నూతన లోక అనువాదము ప్రతిపాదన
1 “నూతన లోక [అనువాదము] కలిగివుండడం చాలా ప్రయోజనకరం. ఇది ఉత్తేజకరమైనది, జీవం ఉట్టిపడేది. చదువరులను ఆలోచింపజేయగలది, పఠింపజేయగలది. ఇది ఉన్నత విమర్శకుల కృతి కాదు గాని దేవుడ్ని, ఆయన వాక్యాన్ని గౌరవించే పండితుల కృతి” అని ప్రఖ్యాతి గాంచిన హెబ్రీ, గ్రీకు వ్యాఖ్యాత అన్నారు. దీనితో మనం ఏకీభవిస్తాము. మనం డిసెంబరులో జ్ఞానము పుస్తకముతో పాటు నూతన లోక అనువాదమును కూడా అందించి అదే మెప్పుదలను చూపడానికి ఇతరులకు ఎలా సహాయం చేయగలము?
2 “నాకు ఇప్పటికే బైబిలు ఉంది. మరొక బైబిలు నాకు అవసరం లేదు” అని కొందరు అనవచ్చు. అయితే, నూతన లోక అనువాదము కేవలం మరొక బైబిలు కాదని వారిని ఒప్పించడమే మనకు గల సవాలు. ఇది మూలభాషలోని భావాన్ని ఖచ్చితంగా వ్యక్తం చేసిన నేటిభాషలోని అక్షరార్థ అనువాదం. ఇందులోని ఉన్నతత్వాన్ని 1 కొరింథీయులు 10:25లోని “shambles” (కింగ్ జేమ్స్ వెర్షన్) అనే పదంతో “meat market” (నూతన లోక అనువాదము) అనే పదాన్ని పోల్చి చూడడం ద్వారా అర్థమౌతుంది.
3 అయితే చాలా కొద్దిమంది మాత్రమే బైబిలు చదువుతారు, అందులో అతి కొద్దిమంది మాత్రమే తమ అనుదిన జీవితం కోసమైన దాని సూత్రాలను అర్థం చేసుకొంటారు. దేవుని వాక్యం వారి జీవితాలపై ఏ విధంగా శ్రేష్ఠమైన ప్రభావాన్ని కల్గివుండగలదో, నేటి సమస్యలను ఎదుర్కొని నిజాయితీ, నైతికత, కుటుంబ జీవితం వంటి విషయాల్లో దాని సలహా ఏ విధంగా సహాయపడుతుందో తెల్సుకోవలసిన అవసరం వారికి ఉంది. అయితే, దాన్ని ఎలా సాధించవచ్చు?
4 అందింపు కోసం సలహా: “ఈనాటి నైతిక విలువలు వేగంగా మారుతున్నందువల్లా, భవిష్యత్ జీవితాన్ని గూర్చిన అనిశ్చయత ఉన్నందువల్ల మనకు నమ్మదగిన మార్గదర్శకం అవసరమని మీరు అంగీకరించరా? [ప్రతిస్పందించనివ్వండి.] బైబిలు అత్యంత పురాతన పుస్తకమైనప్పటికీ, దాని సలహా ఆధునిక జీవితానికీ సంతోషభరిత కుటుంబ జీవితానికీ ఎంతో ఆచరణాత్మకమైనది.” జ్ఞానము పుస్తకంలోని 2వ అధ్యాయానికి తిప్పి 10వ పేరాను మరియు 11వ పేరాలోని మొదటి వాక్యాన్ని చదవండి మరియు 10వ పేరాలోని 2 తిమోతి 3:16, 17ను నొక్కిచెప్పండి. వారు ఆసక్తిని చూపినట్లైతే, జ్ఞానము పుస్తకాన్ని అందించి, మన ఉచిత గృహ బైబిలు పఠన ఏర్పాటును వివరించి, నూతన లోక అనువాదమును కూడా ప్రతిపాదించండి. దేవుడు కోరుతున్నాడు బ్రోషూరు నుండి పఠనాన్ని ప్రారంభించడం మంచిదని మీరు భావించినట్లైతే, అలాగే చేయండి. మీరు ఇతర తగిన సూచనలను తర్కించుట (ఆంగ్లం) పుస్తకములోని 9 నుండి 15 పేజీలలో కనుగొనగలరు.
5 ఇంతటి ఉత్కృష్టమైన నూతన లోక అనువాదము పట్ల మనకు గల మెప్పుదలను ప్రదర్శిద్దాము. మనం దాన్ని డిసెంబరులో ఉత్సాహంగా అందించడం ద్వారా అలా చేయగలము.