క్రియాశీలతకు పెద్ద ద్వారం తెరవబడి ఉంది
1 ఉత్సాహంగల సువార్త ప్రచారకుడైన పౌలు అవసరత ఎక్కువవున్న ప్రాంతాల కొరకు ఆతురతగా అన్వేషించాడు. ఎఫెసు నగరం వాటిలో ఒకటి. ఆయన అక్కడ ప్రకటించడంలో సాఫల్యాన్ని పొందాడు. అందుకే ఆయన తన తోటి క్రైస్తవులకు ఇలా వ్రాశాడు: “క్రియాశీలతకు నడిపే పెద్ద ద్వారం నా కొరకు తెరవబడి ఉంది.” (1 కొరిం. 16:9, NW) పౌలు ఆ ప్రాంతంలోనే ఉండి పరిచర్యను కొనసాగించి, చాలా మంది ఎఫెసీయులు విశ్వాసులు కావడానికి సహాయపడ్డాడు.—అపొ. 19:1-20, 26.
2 నేడు కూడా క్రియాశీలతకు నడిపే పెద్ద ద్వారం మన కోసం తెరువబడి ఉంది. క్రమ పయినీర్ల జాబితాలో చేరేందుకు, సాధ్యమైతే, మరో ప్రాంతానికి స్వచ్ఛందంగా తరలి వెళ్ళేందుకు—బహుశా, పెద్ద పరిచర్య ప్రాంతంగల చిన్న సంఘంతో పరిచర్య చేసేందుకు మనలో ప్రతి ఒక్కరికి పిలుపు ఇవ్వబడుతోంది. అలా మనం చేసే ప్రయత్నాలు నిర్దిష్ట ప్రాంతాల్లో ఉన్న అవసరతను తీరుస్తాయి.—2 కొరిం. 8:13-15 పోల్చండి.
3 నువ్వు క్రమ పయినీర్గా సేవ చేయగలవా? క్రమ పయినీర్గా సేవచేసే సాధ్యతను నువ్వు ప్రార్థనాపూర్వకంగా ఆలోచించావా? ఇండియాలోని పరిచర్య ప్రాంతం నిజానికి చాలా పెద్దది. సమకూర్చే పని ఎంతో చేయవలసి ఉంది. ఈ విషయాన్ని గురించి మీ కుటుంబ సభ్యులతో, మీ సంఘంలోని పెద్దలతో, లేదా మీ ప్రాంతీయ పైవిచారణకర్తతో ఎందుకు మాట్లాడకూడదు. క్రమ పయినీర్ సేవను చేపట్టేందుకు మీ పట్టికలో సర్దుబాట్లు ఎలా చేసుకోవచ్చు అనే దానిపై వాళ్ళ సలహాలను అడగండి. పెద్ద కుటుంబాల్లో, కనీసం ఒక సభ్యుడైనా(రాలైనా) పయినీర్ అవ్వగల్గేందుకు కుటుంబమంతా కలిసికట్టుగా సహకరించగలదా? మీది పిల్లలు లేని కుటుంబమైతే, ఆర్థిక అవసరాల కొరకు ఇద్దరూ పూర్తికాలం పని చేయడం తప్పనిసరి కానట్లైతే, మొదట, భార్య కొన్ని సంవత్సరాలు క్రమ పయినీర్ సేవలో పాల్గొనగల్గేలా కొంతకాలం వరకు పిల్లలు వద్దని నిర్ణయించుకునే విషయాన్ని గురించి ఆలోచించగలరా?
4 ఇటీవలి దశాబ్దాల్లో, ప్రపంచవ్యాప్తంగా వేల కొలది క్రైస్తవ కుటుంబాలు కోత పనిలో పూర్తి భాగం కలిగి ఉండేందుకు ఇతర ప్రాంతాలకు తరలివెళ్ళాయి. ఆ విధంగా చేసిన ఒక వివాహిత జంట ఇలా అన్నది: “సాధ్యమైనంత ఎక్కువ మందికి సహాయం చేయగల చోట యెహోవా సేవ చేయాలని మేము కోరుకున్నాం.” మీరుంటున్న ప్రాంతంలో పెద్ద సంఘం అన్నిచోట్లా పరిచర్య చేయడాన్ని తరచూ పూర్తి చేస్తున్నట్లయితే, రాజ్య ప్రచారకులు చాలా తక్కువగా ఉన్నారని మీకు తెలిసిన మరో చోటకు తరలి వెళ్ళే అవకాశం తెరువబడి ఉన్నట్లయితే, అక్కడికి స్వచ్ఛందంగా తరలి వెళ్ళే విషయాన్ని గురించి ఆలోచించడానికి ఇష్టపడతారా? ఆ క్రొత్త ప్రాంతంలో మీరు క్రమ పయినీర్గా సేవ చేయలేకపోయినప్పటికీ, ఆ చిన్న సంఘంలో మీ సాన్నిధ్యం చాలా ప్రయోజనకరంగా ఉండగలదు. మీకు అలా చేయాలని కోరిక ఉన్నట్లయితే, మీ సంఘంలోని పెద్దలతో లేదా ప్రాంతీయ పైవిచారణకర్తతో ఆ సాధ్యతలను గురించి మాట్లాడవచ్చు.
5 యెహోవా పేరును ధరించడం ఒక ఆధిక్యత. మనలో ప్రతి ఒక్కరూ పయినీరింగ్ చేయలేరు. కానీ, పయినీరింగ్ చేయగల సాధ్యతలను ప్రతి ఒక్కరమూ గంభీరంగా ఆలోచించాలి. ఏది ఏమైనప్పటికీ, క్రియాశీలతకు పెద్ద ద్వారం తెరిచివున్నంత వరకూ, యెహోవా సేవలో మనమందరమూ నిమగ్నమై ఉందాం.—1 కొరిం. 15:58.