కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 4/98 పేజీలు 3-6
  • దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
  • మన రాజ్య పరిచర్య—1998
మన రాజ్య పరిచర్య—1998
km 4/98 పేజీలు 3-6

దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష

1998 జనవరి 5 నుండి ఏప్రిల్‌ 20 మధ్య వారాల్లోని ప్రసంగాల సమాచారంపై పుస్తకాలను మూసి చేసే పునఃసమీక్ష. కేటాయించబడిన సమయంలోనే మీరు వ్రాయగల్గినన్ని ప్రశ్నలకు జవాబులు వ్రాసేందుకు వేరే పేపరును ఉపయోగించండి.

[గమనిక: వ్రాతపూర్వక పునఃసమీక్ష సమయంలో ఏ ప్రశ్నలకు సమాధానమివ్వడానికైనా కేవలం బైబిలును మాత్రమే ఉపయోగించవచ్చు. వాటి ప్రక్కనున్న రెఫరెన్సులు మీ వ్యక్తిగత పరిశోధనకైయున్నవి. కావలికోట రెఫరెన్సులున్న ప్రతిచోట పేజీ నెంబర్లు, పేరా నెంబర్లు ఉండకపోవచ్చు.]

ఈ క్రింది వాక్యాలు సత్యమో, అసత్యమో వ్రాయండి:

1. అపొస్తలుల కార్యములు 15:28లో “మీకు క్షేమము కలుగునుగాక” అనివున్న వ్యాఖ్యానం ‘మీరు రక్తాన్ని లేక జారత్వాన్ని విసర్జిస్తే మీకు మంచి ఆరోగ్యం కలుగుతుంది’ అనే భావంగల వాగ్దానమైవుంది. [వారపు బైబిలు పఠనం; w92 4/1 పేజీ 25 పేరా 7 అధఃసూచి చూడండి.]

2. కొరింథులోని క్రైస్తవుల ఆధ్యాత్మిక సంక్షేమం ఎడల పౌలుకుగల ప్రగాఢమైన శ్రద్ధే ఆయన తన రెండవ మిషనరీ ప్రయాణంలో ఉండగా, వారికి తన మొదటి పత్రికను రాయడానికి నడిపించింది. [si పేజీ 210 పేరా 3]

3. ఐగుప్తీయులు, ఫరోను గ్రద్ద తలగల దైవమైన హోరస్‌ యొక్క సాక్షాత్కారంగా దృష్టించారు. [w96 1/15 పేజీ 24 పేరా 1]

4. అపొస్తలుల కార్యములు 8:9-24లో రాయబడిన సంఘటననుండి తీసుకోబడిన “సైమోని” అనే ఆంగ్లపదం మాంత్రిక విద్యలను అభ్యసించడాన్ని సూచిస్తోంది. [వారపు బైబిలు పఠనం; w91 1/1 పేజీ 13 పేరా 8 చూడండి.]

5. రోమీయులు 8:6, 7 లలో ‘శరీరము,’ వారసత్వంగా పొందిన పాపపు ప్రవృత్తులతోవున్న అపరిపూర్ణ మానవులుగా మన పతనమైన స్థితిని సూచిస్తోంది. [వారపు బైబిలు పఠనం; w92 1/1 పేజీ 24 పేరా 4 చూడండి.]

6. ధాన్యార్పణనూ, పొలముపంటనూ యెహోవా అటు తర్వాత అంగీకరించాడు గనుక, కయీను అర్పణ తిరస్కరించబడిందనడానికి కారణం అతని హృదయంలో ఏదో లోపంవుండడమేనని స్పష్టమౌతుంది. (ఆది. 4:3-5) [w96 6/15 పేజీ 4 పేరా 8]

7. ఒక క్రైస్తవుడు తన జీవితంలో బైబిల్లోని నైతిక ఆధ్యాత్మిక ప్రమాణాల్ని అన్వయించుకుంటుండగా అతడు యెహోవా వాక్యం ద్వారా శుభ్రపర్చబడతాడు, యెహోవా దేవుడు ద్వేషించే ఆచారాలన్నింటినుండి “కడుగ”బడతాడు. (1 కొరిం. 6:9-11) [w96 1/1 పేజీ 30 పేరా 4]

8. కొరింథులో స్తెఫను కుటుంబ సభ్యులకు అపొస్తలుడైన పౌలే స్వయంగా బాప్తిస్మం ఇచ్చాడు. [w96 6/15 పేజీ 29 పేరా 2]

9. అపొస్తలుల కార్యములు 20:20లో ఉన్న “ఇంటింటను” అనే పదబంధం, తోటి విశ్వాసుల గృహాల్లో కాపరి సందర్శనాల్ని చేయడాన్ని మాత్రమే సూచిస్తుంది ఎందుకంటే పౌలు ఆ విషయాన్ని సంఘంలో ఉన్న పెద్దలకు సంబోధిస్తున్నాడని సందర్భం చూపిస్తోంది. [వారపు బైబిలు పఠనం; w91 1/15 పేజీ 11 పేరా 5 చూడండి.]

