కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 10/98 పేజీలు 3-6
  • 1999 దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • 1999 దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పట్టిక
  • మన రాజ్య పరిచర్య—1998
  • ఉపశీర్షికలు
  • నిర్దేశాలు
  • పట్టిక
మన రాజ్య పరిచర్య—1998
km 10/98 పేజీలు 3-6

1999 దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పట్టిక

నిర్దేశాలు

1999లో దైవపరిపాలనా పరిచర్య పాఠశాలను నిర్వహించేటప్పుడు ఈ క్రింది ఏర్పాట్లుంటాయి.

పాఠ్యపుస్తకాలు: అసైన్‌మెంట్లు పరిశుద్ధ లేఖనముల నూతన లోక అనువాదము [bi12] (ఆంగ్లం), కావలికోట [w], తేజరిల్లు! [g-TU] “చర్చనీయ బైబిలు అంశములు” [td], నిత్యజీవానికి నడిపించే జ్ఞానము [kl] కుటుంబ సంతోషానికి గల రహస్యము [fy] అనే పుస్తకాలపై ఆధారపడి ఉంటాయి.

పాట, ప్రార్థన, మరియు ఆహ్వానపు మాటలతో పాఠశాల సరిగ్గా సమయానికి ప్రారంభమవ్వాలి. ఆ తర్వాత ఈ క్రింది విధంగా కొనసాగుతుంది:

అసైన్‌మెంట్‌ నెం. 1: 15 నిమిషాలు. దీనిని ఒక సంఘ పెద్ద లేదా పరిచర్య సేవకుడు నిర్వహిస్తారు. ఇది కావలికోట, లేదా తేజరిల్లు!, లేదా నిత్యజీవానికి నడిపించే జ్ఞానముపై ఆధారపడి ఉంటుంది. కావలికోట లేదా తేజరిల్లు!పై ఆధారపడినప్పుడు, ఈ అసైన్‌మెంట్‌ను మౌఖిక పునఃసమీక్షగా కాక 15 నిమిషాల ఉపదేశ ప్రసంగంగా నిర్వహించాలి. జ్ఞానము పుస్తకం ఆధారంగానైతే, 10-12 నిమిషాల ఉపదేశ ప్రసంగాన్నిచ్చి, ప్రచురణలోని ముద్రిత ప్రశ్నలను ఉపయోగిస్తూ 3-5 నిమిషాల మౌఖిక పునఃసమీక్ష చేయాలి. సమాచారమంతా చెప్పాలన్నదే లక్ష్యమై ఉండక, సంఘానికి మరింత సహాయకరంగా ఉండే సమాచారాన్ని ఉన్నతపరుస్తూ, సమాచారంలోని ఆచరణాత్మక విలువపై శ్రద్ధ నిలపాలన్నది లక్ష్యమై ఉండాలి. చూపించబడిన మూలాంశాన్ని ఉపయోగించాలి.

ఈ ప్రసంగం నియమించబడిన సహోదరులు దీనిని నిర్ణీత సమయంలోనే ముగించడానికి జాగ్రత్తపడాలి. వ్యక్తిని ప్రత్యేకంగా పిలిచి సలహా ఇచ్చేటట్లయితే, వాళ్ళ స్పీచ్‌ కౌన్సిల్‌ స్లిప్‌ మీద సముచితమైన అభిప్రాయాలను వ్రాయాలి.

చదవవలసిన బైబిలు భాగంలోని ఉన్నతాంశాలు: 6 నిమిషాలు. సంఘపెద్ద లేదా పరిచర్య సేవకుడు సమాచారాన్ని ప్రాంతీయ అవసరతలకు తగినట్లు ఫలకరంగా అన్వయిస్తూ దీనిని నిర్వహిస్తారు. ఇది కేవలం నియమిత పాఠ్యభాగ సారాంశమై ఉండకూడదు. 30 నుండి 60 సెకండ్లు నియమిత అధ్యాయాల సంగ్రహ పునఃసమీక్షను ఇమడ్చవచ్చు. అయితే, ఆ సమాచారం మనకు ఎందుకు, ఎలా విలువైనదో గుణగ్రహించేందుకు ప్రేక్షకులకు సహాయపడాలన్నదే దాని ముఖ్యోద్దేశం. తర్వాత పాఠశాల అధ్యక్షుడు విద్యార్థులను వారి వేర్వేరు తరగతి గదులకు పంపిస్తాడు.

అసైన్‌మెంట్‌ నెం. 2. 5 నిమిషాలు. ఒక సహోదరునికి ఇవ్వవలసిన చదవవలసిన నియమిత బైబిలు భాగమిది. ముఖ్య పాఠశాలలోనూ అలాగే సహాయ గుంపుల్లోనూ ఇది వర్తిస్తుంది. విద్యార్థి ప్రారంభ ముగింపు మాటల్లో క్లుప్త వివరణాత్మక సమాచారాన్ని అందించేందుకు వీలయ్యేలా చదవవలసిన ఈ నియమిత భాగాలు సాధారణంగా చిన్నవిగా ఉంటాయ. చారిత్రక పూర్వాపరాలనూ, ప్రవచనార్థక లేదా సిద్ధాంతపరమైన ప్రాముఖ్యతను, సూత్రాలు ఎలా వర్తిస్తాయన్నదీ వివరించాలి. నియమిత వచనాలను అన్నింటిని ఆపకుండా చదవాలి. అయతే, చదవాల్సిన వచనాలు వరుసగా లేనప్పుడు, చదవడం మరలా ఎక్కడినుండి కొనసాగుతుందో విద్యార్థి పేర్కొనవచ్చు.

అసైన్‌మెంట్‌ నెం. 3: 5 నిమిషాలు. ఇది సహోదరీలకు నియమించబడుతుంది. ఈ అందింపు అంశం “చర్చనీయ బైబిలు అంశములు”పై లేదా కుటుంబ సంతోషానికిగల రహస్యము అనే పుస్తకంపై ఆధారపడి ఉంటుంది. సన్నివేశం అనియత సాక్ష్యం, పునర్దర్శనం, ఒక గృహ బైబిలు పఠనం, లేదా ప్రాంతీయ పరిచర్యలోని మరో రంగమో కావచ్చు. కొన్ని సందర్భాల్లో, తల్లి మేజర్‌ కాని తన బిడ్డతో సమాచారాన్ని పంచుకోవడాన్ని కూడా ఇమడ్చవచ్చు. పాల్గొనేవారు కూర్చోవడమో, నిలుచోవడమో చేయవచ్చు. గృహస్థురాలు లేదా బిడ్డ సమాచారాన్ని గురించి హేతుబద్ధంగా ఆలోచించేందుకూ, లేఖనాలు ఎలా వర్తిస్తాయో అర్థం చేసుకునేందుకూ విద్యార్థిని ఎలా సహాయపడుతుందనేదానిలో పాఠశాల పైవిచారణకర్త ముఖ్యంగా ఆసక్తి కలిగి ఉంటాడు. ఈ భాగానికి నియమించబడే విద్యార్థినికి చదవడం వచ్చి ఉండాలి. పాఠశాల అధ్యక్షుడు ఒక సహాయకురాలిని నియమిస్తాడు, అయతే మరొక సహాయకురాలిని కూడ తీసుకోవచ్చు. కుటుంబ సంతోషం పుస్తకంలోని విషయాలను పరిశీలిస్తున్నప్పుడు పుస్తకంలోని పేరాలను గృహస్థురాలితో చదివించాలా వద్దా అన్నది విద్యార్థిని నిర్ణయించుకోవచ్చు. సన్నివేశానికి కాదుగాని సమాచారాన్ని ఫలకరంగా ఉపయోగించేందుకే ప్రాముఖ్యతనివ్వాలి.

అసైన్‌మెంట్‌ నెం. 4: 5 నిమిషాలు. ఇది ఒక సహోదరునికి లేదా సహోదరికి నియమించబడుతుంది. ఇది “చర్చనీయ బైబిలు అంశములు” మీద లేదా కుటుంబ సంతోషానికిగల రహస్యముపై ఆధారపడివుంటుంది. కుటుంబ సంతోషానికిగల రహస్యముపై ఆధారపడి ఉన్నప్పుడు, అది ఒక సహోదరుడికి నియమించబడుతుంది. ప్రతి అసైన్‌మెంట్‌కు మూలాంశం పట్టికలో ఇవ్వబడుతుంది. ఇది ఒక సహోదరికి నియమించబడినప్పుడు, అసైన్‌మెంట్‌ నెం. 3 కోసం సంక్షిప్తపరచబడినట్లుగానే చేయాలి.

*చదవవలసిన బైబిలు భాగం అదనపు పట్టిక: ప్రతి వారం కోసం ఇవ్వబడిన పాట నెంబర్‌ తరువాత ఇది బ్రాకెట్లలో ఇవ్వబడుతుంది. ఈ పట్టికను అనుసరిస్తూ వారానికి పది పేజీలను చదవడం ద్వారా మూడు సంవత్సరాల్లో బైబిలు మొత్తం చదవవచ్చు. పాఠశాల కార్యక్రమంలోని లేదా వ్రాతపూర్వక పునఃసమీక్షలోని ఏ భాగమూ అదనపు భాగ పట్టికపై ఆధారపడి ఉండవు.

గమనిక: అదనపు సమాచారం కోసమూ, సలహా, సమయం, వ్రాతపూర్వక పునఃసమీక్షలూ, అసైన్‌మెంట్‌ల కోసం సిద్ధపడడం వంటి వాటిని గూర్చిన నిర్దేశం కోసమూ దయచేసి అక్టోబరు 1996 మన రాజ్య పరిచర్య 3వ పేజీ చూడండి.

పట్టిక

జన. 4 చదవవలసిన బైబిలు భాగం: ప్రకటన 16-18

పాట నెం. 23 (29) [*2 రాజులు 16-19]

నెం. 1: బైబిలును దేవుడు ఎలా ప్రేరేపించాడంటే (w97 6/15 పే. 4-8)

నెం. 2: ప్రకటన 16:1-16

నెం. 3: మీ పిల్లవాడ్ని (రానున్న) అపాయం నుండి కాపాడండి (fy పే. 61-3 పేరాలు 24-8)

నెం. 4: td 24సి అగ్ని నిర్మూలనానికి ప్రతీక

జన. 11 చదవవలసిన బైబిలు భాగం: ప్రకటన 19-22

పాట నెం. 126 (3) [*2 రాజులు 20-25]

నెం. 1: మీరు సంతోషకరమైన భవిష్యత్తును కలిగివుండవచ్చు (kl 1వ అధ్యాయం)

నెం. 2: ప్రకటన 22:1-15

నెం. 3: తల్లిదండ్రులారా—మీ పిల్లలతో సంభాషించే అవకాశాలను తెరిచి ఉంచండి (fy పే. 64-6 పేరాలు 1-7)

నెం. 4: td 24ఇ ధనవంతుడు లాజరుల వృత్తాంతం నిత్యబాధకు రుజువు కాదు

జన. 18 చదవవలసిన బైబిలు భాగం: ఆదికాండము 1-3

పాట నెం. 180 (5) [*1 దినవృత్తాంతములు 1-6]

నెం. 1: దేవుని గూర్చిన జ్ఞానాన్ని బయల్పర్చే పుస్తకము (kl 2వ అధ్యాయం)

నెం. 2: ఆదికాండము 1:1-13

నెం. 3: పిల్లలకు నైతిక మరియు ఆధ్యాత్మిక విలువలను నేర్పించండి (fy పే. 67-70 పేరాలు 8-14)

నెం. 4: td 25బి జన్మదినములను, క్రిస్‌మస్‌ను తొలిక్రైస్తవులు ఆచరించలేదు

జన. 25 చదవవలసిన బైబిలు భాగం: ఆదికాండము 4-6

పాట నెం. 66 (9) [*1 దినవృత్తాంతములు 7-13]

నెం. 1: తప్పుడు ఉద్దేశాలను ఆపాదించకుండా ఉండేందుకు జాగ్రత్తపడండి (w97 5/15 పే. 26-9)

నెం. 2: ఆదికాండము 4:1-16

నెం. 3: క్రమశిక్షణా గౌరవమూ ఎందుకు ముఖ్యమంటే (fy పే. 71-2 పేరాలు 15-18)

నెం. 4: td 26ఎ ఆరాధనలో ప్రతిమలను, విగ్రహాలను ఉపయోగించడం దేవునికి అవమానకరం

ఫిబ్ర. 1 చదవవలసిన బైబిలు భాగం: ఆదికాండము 7-9

పాట నెం. 108 (5) [*1 దినవృత్తాంతములు 14-21]

నెం. 1: జలప్రళయాన్ని గురించిన బైబిలు వృత్తాంతం సత్యమే (g97 3/8 పే. 24-25)

నెం. 2: ఆదికాండము 7:1-16

నెం. 3: పని మరియు ఆటల విషయాల్లో పిల్లలకు దైవిక దృక్కోణాన్ని బోధించండి (fy పే. 72-5 పేరాలు 19-25)

నెం. 4: td 26బి విగ్రహారాధన ఇశ్రాయేలు జనాంగానికి మరణకరమైందని నిరూపించబడింది

ఫిబ్ర. 8 చదవవలసిన బైబిలు భాగం: ఆదికాండము 10-12

పాట నెం. 132 (21) [*1 దినవృత్తాంతములు 22-29]

నెం. 1: అబద్ధమాడడాన్ని గూర్చిన నిజం (g97 3/8 పే. 26-28)

నెం. 2: ఆదికాండము 12:1-20

నెం. 3: పిల్లవాని తిరుగుబాటూ, దానికి కారణమూ (fy పే. 76-79 పేరాలు 1-8)

నెం. 4: td 26సి ‘సాపేక్షిక’ ఆరాధన అనధికారికము

ఫిబ్ర. 15 చదవవలసిన బైబిలు భాగం: ఆదికాండము 13-15

పాట నెం. 49 (6) [*2 దినవృత్తాంతములు 1-8]

నెం. 1: మానవ బలహీనత యెహోవా శక్తిని ఘనపరుస్తుంది (w97 6/1 పేజీలు 24-7)

నెం. 2: ఆదికాండము 14:8-20

నెం. 3: td 27ఎ ఇతర మతాలతో కలవడం దేవుని మార్గం కాదు

నెం. 4: అసలు అదుపే చేయనివారిగానో మరీ అమితంగా కట్టుదిట్టం చేసేవారిగానో ఉండకండి (fy పే. 80-1 పేరాలు 10-13)

ఫిబ్ర. 22 చదవవలసిన బైబిలు భాగం: ఆదికాండము 16-19

పాట నెం. 188 (6) [*2 దినవృత్తాంతములు 9-17]

నెం. 1: మీ ప్రార్థనలు బయల్పరచేదేమంటే (w97 పే. 27-30)

నెం. 2: ఆదికాండము 18:1-15

నెం. 3: మీ పిల్లవాని కనీసావసరాలను తీర్చడం తిరుగుబాటును నివారించగలదు (fy పే. 82-4 పేరాలు 14-18)

నెం. 4: td 27బి “అన్ని మతాల్లో మంచి ఉందనడం” సత్యం కాదు

మార్చ్‌ 1 చదవవలసిన బైబిలు భాగం: ఆదికాండము 20-23

పాట నెం. 54 (1) [*2 దినవృత్తాంతములు 18-24]

నెం. 1: మీ మనస్సాక్షికి శిక్షణనెలా ఇవ్వాలంటే (w97 8/1 పే. 4-6)

నెం. 2: ఆదికాండము 23:1-13

నెం. 3: td 29ఎ యెహోవా దేవుని నామం

నెం. 4: తప్పు చేసే పిల్లవాడికి సహాయపడడమెలా (fy పే. 85-7 పేరాలు 19-23)

మార్చ్‌ 8 చదవవలసిన బైబిలు భాగం: ఆదికాండము 24-25

పాట నెం. 121 (21) [*2 దినవృత్తాంతములు 25-31]

నెం. 1: సత్యం మనలను దేనినుండి స్వతంత్రులను చేస్తుంది? (w97 2/1 పే. 4-7)

నెం. 2: ఆదికాండము 24:1-4, 10-21

నెం. 3: td 29సి దేవుడు ఉన్నాడని నమ్మేందుకు ఆయనను చూడవలసిన అవసరం లేదు

నెం. 4: కావాలని తిరుగబడేవారితో వ్యవహరించడం (fy పే. 87-9 24-7 పేరాలు)

మార్చ్‌ 15 చదవవలసిన బైబిలు భాగం: ఆదికాండము 26-28

పాట నెం. 197 (6) [*2 దినవృత్తాంతములు 32-36]

నెం. 1: ఆధునిక ఆరాధనలో సంగీతానికున్న స్థానం (w97 2/1 పేజీలు 24-8)

నెం. 2: ఆదికాండము 26:1-14

నెం. 3: మీ కుటుంబాన్ని వినాశకర ప్రభావాల నుండి కాపాడండి (fy పే. 90-2 పేరాలు 1-7)

నెం. 4: td 29డి యెహోవా దేవుడి నాలుగు అత్యున్నత లక్షణాలు

మార్చ్‌ 22 చదవవలసిన బైబిలు భాగం: ఆదికాండము 29-31

పాట నెం. 4 (2) [*ఎజ్రా 1-7]

నెం. 1: భూమి అగ్నిలో అంతం కాదు (g97 2/08 పే. 18-9)

నెం. 2: ఆదికాండము 31:1-18

నెం. 3: td 29ఎఫ్‌ అందరూ యెహోవా దేవుడ్నే ఆరాధించడం లేదు

నెం. 4: లైంగికత విషయంలో దేవుడి దృక్పథం (fy పే. 92-4 పేరాలు 8-13)

మార్చ్‌ 29 చదవవలసిన బైబిలు భాగం: ఆదికాండము 32-35

పాట నెం. 143 (16) [*ఎజ్రా 8-నెహెమ్యా 4]

నెం. 1: దేవుడి నుండి అద్భుత స్వస్థత—ఎప్పుడు? (w97 7/1 పే. 4-7)

నెం. 2: ఆదికాండము 35:1-15

నెం. 3: మంచి స్నేహితులను ఎంచుకోవడానికి మీ పిల్లలకు సహాయపడండి (fy పే. 95-7 పేరాలు 14-18)

నెం. 4: td 30ఎ యెహోవాసాక్షుల ఉద్భవం

ఏప్రి. 5 చదవవలసిన బైబిలు భాగం: ఆదికాండము 36-38

పాట నెం. 106 (7) [*నెహెమ్యా 5-11]

నెం. 1: రక్షణ—నిజానికి దాని భావమేమిటంటే (w97 8/15 పే. 4-7)

నెం. 2: ఆదికాండము 38:6-19, 24-26

నెం. 3: td 31బి యేసు దేవుడి కుమారుడు, నియుక్త రాజు

నెం. 4: ఆరోగ్యకరమైన కుటుంబ వినోదాన్ని ఎంచుకోండి (fy పే. 97-102 పేరాలు 19-27)

ఏప్రి. 12 చదవవలసిన బైబిలు భాగం: ఆదికాండము 39-41

పాట నెం. 34 (9) [*నెహెమ్యా 12-ఎస్తేరు 5]

నెం. 1: చెడు జరిగితే ఎందుకు నివేదించాలి? (w97 8/15 పే. 26-29)

నెం. 2: ఆదికాండము 40:1-15

నెం. 3: ఒంటరి తల్లి/తండ్రి మాత్రమేగల కుటుంబాల కోసం లేఖనాధార అంతర్దృష్టి (fy పే. 103-5 పేరాలు 1-8)

నెం. 4: td 31డి రక్షణకు యేసుక్రీస్తునందు నమ్మకం ఆవశ్యకం

ఏప్రి. 19 చదవవలసిన బైబిలు భాగం: ఆదికాండము 42-44

పాట నెం. 124 (13) [*ఎస్తేరు 6-యోబు 5]

నెం. 1: కోపాన్ని తప్పనిసరిగా ఎందుకు అదుపు చేసుకోవాలంటే (g97 6/08 పే. 18-19)

నెం. 2: ఆదికాండము 42:1-17

నెం. 3: ఒంటరి తల్లి/తండ్రిగా జీవనోపాధిని సంపాదించడంలోని సవాలు (fy పే. 105-7 పేరాలు 9-12)

నెం. 4: td 31ఇ క్రీస్తునందు కేవలం నమ్మకం కంటే ఎక్కువే అవసరం

ఏప్రి. 26 వ్రాతపూర్వక పునఃసమీక్ష. ప్రకటన 16-ఆదికాండము 44

పాట నెం. 18 (15) [*యోబు 6-14]

మే 3 చదవవలసిన బైబిలు భాగం: ఆదికాండము 45-47

పాట నెం. 90 (7) [*యోబు 15-23]

నెం. 1: కోత పండుగలు దేవుడ్ని ప్రీతిపరుస్తాయా? (w97 9/15 పే. 8-9)

నెం. 2: ఆదికాండము 45:16–46:4

నెం. 3: తల్లి/తండ్రి మాత్రమే ఉన్న కుటుంబంలో క్రమశిక్షణను కాపాడండి (fy పే. 107-10 పేరాలు 13-17)

నెం. 4: td 33బి దేవుడి రాజ్యము మానవుల కోసం ఏం చేస్తుందంటే

మే 10 చదవవలసిన బైబిలు భాగం: ఆదికాండము 48-50

పాట నెం. 76 (9) [*యోబు 24-33]

నెం. 1: సత్యదేవుడెవరంటే (kl 3వ అధ్యాయం)

నెం. 2: ఆదికాండము 49:13-28

నెం. 3: ఒంటరితనంతోనున్న పోరాటంలో జయించడం (fy పే. 110-13 పేరాలు 18-22)

నెం. 4: td 33సి క్రీస్తు విరోధులు క్రియాశీలంగా ఉండగానే రాజ్యపాలన ఆరంభమౌతుంది

మే 17 చదవవలసిన బైబిలు భాగం: నిర్గమకాండము 1-4

పాట నెం. 205 (28) [*యోబు 34-42]

నెం. 1: యేసుక్రీస్తు—దేవుడి గురించిన జ్ఞానానికి కీలకం (kl 4వ అధ్యాయం)

నెం. 2: నిర్గమకాండము 4:1-17

నెం. 3: td 33ఇ రాజ్యం ‘హృదయంలోనూ’ కాదూ, మానవ ప్రయత్నాల వల్లా రాదు

నెం. 4: తల్లి/తండ్రి మాత్రమే ఉన్న కుటుంబాలకు ఎలా మద్దతు ఇవ్వవచ్చంటే (fy పే. 113-15 పేరాలు 23-7)

మే 24 చదవవలసిన బైబిలు భాగం: నిర్గమకాండము 5-8

పాట నెం. 42 (21) [*కీర్తనలు 1-17]

నెం. 1: బీదవారు అయినా ధనవంతులే—అదెలా సాధ్యం? (w97 9/15 పే. 3-7)

నెం. 2: నిర్గమకాండము 7:1-13

నెం. 3: td 34ఎ “లోకాంతము” అంటే ఏమిటి

నెం. 4: అనారోగ్యాన్ని దైవిక దృక్పథంతో ఎదుర్కోవడం వల్ల కలిగే ప్రయోజనాలు (fy పే. 116-19 పేరాలు 1-9)

మే 31 చదవవలసిన బైబిలు భాగం: నిర్గమకాండము 9-12

పాట నెం. 24 (13) [*కీర్తనలు 18-28]

నెం. 1: లోకసంబంధులు కాకుండా ఉండడమంటే ఏమిటంటే (g97 9/08 పే. 12-13)

నెం. 2: నిర్గమకాండము 12:21-36

నెం. 3: స్వస్థపరచే స్ఫూర్తి విలువ (fy పే. 120-1 పేరాలు 10-13)

నెం. 4: td 34బి అంత్య దినముల సూచనల విషయమై మనం అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది

జూన్‌ 7 చదవవలసిన బైబిలు భాగం: నిర్గమకాండము 13-16

పాట నెం. 58 (26) [*కీర్తనలు 29-38]

నెం. 1: నిరాశ మధ్యన నిరీక్షణను ఎలా కనుగొనవచ్చంటే (w97 5/15 పే. 22-5)

నెం. 2: నిర్గమకాండము 15:1-13

నెం. 3: ప్రాముఖ్యమైన విషయాలేవో నిర్ణయించండి, అనారోగ్యం వల్ల కుటుంబంలో ఏర్పడిన పరిస్థితిని అధిగమించడానికి పిల్లలకు సహాయపడండి (fy పే. 122-3 పేరాలు 14-18)

నెం. 4: td 36బి విధేయతగల మానవజాతికి నిత్యజీవం హామీ ఇవ్వబడింది

జూన్‌ 14 చదవవలసిన బైబిలు భాగం: నిర్గమకాండము 17-20

పాట నెం. 115 (23) [*కీర్తనలు 39-50]

నెం. 1: క్రైస్తవులు వృద్ధ తల్లిదండ్రులను ఎలా సన్మానిస్తారంటే (w97 9/1 పే. 4-7)

నెం. 2: నిర్గమకాండము 17:1-13

నెం. 3: td 36డి పరలోక జీవితం క్రీస్తు శరీరమందున్నవారికే పరిమితం

నెం. 4: వైద్య చికిత్సను ఎలా దృష్టించాలంటే (fy పే 124-7 పేరాలు 19-23)

జూన్‌ 21 చదవవలసిన బైబిలు భాగం: నిర్గమకాండము 21-24

పాట నెం. 5 (6) [*కీర్తనలు 51-65]

నెం. 1: నిజ విజ్ఞాన శాస్త్రమూ, బైబిలూ పరస్పరం ఏకీభవిస్తాయి (g97 8/8 పే. 24-5)

నెం. 2: నిర్గమకాండము 21:1-15

నెం. 3: విభాగిత కుటుంబంలో విశ్వాసియైన భార్య శాంతిని ఎలా కాపాడగలదు? (fy పే. 128-32 పేరాలు 1-9)

నెం. 4: td 36ఇ అసంఖ్యాకులైన “వేరే గొఱ్ఱెల”కు భూజీవితం వాగ్దానం చేయబడింది

జూన్‌ 28 చదవవలసిన బైబిలు భాగం: నిర్గమకాండము 25-28

పాట నెం. 47 (11) [*కీర్తనలు 66-74]

నెం. 1: వ్యక్తిత్వమున్న దేవుడైన యెహోవాను తెలుసుకోండి (w97 10/1 పే. 4-8)

నెం. 2: నిర్గమకాండము 25:17-30

నెం. 3: td 38బి వివాహ ఐక్యత తప్పనిసరిగా ఘనమైనదిగా ఉండాలి

నెం. 4: విభాగిత కుటుంబంలో విశ్వాసియైన భర్త శాంతిని ఎలా కాపాడగలడు? (fy 132-3 పేరాలు 10-11)

జూలై 5 చదవవలసిన బైబిలు భాగం: నిర్గమకాండము 29-32

పాట నెం. 174 (22) [*కీర్తనలు 75-85]

నెం. 1: ఈ లోక స్ఫూర్తి మిమ్మల్ని విషపూరితం చేయడానికి అనుమతించకండి (w97 10/1 పే. 25-9)

నెం. 2: నిర్గమకాండము 29:1-14

నెం. 3: విభాగిత కుటుంబంలో పిల్లల ఆధ్యాత్మిక తర్ఫీదు (fy పే. 133-4 పేరాలు 12-15)

నెం. 4: td 38సి క్రైస్తవులు శిరసత్వ సూత్రాన్ని తప్పనిసరిగా గౌరవించాలి

జూలై 12 చదవవలసిన బైబిలు భాగం: నిర్గమకాండము 33-36

పాట నెం. 214 (23) [*కీర్తనలు 86-97]

నెం. 1: విశ్వాసయోగ్యులుగా ఉండండి, మీ యథార్థతను కాపాడుకోండి (w97 5/1 పే. 4-7)

నెం. 2: నిర్గమకాండము 34:17-28

నెం. 3: వేరే మతంలో విశ్వసించే తల్లిదండ్రులతో శాంతియుతమైన సంబంధాన్ని కాపాడుకోవడం (fy పే. 134-6 పేరాలు 16-19)

నెం. 4: td 38డి పిల్లల ఎడల క్రైస్తవ తల్లిదండ్రుల బాధ్యత

జూలై 19 చదవవలసిన బైబిలు భాగం: నిర్గమకాండము 37-40

పాట నెం. 38 (16) [*కీర్తనలు 98-106]

నెం. 1: దేవుడు ఎవరి ఆరాధనను అంగీకరిస్తాడంటే (kl 5వ అధ్యాయం)

నెం. 2: నిర్గమకాండము 40:1-16

నెం. 3: మారుటి తల్లి/తండ్రికుండే సవాలు (fy పే. 136-9 పేరాలు 20-5)

నెం. 4: td 38ఇ క్రైస్తవులు క్రైస్తవులనే వివాహం చేసుకోవాలి

జూలై 26 చదవవలసిన బైబిలు భాగం: లేవీయకాండము 1-4

పాట నెం. 26 (3) [*కీర్తనలు 107-118]

నెం. 1: మనమెందుకు వృద్ధులమై మరణిస్తామంటే (kl 6వ అధ్యాయం)

నెం. 2: లేవీయకాండము 2:1-13

నెం. 3: వస్తుసంబంధమైన లక్ష్యాలు మీ కుటుంబాన్ని విభజించడానికి అనుమతించకండి (fy పే. 140-1 పేరాలు 26-8)

నెం. 4: td 38ఎఫ్‌ బహుభార్యా/భర్తృత్వం లేఖనానుసారం కాదు

ఆగ. 2 చదవవలసిన బైబిలు భాగం: లేవీయకాండము 5-7

పాట నెం. 9 (22) [*కీర్తనలు 119-125]

నెం. 1: నిజమైన సంతోషానికి కీలకం (w97 10/15 పే. 5-7)

నెం. 2: లేవీయకాండము 6:1-13

నెం. 3: మద్యపానం వల్ల కలిగే హానికర ప్రభావాలు (fy పే. 142-3 పేరాలు 1-4)

నెం. 4: td 39ఎ మరియ యేసు తల్లి, “దేవునికి తల్లి” కాదు

ఆగ. 9 చదవవలసిన బైబిలు భాగం: లేవీయకాండము 8-10

పాట నెం. 210 (23) [*కీర్తనలు 126-143]

నెం. 1: సూత్రాన్ని గ్రహించడం పరిపక్వతను ప్రతిబింబిస్తుంది (w97 10/15 పే. 28-30)

నెం. 2: లేవీయకాండము 10:12-20

నెం. 3: మద్యానికి దాసుడైన కుటుంబ సభ్యుడికి సహాయం చేయడం (fy పే. 143-7 పేరాలు 5-13)

నెం. 4: td 39సి మరియ “నిత్య కన్యక” కాదు

ఆగ. 16 చదవవలసిన బైబిలు భాగం: లేవీయకాండము 11-13

పాట నెం. 80 (6) [*కీర్తనలు 144-సామెతలు 5]

నెం. 1: “ఎపికూరీయులు” ఉన్నారు జాగ్రత్త (w97 11/1 పే. 23-5)

నెం. 2: లేవీయకాండము 13:1-17

నెం. 3: గృహ దౌర్జన్యమూ, దానిని నివారించే మార్గాలూ (fy పే. 147-9 పేరాలు 14-22)

నెం. 4: td 40ఎ ప్రభువు రాత్రి భోజనం ఆచరించడమెలాగంటే

ఆగ. 23 చదవవలసిన బైబిలు భాగం: లేవీయకాండము 14-15

పాట నెం. 137 (11) [*సామెతలు 6-14]

నెం. 1: ఇవి నిజంగా అంత్యదినాలే (w97 4/1 పే. 4-8)

నెం. 2: లేవీయకాండము 14:33-47

నెం. 3: td 40బి మాస్‌ ఆచరణ లేఖన రహితం

నెం. 4: విడిపోవడమే పరిష్కారమా? (fy పే. 150-2 పేరాలు 23-6)

ఆగ. 30 వ్రాతపూర్వక పునఃపరిశీలన. ఆదికాండము 45-లేవీయకాండము 15

పాట నెం. 145 (13) [*సామెతలు 15-22]

సెప్టె. 6 చదవవలసిన బైబిలు భాగం: లేవీయకాండము 16-18

పాట నెం. 222 (29) [*సామెతలు 23-31]

నెం. 1: బాధ ఇక ఎంతమాత్రం ఎప్పుడు ఉండదంటే (w97 2/15 పే. 4-7)

నెం. 2: లేవీయకాండము 16:20-31

నెం. 3: td 49ఎ క్రీస్తు పునరాగమనం మానవులకు అదృశ్యంగా ఉంటుంది

నెం. 4: వైవాహిక సమస్యలను పరిష్కరించేందుకు లేఖనానుసారమైన మార్గం (fy పే. 153-6 పేరాలు 1-9)

సెప్టె. 13 చదవవలసిన బైబిలు భాగం: లేవీయకాండము 19-21

పాట నెం. 122 (23) [*ప్రసంగి 1-12]

నెం. 1: జ్ఞానానికి సన్యాసమే కీలకం కాదెందుకంటే (g97 11/08 పే. 28-9)

నెం. 2: లేవీయకాండము 19:16-18, 26-37

నెం. 3: td 49బి క్రీస్తు పునరాగమనాన్ని భౌతిక వాస్తవాల ద్వారా గుర్తించవచ్చు.

నెం. 4: వివాహ ధర్మాన్ని నిర్వర్తించడం (fy పే. 156-8 పేరాలు 10-13)

సెప్టె. 20 చదవవలసిన బైబిలు భాగం: లేవీయకాండము 22-24

పాట నెం. 8 (16) [*పరమగీతము 1-యెషయా 5]

నెం. 1: ఫిర్యాదు చేయడం ఎల్లప్పుడూ తప్పేనా? (w97 12/1 పే. 29-31)

నెం. 2: లేవీయకాండము 23:15-25

నెం. 3: td 42ఎ క్రైస్తవుల ఎడల వ్యతిరేకతకు గల కారణం

నెం. 4: విడాకులకు బైబిలు ఆధారాలు (fy పే. 158-9 పేరాలు 14-16)

సెప్టె. 27 చదవవలసిన బైబిలు భాగం: లేవీయకాండము 25-27

పాట నెం. 120 (25) [*యెషయా 6-14]

నెం. 1: మానవజాతిని రక్షించడానికి దేవుడు ఏమి చేశాడంటే (kl 7వ అధ్యాయం)

నెం. 2: లేవీయకాండము 25:13-28

నెం. 3: td 42సి భర్త తనను దేవుడి నుండి వేరుచేయుటకు భార్య అనుమతించకూడదు

నెం. 4: విడిపోవడాన్ని గురించి లేఖనాలు ఏమి చెబుతున్నాయంటే (fy పే. 160-2 పేరాలు 17-22)

అక్టో. 4 చదవవలసిన బైబిలు భాగం: సంఖ్యాకాండము 1-3

పాట నెం. 30 (22) [*యెషయా 15-25]

నెం. 1: దేవుడు బాధను ఎందుకు అనుమతిస్తున్నాడంటే (kl 8వ అధ్యాయం)

నెం. 2: సంఖ్యాకాండము 1:44-54

నెం. 3: జతగానే వృద్ధులుకావడం (fy పే. 163-5 పేరాలు 1-9)

నెం. 4: td 42డి భార్య తనను దేవుడి నుండి వేరుచేయుటకు భర్త అనుమతించకూడదు

అక్టో. 11 చదవవలసిన బైబిలు భాగం: సంఖ్యాకాండము 4-6

పాట నెం. 97 (6) [*యెషయా 26-33]

నెం. 1: యెహోవా కనికరముతో పరిపాలిస్తాడు (w97 12/15 పే. 28-29)

నెం. 2: సంఖ్యాకాండము 4:17-33

నెం. 3: వివాహ అనుబంధాన్ని పునర్జీవింపజేసుకోవడం (fy పే. 166-7 పేరాలు 10-13)

నెం. 4: td 43ఎ దేవుడు ఆలకించే ప్రార్థనలు

అక్టో. 18 చదవవలసిన బైబిలు భాగం: సంఖ్యాకాండము 7-9

పాట నెం. 96 (6) [*యెషయా 34-41]

నెం. 1: నిజమైన సంతోషం ఎక్కడ కనుగొనబడగలదంటే (w97 3/15 పే. 23)

నెం. 2: సంఖ్యాకాండము 9:1-14

నెం. 3: మీరు మీ మనుమలు మనుమరాండ్రతో ఆనందించండి, మీ వయస్సు పెరుగుతున్నకొద్దీ సర్దుకుపోండి (fy పే. 168-70 పేరాలు 14-19)

నెం. 4: td 43సి పునరుక్తి వ్యర్థం, మరియకు గానీ “పరిశుద్ధులకు”గానీ ప్రార్థన చేయడం యుక్తం కాదు

అక్టో. 25 చదవవలసిన బైబిలు భాగం: సంఖ్యాకాండము 10-12

పాట నెం. 125 (9) [*యెషయా 42-49]

నెం. 1: దుఃఖితుల విషయంలో యెహోవా శ్రద్ధకల్గివున్నాడు (w97 4/15 పే. 4-7)

నెం. 2: సంఖ్యాకాండము 10:11-13, 29-36

నెం. 3: మీ వివాహజతను కోల్పోయిన పరిస్థితితో వ్యవహరించడం (fy 170-72 పేరాలు 20-5)

నెం. 4: td 44ఎ మానవుడి విధి వ్రాయబడలేదు

నవ. 1 చదవవలసిన బైబిలు భాగం: సంఖ్యాకాండము 13-15

పాట నెం. 64 (7) [*యెషయా 50-58]

నెం. 1: కేవలం అద్భుతాలే విశ్వాసాన్ని పెంపొందించవెందుకంటే (w97 3/15 పే. 4-7)

నెం. 2: సంఖ్యాకాండము 14:13-25

నెం. 3: td 46ఎ యేసు మానవ జీవితం ‘అందరికీ విమోచన క్రయధనము’గా చెల్లించబడింది

నెం. 4: వృద్ధ తల్లిదండ్రులను సన్మానించే క్రైస్తవ మార్గాలు (fy పే. 173-5 పేరాలు 1-5)

నవ. 8 చదవవలసిన బైబిలు భాగం: సంఖ్యాకాండము 16-19

పాట నెం. 78 (21) [*యెషయా 59-66]

నెం. 1: బీదరికం దొంగతనాన్ని ఎందుకు సమర్థించదంటే (g97 12/8 పే. 12-13)

నెం. 2: సంఖ్యాకాండము 18:1-14

నెం. 3: ప్రేమనూ సానుభూతినీ చూపండి (fy పే. 175-8 పేరాలు 6-14)

నెం. 4: td 46బి క్రయధనము అంటే సమానమైన మూల్యము

నవ. 15 చదవవలసిన బైబిలు భాగం: సంఖ్యాకాండము 20-22

పాట నెం. 46 (5) [*యిర్మీయా 1-6]

నెం. 1: బైబిలు మనలను ఎలా చేరుకుందంటే—భాగం 1 (w97 8/15 పే. 8-11)

నెం. 2: సంఖ్యాకాండము 20:14-26

నెం. 3: బలం కోసం ఎల్లప్పుడూ యెహోవా వైపుకు చూడండి (fy 179-82 పే. 15-21)

నెం. 4: td 47ఎ సత్యమతం ఒకటే ఉంది

నవ. 22 చదవవలసిన బైబిలు భాగం: సంఖ్యాకాండము 23-26

పాట నెం. 59 (5) [*యిర్మీయా 7-13]

నెం. 1: బైబిలు మనలను ఎలా చేరుకుందంటే—భాగం 2 (w97 9/15 పే. 25-29)

నెం. 2: సంఖ్యాకాండము 23:1-12

నెం. 3: దైవిక భక్తినీ ఆత్మనిగ్రహాన్నీ పెంపొందించుకోండి (fy పే. 183-4 పేరాలు 1-5)

నెం. 4: td 47సి అబద్ధ సిద్ధాంతం సరిగా ఖండించబడింది

నవ. 29 చదవవలసిన బైబిలు భాగం: సంఖ్యాకాండము 27-30

పాట నెం. 180 (17) [*యిర్మీయా 14-21]

నెం. 1: బైబిలు మనలను ఎలా చేరుకుందంటే—భాగం 3 (w97 10/15 పే. 8-12)

నెం. 2: సంఖ్యాకాండము 27:1-11

నెం. 3: శిరస్సత్వాన్ని గురించిన సరైన దృష్టి (fy పే. 185-6 పేరాలు 6-9)

నెం. 4: td 47ఇ తమ మతం తప్పని నిరూపించబడితే దానిని మార్చుకోవడం ఆవశ్యకం

డిశె. 6 చదవవలసిన బైబిలు భాగం: సంఖ్యాకాండము 31-32

పాట నెం. 170 (21) [*యిర్మీయా 22-28]

నెం. 1: ఆధునిక క్రిస్మస్‌ వేళ్ళు (w97 12/15 పే. 4-7)

నెం. 2: సంఖ్యాకాండము 31:13-24

నెం. 3: కుటుంబంలో ప్రేమకున్న ప్రాముఖ్యమైన పాత్ర (fy పే. 186-7 పేరాలు 10-12)

నెం. 4: td 47జి “అన్ని మతాల్లో మంచి ఉందని” కనిపించడం దేవుడి అనుగ్రహాన్ని హామీ ఇవ్వదు

డిశె. 13 చదవవలసిన బైబిలు భాగం: సంఖ్యాకాండము 33-36

పాట నెం. 185 (24) [*యిర్మీయా 29-34]

నెం. 1: మరణించిన మన ప్రియమైనవారికి ఏమి సంభవిస్తుందంటే (kl 9వ అధ్యాయం)

నెం. 2: సంఖ్యాకాండము 36:1-13

నెం. 3: td 48ఎ పునరుత్థానం—మృతుల కొరకైన నిరీక్షణ

నెం. 4: కుటుంబ సమేతంగా దేవుడి చిత్తాన్నిచేయడం (fy పే. 188-9 పేరాలు 13-15)

డిశె. 20 చదవవలసిన బైబిలు భాగం: ద్వితీయోపదేశకాండము 1-3

పాట నెం. 187 (17) [*యిర్మీయా 35-41]

నెం. 1: దేవుడి రాజ్యం పరిపాలిస్తుంది (kl 10వ అధ్యాయం)

నెం. 2: ద్వితీయోపదేశకాండము 2:1-15

నెం. 3: td 48బి పరలోకానికి లేదా భూమి మీదకు పునరుత్థానం

నెం. 4: కుటుంబమూ, మీ భవిష్యత్తూ (fy పే. 190-1 పేరాలు 16-18)

డిశె. 27 చదవవలసిన బైబిలు భాగం: వ్రాతపూర్వక పునఃసమీక్ష. లేవీయకాండము 16-ద్వితీయోపదేశకాండము 3

పాట నెం. 192 (21) [*యిర్మీయా 42-48]

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి