కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 1/98 పేజీ 2
  • జనవరి సేవా కూటాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జనవరి సేవా కూటాలు
  • మన రాజ్య పరిచర్య—1998
  • ఉపశీర్షికలు
  • జనవరి 5తో ప్రారంభమయ్యే వారం
  • జనవరి 12తో ప్రారంభమయ్యే వారం
  • జనవరి 19తో ప్రారంభమయ్యే వారం
  • జనవరి 26తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—1998
km 1/98 పేజీ 2

జనవరి సేవా కూటాలు

జనవరి 5తో ప్రారంభమయ్యే వారం

పాట 10 (21)

8 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. జనవరి 13 మరియు/లేక 14 కొరకైన ప్రాంతీయ సేవ ఏర్పాట్ల గురించి క్లుప్తంగా తెలియజేయండి.

17 నిమి: “సంపూర్ణ సాక్షమివ్వడంలో ఆనందాన్ని పొందండి.” శీర్షికను ప్రేక్షకులతో చర్చించండి. ఒక ప్రభావవంతమైన అందింపులోని ప్రముఖమైన అంశాలను ఉన్నతపర్చండి: (1) స్నేహపూర్వకంగా అభివాదం చేయడం, (2) ప్రస్తుత చర్చనీయాంశంగా ఉన్న విషయం గురించి ఒక వ్యాఖ్యానాన్ని చేయడం లేక ప్రశ్నించడం, (3) సముచితమైన లేఖనాన్ని చూపించడం, (4) అందిస్తున్న ప్రచురణవైపు ఆసక్తిని మళ్లించడం. ఒక సామర్థ్యంగల ప్రచారకుడు తొలి అందింపును, ఆ తర్వాత తత్సంబంధిత పునర్దర్శనాన్ని ప్రదర్శించాలి.

20 నిమి: రక్తం విషయంలో దేవుని నియమానికి అంటిపెట్టుకుని ఉండడానికి ఇప్పుడే సిద్ధపడండి. అర్హతగల పెద్ద అడ్వాన్స్‌ మెడికల్‌ డైరెక్టివ్‌/రిలీజ్‌ కార్డ్‌ను నింపడంలోని ప్రాముఖ్యతను చర్చిస్తాడు. అపొస్తలుల కార్యములు 15:28, 29, రక్తం విషయంలో దేవుని పరిపూర్ణ నియమానికి ఒక వ్యక్తీకరణ అని కీర్తన 19:7లోని ప్రేరేపిత నిర్దేశనం చూపిస్తుంది. యథార్థవంతులైన ఆరాధికులు ఆ నియమానికి అంటిపెట్టుకోవడానికి కృషిచేస్తారు. ఈ డాక్యుమెంటు అలా చేయాలన్న మీ నిర్ణయాన్ని తెలియజేస్తుంది, అలాగే మీరు మాట్లాడలేని సమయంలో మీకోసం అది మాట్లాడుతుంది. (సామెతలు 22:3 పోల్చండి.) రక్తాన్ని తిరస్కరించడంలో మీ ప్రస్తుత నిర్ణయాన్ని క్రొత్త కార్డు తెలియజేస్తుంది. ఈ కూటం తర్వాత, క్రొత్త కార్డు కావాలనుకునే బాప్తిస్మం పొందిన సాక్షులు లిటరేచర్‌ కౌంటర్‌ నుండి దీన్ని పొందవచ్చు, బాప్తిస్మం పొందని మైనర్‌ పిల్లలు గలవారు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడెంటిటీ కార్డు చొప్పున పొందవచ్చు. ఈ కార్డులను ఈ రాత్రే నింపకూడదు. వాటిని జాగ్రత్తగా ఇంటివద్ద నింపాలి కానీ సంతకం చేయకూడదు. అన్ని కార్డులపైన సంతకం చేయడం, సాక్ష్యం చేకూర్చడం, తేదీ వేయడం తరువాతి సంఘ పుస్తక పఠనంవద్ద పుస్తక పఠన నిర్వాహకుని ఆధ్వర్యంలో జరగాలి. దీనిద్వారా ఆయన గ్రూపుకు నియమించబడిన ప్రతి ఒక్కరు ఈ మెడికల్‌ డైరెక్టివ్‌ను అమలులో పెట్టడానికి కావాల్సిన సహాయాన్ని పొందడం వీలౌతుంది. సాక్షులుగా సంతకం చేసేవారు కార్డుగలవ్యక్తి డాక్యుమెంటుపై సంతకం పెట్టడాన్ని చూడాలి. ఆ సమయంలో హాజరుకాని వారెవరైనా కార్డుపై సంతకం కావాలనుకుంటే, తర్వాతి సేవా కూటంలో వారికి నిర్వాహకులు/పెద్దలు సహాయం చేస్తారు. ఇది బాప్తిస్మం పొందిన ప్రచారకులందరూ తమ కార్డులను సరిగ్గా పూర్తి చేసేంతవరకూ జరగాలి. (అక్టోబరు 15, 1991 ఉత్తరాన్ని సమీక్షించండి.) బాప్తిస్మం పొందని ప్రచారకులు ఈ కార్డులోని మాటలను తమ స్వంత పరిస్థితులకూ, నమ్మకాలకూ అనుగుణంగా అన్వయించుకుంటూ తమ కొరకు తమ పిల్లల కొరకు తమ స్వంత డైరెక్టివ్‌ను వ్రాసుకోవచ్చు.

పాట 142 (17), ముగింపు ప్రార్థన.

జనవరి 12తో ప్రారంభమయ్యే వారం

పాట 125 (3)

10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్‌ రిపోర్టు.

15 నిమి: “హ్యాండ్‌బిల్లులను బాగా ఉపయోగించండి.” ప్రేక్షకులతో చర్చ. డిసెంబరు 1, 1996, కావలికోట, పేజీ 13, పేరా 15 లోని అనుభవాన్ని చేర్చండి. ఒకవేళ సంఘం హ్యాండ్‌బిల్లులను ఇప్పటివరకు ఉపయోగించక, ఇటీవలనే ఆర్డరు చేసినట్లైతే అవి త్వరలోనే వస్తాయని పేర్కొనండి.

20 నిమి: “యెహోవా అసాధారణ శక్తిని ఇస్తున్నాడు.” ప్రశ్నాజవాబులు. (w90 7/15 19, 15-16 పేరాలు చూడండి.) యెహోవా తమను ఎలా బలపర్చాడో చూపించే ప్రోత్సాహకరమైన అనుభవాలను చెప్పేందుకు కొందరిని ఏర్పాటు చేయండి.

పాట 81 (26), ముగింపు ప్రార్థన.

జనవరి 19తో ప్రారంభమయ్యే వారం

పాట 1 (6)

10 నిమి: స్థానిక ప్రకటనలు. జనవరి 26 కొరకైన ప్రాంతీయ సేవా ఏర్పాట్లను గురించి క్లుప్తంగా చెప్పండి.

15 నిమి: స్థానిక అవసరతలు.

20 నిమి: సంతోషాన్ని తీసుకువచ్చే కుటుంబ పఠనము. ఒక వివాహిత జంట తమ కుటుంబపు ఆధ్యాత్మిక అవసరాలను గూర్చి చర్చిస్తారు. తమ పిల్లలపైన లోకం చూపించే ప్రతికూల ప్రభావాల గురించి ఆందోళన చెందుతూ, తమ పిల్లల ఆధ్యాత్మికతను బలపర్చాల్సిన అవసరత ఉందని వారు భావిస్తారు. కానీ తమ కుటుంబ పఠనం ఎప్పుడో ఒకప్పుడు మాత్రమే జరుగుతుందని, తరచూ నిష్ప్రయోజనకరంగా ఉంటుందని వారు గుర్తిస్తారు. ఒక అర్థవంతమైన పఠనాన్ని నిర్వహించడానికి ఆగస్టు 1, 1997, కావలికోట, 26-9 పేజీల్లో ఇవ్వబడిన సిఫార్సులను వారిద్దరూ కలిసి సమీక్షిస్తారు. తమ పిల్లల ఆధ్యాత్మిక సంక్షేమాన్ని కాపాడడానికి కృషిచేయాలని దృఢనిశ్చయం చేసుకుంటారు.

పాట 146 (11), ముగింపు ప్రార్థన.

జనవరి 26తో ప్రారంభమయ్యే వారం

పాట 187 (17)

12 నిమి: స్థానిక ప్రకటనలు. ఫిబ్రవరి కొరకైన సాహిత్య ప్రతిపాదనను పునఃసమీక్షించండి. నిరంతరము జీవించగలరు, జ్ఞానము, కుటుంబ సంతోషము పుస్తకాలను ప్రతిపాదించేటప్పుడు సహాయకరంగా ఉండగల ఒకటి రెండు విషయాలను వాటిలోనుండి పేర్కొనండి.

15 నిమి: “యెహోవా ఆరాధనాస్థలం ఎడల గౌరవాన్ని చూపండి.” ప్రశ్నాజవాబులు. దీన్ని ఒక పెద్ద నిర్వహించాలి, ఆయన దయాపూర్వకంగా స్థానిక అవసరాలకు తగిన విధంగా దీన్ని అన్వయించాలి.

18 నిమి: ప్రపంచవ్యాప్త సాక్ష్యపు పనిలో మన భాగాన్ని నివేదించడము. (మన పరిచర్య పుస్తకములోని 100-2, 106-10 పేజీల ఆధారముగా) సంఘ కార్యదర్శి చేసే ప్రసంగమూ, చర్చా. మన కార్యకలాపాన్ని క్రమంగా నివేదించడానికి లేఖనాల్లోగల పూర్వ ఉదాహరణను చూపించిన తర్వాత, “మనమెందుకు మన సేవారిపోర్టు ఇవ్వాలి” అనే ఉపశీర్షికను సమీక్షించమని ఇద్దరు పరిచర్య సేవకులను ఆయన ఆహ్వానిస్తాడు. తర్వాత, కచ్చితమైన రిపోర్టులను సరిగ్గా సమయానికి అందించడంలోని ప్రాముఖ్యతను కార్యదర్శి నొక్కిచెబుతాడు. వ్యక్తిగత లక్ష్యాలను ఉంచుకోవడం ఎందుకు ప్రయోజనకరమో ఆయన కారణాలను చూపిస్తాడు. సాక్ష్యపు పనిలో పూర్తిగా భాగం వహించేవారు పొందగల ఆశీర్వాదాలను గురించి ప్రోత్సాహకరంగా వ్యాఖ్యానిస్తూ ఆయన ముగిస్తాడు.

పాట 189 (4), ముగింపు ప్రార్థన.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి