పైవిచారణకర్తలు నేతృత్వం వహిస్తారు —కావలికోట పఠన నిర్వాహకుడు
1 కావలికోట యెహోవా రాజ్యమును ప్రకటించుచున్నది అనేది ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని’ ద్వారా మనకు “తగినవేళ” అందజేయబడుతున్న ఆధ్యాత్మిక ఆహారంలో ప్రాథమిక ఏర్పాటు. (మత్త. 24:45) కావలికోట పఠనాన్ని నిర్వహించే పెద్ద, సామర్థ్యంగల బోధకునిగా ఒక ప్రాముఖ్యమైన బాధ్యతను కల్గి ఉంటాడు, ఆయన క్రైస్తవజీవితంలో మంచి మాదిరికరంగా ఉంటాడు.—రోమా. 12:7; యాకో. 3:1.
2 తన బోధనా విధానం ప్రభావవంతంగా ఉండాలంటే, ప్రతివారం కావలికోట పఠన నిర్వాహకుడు తన సిద్ధపాటుని నిజమైన ప్రయత్నంతో చేయాలి. ఆయన తన సిద్ధపాటును ప్రార్థనాపూర్వకంగాను, జాగ్రత్తగాను చేస్తాడు. పఠించబడే సమాచారంతో మన హృదయాలను చేరాలన్న ఆయన యథార్థమైన ప్రయత్నం, సంఘంపట్ల ఆయనకు గల లోతైన ఆసక్తిని కనబరుస్తుంది. ఆయన పాఠంలోని ముఖ్యాంశాలపై దృష్టిని కేంద్రీకరిస్తాడు, అవి శీర్షిక యొక్క అంశంతో ఎలా సంబంధం కల్గి ఉన్నాయో మనం గ్రహించడానికి ఆయన సహాయం చేస్తాడు.
3 లేఖనాలను ముందుగా చూసి, అవి ఎలా వర్తిస్తాయో తెల్సుకోవడం కూడా బాగా సిద్ధపడడంలో భాగం వహించడమే. పఠనం జరుగుతూ ఉండగా బైబిలు ఉపయోగించమని సంఘాన్ని ప్రోత్సహించడం ద్వారా ఆయన దేవుని వాక్యాన్ని ప్రథమ స్థానంలో ఉంచుతాడు. సంఘం నుండి వచ్చే వ్యాఖ్యానాల్లో ముఖ్యాంశం లేనప్పుడు లేదా కీలక లేఖనాల అన్వయింపు లేనప్పుడు, ఆయన ప్రత్యేక అదనపు ప్రశ్నలను అడగడం ద్వారా సమాచారాన్ని రాబడతాడు. ఈ విధంగా ఆయన మనం సరియైన ముగింపుకు రావడానికి మరియు మన జీవితంలో నేర్చుకున్న దాన్ని ఎలా అన్వర్తింపజేసుకోవాలో తెల్సుకోవడానికి మనకు సహాయం చేస్తాడు.
4 కావలికోట పఠన నిర్వాహకుడు తన స్వంత బోధనా సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంలో క్రమంగా ప్రయత్నిస్తాడు. ఆయన వ్యాఖ్యానాలను అధికంగా చేయడు కానీ, మనం మన స్వంత మాటల్లో, క్లుప్తంగా, అసలు పాయింటును చెప్పేలా మనల్ని ప్రోత్సహిస్తాడు. ఆయన మొదటి వ్యాఖ్యాత పేరా నుండి క్లుప్తమైన వ్యాఖ్యానాన్ని, ముద్రిత ప్రశ్నకు సూటియైన సమాధానాన్ని ఇవ్వాలని అప్పుడప్పుడు గుర్తు చేయవచ్చు. లేఖన అన్వయింపు, వ్యాఖ్యానాలకు మద్దతు, లేదా సమాచారం యొక్క ఆచరణాత్మక అన్వయింపు చేసే ఇతర వ్యాఖ్యానాలను శ్రోతల నుండి రాబట్టవచ్చు. వ్యక్తిగత మరియు కుటుంబ సిద్ధపాటును చేయమని ప్రోత్సహించడం ద్వారా, పఠనంలో పాల్గొనాలనే ప్రతి ఒక్కరి కోరికను కావలికోట పఠన నిర్వాహకుడు ప్రేరేపిస్తాడు.
5 ‘యెహోవాచేత ఉపదేశింపబడే వారము’గా ‘మనుష్యులలో ఈవు’లైన కావలికోట పఠన నిర్వాహకుల వంటి ‘ఉపదేశమందు ప్రయాసపడువారి’పట్ల మనము మెప్పుదలను చూపుతాము.—యెష. 54:13; ఎఫె. 4:8, 11; 1 తిమో. 5:17.