కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 5/98 పేజీ 6
  • ప్రశ్నా భాగం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రశ్నా భాగం
  • మన రాజ్య పరిచర్య—1998
  • ఇలాంటి మరితర సమాచారం
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1989
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1991
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1992
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1991
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1998
km 5/98 పేజీ 6

ప్రశ్నా భాగం

◼ యెహోవాసాక్షులు మా ఇంటికి రావొద్దని పదేపదే ఇంటి యజమాని చెబితే, ఆ పరిస్థితితో ఎలా వ్యవహరించాలి?

మత ప్రచారం నిమిత్తం చేసే సందర్శనాలు పూర్తిగా నిషేధం అనే బోర్డు తలుపుపైగానీ లేక గేటుమీదగానీ మనకు కనబడితే, విశేషంగా ఆ బోర్డు యెహోవాసాక్షుల పేరును గనుక నిర్దిష్టంగా ప్రస్తావిస్తే బహుశా ఆ ఇంటి యజమాని అభీష్టాన్ని మన్నించి ఆ తలుపును తట్టకుండా ఉండడం మంచిది.

సేల్స్‌మ్యాన్ల రాకనుగానీ లేక చందాల కోసం వచ్చే ప్రజల రాకనుగానీ నిషేధించే బోర్డులు కొన్నిసార్లు మనకు తారసపడతాయి. మనం ధర్మాదాయ (చారిటబుల్‌) మత సంబంధిత పనిని చేస్తున్నాం గనుక, అది నిజంగా మనకు అన్వయించదు. అలాంటి బోర్డులున్న ఇళ్లు కనిపిస్తే, ముందుకెళ్లి వాటి తలుపులను తట్టడం సముచితమైనదే. ఆ ఇంటి యజమాని గనుక ఆటంకపరిస్తే, అలాంటి బోర్డులు మన విషయంలో అన్వయించవని మనమెందుకు భావిస్తున్నామో యుక్తిగా వివరించవచ్చు. అప్పుడు, ఇంటి యజమాని ఆ నిషేధంలో యెహోవాసాక్షులు కూడా చేరివున్నారని స్పష్టపరిస్తే, మనం అతని అభీష్టాన్ని గౌరవిస్తాం.

మనం టెరిటరీలో పనిచేస్తున్నప్పుడు, ఇంటి యజమానొకరు బహుశా నిజంగానే చాలా చిరాకు పడి, మనల్ని మరలా రావొద్దని గట్టిగా చెప్పవచ్చు. ఆ విషయంపై తర్కించడానికి ఆయన నిరాకరిస్తే, ఆ విన్నపానికి అనుగుణంగా మనం ప్రవర్తించాలి. భవిష్యత్తులో ఆ టెరిటరీలో పనిచేసే ప్రచారకులు ఆ ఇంటికి వెళ్లకుండా జాగ్రత్తపడేలా టెరిటరీ మ్యాప్‌ కార్డు వెనుకవైపున పెన్సిల్‌తో తారీఖుతోపాటు దాన్ని గూర్చి రాయాలి.

అలాంటి ఇళ్లకు అస్సలు వెళ్లకుండా అలానే వదిలేయకూడదు. ఆ ఇంట్లో ప్రస్తుతం ఉంటున్నవాళ్లు ఖాళీచేసి వెళ్లిపోవచ్చు. అనుకూలంగా ప్రతిస్పందించే మరొక కుటుంబ సభ్యుడ్ని మనం కలుసుకోవచ్చు. మనం మాట్లాడిన ఆ గృహస్థుడి హృదయ పరిస్థితిలో మార్పు వచ్చి, మనం మరలా సందర్శించడాన్ని మరింత ఇష్టపడే అవకాశం కూడా ఉంది. కాబట్టి కొంతకాలం గడిచిపోయిన తర్వాత, ఆ ఇంట్లో ఉంటున్నవారి ప్రస్తుత తలంపులు ఏమైవున్నాయో నిర్ధారించుకునేందుకు వారిని గురించి యుక్తిగా ఎంక్వయిరీ చేయాలి.

మా దగ్గరకు రావొద్దని చెప్పిన వారి ఇళ్లను గూర్చిన లిస్టును తయారుచేస్తూ, టెరిటరీ ఫైల్ని సంవత్సరానికోసారి పునఃపరిశీలన చేయాలి. సేవా పైవిచారణకర్త నిర్దేశం క్రింద, ఈ ఇళ్లను సందర్శించేందుకు కొంతమంది యుక్తిగల, అనుభవజ్ఞులైన ప్రచారకులను నియమించవచ్చు. ఆ ఇంట్లో మునుపున్న ఇంటి యజమానే ఉంటున్నాడా లేదా అనే సమాచారాన్ని సేకరించడానికి మేం వచ్చామని వివరించవచ్చు. బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను అనే చిన్న పుస్తకంలో 7-16 పేజీల్లోవున్న, “సంభాషణను ఆటంకపర్చే వారికి మీరెలా ప్రత్యుత్తరమివ్వవచ్చును” అనే ఉపశీర్షిక క్రింద ఉన్న సమాచారంతో ఆ ప్రచారకుడు పరిచయాన్ని కల్గివుండాలి. సహేతుకమైన జవాబు గనుక వస్తే, భవిష్యద్‌ సందర్శనాల్ని యధావిధిగానే చేయవచ్చు. ఆ ఇంటి యజమాని అదేపనిగా ప్రతికూలతను వ్యక్తపరిస్తే, తర్వాతి సంవత్సరం వరకూ ఆ ఇంటిని సందర్శించవద్దు. ఫలానా ఇంటి యజమాని విషయంలో పరిస్థితులు భిన్నమైన రీతిలో వ్యవహరించగలిగేటట్టు ఉన్నట్లయితే స్థానిక పెద్దల సభ నిర్ణయం తీసుకోవచ్చు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి