అక్టోబరులోని సేవా కూటాలు
గమనిక: రాబోయే నెలల్లో ప్రతి వారం సేవా కూటాల కొరకు మన రాజ్య పరిచర్య పట్టిక వేస్తుంది. “దైవిక జీవిత మార్గం” సమావేశానికి హాజరయ్యేందుకు సంఘాలు అవసరమైన సర్దుబాట్లు చేసుకోవాలి, అలాగే అటుతర్వాతి వారం సేవా కూటంలో ఈ సమావేశ కార్యక్రమపు ఉన్నతాంశాలు 30 నిమిషాలపాటు చర్చించేందుకు కూడా ఏర్పాట్లు చేసుకోవాలి. సమావేశ కార్యక్రమం యొక్క ప్రతిదిన అంశాల్ని పునఃసమీక్షించేందుకు అర్హులైన ముగ్గురు సహోదరులకు ముందుగానే నియామకాన్ని ఇవ్వాలి, వారు విశేషమైన అంశాలపై అవధానాన్ని కేంద్రీకరించాలి. చక్కని సిద్ధపాటుతో చేసే ఈ పునఃసమీక్ష, కీలకమైన అంశాలను సంఘంలోనివారు వ్యక్తిగతంగా తమకై తాము అన్వయించుకోవడానికీ ప్రాంతీయ సేవలోనూ సహాయపడుతుంది. ప్రేక్షకులనుండి వచ్చే వ్యాఖ్యానాలూ, వారు చెప్పే అనుభవాలూ క్లుప్తంగానూ విషయానికి సంబంధించినవిగాను ఉండాలి.
అక్టోబరు 5తో ప్రారంభమయ్యే వారం
పాట 199 (11)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు.
15 నిమి: “పునర్దర్శనాలు చేయడంలోని సవాలును ఎదుర్కోవడం.” సేవా పైవిచారణకర్త ఇచ్చే ప్రసంగము, ప్రేక్షకులతో చేసే చర్చ. పేరా 5ను పరిశీలించిన తర్వాత స్థానికంగా ఉన్న బలహీనతలను ఎలా అధిగమించాలో చూపించాలి.
20 నిమి: “మ్యాగజైన్ రూట్లలో ‘రాజ్య విత్తనాలను విత్తడం.’” ప్రేక్షకులతో చర్చ. మ్యాగజిన్ రూట్‌ను ఎలా ప్రారంభించారో దాన్ని ఎలా కొనసాగించారో కొంతమందిని వివరించమనండి. తర్వాత ఒక పత్రిక అందింపును ప్రదర్శించడాన్ని చూపించండి, ఆ ప్రదర్శనలో తర్వాతి పత్రికలతో తిరిగి వెళ్లేందుకు ఏర్పాట్లు జరిగినట్లు చూపించండి.
పాట 133 (3), ముగింపు ప్రార్థన.
అక్టోబరు 12తో ప్రారంభమయ్యే వారం
పాట 42 (21)
5 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్టు.
10 నిమి: “పైవిచారణకర్తలు నేతృత్వం వహిస్తారు—కార్యదర్శి.” సంఘ కార్యదర్శి తనకు నియమించబడిన పనులను గూర్చి ఇచ్చే ప్రసంగం. క్షేత్ర సేవా రిపోర్టులను సమయానికి ఇవ్వడం ద్వారా అందరూ సహకారాన్ని అందించాలని ఆయన చెబుతాడు.
10 నిమి: వారు ఉత్సాహపూరితమైన పయినీర్ స్ఫూర్తిని కలిగివున్నారు. 1998 వార్షికపుస్తకం (ఇంగ్లీష్), పేజీలు 104-7 పై ఆధారపడిన ఒక ఉత్సాహపూరితమైన ప్రసంగము. జపాన్‌లో అంత మంది పయినీర్లు ఎందుకున్నారో, గృహిణులు ఆధ్యాత్మిక ఆసక్తులకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని ఏది సాధ్యపరచిందో, ప్రతి పయినీర్ దరఖాస్తు వెనుక ఉన్నదేమిటో, పయినీర్లలో అధిక శాతం ఎవరున్నారో వివరించండి. పయినీర్ తల్లిదండ్రులు చూపుతున్న చక్కని ప్రభావాన్ని వివరించండి. పయినీర్ సేవ కొరకు ఒకరు తమ జీవితంలో అవసరమైన సర్దుబాట్లు చేసుకోవడానికి ఎంతటి ధృఢనిశ్చయం అవసరమో నొక్కి తెల్పండి. పయినీరింగ్ చేసే అవకాశాల్ని గురించి గంభీరంగా ప్రార్థనాపూర్వకంగా మరోసారి పరిశీలించమని అందర్నీ ప్రోత్సహించండి.
20 నిమి: “మీరు మన పత్రికలను చదువుతారా?” ప్రశ్నాజవాబులు. పాఠశాల నిర్దేశక పుస్తకము (ఇంగ్లీష్), పాఠ్యభాగం 4, 5-6 పేరాల్లో వ్యక్తిగత పఠనానికి కావల్సిన పట్టికను గూర్చిన ఆచరణాత్మక సలహాలను పేర్కొనండి.
పాట 107 (4), ముగింపు ప్రార్థన.
అక్టోబరు 19తో ప్రారంభమయ్యే వారం
పాట 16 (22)
10 నిమి: స్థానిక ప్రకటనలు. తాజా పత్రికల్లో నుండి మనం మాట్లాడగల అంశాలను పేర్కొనండి. 1997 వార్షికపుస్తకం (ఇంగ్లీష్), పేజీ 45 మరియు అక్టోబర్ 22, 1996, తేజరిల్లు! (ఇంగ్లీష్) పేజీ32లలో ఉన్న అనుభవాలను పేర్కొనండి. ఈ వారాంతంలో పత్రికలు అందించేందుకు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, ప్రోత్సహించండి.
15 నిమి: స్థానిక అవసరాలు.
20 నిమి: కావలికోట పఠనానికి ఎలా సిద్ధపడాలి. మే 15, 1986 కావలికోట, (ఇంగ్లీషు) పేజీలు 19-20, పేరాలు 16-18 మరియు పాఠశాల నిర్దేశక పుస్తకం (ఇంగ్లీష్), పాఠ్యభాగం 7, పేరా 11, మరియు పాఠ్యభాగం 18, పేరాలు 4-6 ఆధారంగా కావలికోట పఠన నిర్వాహకుడు ప్రేక్షకులతో చేసే చర్చ. ఈ క్రింది ప్రశ్నలపై వ్యాఖ్యానించమని ప్రేక్షకులను కోరండి: (1) కావలికోట లోని ప్రతి పఠన శీర్షిక నుండి సాధ్యమైనంత ఎక్కువ ప్రయోజనం పొందడం ఎందుకంత ప్రాముఖ్యం? (2) మనం క్రొత్త పత్రికలను అందుకున్నప్పుడు మనమేమి చేయాలి? (3) కావలికోట పఠనానికి సిద్ధపడేందుకు మంచి మార్గమేమిటి? (4) ఎత్తివ్రాయబడని లేఖనాలకు మరియు పాఠము యొక్క మూలాంశానికి మనం ఎటువంటి అవధానాన్ని ఇవ్వాలి? (5) మనం నేర్చుకున్నదానిని ఎలా పునఃపరిశీలించుకోవచ్చు? (6) ఆ పాఠాన్ని వ్యక్తిగతంగా పఠించడం ముగిసినప్పుడు, మనమే కీలకాంశాల్ని గురించి ధ్యానించాలి? (7) మనం వ్యాఖ్యానించేందుకు ఎలా సిద్ధపడాలి? (8) ఒకే ప్రశ్నకు వివిధ రకాలైన వ్యాఖ్యానాలను ఎలా ఇవ్వవచ్చు? కావలికోట పఠనం నుండి సాధ్యమైనంత ఎక్కువగా ప్రయోజనం పొందడానికి వారు వ్యక్తిగతంగా ఏమి చేశారో చెప్పమని కొంతమందిని ఆహ్వానించండి.—మన పరిచర్యను నెరవేర్చుటకు సంస్థీకరింపబడియున్నాము, 65-7 పేజీలు కూడా చూడండి.
పాట 95 (28), ముగింపు ప్రార్థన.
అక్టోబర్ 26తో ప్రారంభమయ్యే వారం
పాట 98 (16)
10 నిమి: స్థానిక ప్రకటనలు. స్థానికంగా స్టాకులో ఉన్న పాత ప్రచురణలను పేర్కొనండి, అవకాశాలు లభించినప్పుడు వాటిని పరిచర్యలో అందించవచ్చని తెలియజేయండి. డిసెంబరులో సెలవులు వస్తున్నాయి కాబట్టి, యౌవనస్థులు మరితరులు సహాయ పయినీరింగ్ చేయడానికి అది మంచి సమయం.
20 నిమి: మతపరంగా విభాగించబడివున్న కుటుంబాల్లో దైవీక విధేయత. జూన్ 1, కావలికోట, 1995, 26-9 పేజీలపై ఆధారపడిన ప్రసంగము. అవిశ్వాస జత ఉన్నవారు అనుకూల దృక్పథంతో ఉండడానికీ, సంఘంతో చురుకుగా సహవసించడానికీ సహాయం చేసేందుకు దయాపూర్వక ప్రోత్సాహాన్నీ పురికొల్పునూ ఇవ్వండి.
15 నిమి: కూటాలకు సమయానికి హాజరుకావడం. కూటాలకు ఆలస్యంగా హాజరుకావడం అనే సమస్యను గూర్చి ఇద్దరు లేక ముగ్గురు సంఘపుస్తక పఠన నిర్వాహకులు లేక పరిచర్య సేవకులు చేసే చర్చ. అత్యవసర పరిస్థితులతో పాటు, వాతావరణ పరిస్థితులు, ట్రాఫిక్ లాంటి అనూహ్య పరిస్థితులు కూటాలకు ఆలస్యమయ్యేలా చేయగలవని వారు చెప్తారు. అయితే, కొందరు అలవాటుగా ఆలస్యంగా వస్తారు. సమయానికి హాజరయ్యేందుకు ఏమి అవసరమో ఆ గ్రూపు ప్రోత్సాహకరమైన రీతిలో చర్చిస్తుంది: (1) కూటాలకు హాజరయ్యే ఆధిక్యతను, మరియు అక్కడ లభించే ఆధ్యాత్మిక ఆహారంపట్ల మరియు అక్కడ లభించే సహవాసంపట్ల హృదయపూర్వకమైన మెప్పుదల, (2) సొంత పనులను ముందుగానే ప్రణాళిక వేసుకుని సంస్థీకరించుకోవడం, (3) కుటుంబ సభ్యుల మధ్య ఇష్టపూర్వక సహకారం, (4) ఎదురుచూడని సమస్యలు వచ్చినప్పుడు వాటిని అధిగమించడానికిగాను ఇంటినుండి ముందుగానే బయలుదేరడం, (5) హాజరైన ఇతరులకు అవధాన భంగం కలిగించకూడదన్న నిజమైన శ్రద్ధ కల్గివుండడం. అభివృద్ధి సాధించాలన్న కోరికతోపాటు తీవ్రమైన కృషి చేయడం ద్వారా కూటాలకు ఆలస్యంగా రావడం అన్న ఈ సమస్యను అధిగమించవచ్చని చర్చించేవారందరూ ఏకీభవిస్తారు.
పాట 86 (23), ముగింపు ప్రార్థన.