కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 4/99 పేజీలు 5-6
  • దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
  • మన రాజ్య పరిచర్య—1999
మన రాజ్య పరిచర్య—1999
km 4/99 పేజీలు 5-6

దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష

1999 జనవరి 4 నుండి ఏప్రిల్‌ 19 మధ్య వారాల్లోని ప్రసంగాల సమాచారంపై పుస్తకాలను మూసి చేసే పునఃసమీక్ష. కేటాయంచబడిన సమయంలోనే మీరు వ్రాయగల్గినన్ని ప్రశ్నలకు జవాబులు వ్రాసేందుకు వేరే పేపరును ఉపయోగించండి.

[గమనిక: వ్రాతపూర్వక పునఃసమీక్ష సమయంలో ఏ ప్రశ్నలకు సమాధానమివ్వడానికైనా కేవలం బైబిలును మాత్రమే ఉపయోగించవచ్చు. వాటి ప్రక్కనున్న రెఫరెన్సులు మీ వ్యక్తిగత పరిశోధనకైయున్నవి. కావలికోట రెఫరెన్సులున్న ప్రతిచోట పేజీ నెంబర్లు, పేరా నెంబర్లు ఉండకపోవచ్చు.]

ఈ క్రింది వాక్యాలు సత్యమో, అసత్యమో వ్రాయండి:

1. బైబిలులో లిఖించబడిన ప్రతీ అక్షరాన్నీ యెహోవా చెప్పి వ్రాయించలేదు. (2 తిమో. 3:16) [w97 6/15 పేజీ 5 పేరా 3]

2. కుటుంబ ప్రశాంతత, పిల్లల ఆధ్యాత్మిక అభివృద్ధి అనేవి పూర్తిగా తలిదండ్రులపైనే ఆధారపడి ఉంటాయి. (సామె. 22:6) [fy పేజీ 85 పేరా 19]

3. పాపము ‘వాకిట పొంచివుంది’ గనుక కయీను గంభీరమైన తప్పు చేయకుండా ఉండలేకపోయాడు. (ఆది. 4:7) [వారపు బైబిలు పఠనము; w94 6/15 పేజీ 14 పేరా 11 చూడండి.]

4. ఒక యౌవనుడు పెద్దవాడవుతూ ఉండగా అతనికి వినోదాన్ని ఎంపిక చేసుకునే విషయంలో అధిక స్వేచ్ఛను అనాలోచితంగానే ఇచ్చేయాలి. [5, fy పేజీ 73 పేరా 20]

5. మన సృష్టికర్తను ప్రీతిపర్చాలనే కోరిక, మనం ఎల్లవేళలా సత్యం పలకడానికి అన్నింటికన్నా గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తుంది. (సామె. 6:17) [g97 3/8 పేజీ 28 పేరా 5]

6. మన ప్రార్థనలో ‘మన నోటి మాటలు మన హృదయ ధ్యానము యెహోవాకు అంగీకృతం’ కావాలంటే వీలైనంత మేరకు సుదీర్ఘంగా ప్రార్థించడానికి గట్టిగా ప్రయత్నించాలి. (కీర్త. 19:14) [w97 7/1 పేజీ 29 పేరా 4-5]

7. ఆదికాండము 26:5 లో చెప్పబడిన యెహోవా ఆజ్ఞలు, కట్టడలు, నియమాలు ధర్మశాస్త్ర నిబంధనలోనివే. [వారపు బైబిలు పఠనము; w92 7/1 పేజీ 10 పేరా 8 చూడండి.]

8. లూకా 8:48 లో “నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను” అని యేసు చెప్పినప్పుడు రోగగ్రస్థురాలైన ఆ స్త్రీ తాను స్వస్థత పొందడానికి ముందు ఆయన మెస్సీయా అని విశ్వసించి తన విశ్వాసాన్ని ప్రకటించాలని ఆయన భావం. [w97 7/1 పేజీ 4 పేరా 2-4]

9. మానవ జాతి లేదా మానవ సమాజాన్ని సూచించడానికి “భూమి” అన్న పదాన్ని ఉపయోగించిన అనేక బైబిలు వచనాల్లో ఆదికాండము 11:1 ఒకటి. [g97 2/8 పేజీ 19 పేరా 3]

10. దీనా తాను అంగీకరించినట్లు ఎటువంటి సూచనా లేకపోయినప్పటికీ ఆమె తన కన్యాత్వాన్ని కోల్పోవడంలో కొంత బాధ్యతను కలిగివుంది. (ఆది. 34:1, 2) [వారపు బైబిలు పఠనము; w85 6/15 పేజీ 31 పేరా 4 చూడండి.]

ఈ క్రింది ప్రశ్నలకు జవాబులివ్వండి:

11. ఆదికాండము 3:1-5 వచనాల్లో ఉన్న తన తర్కం ద్వారా సాతాను ఏమి సూచించాడు? [వారపు బైబిలు పఠనము; w95 7/15 పేజీ 5 పేరా 1 చూడండి.]

12. ప్రకటన 19:15 లో చెప్పబడినట్లు, క్రీస్తు నోటనుండి బయలువెడలే “వాడిగల ఖడ్గము” ఏమిటి? [వారపు బైబిలు పఠనము; w90 5/15 పేజీ 4 పేరా 4 చూడండి.]

13. నోవహుకాలంనాటి జలప్రళయం గురించిన కచ్చితమైన తేదీలను మోషే ఇచ్చాడన్న వాస్తవం ఏమి చూపిస్తుంది? [5, g97 3/8 పేజీ 24 పేరా 4]

14. అబ్రాహాము “యెహోవా నామమున ప్రార్థన చేసెను” అంటే దానర్థం ఏమిటి? (ఆది. 12:8) [వారపు బైబిలు పఠనము; w89 7/1 పేజీ 20 పేరా 9 చూడండి.]

15. “నా కృప నీకు చాలును” అని యెహోవా పౌలుతో చెప్పిన సందర్భంలో ఆయన మాటలకు అర్థం ఏమిటి? (2 కొరిం. 12:9) [w97 6/1 పేజీ 25 పేరా 3]

16. లోతు భార్య వెనక్కి తిరిగిచూసి, తద్వారా ఆమె ఉప్పుస్తంభమయ్యేలా చేసినదేమిటి? (ఆది. 19:26) [వారపు బైబిలు పఠనము; w90 4/15 పేజీ 18 పేరా 10 చూడండి.]

17. దొంగిలించబడిన వస్తువులను కొనే విషయంలో క్రైస్తవులు ఎలాంటి తలంపును కలిగివుండాలి? (నిర్గ. 22:1; యిర్మీ. 17:11) [వారపు బైబిలు పఠనము; w92 6/15 పేజీ 30 పేరా 3; పేజీ 31 పేరాలు 1, 6-7 చూడండి.]

18. ఆదికాండము 33:18 ప్రకారం, కనానీయులతో సహవాసం చేయడం యాకోబుకు ఇష్టం లేదని ఎలా చూపించాడు? [వారపు బైబిలు పఠనం; w95 9/15 పేజీ 21 పేరా 4 చూడండి.]

19. ఆదికాండము 37:13 లో వర్ణించబడిన యోసేపు చర్యలు యేసుకు ఎలా సమాంతరంగా ఉన్నాయి? [వారపు బైబిలు పఠనం; w87 5/1 పేజీ 12 పేరా 12 చూడండి.]

20. కోపాన్ని వ్యక్తపర్చే విషయంలో దేవునికి మానవునికి ఉన్న వ్యత్యాసం ఏమిటి? [g97 7/8 పేజీ 29 పేరా 2-3]

ఈ క్రింది వాక్యాలను పూరించేందుకు అవసరమైన పదాన్ని(పదాల్ని) పదబంధాలను చేర్చండి:

21. _________________________ కారణం లేకుండా ఇతరులకు _________________________ ఉద్దేశాలను ఆపాదించడం వారికి తీర్పు తీర్చడంతో సమానం. [w97 5/15 పేజీ 26 పేరా 5]

22. పిల్లలను పెంచడంలో మరీ _________________________, లేక విపరీతంగా _________________________ యొక్క ఫలితాలను తలిదండ్రులు గ్రహించడానికి రెహబాము మరియు ఏలీ ఉదాహరణలు సహాయం చేస్తాయి. [fy పేజీలు 80-1 పేరాలు 9-13]

23. _________________________ ను తీసుకోవడం, దైవిక _________________________ ని వృద్ధి చేసుకోవడానికి ఎంతో ప్రాముఖ్యమైన చర్య. [w97 8/1 పేజీ 4 పేరా 5]

24. తప్పిదాన్ని గురించి నివేదించడమంటే _________________________ పట్లా, _________________________పట్లా, _________________________ పట్లా సూత్రబద్ధమైన ప్రేమను చూపించడమే. [w97 8/15 పేజీ 30 పేరా 2]

క్రింది వాక్యాలలో నుండి సరైన జవాబును ఎంపిక చేయండి:

25. (కఠినమైన; సౌమ్యమైన; సరియైన) క్రమశిక్షణ తమ పిల్లల పట్ల తలిదండ్రులకు గల ప్రేమకు ఒక నిదర్శనం. (హెబ్రీ. 12:6, 11) [fy పేజీ 72 పేరా 18]

26. యోహాను 8:32 లోని యేసు మనస్సులో ఉన్నది (రోమా పరిపాలన; మూఢవిశ్వాసం; పాప మరణాలు) నుండి స్వాతంత్ర్యము. [w97 2/1 పేజీ 5 పేరా 1]

27. ఆదికాండము 22:18 చివరి నెరవేర్పుగా ఆ సంతానం (ఇస్సాకును; ఇశ్రాయేలీయులను; యేసును, 1,44,000మందినీ) సూచిస్తుంది. [వారపుబైబిలు పఠనం; w98 2/1 పేజీ 14 పేరా 8 చూడండి.]

28. లైంగిక దుర్నీతిని విజయవంతంగా ఎదుర్కొనేందుకు యోసేపుకు సహాయం చేసింది (మోషే ధర్మశాస్త్రానికి విధేయత చూపించడం; దేవుడున్నాడన్న నమ్మకం, ఆయన్ని బాధపెడతానన్న భయం; శిక్ష అంటే భయం). (ఆది. 39:9) [వారపు బైబిలు పఠనం; w81 2/15 పేజీ 7 పేరా 2 చూడండి.]

క్రింద ఇవ్వబడిన వాక్యాలతో ఈ క్రింది లేఖనాలను జతచేయండి:

సామె. 5:3, 4; 15:22; 20:11; ఎఫె. 5:19; 2 తిమో. 3:16

29. నైతికమైన, పరిశుభ్రమైన జీవితం గడపడం యొక్క ప్రాముఖ్యత యందు తమ పిల్లలు హృదయపూర్వక నమ్మకాన్ని కల్గివుండేలా చూడటం తలిదండ్రులకు ఎంతో ప్రాముఖ్యం. [fy పేజీ 67 పేరా 8]

30. సంభాషణా ద్వారాలు తెరిచివుంచడానికి తలిదండ్రులు, యౌవనస్థులైన వారి పిల్లల మధ్య ఆంతరంగిక సంభాషణ ప్రాముఖ్యము. [fy పేజీ 65 పేరా 4]

31. మనం పాడే విధానాన్ని వృద్ధి చేసుకోవడానికి అవసరమైన కీలకం సరైన హృదయ దృక్పథాన్ని కలిగివుండడమే. [w97 2/1 పేజీ 27 పేరా 3]

32. నిరంతర జీవితాన్ని పొందాలంటే, దేవుని వాక్యమైన బైబిలు బోధలను అర్థం చేసుకోవాలి. [w97 8/15 పేజీ 6 పేరా 5]

33. లైంగిక అవినీతి అనే శోధనను అధిగమించేందుకు మనం అది తప్పు అని అది వినాశకరమైన, చేదైన పర్యవసానాలను కలిగిస్తుందని గుర్తించాలి. [fy పేజీ 93 పేరా 9]

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి