మీరు ఒక ఉద్దేశంతో పనిచేస్తున్నారా?
1 యెహోవా ఉద్దేశం గల దేవుడు. (యెష. 55:10, 11) మనం ఆయనను అనుకరించాలని మనకు ఉద్బోధించబడుతోంది. (ఎఫె. 5:1) మనం పరిచర్యను చేసే విధానంలో కూడా అది వ్యక్తమవ్వాలి. కాబట్టి “మీరు ఒక ఉద్దేశంతో పనిచేస్తున్నారా?” అన్న ప్రశ్న సముచితమైనదే.
2 మీరు ఇంటింటా ప్రకటించడం, అనియతంగా సాక్ష్యమివ్వడం, సాహిత్యాన్ని పంపిణీ చేయడం, ఇవన్నీ ఉద్దేశపూరితమైన పరిచర్యలో భాగమే. కానీ మనకివ్వబడిన ఆజ్ఞలో నియామకంలో ప్రకటించడమే కాక, శిష్యులను చేయడం కూడా ఇమిడి ఉంది. (మత్త. 28:19, 20) రాజ్యాన్ని గురించిన సత్యపు విత్తనాలను విత్తిన తర్వాత, వాటిని ఎదిగేలా చేయమని మనం యెహోవా వైపు చూస్తూ, మనం వాటికి నీళ్ళు పోయడానికి, క్రమంగా తగిన శ్రద్ధను చూపించడానికి మనం వెళ్ళవలసిన అవసరం ఉంది. (1 కొరిం. 3:6) అందుకు, పునర్దర్శనాలు చేయాలన్న స్పృహను, బైబిలు పఠనాలు ప్రారంభించాలన్న స్పృహను మనం కలిగి ఉండవలసిన అవసరం ఉంది.
3 మీ పరిచర్యను విస్తృతం చేసుకోండి: మీరు సేవలో చేసిన దాన్ని వెనుదిరిగి చూసుకొని, “నేను అనుకున్న దాన్ని చేయగల్గాను” అని మీకు మీరే చెప్పుకోగల్గినప్పుడు, మీకు మంచి అనుభూతి ఎల్లప్పుడూ కలుగుతుంది. 2 తిమోతి 4:5లో వ్రాయబడినట్లుగా, పౌలు, “నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము” అని ఉద్బోధించాడు. అలా చేయడంలో, ఆసక్తి కనబరచినవారందరి దగ్గరికీ తిరిగివెళ్ళేందుకు మీరు చేసే ప్రయత్నాలను విస్తృతపర్చుకోవడం ఇమిడి ఉంది. మీ వారపు సేవా షెడ్యూల్లో, పునర్దర్శనాలను చేసేందుకు ఖచ్చితమైన సమయాన్ని కేటాయించుకోండి. నీతివైపుకు మ్రొగ్గుచూపేవారితో బైబిలు పఠనాలను ప్రారంభించడానికి ప్రయత్నం చేయాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేయండి. పరిచర్యలో భాగం వహించేటప్పుడు మీ లక్ష్యం అదే అయివుండాలి.
4 తమ బైబిలు విద్యార్థులు ఒక ప్రాంతీయ సమావేశంలో బాప్తిస్మం పొందినప్పుడు తమకు ఎలాంటి అనుభూతి కలిగిందో చెప్పమని ప్రచారకులను అడగండి. బాప్తిస్మం పొందినవాళ్ళు ఎంత ఎక్కువగా ఆనందించారో వాళ్ళు కూడా దాదాపుగా అంత ఎక్కువగా ఆనందించి ఉంటారు. వాళ్ళు ఒక గొప్ప ఉద్దేశాన్ని నెరవేర్చారు! “శిష్యులను తయారు చేయడమంటే, యెహోవాకు మరనేకమంది స్తుతికర్తలను తయారు చేయడమని అర్థం. సత్యాన్ని అంగీకరించేవారికి జీవం అని దానర్థం. ఇతరులకు సత్యాన్ని బోధించడమంటే నాకు చాలా ఇష్టం—అది ఎంత బాగుంటుందో! . . . యెహోవాను ప్రేమించేవారిగా మారిన అనేకులు ఇప్పుడు నాకు ప్రియాతి ప్రియమైన స్నేహితులుగా మారారు” అని శిష్యులను తయారు చేసే ఒకరు వ్యక్తపర్చారు.
5 యెహోవాకు సమర్పించుకున్న ఒక సేవకుడుగా అయ్యేందుకు ఒకరికి సహాయపడగల్గడాన్ని గురించి ఊహించండి! ఆనందించడానికి అదెంతటి కారణం ! అలాంటి ఫలితం, పరిచర్యలో ఒక ఉద్దేశంతో పని చేసినప్పుడే వస్తుంది.—కొలొ. 4:17