిన లేఖనాలను ఉపయోగించండి.
పాట 87 (6), ముగింపు ప్రార్థన.