ప్రజలెక్కడుంటే అక్కడ సాక్ష్యమివ్వండి
1 తన పరిచర్యలో దేవుని ఆత్మ యొక్క పాత్రను గుర్తిస్తూ, “వృద్ధి కలుగజేసినవాడు దేవుడే” అని అపొస్తలుడైన పౌలు అన్నాడు. “మేము దేవుని జతపనివారమై యున్నాము” అని కూడా ఆయన ఒప్పుకున్నాడు. (1 కొరిం. 3:5-9) ఇది శ్రేష్ఠమైన ఆధిక్యత. మనం దేవుని జతపనివారమై ఉండడాన్ని ప్రశంసిస్తున్నామని బహిరంగంగా ఎలా చూపిస్తాం? ఇంటింటి పరిచర్యలోనైనా, మరెక్కడైనా సరే మనం కలిసే వ్యక్తులందరికీ సువార్తను ప్రకటించడం ద్వారానే.
2 ‘సమస్త జనులను శిష్యులనుగా చేయాలని’ మనకు ఆజ్ఞాపించబడింది. (మత్త. 28:19) మనం పరిచర్యలో భాగం వహించినప్పుడు చాలా కొద్దిమందిని మాత్రమే కలిస్తే మనం త్వరగా నిరుత్సాహం పొంది, చాలా తక్కువ చేయగలిగామని భావించవచ్చు. మరొకవైపు, మనం చాలా మందిని కనుగొని, వారితో సంభాషించగలిగినప్పుడు మనం మన పరిచర్యలో చాలా ఆనందిస్తాం. అందుకు, ప్రజలు ఎక్కడుంటే అక్కడికెళ్ళి వారిని కలిసేందుకు మనం చొరవ తీసుకోవలసిన అవసరముంటుంది కనుక ఇది సవాలుగానే ఉండగలదు.
3 ఆచరణాత్మక మాదిరులు: మార్కెట్లలోనూ, పార్కుల్లోనూ, విశ్రాంతి తీసుకునే స్థలాల్లోనూ, జంక్షన్లలోనూ ఎక్కడైనా సరే సాక్ష్యపు పని అనుమతించబడిన చోటెల్లా ప్రజలకు మనం సాక్ష్యమివ్వవచ్చు. మీరు ప్రజా రవాణా సౌకర్యాల్లో ప్రయాణిస్తున్నప్పుడు, ఆ ప్రయాణంలో సాక్ష్యమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా? ప్రాంతీయ పరిచర్య కొరకైన కూటం జరిగే స్థలానికి చాలా రద్దీగా ఉన్న బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు సాక్షులు భవిష్యత్తు కొరకైన దేవుని వాగ్దానాలను గూర్చి చర్చిస్తూ జ్ఞానము పుస్తకంలోవున్న పరదైసు చిత్రాన్ని గురించి సంభాషించనారంభించారు. వాళ్ళు ఆశించినట్లే, వాళ్ళ ప్రక్కనే నిలబడివున్న ఒక యువకుడు వాళ్ళ సంభాషణను విన్నాడు. తను విన్న విషయాన్నిబట్టి ముగ్ధుడయ్యాడు. బస్సు దిగే ముందు ఆయన ఒక పుస్తకాన్ని తీసుకున్నాడు. ఎవరైనా తన ఇంటికి రావాలని కోరుకున్నాడు.
4 చాలా మంది ప్రచారకులు అనియత సాక్ష్యపుపని చేయడంలో ఆనందాన్ని కనుగొన్నారు. ఒక సహోదరి ఒక రోజు మధ్యాహ్నం స్థానిక షాపింగ్ సెంటర్కు వెళ్ళి, తమ షాపింగ్ అయిపోయినప్పటికీ వెళ్ళిపోవాలన్న తొందరలో లేని ప్రజలను సమీపించింది. ఆమె తన సంచిలో పెట్టుకున్న సాహిత్యాన్నంతా ఇచ్చేయగలిగింది. తన కారులో వేచివున్న ఒక వ్యక్తి ఆమె దగ్గర నుండి పత్రికలను తీసుకోవడానికి సంతోషించాడు. ఆయన మునుపు కూటాలకు హాజరైనవాడే. వాళ్ళ సంభాషణ ఆయన ఆసక్తి మళ్ళీ రేకెత్తేలా చేసింది.
5 యెహోవా నామాన్ని ఉన్నతపర్చడమనేది ఒక ఆధిక్యత. ప్రకటనాపనిలో మనం ఆతురత చూపడం ద్వారా, దేవునికి మన ఎడల ఉన్న అనర్హదయ యొక్క సంకల్పం నుండి మనం తప్పిపోలేదని చూపిస్తాం. ఇతరులకు సహాయపడేందుకు, “ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము” గనుక ప్రజలెక్కడుంటే అక్కడికి వెళ్ళి, యెహోవా “రక్షణ దినము” గురించి వారికి సాక్ష్యమిద్దాం.—2 కొరిం. 6:1, 2.