10. మనము మన హృదయమునకు ఆత్మీయ [ఆధ్యాత్మిక] విషయములను మెచ్చుకొనునట్లు శిక్షణ ఇచ్చి, ఈ విషయములో సహాయముచేయుటకై దేవుని ఆత్మ కొరకు ప్రార్థించినట్లయిన, అప్పుడు మనము “శరీరానుసారమైన మనస్సును” కలిగియుండుటను నిరోధించగలము. (రోమా. 8:6, 7) [వారపు బైబిలు పఠనం; w92 1/1 పేజీ 24, పేరా 5 చూడండి.]

ఈ క్రింది ప్రశ్నలకు జవాబివ్వండి:

11. ఒకనిని జీవమార్గంపై ఉంచే కచ్చితమైన జ్ఞానాన్ని సంపాదించడానికి దేవుని వాక్యాన్ని కల్గివుండడమూ, దాన్ని వ్యక్తిగతంగా చదవడమూ మాత్రమే సరిపోదని అపొస్తలుల కార్యములు పుస్తకంలోని ఏ వృత్తాంతం చూపిస్తోంది? [వారపు బైబిలు పఠనం; w91 9/1 పేజీ 19, పేరా 16 చూడండి.]

12. మన ఆధ్యాత్మిక సహోదరులను మనం తీవ్రంగా తీర్పు తీర్చకుండా ఏది మనల్ని ఆపాలి? [w96 3/15 పేజీ 22 పేరా 5]

13. అపొస్తలుల కార్యములు 11:26లో ఇతర బైబిలు అనువాదాలు “దైవానుగ్రహం” అనే అభిప్రాయాన్ని చేర్చకపోగా “దైవానుగ్రహం వలన క్రైస్తవులని పిలువబడ్డారు” అనే మాటలను నూతన లోక అనువాదము (ఆంగ్లం) ఎందుకు ఉపయోగించింది? [వారపు బైబిలు పఠనం; w91 1/1 పేజీ 15 పేరా 19 చూడండి.]

14. తన భర్త ఎడల ప్రగాఢమైన గౌరవాన్ని చూపించడానికి ఒక క్రైస్తవ భార్యకు ఏది సహాయపడుతుంది? (ఎఫె. 5:33) [w96 3/1 పేజీ 21 పేరా 5]

15. అపొస్తలుల కార్యములు 17:11లో ఏ విధమైన వ్యక్తిగత పఠనం ప్రోత్సహించబడింది? [si పేజీ 205 పేరా 38]

16. రోమ్‌లో ఉన్న క్రైస్తవులకు తాను రాసిన తన పత్రికలో, యూదుల గురించీ, యూదులుకాని వారిని గురించీ పౌలు దేన్ని స్థిరపర్చాడు? [si పేజీ 206 పేరా 2]

17. రోమీయులు 12:2 ప్రకారంగా, దేవుని వాక్యానికున్న శక్తి మూలంగా క్రైస్తవ వ్యక్తిత్వాలు ఎంత మేరకు మారాలి? [వారపు బైబిలు పఠనం; w90 11/1 పేజీ 23 పేరా 3 చూడండి.]

18. రోమీయులు 11:25లో పౌలు ప్రస్తావించిన “[పవిత్ర] మర్మము” ఏమిటి? [వారపు బైబిలు పఠనం; w83 8/15 పేజీ 16 పేరా 16 చూడండి.]

19. పశ్చాత్తాపాన్ని చూపని తప్పిదస్థుల్ని బహిష్కరించడంలో క్రైస్తవ సంఘం ఎందుకు న్యాయబద్ధంగానే ఉంది? (1 కొరిం. 5:11, 13) [వారపు బైబిలు పఠనం; g96 10/8 పేజీ 27 పేరాలు 2-3 చూడండి.]

20. శత్రువు తలమీద నిప్పులు కుప్పగా పోయడం కీడును జయించడంలో ఎలా సహాయపడుతుంది? (రోమా. 12:20, 21) [13, వారపు బైబిలు పఠనం; g86 1/22 పేజీ 6 పేరా 5 చూడండి.]

క్రింది వాక్యాలను పూరించడానికి అవసరమైన పదాన్ని (పదాలను) లేక పదబంధాలను చేర్చండి:

21. _____________________ వచనాల్లోని ప్రవచనం ఎలా నెరవేరిందో ఐతియొపీయుడైన నపుంసకునికి ఫిలిప్పు వివరించాడు, దాన్ని గూర్చిన జ్ఞానాన్ని పొందినవాడైన ఇతడు _____________________ ఇమ్మని వినయంతో అడిగాడు. (అపొ. 8:28-35) [si పేజీ 204 పేరా 33]

22. _____________________ ని గూర్చిన విషయం చర్చించబడుతున్నప్పుడు, “ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడియున్నవి; ఎట్లనగా . . . అని వ్రాయబడియున్నది” అని చెప్పడం ద్వారా _____________________ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. (అపొ. 15:15-18) [వారపు బైబిలు పఠనం; si పేజీ 204 పేరా 33 చూడండి.]

23. ‘ఇతరులను మనకంటె యోగ్యులనుగా ఎంచడానికి’ _____________________ అనే లక్షణం మనకు సహాయం చేయగా, _____________________ మనం ‘కీడును సహించేలా’ చేస్తుంది. (ఫిలి. 2:3; 2 తిమో. 2:26) [w96 5/15 పేజీ 21 పేరా 5]

24. రోమీయులు 11వ అధ్యాయంలో ఉన్న సూచనార్థక ఒలీవ మొక్కను గూర్చిన పౌలు ఉపమానం ప్రకారంగా, ఇస్సాకు ద్వారా అబ్రాహాము నుండి ఇశ్రాయేలు 12 గోత్రాలూ పుట్టుకురాగా _____________________ ద్వారా _____________________ నుండి _____________________ సూచనార్థక 12 గోత్రాలూ పుట్టుకొచ్చాయి. [వారపు బైబిలు పఠనం; w83 8/15 పేజీ 16 పేరా 5 చూడండి.]

25. _____________________ అరణ్యప్రాంతంలో మజిలీచేసిన ఇశ్రాయేలీయుల్ని యెహోవా కాపాడినట్లుగానే _____________________ ఆయన మనలను కాపాడగలడు. [w96 8/15 పేజీ 7 పేరాలు 1-2]

క్రింది వాక్యాలలో నుండి సరైన జవాబును ఎంపిక చేయండి:

26. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయంలోని తన చర్చతో, పౌలు సజీవుడైన దేవుని (సర్వాధిపత్యాన్ని; నీతిని; ప్రేమను) యుక్తిగా స్థిరపరుస్తున్నాడు. [వారపు బైబిలు పఠనం; si పేజీ 204 పేరా 37 చూడండి.]

27. లేఖనాల్ని పరిశీలించడంలోని వారి ఆసక్తిని బట్టి (బెరయలోని; మాసిదొనియలోని; యెరూషలేములోని) ప్రజలను (పౌలు; పేతురు; లూకా) ప్రేమపూర్వకంగా మెచ్చుకున్నాడు. (అపొ. 17:11) [వారపు బైబిలు పఠనం; w95 5/1 పేజీ 14 పేరా 3 చూడండి.]

28. రోమీయులు 1:25 వచనంలో ప్రస్తావించబడిన అబద్ధం లేక అసత్యం (విగ్రహారాధనను గూర్చిన; అపవిత్రమైన లైంగిక క్రియలను గూర్చిన; అబద్ధాలాడడాన్ని గూర్చిన) సూచనను కల్గివుంది. [వారపు బైబిలు పఠనం; w91 11/15 పేజీ 6 పేరా 6 చూడండి.]

29. వాస్తవానికి, విషయాలు అదుపు తప్పినప్పుడు (ప్రజలు; దేవుడూ, క్రీస్తూ; సాతానూ, దయ్యాలూ) తరచూ నిందార్హులు. [w96 9/1 పేజీ 5 పేరా 3]

30. (రోమ్‌లో; ఎఫెసులో; కొరింథులో) ఉండగా పౌలు తన మొదటి పత్రికను కొరింథీయులకు దాదాపు సా.శ. (52లో; 55లో; 56లో) రాశాడు. [si పేజీ 210 పేరా 3]

క్రింద ఇవ్వబడిన వాక్యాలతో ఈ క్రింద లేఖనాలను జత చేయండి:

సామె. 17:27; ప్రసం. 9:11; మత్త. 10:16; అపొ. 10:34, 35; 2 కొరిం. 4:18

31. యెహోవా సేవకులుగా, అన్ని జాతులకు చెందిన ప్రజల్నీ మనం ఆయన దృష్టించినట్టుగానే దృష్టించాలి. [వారపు బైబిలు పఠనం; w88 5/15 పేజీ 16 పేరా 6 చూడండి.]

32. క్రైస్తవ జీవితము యొక్క సంతోషకరమైన ప్రతిఫలంపై మన దృష్టినుంచుతూ, మన ప్రస్తుత పరిస్థితులకు మించినవాటిని మనం చూడాలి. [w96 2/15 పేజీ 27 పేరాలు 3-4]

33. గాయపరిచే విషయాన్ని చెప్పకుండా మన ఉద్రేకాన్ని అణచుకునేందుకు వివేచన మరియు సహోదర ప్రేమ సహాయపడతాయి. [w96 5/15 పేజీ 22 పేరా 7]

34. హింసను ఎదుర్కుంటున్నప్పుడు, నిజమైన క్రైస్తవులు రాజ్య సువార్తను ఇతరులకు ప్రకటించడంలో తెలివినీ స్వచ్ఛతనూ జోడించాల్సిన అవసరంవుంది. [w96 7/15 పేజీ 22 పేరా 4]

35. ప్రమాదాల వెనుక సృష్టికర్త ఉన్నాడని లేదా ప్రమాదాలకు గురైన వారు ఏదోవిధంగా శిక్షించబడుతున్నారని నమ్మడానికి ఏ కారణమూ లేదు. [w96 9/1 పేజీ 5 పేరా 4]

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి