కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 4/99 పేజీ 7
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—1999
మన రాజ్య పరిచర్య—1999
km 4/99 పేజీ 7

ప్రకటనలు

◼ ఏప్రిల్‌, మే: కావలికోట, తేజరిల్లు! పత్రికల చందాలు. ఆసక్తి గల వారికి ఇచ్చేందుకు దేవుడు కోరుతున్నాడు అనే బ్రోషూరులను దగ్గర ఉంచుకోండి. గృహబైబిలు పఠనాన్ని ప్రారంభించేందుకు కృషి చేయండి. జూన్‌: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము. జూలై, ఆగస్టు: ఈ క్రింద ఇవ్వబడిన 32-పేజీల బ్రోషూర్లలో దేన్నైనా ఉపయోగించవచ్చు: జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, పరదైసును తీసుకొనివచ్చు ప్రభుత్వము, భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము!, మనం మరణించినప్పుడు మనకేమి సంభవిస్తుంది? (ఆంగ్లం), మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే. ఈ బ్రోషూర్లను అంటే మన సమస్యలు వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?, మృతుల ఆత్మలు—అవి మీకు సహాయపడగలవా లేక హాని తలపెట్టగలవా? అవి నిజంగా ఉనికిలో ఉన్నాయా? (ఆంగ్లం), యుద్ధంలేని లోకం ఎప్పటికైనా ఉంటుందా? (ఆంగ్లం), సర్వమానవాళి కొరకైన గ్రంథము అనే బ్రోషూర్లను సముచితమైనచోట్ల ప్రతిపాదించవచ్చు.

◼ నియమించబడని ప్రాంతంలో పని చేస్తున్నప్పుడు, ప్రచారకులు జ్ఞానము పుస్తకాన్ని గానీ, దేవుడు కోరుతున్నాడు బ్రోషూరును గానీ, ప్రతిపాదించవచ్చు. ఒకవేళ గృహస్థునికి అప్పటికే ఈ రెండు ప్రచురణలు ఉన్నట్లయితే మరే ఇతర ప్రచురణలనైనా ప్రతిపాదించవచ్చు. ఇండ్లవద్ద లేనివారికీ, సాహిత్యాన్ని నిరాకరించే వారికీ అందించేందుకుగానూ ప్రతిఒక్కరూ, రకరకాల కరపత్రాలను తీసుకువెళ్ళాలి. ఆసక్తిగలవారిని సందర్శించేందుకు ప్రయత్నాలు చేయాలి. మరిముఖ్యంగా, ప్రత్యేక పయినీర్లు పనిచేసిన ప్రాంతములో లేదా చుట్టుప్రక్కల సంఘాలకు దగ్గరలో ఉన్న నియమించబడని ప్రాంతంలో నివసించే ఆసక్తిగలవారిని సందర్శించడానికి ప్రయత్నాలు చేయాలి.

◼ సంఘ పైవిచారణకర్తల, కార్యదర్శుల అడ్రస్‌లకూ టెలిఫోన్‌ నెంబర్లకూ సంబంధించిన రికార్డును ఎప్పటికప్పుడు నవీకరించడం సంస్థకు అవసరం. ఎప్పుడైనా మార్పు వచ్చినట్లయితే ప్రిసైడింగ్‌ ఓవర్‌సీయర్‌/సెక్రటరీ ఛేంజ్‌ ఆఫ్‌ అడ్రస్‌ ఫారమ్‌ (S-29)ను కార్యదర్శి పూర్తిచేసి సంస్థకు వెంటనే పంపించాలి. దయచేసి వారి పేర్ల క్లుప్తరూపాన్ని గాక పూర్తి పేర్లను మాత్రమే పంపించండి.

◼ ఈ క్రింద ఇవ్వబడిన పయినీర్‌ ఫారమ్‌లు సంఘంలో కావలసినన్ని ఉండేలా సంఘకార్యదర్శులు చూసుకోవాలి: అప్లికేషన్‌ ఫర్‌ రెగ్యులర్‌ పయినీర్‌ సర్వీస్‌ (S-205), అప్లికేషన్‌ ఫర్‌ ఆగ్జిలరీ పయినీర్‌ సర్వీస్‌ (S-205b), నోటిఫికేషన్‌ ఫర్‌ డిస్‌కంటిన్యూయింగ్‌ రెగ్యులర్‌ పయినీర్‌ సర్వీస్‌ (S-206). వీటిని లిటరేచర్‌ రిక్వస్ట్‌ ఫారమ్‌ (S-14) నందు ఆర్డరు చేయవచ్చు. కనీసం ఒక సంవత్సరానికి కావలసినన్ని స్టాకులో ఉంచుకోవాలి. క్రమ పయినీరు దరఖాస్తు ఫారమ్‌ పూర్తిగా నింపబడిందో లేదోనని రూఢిపర్చుకోవడానికి దాన్ని పునఃపరిశీలించాలి. తాము బాప్తిస్మం తీసుకున్న ఖచ్చితమైన తారీఖు ధరఖాస్తుదారులకు గుర్తులేకపోతే, వాళ్ళు ఆ తారీఖును ఉజ్జాయింపుగా లెక్కించి దాన్ని వ్రాసిపెట్టుకోవాలి.

◼ ఫిబ్రవరి నెల స్టేట్‌మెంటుతోపాటు స్పెషల్‌ రిక్వస్ట్‌ ఫారమ్‌ ఫర్‌ ఏన్యువల్‌ ఐటమ్స్‌ను ప్రతి సంఘానికి పంపించడం జరిగింది. సంఘాలు 1999 జిల్లా సమావేశపు బ్యాడ్జి కార్డుల కోసం, 2000 సంవత్సరానికి కావల్సిన ఇతర వార్షిక ఐటమ్‌ల కోసం ఇంకా రిక్వస్ట్‌ చేయని సంఘాలు తమ రిక్వస్ట్‌లను వెంటనే పంపించాలి. ఒకవేళ మీకు ప్లాస్టిక్‌ బ్యాడ్జి కార్డుహోల్డర్లు కావలసినట్లయితే, వాటిని విడిగాగాక అనేక ఐటమ్‌లు ఉన్న మీ రెగ్యులర్‌ లిటరేచర్‌ రిక్వస్టు ఫారమ్‌ (S-AB-14)తో పాటు ఆర్డర్‌ చేయండి, ఎందుకంటే చిన్న ప్యాకేజీలు రవాణాలో తరచూ పోతున్నాయి.

◼ 1998 డిసెంబరు 20న లోనావ్లాలో జరిగిన మూడవ పరిచర్య శిక్షణ పాఠశాలలో ఇండియా నుండి 23 మంది విద్యార్థులు, నేపాల్‌ నుండి ముగ్గురు విద్యార్థులు పట్టభద్రులయ్యారు. విద్యార్థులు 25 సంఘాల నుండి వచ్చారు. 18 మంది విద్యార్థులు వారి వారి స్వంత సంఘాల్లో సేవచేయడానికి తిరిగి వెళ్ళగా, ఎనిమిది మంది విద్యార్థులు క్రొత్త ప్రత్యేక పయినీర్లుగా పూర్తికాల పరిచారకులుగా సేవలో ప్రవేశించారు. సేవచేయడానికి ఈ ఒంటరి సహోదరులు ఏయే సంఘాలకు నియమించబడ్డారో ఆయా సంఘాలకు గొప్పఆశీర్వాదాలు ప్రవహించాలని మనం ప్రార్థిద్దాం.

◼ జనవరి 1, 1999 నుండి మన రాజ్య పరిచర్య అస్సామీ, మిజోరామ్‌ భాషలలో లభ్యమవుతోంది.

◼ లభ్యమయ్యే క్రొత్త ప్రచురణలు:

శాంతియుతమైన నూతనలోకంలో జీవితము (కరపత్రం నెం. 15)—నెవారి

◼ లభ్యమయ్యే క్రొత్త ఆడియో క్యాసెట్లు:

కుటుంబములారా—అనుదిన బైబిలు పఠనాన్ని మీ జీవిత మార్గంగా చేసుకోండి—ఆంగ్లం, కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, హిందీ

ఈ క్రింద ఇవ్వబడిన పుస్తకాలు ఇకమీదట లభ్యం కావు కాబట్టి జనవరి 1, 1999 నాటి వాచ్‌టవర్‌ పబ్లికేషన్‌ లిస్ట్‌ను సవరించాల్సి ఉంటుంది:

పుస్తకాలు: మీ యౌవనం—దానిని శ్రేష్ఠంగా అనుభవించడం, నిజమైన శాంతి భద్రతలు—మీరు ఎలా కనుగొనగలరు?—మలయాళం

చిన్నపుస్తకాలు: శ్రద్ధ కనపర్చే దేవుడు ఉన్నాడా? “ఈ రాజ్య సువార్త”—తమిళం

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి