కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 4/99 పేజీ 1
  • ఆతురతతో సువార్తను ప్రకటించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆతురతతో సువార్తను ప్రకటించండి
  • మన రాజ్య పరిచర్య—1999
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రకటించి సంపూర్ణంగా సాక్ష్యమివ్వండి
    మన రాజ్య పరిచర్య—2003
  • కావలెను—4,000 మంది సహాయ పయినీర్లు
    మన రాజ్య పరిచర్య—1997
  • 2000 ఏప్రిల్‌ను మన అపూర్వమైన నెలగా చేసుకోగలమా?
    మన రాజ్య పరిచర్య—2000
  • అత్యంత ఉత్సాహంతో సువార్తను ప్రకటించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1999
km 4/99 పేజీ 1

ఆతురతతో సువార్తను ప్రకటించండి

1 “మిమ్మును చూడవలెనని మిగుల అపేక్షించుచున్నాను . . . మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా [“ఆతురముగా,” NW] ఉన్నాను.” అలా అపొస్తలుడైన పౌలు రోమాలో ఉన్న సహోదరులకు వ్రాసిన తన పత్రిక ప్రారంభంలో తనను తాను వ్యక్తపర్చుకున్నాడు. పౌలు వాళ్ళను కలుసుకోవడానికి ఎందుకంత ఆతురత కల్గి ఉన్నాడు? ఆయనే ఇలా తెలియజేశాడు: “మీలో కూడా ఫలమేదైనను పొందవలెనని . . . మీయొద్దకు రానుద్దేశించితిని; సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది.”—రోమా. 1:11-16.

2 ఎఫెసులోని పెద్దలతో మాట్లాడుతున్నప్పుడు పౌలు అదేవిధమైన ఆతురతను ప్రతిబింబించాడు. ఆయన వారికి “నేను ఆసియలో కాలుపెట్టిన దినమునుండి, . . . . ఏదియు దాచుకొనక బహిరంగముగాను, ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు, . . . యూదులకును గ్రీసుదేశస్థులకును . . . సాక్ష్యమిచ్చుచుంటి[నని]” గుర్తుచేశాడు. (అపొ. 20:18-21) తనకు నియమించబడిన ప్రాంతమంతటిలో, పౌలు రక్షణ సువార్తను వ్యాప్తిచేయాలనీ, రాజ్య ఫలాలను పొందాలనీ బలంగా తీర్మానించుకున్నాడు. మనం అనుకరించడానికి ఎంత చక్కని స్ఫూర్తో గదా!

3 నేను నివసిస్తున్న సమాజంలో సువార్తను ప్రకటించడంలో అలాంటి ఆతురతనే కనపరుస్తున్నానా? ప్రకటనా పనిని కేవలం డ్యూటీగా దృష్టించడానికి బదులు, నేను సాధ్యమైనంత ఎక్కువమంది ప్రజలతో సువార్తను పంచుకోవడానికి ఆతురతను కల్గివున్నానా? నా వ్యక్తిగత పరిస్థితులను ప్రార్థనాపూర్వకంగా పరిశీలిస్తున్నానా? ఇంటింటా, వీధుల్లో, వ్యాపార స్థలాల్లో, టెలిఫోన్‌ద్వారా, అనియతంగా ప్రకటించడం వంటి వీలయ్యే అన్ని పద్ధతులను అంటే మన ప్రాంతంలో చేయడానికి వీలయ్యే అన్ని పద్ధతులను ప్రయత్నించి చూశానా? అని మనలను మనం ప్రశ్నంచుకోవాలి.

4 ఏప్రిల్‌లో ఆతురతతో భాగంవహించండి: ప్రకటనా పనిలో మనం, వ్యక్తిగతంగా మరింత భాగంవహించడానికి సరియైన సమయం ఏప్రిల్‌ నెల. పరిచర్యలో వెచ్చించాల్సిన గంటలలో వచ్చిన తగ్గింపు అనేకమంది సహాయ పయినీరు సేవచేసేలా తోడ్పడాలి. ఏప్రిల్‌, మే నెలల్లో సహాయ పయినీరుగా సేవ చేయడానికి అనువుగా మీ పరిస్థితులు ఉండి ఉండవచ్చు. లేక పరిచర్యలో వెచ్చించాల్సిన గంటల్లో వచ్చిన సవరింపు దృష్ట్యాచూస్తే, బహుశా మీరు క్రమ పయినీరుల జాబితాలోకి చేరవచ్చు. మీరు సంఘ ప్రచారకులయితే, పయినీరు సేవ చేస్తున్న వారికి మద్దతునిస్తూ, సాధారణంగా సేవలో మీరు వెచ్చించే సమయం కన్నా ఎక్కువ సమయాన్ని ఈ నెలలోనూ వచ్చే నెలలోనూ వెచ్చించగలరా? అలా చేయడం యెహోవా హృదయాన్ని సంతోషపరుస్తుంది.

5 పౌలు వలె, రాజ్యప్రచారకులందరూ ప్రకటన పనిలో మరింత ఎక్కువ చేయడానికి కృషిచేయడం ద్వారా ఆతురతను కనపర్చడంలో కొనసాగాలి. పరిచర్యలో మనం చేయగలిగిందంతా చేయడం మనకు నిజమైన ఆనందాన్ని స్తుంది. తాను చేసిన పవిత్ర సేవ విషయంలో పౌలు అలాంటి ఆనందాన్నే పొందాడు. ఆయన చక్కని మాదిరిని మనం అనుకరిద్దాం.—రోమా. 11:13; 1 కొరిం. 4:16.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి